postmartum
-
ఇందు మృతిపై ఎలాంటి అనుమానాలు లేవు : బాలిక తండ్రి
-
పోస్టుమార్టం రోజునే ప్రభుత్వ సాయం
పి.గన్నవరం: గోదావరి వరదల్లో ప్రమాదవశాత్తు గల్లంతై మరణించిన ఇద్దరి కుటుంబాలకు పోస్టుమార్టం పూర్తయిన రోజునే రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున సాయం అందించింది. ఈ నెల 16న కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం మానేపల్లి పల్లిపాలేనికి చెందిన కడలి శ్రీనివాసరావు (48) ఏటిగట్టు నుంచి 100 మీటర్ల దూరంలో ఉన్న తన ఇంటికి నదిలో ఈదుకుంటూ వస్తూ వరద ఉధృతిలో కొట్టుకుపోయాడు. అతడి మృతదేహాన్ని మంగళవారం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెలికి తీశారు. 18వ తేదీన అదే గ్రామానికి చెందిన కారాడి రామకృష్ణ (68) శివాయలంకకు పడవపై గ్రామస్తులను తీసుకువెళ్లాడు. తిరిగి వస్తుండగా పడవ బోల్తా పడటంతో నదిలో కొట్టుకుపోయాడు. ఇతడి మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బుధవారం అప్పనపల్లిలో వెలికితీశారు. ఇద్దరి మృతదేహాలకు రాజోలు ప్రభుత్వాస్పత్రిలో బుధవారం సాయంత్రం పోస్టుమార్టం జరిగింది. ఇదే సమయంలో సీఎం జగన్ ఆదేశాల మేరకు కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు.. బాధితుల ఇళ్లకు మోకాలి లోతు వరద నీటిలో నడిచి వెళ్లి రూ.4 లక్షల చొప్పున ప్రభుత్వ సాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. ప్రభుత్వం స్పందించిన తీరును గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర తదితరులు పాల్గొన్నారు. కాలినడకన 4 కిలోమీటర్లు నాతవరం (అనకాపల్లి జిల్లా): రోడ్డు సౌకర్యం లేని గిరిజన గ్రామానికి అనకాపల్లి కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి బుధవారం కాలినడకన వెళ్లారు. కొండలు, గుట్టలు ఎక్కి 4 కిలోమీటర్లు నడిచి వెళ్లి నాతవరం మండలంలోని అసనగిరి గ్రామంలో గిరిజనుల కష్టసుఖాలు తెలుసుకున్నారు. గ్రామంలో అన్ని వీధులూ కలియతిరిగి సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. తాటాకు గుడిసెల్లోకి కూడా వెళ్లి వారితో మాట్లాడారు. ఆ ఆదివాసీ గ్రామానికి వచ్చిన తొలి కలెక్టర్ కావడంతో గిరిజనులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. సుందరకోట పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసి, సరుగుడు సచివాలయంలో వలంటీర్లతో సమావేశమయ్యారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతో ముచ్చటించారు. ఇదీ చదవండి: సహాయం.. శరవేగం -
ఆస్తి కోసమే నా భర్తను చంపేశారు
అనంతపురం క్రైం: చనిపోయిన ఓ ఆటోడ్రైవర్ మృతదేహానికి 15 రోజుల తర్వాత పోస్టుమార్టం నిర్వహించాలని త్రీటౌన్ పోలీసులు నిర్ణయించారు. త్రీటౌన్ సీఐ హరినాథ్ వివరాల మేరకు ... స్థానిక ఇందిరానగర్‌కు చెందిన మహబూబ్‌పీరా (46) ఆటోడ్రైవర్‌గా విధులు నిర్వర్తించేవాడు. అతనికి భార్య ఆశా, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మహబూబ్‌పీరా పదేళ్లుగా భార్యకు దూరంగా ఉంటూ అతని చెల్లెళ్ల వద్ద ఉంటున్నాడు. గత నెల 22న మహబూబ్‌పీరా వాంతి కాగా, ఈనో ప్యాకెట్ తెచ్చుకుని సేవించాడు. కాసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కుటుంబీకులు జీజీహెచ్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని ఇందిరానగర్ సమీపంలోని ముస్లిం శ్మశాన వాటికలో ఖననం చేశారు. భర్త మృతిపై ఆమె భార్య ఆశా అనుమానం వ్యక్తం చేసింది. తన భర్త వద్ద రూ.30 లక్షల నగదు, ఆటోలు, ఇతర ఆస్తులు ఉన్నాయని వాటి కోసమే భర్తింటి వారు ఆయన్ను చంపేశారని ఇటీవల త్రీటౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే మహబూబ్‌పీరా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని ప్రభుత్వ వైద్య కళాశాల ఫోరెన్సిక్ విభాగానికి త్రీటౌన్ పోలీసులు లిఖిత పూర్వకంగా విన్నవించారు. రెండ్రోజుల్లో మహబూబ్‌పీరా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. (చదవండి: న్యూడ్ ఫొటోలు పంపుతామని బెదిరించారు.. తెల్లారి అన్నంత పనీ చేసేశారు) -
భార్య కాపురానికి రావడం లేదని ... దివ్యాంగుడి బలవన్మరణం
శాలిగౌరారం: భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో ఓ దివ్యాంగుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని అడ్లూరులో చోటు చేసుకుంది. ఎస్ఐ హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. అడ్లూరు గ్రామానికి చెందిన వరికుప్పల ఉపేందర్(35)కు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం అతడికి భార్యతో పాటూ కుమారుడు ఉన్నారు. ఇదిలా ఉండగా మూడు నెలల క్రితం హైదరాబాద్‌లో ఉంటున్న తనతల్లిగారింటికి ఉపేందర్ భార్య వెళ్లింది. అప్పటినుంచి కాపురానికి రావడం లేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఉపేందర్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి వరికుప్పల యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ వివరించారు. -
దారుణం: గతేడాది కోవిడ్‌తో చనిపోతే.. ఇప్పుడు మృతదేహాలు అప్పగింత!
బెంగళూరు: ఏడాది క్రితం కరోనా మహమ్మారి కారణంగా తమ ప్రియమైన వారిని కోల్పోయిన రెండు కుటుంబాలకు బెంగళూరులోని రాజాజి ఆసుపత్రి నుంచి ఊహించని షాక్ ఎదురైంది. అయితే తమ ప్రియమైన వ్యక్తులు కరోనా బారినపడి చనిపోయిన ఏడాది తర్వాత మీ సంబంధికుల మృతదేహాలు ఆసుపత్రి మార్చురీలో ఉన్నాయంటూ ఆసుపత్రి సిబ్బంది నుంచి కాల్ వచ్చింది. దాంతో సదరు కుటుంబ సభ్యులు అయోమయానికి గురి కావడమే కాక అసలు విషయం తెలుసుకుని షాక్‌కి గురయ్యారు. (చదవండి: నువ్వా!...నేనా.. అంటూ ఒక ఆట ఆడించిన సింహం!) అయితే నిజానికి ఆ మృతులు దుర్గా సుమిత్ర (40), మునిరాజు (50) గతేడాది కరోనాతో మృతిచెందారు. అంతేకాక బెంగళూరులోని రాజాజీనగర్‌లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, మోడల్ ఆస్పత్రి సర్టిఫికేట్లలో గతేడాది జూలై 2, 2020న మరణించినట్లు మరణ ధృవీకరణ పత్రాలు కూడ ఇచ్చింది. పైగా ఆ సమయంలో కరోనా సెకండ్ వేవ్ విజృభించడంతో ఆస్పత్రి సిబ్బంది మృతదేహాలను ఇవ్వమని చెప్పారు. ఈ మేరకు బృహత్ బెంగళూరు మహానగర పాలికే(బీబీఎంపీ) ఆ మృత దేహాలకు దహన సంస్కారాలు నిర్వహించాం అని కూడా ఆయా బాధిత కుటుంబాలకు తెలియజేసింది. అయితే ఇటీవలే మూడురోజుల క్రితం బాధిత కుటుంబాలకి మీ వాళ్ల మృతదేహాలు మార్చురీలో ఉన్నాయంటూ సదరు ఆసుపత్రి సిబ్బంది సమాచారం అందించింది. అయితే సదరు బాధిత కుటుంబాలు తాము మొదటగా నమ్మలేదని ఆసుపత్రికి వెళ్తే అసలు విషయం తెలిసిందని అంటున్నారు. దీంతో ఆయా బాధిత కుటుంబాలు ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష వైఖరి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ మేరకు సదరు ఆస్పత్రి ఆధికారులు సిబ్బంది పై చర్యలు తీసుకోవడమే కాక అసలు ఇది ఎలా జరిగిందో దర్యాప్తు చేయడం ప్రారంభించారు. (చదవండి: దూషించొద్దు అన్నందుకు స్నేహితులే హత్య చేశారు!) -
శవమే శివం.. భోజనం 2 పూటలే.. శుభకార్యాలకు దూరం
కర్నూలు(హాస్పిటల్): ఫోరెన్సిక్ విభాగం అంటే పోలీసులు, వైద్యులు, మీడియా, కొద్దిగా ఉన్నత విద్యావంతులకు మినహా మిగిలిన వారికి పెద్దగా పరిచయం లేని ప్రాంతం. అయితే మార్చురి అంటే దాదాపుగా అందరికీ పరిచయమే. దాని పేరు చెబితేనే...ఆ శవాల గదా..అని ముఖం చిట్లిస్తారు. మరికొందరు అటువైపు వెళ్లాలంటేనే దెయ్యాలంటాయని భయపడతారు. మరికొందరు అక్కడి దుర్వాసనను తట్టుకోలేక అటువైపు వెళ్లాలంటే జంకుతారు. తప్పనిసరైన పరిస్థితుల్లో అక్కడికి వెళ్లే వివిధ వర్గాల ప్రజలు ఇక్కడ నుంచి ఎప్పుడెప్పుడు బయటపడతామా అని ఆలోచిస్తుంటారు. ఇలాంటి ప్రాంతంలో అక్కడే విధులు నిర్వహించే వైద్యులు, సిబ్బంది పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచిస్తే ఒళ్లు జలదరిస్తుంది. కాస్త లోతుగా ఆలోచిస్తే అయ్యోపాపం అనిపిస్తుంది. వారి జీవితం దయనీయంగా ఉంటుంది. కర్నూలు మెడికల్ కాలేజి 1954లో స్థాపించారు. కాలేజి ఆవిర్భావంతోనే ఫోరెన్సిక్ విభాగం కూడా ఏర్పడింది. ప్రస్తుతం ఈ విభాగంలో ఇద్దరు ప్రొఫెసర్లు డాక్టర్ ఆర్. శంకర్(హెచ్‌వోడి), డాక్టర్ పి. బ్రహ్మాజీ మాస్టర్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వి. రాజశేఖర్, సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వైకేసి రంగయ్య, మరో నలుగురు కన్సాలిడేట్ పే అసిస్టెంట్ వైద్యులు, ఇద్దరు పీజీ వైద్య విద్యార్థులు పనిచేస్తున్నారు. మరో నాలుగు ట్యూటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ విభాగానికి సంబంధించి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించే గది కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఉంది. ఇక్కడికి చికిత్సకు కర్నూలు జిల్లాతో పాటు పక్కనున్న ప్రకాశం, చిత్తూరు, వైఎస్ఆర్ కడప జిల్లా, అనంతపురం, తెలంగాణాలోని మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, కర్నాటకలోని బళ్లారి, రాయచూరు జిల్లాల నుంచి ప్రజలు వస్తుంటారు. దీనికితోడు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి పనిచేస్తూ రోడ్డు ప్రమాదాలు, ఇతర ప్రమాదాలు, ఆత్మహత్యల వల్ల మరణించిన వారి కేసులూ ఉంటాయి. ఈ మేరకు ప్రతిరోజూ సగటున మూడు నుంచి ఐదు, నెలకు 120 దాకా, ఏటా 1200 నుంచి 1500ల దాకా మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తారు. టిఫిన్ చేసి వస్తే మళ్లీ రాత్రి భోజనమే ఇక్కడ ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ మృతదేహాలకు వైద్యులు పోస్టుమార్టం నిర్వహిస్తారు. దీంతో పాటు సెలవు రోజుల్లోనూ మధ్యాహ్నం 1 గంటల వరకు పోస్టుమార్టం చేస్తారు. ఈ మేరకు మొత్తం మృతదేహాలకు పోస్టుమార్టం ముగిశాకే వారు భోజనం చేయాల్సి వస్తోంది. అంటే రోజూ 4 నుంచి 5 గంటల తర్వాతే ఇంటికి వెళ్లి స్నానం చేసిన తర్వాతే భోజనం చేస్తున్నారు. అప్పటి వరకు ఎలాంటి ఆహారం తీసుకోవడానికి వీలుండదు. ఈ కారణంగా వారు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత మళ్లీ రాత్రి భోజనంకు మాత్రమే పరిమితమయ్యారు. పురుగులు పట్టినా చూడాల్సిందే.. పోస్టుమార్టం చేసే సమయంలో కొన్ని మృతదేహాలు కుళ్లిపోయి పురుగులు పట్టి ఉంటాయి. ఇలాంటి దృశ్యాలు చూస్తే సామాన్య ప్రజలు జడుసుకుంటారు. కానీ ఫోరెన్సిక్ వైద్యులు, సిబ్బంది మాత్రం వృత్తిధర్మంగా భావించి దుర్వాసనను భరిస్తూ విధులు నిర్వహిస్తారు. ఒక్కోసారి మృతదేహాలను కోసే సమయంలో లీటర్ల కొద్దీ రక్తాన్ని జగ్గుతో తోడిపోయడం వంటి దృశ్యాలను చూస్తూ రిపోర్ట్ రాసుకోవాల్సిందే. ఇలాంటి వాతావరణంలో నుంచి ఇంటికి వెళ్లినా మార్చురి తాలూకు దుర్వాసన శరీరంపై వస్తూనే ఉంటుంది. దీనికితోడు పోస్టుమార్టంకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఒక్కోసారి ఇంట్లోనూ పరిశీలిస్తూ కేసును ఛేదించాల్సిన పరిస్థితి వైద్యులది. పోస్టుమార్టం ఎలా చేస్తారంటే...! శవాన్ని ముందుగా నీటితో కడుగుతారు. ముఖాన్ని స్పాంజ్‌తో తుడుస్తారు. శవాన్ని కోశాక మరణానికి కారణాలను గుర్తించేందుకు తమ పరిశోధన కొనసాగిస్తారు. ఏదైనా క్రిమిసంహారక మందు తాగి/తాగించి చనిపోయిన వారి మృతదేహాలకైతే ముందుగా జీర్ణాశయం, 500 గ్రాముల లివర్, 30 సెంటీమీటర్ల చిన్నపేగుల, రెండు కిడ్నీల్లో సగం సగం తీసి ఫోరెన్సిక్ ల్యాబోరేటరికి పంపిస్తారు. ఆ తర్వాత మృతదేహాన్ని కుట్టేసి కుటుంబీకులకు అప్పగిస్తారు. ►నీటిలో మునిగి చనిపోయి ఉంటే తనే నీటిలో పడ్డాడా, ఎవ్వరైనా కొట్టి నీటిలో పారవేశారా, లేక మూర్చవ్యాధితో నీటిలో పడ్డారా అని పోస్టుమార్టంలో తెలుస్తుంది. ►ఇటీవల ఓ వ్యక్తి విద్యుత్ షాక్‌తో చనిపోవడంతో మార్చురికి తీసుకొచ్చారు. అతనికి పొట్టలో పేగులు బయటకు రావడంతో పొడిచి చంపారని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం అనంతరం అతను విద్యుత్ షాక్‌తోనే చనిపోయాడని, విద్యుదాఘాతం వల్లే అతని పొట్టలో పేగులు బయటపడ్డాయని నిర్దారించారు. ►ఇటీవల ఓ యువకుడు రోడ్డు ప్రమాదానికి గురై మరణించాడు. కానీ అతన్ని బండరాయితో స్నేహితులు కొట్టి చంపారని కుటుంబసభ్యులు కేసు పెట్టారు. అతను రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందాడని పోస్టుమార్టంలో నిర్దారణ అయ్యింది. మాసం పోస్ట్‌మార్టం ఎగ్జామినేషన్ ఏజ్ డిటర్నినేషన్ సెక్సువల్ అఫెన్సెస్ ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ జనవరి 123 05 11 12 ఫిబ్రవరి 141 03 03 09 మార్చి 118 02 04 07 ఏప్రిల్ 123 06 03 11 మే 129 02 05 05 జూన్ 106 04 08 04 మొత్తం 740 22 34 47 2020లో వివిధ రకాల సెక్షన్లలో కేసులు సెక్షన్లు సంఖ్య 304(ఎ) రోడ్డు ప్రమాదాలు 394 174 సీఆర్పీసీ ఆత్మహత్యలు 694 302(ఎ)హత్యలు 15 318(ఎ)అనుమానస్పద మరణాలు 01 498(ఎ), 306 వేదింపుల కారణంగా మహిళల ఆత్మహత్యలు 04 306 ఐపీసీ ఆత్మహత్యకు ప్రేరేపించడం వల్ల మరణాలు 15 307(ఎ) హత్యాయత్నం 01 నాన్ వెజ్ తినడం మానేశాను –డాక్టర్ ఆర్. శంకర్, ఫోరెన్సిక్ హెచ్‌వోడి, కేఎంసీ ఫోరెన్సిక్లో పనిచేస్తున్నప్పటి నుంచి నేను నాన్‌వెజ్ తినలేక మానేశాను. నాన్‌వెజ్ తిందామని కూర్చున్నా ప్లేట్లో మాంసం ముక్కలు చూడగానే మార్చురిలో శవానికి కోసిన శరీర భాగాలు గుర్తుకు వస్తాయి. దీంతో నాన్ వెజ్ అంటేనే విరక్తి కలిగింది. మార్చురిలోని దుర్వాసన మా శరీరానికి అంటుకుపోతుంది. స్నానం చేసినా కూడా దుర్వాసన భావన మనసులోనే ఉంటుంది. వివాహాది శుభకార్యాలకు వెళ్లడం మానేశాం. సమాజంలో అందరినీ కలవలేని పరిస్థితి. ఇల్లు, ఉద్యోగమే జీవితం. కొన్నిసార్లు కుటుంబసభ్యులకూ దూరంగా ఉండాల్సిన పరిస్థితి. మెడికో లీగల్ కేసుల్లో మేమిచ్చే నివేదికలే ఆధారం కాబట్టి మా జీవితం ఇలా అలవాటు పడాల్సి వచ్చింది. -
బాధితురాలిని చిత్రహింసలకు గురిచేశారు..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌కు చెందిన 20 ఏళ్ల యువతిపై ఆధిపత్య కులానికి చెందిన నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం విదితమే. పొలంలో పనిచేసుకుంటున్న బాధితురాలిని లాక్కెళ్లి చిత్ర హింసలకు గురిచేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. నాలుక కోసి, వెన్నెముక విరిగేలా రాక్షసంగా వ్యవహరించినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. యువతి గర్భాశయం వద్ద తీవ్రమైన గాయాలున్నట్లు తేలింది. ఈ పైశాచిక దాడి అనంతరం యువతిని గొంతునులిమి చంపే ప్రయత్నం చేశారు. ఈ మేరకు బాధితురాలి మెడపై గుర్తులు ఉన్నట్లు పోస్టుమార్టంలో వెల్లడైంది. (యూపీ సర్కార్‌కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు) ఇక ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను తొలుత అలీఘర్‌లో చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో, ఢిల్లీలోని సఫ్దార్జంగ్ ఆస్పత్రికి తరలించారు. పక్షవాతం, శరీరంలోని ప్రధాన భాగాలన్నీ తీవ్రంగా దెబ్బతినడంతో రెండు వారాలుగా చిత్రవధ అనుభవించిన బాధితురాలు కన్నుమూసింది. అయితే అదే రోజు అర్థరాత్రి దాటిన తర్వాత హడావుడిగా అంత్యక్రియలు జరిపించడం సర్వత్రా విమర్శలకు దారితీసింది. రాజకీయ పార్టీలు, హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దళితురాలు అయినందున బాధితురాలి పట్ల మరణంలోనూ క్రూరంగా వ్యవహరించిందని మండిపడ్డాయి. (యూపీ నిర్భయ పట్ల అమానవీయం) -
'చర్ల ఎన్కౌంటర్..రీ పోస్టుమార్టం జరిపించండి'
సాక్షి, హైదరాబాద్ : చర్ల ఎన్‌కౌంటర్‌పై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చనిపోయిన ముగ్గురు మృతదేహాలను ఫ్రీజ్ చేయాలని పిటీషనర్ తరపు న్యాయవాది రగునాథ్ హైకోర్టును కోరారు. ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయాలని తెలిపారు. మృతదేహాలను వరంగల్ ఎంజీఎం, ఉస్మానియా ఆసుపత్రికి తరలించాలన్నారు. అదే విధంగా మృత దేహాలకు ఫోరెన్సిక్ నిపుణులతో పోస్టు మార్టం చేపించాలని హైకోర్టును కోరారు. (ముగ్గురు మావోల ఎన్కౌంటర్ ) అయితే ఇప్పటికే మూడు మృతదేహాలను పోస్టుమార్టం చేసి కుటుంబసభ్యులకు అప్పగించామని ప్రభుత్వం బదులిచ్చింది. దీనిపై స్పందించిన న్యాయస్థానం కుటుంబ సభ్యుల నుండి మృతదేహాలను తీసుకుని భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ హాస్పిటల్లో ఫ్రీజ్ చేయాలని ప్రభుత్వానికి సూచించింది. అంతేకాకుండా ఎంజీఎం ఫోరెన్సిక్ నిపుణులతో రీ పోస్టుమార్టం చేపించాలని ఆదేశించింది. పోస్టుమార్టం మొత్తం వీడియో గ్రఫీ చేపించి రీపోర్ట్ షీల్డ్ కవర్లో సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 5 కు వాయిదావేసింది. (చర్ల ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపించాలి) -
పూడ్చిన శవానికి పోస్టుమార్టం
సాక్షి, కామారెడ్డి : అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరిన ఓ వివాహిత రెండ్రోజుల క్రితం మృతి చెందగా, కుటుంబ సభ్యులు గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, తన కూ తుర్ని భర్తే కొట్టి చంపాడని తండ్రి ఫిర్యాదు చేయడంతో పూడ్చి పెట్టిన మృతదేహాన్ని వెలికితీసి బుధవారం పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటన కామారెడ్డి మండలం తిమ్మక్‌పల్లి (కే)లో చోటు చేసుకుంది. దేవునిపల్లి ఎస్సై శ్రీకాంత్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొలిమి భూపాల్‌కు, మేన మరదళ్లు శ్రీలత, మౌనిక(25)తో 2017లో వివాహం జరిగింది. దివ్యాంగురాలైన (మూగ) శ్రీలతకు ఇద్దరు పిల్లలు కాగా, అందరూ కలిసే ఉంటున్నారు. అయితే, ఇటీవల కుటుంబ కలహాలు మొదలమయ్యాయి. ఈ క్రమంలో అనారోగ్యమని ఈ నెల 15న మౌనికను కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి్పంచారు. మూడు రోజుల తర్వాత పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించగా, మౌనిక 20వ తేదీన మృతి చెందింది. మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేశారు. (మాస్కులు తయారు చేసిన భారత ప్రథమ మహిళ ) తన కూతురు అనారోగ్యంతో మృతి చెందలేదని, అల్లుడు తీవ్రంగా కొట్టడంతోనే చనిపోయిందని మృతురాలి తండ్రి సాయిలు దేవునిపల్లి ఠాణాలో మంగళవారం ఫిర్యాదు చేశారు. దీంతో అసిస్టెంట్ కలెక్టర్ నందలాల్ పవార్, డీఎస్పీ లక్ష్మీనారాయణ, తహసీల్దార్ అమీన్‌సింగ్, రూరల్ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం కుటుంబ సభ్యులను విచారించారు. గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని బ యటకు తీయించి పోస్టుమార్టం చేయించారు. మృతురాలి భర్త భూపాల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని ఎస్సై తెలిపారు. పూడ్చి్టన శవాన్ని తీయించి పోస్టుమార్టం నిర్వహించడం చర్చనీయాంశమైంది. (ఆ ఎడిటర్‌ను పెళ్లి చేసుకోవాలని ఉంది: వర్మ ) -
పోస్ట్‌మార్టం వద్దంటూ బైక్‌పై మృతదేహంతో పరార్
-
బైక్‌పై మృతదేహంతో పరార్
సాక్షి, కర్నూలు : నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో ఓ ఆత్మహత్య కేసులో మృతుడి బంధువులు హల్చల్ చేశారు. పోస్ట్‌మార్టం వద్దంటూ మృతదేహం తీసుకొని బైక్‌పై పరారయ్యారు. కర్నూలు జిల్లా దొర్నపాడు మండలం గోవిందిన్నే గ్రామానికి చెందిన రైతుకూలి నారాయణ(18) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ విఫలమే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే తమ కుమారుడికి పోస్ట్‌మార్టం అక్కర్లేదంటూ యువకుడి తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి సిబ్బందితో గొడవకు దిగారు. బైక్‌పై మృతదేహాన్ని వేసుకొని పరారయ్యారు. వెంటపడ్డ పోలీసులను తోసేసి మృతదేహాన్ని తీసుకెళ్లారు. -
రిజిస్ట్రేషన్ కోసం వెళ్లి.. అనంత లోకాలకు
సాక్షి,జనగామ: ఆటో రిజిస్ట్రేషన్ కోసం వరంగల్ వెళ్లి తిరిగి వస్తుండగా జనగామ జిల్లా యశ్వంతాపూర్ శివారు వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ చిలకనగర్‌లో నివాసముంటున్న కె.హేమంత్‌హరిశ్రీకాంత్(23) ఆటో నడుపుతూ కటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అదే ప్రాంతంలో నివాసముంటున్న స్నేహితుడు రమేష్ వద్ద ఆటోను కొనుగోలు చేశాడు. ఈ ఆటో రిజిష్ట్రేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఉంది. దానిని తన పేర మార్పిడి చేసుకునేందుకు హేమంత్‌హరిశ్రీకాంత్ తన స్నేహితులు రమేష్, దాస్లతో కలిసి ఆటోలోనే ఉదయం వరంగల్‌కు బయలుదేరారు. పని పూర్తి చేసుకున్న తర్వాత రాత్రి హైదరాబాద్‌కు తిరిగి వెళ్తున్నారు. యశ్వంతాపూర్ శివారు నేషనల్ హైవేపై ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఆటో ఎగిరి పల్టీలు కొట్టింది. ఆ సమయంలో డ్రైవింగ్ చేస్తున్న శ్రీకాంత్ అక్కడిక్కడే మృతి చెందాడు. రమేష్, దాస్‌లకు తీవ్ర గాయాలయాయ్యయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. క్షతగాత్రులను జిల్లా ప్రధాన ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో వారిని వరంగల్ ఎంజీఎంకు తీసుకు వెళ్లారు. శ్రీకాంత్ మృతదేహాన్ని పోస్టుమార్టం గదిలో భద్రపరిచారు.విషయం తెలుసుకున్న హేమంత్‌హరిశ్రీకాంత్ భార్య దివ్య, కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. తండ్రి కోసం ఏడాది కూతురు ఎదురు చూపు.. తండ్రి కనిపించపోవడంతో హేమంత్‌హరిశ్రీకాంత్ ఏడాది కూతురు బిక్కు బిక్కుమంటూ ఉండి పోయింది. జిల్లా ప్రధాన ఆస్పత్రిలో తల్లి దివ్య రోదిస్తుంటే.. ఏం జరిగిందో తెలియని ఆ పసిపాప దీనంగా చూసింది. నాన్న ప్రేమకు దూరమైన చిన్నారిని చూసిన వారు కంటతడి పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించారు. -
మృతదేహాలకు ట్యాగింగ్!
