
ఉషారాణి మృతదేహం, ఆస్పత్రిలో దుర్గాప్రసాద్
పాల్వంచరూరల్( ఖమ్మం): వారిద్దరూ నవ దంపతులు. రెండు నెలల క్రితమే వివాహమైంది. అంతలోనే వారి మధ్య కలహాలు. ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అతడు, విద్యుత్ వైరు పట్టుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఆస్పత్రిపాలయ్యాడు.
అసలేం జరిగింది..?
పోలీసులు ఇలా చెప్పారు.. మండలంలోని సోములగూడెం గ్రామస్తుడైన ట్రాక్టర్ డ్రైవర్ గోపిశెట్టి దుర్గాప్రసాధ్‌కు, పాత పాల్వంచకు చెందిన చిన్నంశెట్టి ఉషారాణి(19)తో రెండు నెలల క్రితం వివాహమైంది. వీరి కాపురం నెల రోజులపాటు సాఫీగా సాగింది. ఇటీవల వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం ఇంట్లో ఉషారాణి ఉంది. దుర్గాప్రసాద్ బయటకు వెళ్లాడు. ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఆ తరువాత కొద్దిసేపటికే ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఆమె ఉరి వేసుకుంది. చుట్టుపక్కక్కల వారు గమనించి వెంటనే కిందకు దించారు. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్టు వైద్యులు చెప్పారు.
ఈ విషయం తెలుసుకసుని ఇంటికి వచ్చిన దుర్గాప్రసాద్, గ్రామ శివారులోని కిన్నెరసాని వాగు ఒడ్డునగల 11 కేవీ విద్యుత్ లైన్ ట్రాన్స్‌పార్మర్ విద్యుత్ వైర్ పట్టుకున్నాడు. షాక్‌తో అపస్మారక స్థితికి చేరాడు. స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. ఉషారాణి తల్లిదండ్రులు హరి, నవ్య ఫిర్యాదుతో కేసును ఎస్‌ఐ అనిల్ దర్యాప్తు చేస్తున్నారు.
ఉషారాణి మృతదేహన్ని చూసిన తల్లిదండ్రులు హరి, నవ్యచ, బంధువులు భోరుమని విలపించారు. ఉదయమే తనతో మాట్లాడిందని, గంటలో ఇంటికి వస్తానని చెప్పిందని ఆ తల్లి తల్లి రోదిస్తూ చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment