సాక్షి, కామారెడ్డి : అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరిన ఓ వివాహిత రెండ్రోజుల క్రితం మృతి చెందగా, కుటుంబ సభ్యులు గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, తన కూ తుర్ని భర్తే కొట్టి చంపాడని తండ్రి ఫిర్యాదు చేయడంతో పూడ్చి పెట్టిన మృతదేహాన్ని వెలికితీసి బుధవారం పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటన కామారెడ్డి మండలం తిమ్మక్‌పల్లి (కే)లో చోటు చేసుకుంది. దేవునిపల్లి ఎస్సై శ్రీకాంత్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొలిమి భూపాల్‌కు, మేన మరదళ్లు శ్రీలత, మౌనిక(25)తో 2017లో వివాహం జరిగింది. దివ్యాంగురాలైన (మూగ) శ్రీలతకు ఇద్దరు పిల్లలు కాగా, అందరూ కలిసే ఉంటున్నారు. అయితే, ఇటీవల కుటుంబ కలహాలు మొదలమయ్యాయి. ఈ క్రమంలో అనారోగ్యమని ఈ నెల 15న మౌనికను కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి్పంచారు. మూడు రోజుల తర్వాత పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించగా, మౌనిక 20వ తేదీన మృతి చెందింది. మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేశారు.
(మాస్కులు తయారు చేసిన భారత ప్రథమ మహిళ )
తన కూతురు అనారోగ్యంతో మృతి చెందలేదని, అల్లుడు తీవ్రంగా కొట్టడంతోనే చనిపోయిందని మృతురాలి తండ్రి సాయిలు దేవునిపల్లి ఠాణాలో మంగళవారం ఫిర్యాదు చేశారు. దీంతో అసిస్టెంట్ కలెక్టర్ నందలాల్ పవార్, డీఎస్పీ లక్ష్మీనారాయణ, తహసీల్దార్ అమీన్‌సింగ్, రూరల్ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం కుటుంబ సభ్యులను విచారించారు. గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని బ యటకు తీయించి పోస్టుమార్టం చేయించారు. మృతురాలి భర్త భూపాల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని ఎస్సై తెలిపారు. పూడ్చి్టన శవాన్ని తీయించి పోస్టుమార్టం నిర్వహించడం చర్చనీయాంశమైంది. (ఆ ఎడిటర్‌ను పెళ్లి చేసుకోవాలని ఉంది: వర్మ )
Comments
Please login to add a commentAdd a comment