Enkuru
-
వాహనం పంపిస్తామన్నా వారే వెళ్లారు..
ఏన్కూరు: ‘రోడ్లు బాగాలేవు... వాహనాలెలా వస్తాయి... ఉదయం ఆరు గంటలకు చిన్నారి మృతదేహాన్ని తీసుకువేళ్లేందుకు పార్థివ వాహనం ఏర్పాటు చేస్తామని ఖమ్మం జిల్లా ఆస్పత్రి ఆర్ఎంఓ చెప్పినా వారే బండి మీద తీసుకెళ్లారు.... గ్రామస్తులు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత కూడా పాటించడం లేదు’ అని ఖమ్మం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మాలతి వ్యాఖ్యానించారు. ‘బైక్‌పై కూతురు మృతదేహంతో 55 కి.మీ’ శీర్షికన ‘సాక్షి’లో మంగళవారం వచ్చిన కథనానికి స్పందించిన డీఎంహెచ్ఓ మాలతి ఏన్కూరు మండలం కొత్తమేడేపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మృతురాలు సుక్కు తల్లి ఆదితో మాట్లాడారు. పిల్లలు ఎంతమంది, ఏం చేస్తున్నారని ఆరా తీయడంతో పాటు గ్రామంలో గర్భిణులతో మాట్లాడి చికిత్స, కాన్పు తేదీల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. కొత్తమేడేపల్లి ఏన్కూరు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి 10కి.మీ దూరంలో ఉండగా, రోడ్డు అధ్వానంగా ఉన్న కారణంగా అధికారులు గ్రామానికి రావడం లేదన్నారు. వాహనాలు కూడా రాలేని పరిస్థితి ఉండడంతో ఎవరైనా అనారోగ్యానికి గురైతే సకాలంలో వైద్యం అందదని చెప్పారు. గ్రామంలో ఫిట్స్, నిమ్ము వచ్చి చిన్నారులు మృతి చెందుతున్నారని ఆమె వెల్లడించారు. గ్రామంలో సబ్‌సెంటర్ ఏర్పాటు చేయొచ్చు కదా అని ‘సాక్షి’ ప్రశ్నించగా చిన్నారులకు బాగా జ్వరం వచ్చినపుడు ఫిట్స్ వస్తాయే తప్ప అదేమీ వ్యాధి కాదని తెలిపారు. అయినప్పటికీ ప్రతీ వారం గ్రామానికి ఏఎన్ఎం వస్తున్నందున, సబ్‌సెంటర్ ఏర్పాటుపై పరిశీలిస్తామని తెలిపారు. కాగా, కోవిడ్ సమయాన కొత్తమేడేపల్లిలో ఒక కేసు కూడా నమోదు కాలేదని డీఎంహెచ్ఓ గుర్తు చేశారు. డీఎంహెచ్ఓ మాలతి వెంట డిప్యూటీ డీఎంహెచ్ఓ సీతారాం, ఎంపీపీ అరెం వరలక్ష్మి, ప్రభుత్వ వైద్యాధికారి పవన్‌కుమార్ తదితరులు ఉన్నారు. -
అయ్యో తల్లి.. నీకెంతటి కష్టం వచ్చింది
కొణిజర్ల(ఏన్కూరు)/ఖమ్మం: గొత్తికోయ మహిళకు సకాలంలో వైద్యం అందక ప్రసవం జరిగి శిశువు మృతి చెందిన సంఘటన ఏన్కూరు మండలం కొత్తమేడేపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. కొత్తమేడేపల్లికి చెందిన హేమ్లా నిర్మల అనే గర్భిణికి మంగళవారం నొప్పులు వస్తున్నాయని ఏన్కూరు పీహెచ్‌సీకి రాగా ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్‌చేశారు. అక్కిడికి తీసుకెళ్లగా సాధారణ వాతపు నొప్పులని, కాన్పు రావడానికి ఇంకా చాలా రోజులు పడుతుందని చెప్పి వెనక్కి పంపించేశారు. తిరిగి బుధవారం ఉదయం ఆమెకు తీవ్రమైన నొప్పులు రావడంతో బంధువులు మూడు కిలోవీుటర్ల దూరం ఆమెను మంచంపై మోసుకొచ్చి 108 ద్వారా ఖమ్మం తరలిస్తుండగా ప్రసవం జరిగి ఆడ∙శిశువు మృతి చెందింది. విషయం తెలుసుకున్న మానవ హక్కుల సంఘం నేత మద్దిశెట్టి సామేలు, నవీన్, మురళి , శ్రీనివాసరావు, ప్రసాద్, అనిల్, తిమోతి తదితరులు కొత్త మేడేపల్లి వెళ్లి పరామర్శించారు. వైద్యాధికారుల నిర్లక్ష్యం వల్లే సదరు మహిళకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. విషయాన్ని డీఎంహెచ్ఓ డాక్టర్ మాలతికి ఫోన్లో వివరించారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై ఏన్కూరు పీహెచ్సీ వైద్యాధికారి పవన్‌కుమార్‌ను వివరణ కోరగా 8వ నెలలోనే బిడ్డ పుట్టడం వల్ల చనిపోయి ఉంటుందన్నారు. చదవండి: నర్సాపూర్ ఆసుపత్రిలో నిండు గర్భిణి మృతి -
రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకుల మృతి
సాక్షి, ఏన్కూరు: సరుకుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతి చెందారు. మరో కుమారుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు ఈ సంఘటన మండల పరిధిలోని కేసుపల్లి సమీపంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం... కేసుపల్లి గ్రామానికి చెందిన గుగులోతు రాంబాబు(40) తన ఇద్దరు కుమారులు వినోద్, విష్ణు(12)లను ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని సరుకుల కొనుగోలుకు ఏన్కూరు వచ్చాడు. సరుకులు కొనుగోలు చేసిన అనంతరం ద్విచక్రవాహనంపై తన ఇద్దరు కుమారులతో కలిసి ఇంటికి బయలుదేరాడు. అదే సమయంలో తూతకలింగన్నపేట సమీపంలో సాగర్ కాల్వలో వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు కేసుపల్లి నుంచి ట్రాక్టర్ బయలుదేరింది. గ్రామ సమీపంలో వేగంగా వస్తున్న ట్రాక్టర్ ఎదురుగా వచ్చే ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో రాంబాబు చిన్న కుమారుడు విష్ణు(12) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రగాయాలపాలయిన రాంబాబును ఏన్కూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాంబాబు మృతి చెందాడు. రాంబాబు పెద్ద కుమారుడు వినోద్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కుమారుడు, భర్త మృతి చెందడంతో పద్మ శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రమాదం నుంచి బయటపడిన వినోద్.. తండ్రి, తమ్ముడి మృతదేహాల మీద పడి రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. తండ్రీకొడుకుల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. సంఘటన స్థలానికి ఎస్హెచ్ఓ కోటేశ్వరరావు, సిబ్బంది వచ్చి వివరాలు సేకరిస్తున్నారు. -
గ్రామీణ మహిళల అభివృద్ధికే కృషిమార్ట్‌లు
ఏన్కూరు: గ్రామీణ ప్రాంతాల్లో మహిళల అభివృద్ధి కోసం కృషిమార్టలు ఏర్పాటు చేశామని ప్రపంచబ్యాంక్ టాస్ టీమ్ లీడర్ వినయ్‌కుమార్ తెలిపారు. మండల కేంద్రంలోని కృషిమార్ట్ను మంగళవారం ప్రపంచబ్యాంకు బృందం సందర్శించింది. ఈ సందర్భంగా కృషిమార్ట్ లోని నిత్యావసర వస్తువులు, వాటి నాణ్యత, ధరల వివరాలు, క్రయ, విక్రయాలగురించి తెలుసుకున్నారు. ఏన్కూరులోని కిరాణా దుకాణా న్ని, తూతకలింగన్నపేటలోని చిరువస్తువుల తయారీ కేంద్రాన్ని వారు పరిశీలించారు. అనంతరం స్థానిక ఐకేపీ కార్యాలయంలో భవిత మహిళలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్‌కుమార్ విలేకరులతో మాట్లాడారు. నిరుపేదలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులు తక్కువ ధరలకు అందించేందుకు కృషిమార్ట్‌లు ఏర్పాటు చేశామని, తెలంగాణ రాష్ట్రంలో రూ.642కోట్లతో 150మండలాల్లో ఈ పథకం అమలు చేస్తున్నామని వివరించారు. ఏన్కూరు మండలంలో 44మహిళా సంఘాలున్నాయని 31సంఘాల మహిళలు నిత్యావసర వస్తువులు విక్రరుుస్తున్నట్లు చెప్పారు. మిగతా గ్రూపులుకూడా నిత్యావసరవస్తువులు విక్రరుుంచేందుకు వారికి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. డ్వాక్రా మహిళలు తయారు చేసుకున్న పచ్చళ్లు, వస్తువులను కూడా కృషిమార్ట్ ద్వారా విక్రరుుంచుకోవచ్చని సూచించారు. కృషిమార్ట్ ద్వారా నాణ్యమైన నిత్యావసర వస్తువులు తక్కువధరలకు దొరుకుతున్నాయని ప్రచారం చేయడంతో విక్రయాలుపెరిగి కృషిమార్ట్లకు ఆదాయం ఎక్కువ వస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రపంచబ్యాంకు బృందం సభ్యులు బాలకృష్ణ, రాజేష్, ప్రదీప్, ఐకేపీ ఏపీఎం సురేంద్రబాబు పాల్గొన్నారు.