అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి | Suspicious Death Of Young Man | Sakshi

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

Published Tue, Aug 21 2018 11:15 AM | Last Updated on Tue, Aug 21 2018 11:15 AM

Suspicious Death Of   Young Man - Sakshi

యువకుడి మృతదేహం 

ముదిగొండ ఖమ్మం : ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మండలంలోని వనంవారికృష్టాపురం వద్ద సోమవారం ఇది జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు... నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన కర్లపూడి కృష్ట- సంపూర్ణ దంపతుల పెద్ద కుమారుడైన శ్రీనివాస్‌(27), గత మూడేళ్ల నుంచి హైదరాబాద్‌లోని ప్రయివేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 18న చెన్నారం వచ్చాడు. ఇప్పుడెందుకు వచ్చావని తల్లిదండ్రులు అడిగారు. వనంవారికృష్టాపురంలోని అయ్యగారి మామిడి తోటలో తన చిన్ననాటి స్నేహితులంతమంతా కలిసి పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేసుకుంటున్నామని, 19వ తేదీన అక్కడకు వెళుతున్నట్టు తల్లితో చెప్పాడు.

వనంవారికృష్టాపురం నుంచి ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. దూకుడుబందం వాగులో మృతదేహం కనిపించింది. తనకు ఈ సమాచారాన్ని సోమవారం ఉదయం కర్లపూడి వెంకటేశ్వర్లు ఇచ్చాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మృతుడి తల్లి తెలిపింది. తమ కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడని పేర్కొంది. కేసును ముదిగొండ ఎస్‌ఐ లవణ్‌కుమార్‌ దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement