దీక్షలో పాల్గొన్న రైతులు తదితరులు
తల్లాడ ఖమ్మం జిల్లా : రైతులను మోసం చేసి ఐపీ పెట్టిన మిర్చి వ్యాపారి జలంధర్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తల్లాడలో మిర్చి వ్యాపారి ఇంటి వద్ద రిలే నిరాహార దీక్షలు నిర్వహించి నిరసన తెలిపారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మిర్చి వ్యాపారిని రప్పించి రైతులకు రావాల్సిన బకాయిలను ఇప్పించాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు.
ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని రైతు సంఘం జిల్లా నాయుకులు మాదినేని రమేష్ ప్రారంభించారు. ఈ రిలే నిరాహార దీక్షలకు వైఎస్‌ఆర్ సీపీ మండల కమిటీ, టీడీపీ మండల కమిటీ మద్దతు తెలిపింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణా రైతు సంఘం నాయుకులు తాతా భాస్కర్‌రావు, గుంటుపల్లి వెంకటయ్య, శీలం సత్యనారాయణ రెడ్డి, భాదిత రైతులు గద్దె అశోక్, డి.కొండల్‌రావు, వేల్పుల యాకోబు, కె.వీరభద్రయ్య, సాయిన్ని వెంకటేశ్వర్లు, మట్టా నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment