సాక్షి, నెల్లూరు: స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా వెంకటగిరి బ్రాంచిలో పనిచేస్తున్న షేక్ రబ్బానీ అనే ఉద్యోగి (క్లర్క్) ఓ ఖాతాదారునికి సంబంధించిన ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సదరు ఖాతాదారునికి తెలియకుండా రుణం తీసుకున్న కేసుతో పాటు నిబంధనలకు విరుద్ధంగా మరో ఇద్దరి అకౌంట్‌ల నుంచి లోన్ కింద రూ.9.26 లక్షలు డ్రా చేసుకున్న కేసులో నిందితుడు రబ్బానీని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. సీఐ నాగమల్లేశ్వరరావు కథనం మేరకు..
వెంకటగిరి ఎస్‌బీఐలో పనిచేస్తున్న క్లర్క్ రబ్బానీ తన తల్లి, తమ్ముడు, స్నేహితుడిపై ఉన్న మూడు ఖాతా లను రాపూరు ఎస్‌బీఐ బ్రాంచ్ నుంచి వెంకటగిరి బ్రాంచ్‌కు మార్చుకున్నాడు. బ్యాంక్ ఉద్యోగి అయిన రబ్బానీ ఆ కౌంట్‌లకు ఉన్న పరిమితులను కార్పొరేట్ తరహాగా మార్చుకుని వాటిలో ఓ అకౌంట్ నుంచి రూ.3.22 లక్షలు, మరో అకౌంట్ నుంచి రూ.6.02 లక్షలను రుణం కింద తీసుకున్నాడని తెలిపారు. ఇక బ్యాంక్‌కు వచ్చిన ఓ ఖాతాదారుడికి ఓ యాప్ ద్వారా రబ్బానీ ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయించాడు.
అయితే ఖాతాదారుడికి తెలియకుండా ఆ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై రబ్బానీ రూ.1.35 లక్షలు రుణం తీసుకున్నాడు. ఈ క్రమంలో ఆ రుణంకు సంబంధించి ఈఎంఐ కట్టాలని మెసేజ్ ఖాతాదారుడికి వెళ్లింది. దీంతో తాను తీసుకోని రుణంకు వాయిదా చెల్లించాలంటూ మెసేజ్ రావడంపై ఆయన బ్యాంక్ మేనేజర్‌ను సంప్రదించాడు. ఈ వ్యవహారంపై బ్యాంక్‌లో విజిలెన్స్ విచారణ జరిపి మోసాలకు కారణమైన రబ్బానీపై బ్యాంక్ మేనేజర్ ఈనెల 10న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారించిన పోలీసులు ఆదివారం నిందితుడు రబ్బానీని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు.
చదవండి:
అప్పు కోసం బ్యాంకుకు వెళ్లిన మహిళా కానిస్టేబుల్‌కు షాక్.. పాన్ కార్డుపై అప్పటికే..
ఉత్తుత్తి బ్యాంక్: ఓటీపీ చెప్పాడు.. క్షణాల్లోనే రూ.1,64,612 మాయం
Comments
Please login to add a commentAdd a comment