రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకుల మృతి | Father And Son Died In Road Accident At Enkuru | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకుల మృతి

Published Fri, Sep 13 2019 9:46 AM | Last Updated on Fri, Sep 13 2019 9:46 AM

Father And Son Died In Road Accident At Enkuru - Sakshi

మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు; మృతుడు వినోద్‌

సాక్షి, ఏన్కూరు: సరుకుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతి చెందారు. మరో కుమారుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు ఈ సంఘటన మండల పరిధిలోని కేసుపల్లి సమీపంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం... కేసుపల్లి గ్రామానికి చెందిన గుగులోతు రాంబాబు(40) తన ఇద్దరు కుమారులు వినోద్, విష్ణు(12)లను ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని సరుకుల కొనుగోలుకు ఏన్కూరు వచ్చాడు.

సరుకులు కొనుగోలు చేసిన అనంతరం ద్విచక్రవాహనంపై తన ఇద్దరు కుమారులతో కలిసి ఇంటికి బయలుదేరాడు. అదే సమయంలో తూతకలింగన్నపేట సమీపంలో సాగర్‌ కాల్వలో వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు కేసుపల్లి నుంచి ట్రాక్టర్‌ బయలుదేరింది. గ్రామ సమీపంలో వేగంగా వస్తున్న ట్రాక్టర్‌ ఎదురుగా వచ్చే ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో రాంబాబు చిన్న కుమారుడు విష్ణు(12) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రగాయాలపాలయిన రాంబాబును ఏన్కూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాంబాబు మృతి చెందాడు. రాంబాబు పెద్ద కుమారుడు వినోద్‌ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కుమారుడు, భర్త మృతి చెందడంతో పద్మ శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రమాదం నుంచి బయటపడిన వినోద్‌.. తండ్రి, తమ్ముడి మృతదేహాల మీద పడి రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. తండ్రీకొడుకుల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. సంఘటన స్థలానికి ఎస్‌హెచ్‌ఓ కోటేశ్వరరావు, సిబ్బంది వచ్చి వివరాలు సేకరిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement