
దుగ్గిదేవర అనూష (ఫైల్)
తల్లాడ: మండలంలోని మల్లవరంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన దుగ్గిదేవర అనూష(25), భర్త నరసింహారావు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. అనూష తండ్రి శెట్టిపల్లి క్రిష్ణయ్య, కొన్ని రోజుల క్రితం ఇద్దరికి సర్దిచెప్పాడు.
అయినప్పటికీ గొడవలు సద్దుమణగలేదు. బుధవారం ఉదయం తన కుమారుడిని, కుమార్తెను తల్లాడలోని బాలభారతి పాఠశాలకు పంపించి ఇంటికి వెళ్లింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.
తీవ్ర గాయాలతో అక్కడకక్కడే మృతిచెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ మేడా ప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.