గుంటూరు మెడికల్ : రాష్ట్ర రాజధాని ఆస్పత్రి గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ చనిపోయిన వారికి పోస్టుమార్టం చేయాల్సినప్పుడు మృతదేహాం తారుమారు కాకుండా ఉండేందుకు ట్యాగింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసేందుకు ఆస్పత్రి అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు గురువారం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దేవనబోయిన శౌరిరాజునాయుడు, ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ బచ్చు ప్రవీణ్‌కుమార్, ఫోరెన్సిక్ వైద్య విభాగాధిపతి డాక్టర్ టీటీకె రెడ్డి ట్యాగ్లు ఏర్పాటు చేయటంపై చర్చించారు. కొన్ని రకాల ట్యాగింగ్‌లను పరిశీలించారు. కాగితాలపై నమోదుతో తారుమారు! గుంటూరు జీజీహెచ్‌లో రోడ్డు ప్రమాదంలో గాయపడి, కత్తిపోట్లకు గురై, శరీరం కాలి, విషప్రభావానికి గురై, కొట్లాటలో గాయపడి, ఇతర సందర్భాల్లో చికిత్స పొందుతున్న వ్యక్తి చనిపోయిన పిదప మెడికో లీగల్ కేసులను తప్పనిసరిగా పోస్టుమార్టం చేయాల్సి ఉంటుంది. జీజీహెచ్‌లో ప్రతిరోజూ పదిమందికి పోస్టుమార్టం చేస్తున్నారు. పోలీసులు వచ్చి విచారణ చేసి ఇంక్వెస్టు రిపోర్టు వైద్యులకు ఇచ్చే సరికి ఒక రోజు లేదా ఒక పూట సమయం పడుతుంది. కొన్ని క్లిష్టమైన కేసులకు రెండు రోజులు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని శవాగారంలో భద్రం చేసేందుకు కాగితాలపై పెన్నుతో వివరాలు రాసి మృతదేహం ఉంచిన బాక్స్ వద్ద అంటిస్తున్నారు. ఆస్పత్రి శవాగారంలో 30 మృతదేహాలను నిల్వచేసే సామర్థ్యం ఉంది. మృతదేహాలు పాడవ్వకుండా అతిశీతలీకరణం చేయటం వల్ల కొన్నిసార్లు కాగితాలపై మృతదేహానికి సంబం«ధించిన వివరాలు చెరిగిపోతున్నాయి. దీని వల్ల మృతదేహాలకు సంబంధించిన వివరాలు కొన్నిసార్లు తారుమారు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా ట్యాగ్లు ఏర్పాటు చేసేందుకు ఆస్పత్రి అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఉచితంగా చాపలు, వస్త్రాలు.. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు రెండు చాపల్లో చుట్టి, తెల్లటి గాజు వస్త్రంలో చుట్టి అందజేస్తారు. గతంలో చాపలు, వస్త్రాలను ఆస్పత్రి అధికారులే హెచ్‌డీఎస్ నిధుల నుంచి కొనుగోలు చేసి ఉచితంగా అందజేశారు. ఇలా చేయటం ద్వారా శవాగారంలో వస్త్రాలు, చాపలు, విస్రా బాటిల్స్ కోసం చనిపోయిన వారి బంధువుల నుంచి వైద్య సిబ్బంది డబ్బులు వసూలు చేయటాన్ని నిలువరించారు. మూడేళ్ళపాటు సత్ఫలితాలు ఇచ్చిన ఈ విధానాన్ని రెండున్నరేళ్ళ కిత్రం అర్ధాంతరంగా ఆపివేశారు. కొంతమంది ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది చాపలు, వస్త్రాలను సైడ్ బిజినెస్‌గా నిర్వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మార్చురీ ఎదురుగా ఉంటే షాపుల్లో వాటిని అందుబాటులో ఉంచి వైద్య సిబ్బంది అమ్మిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇటీవల కాలంలో చాపలు, వస్త్రాల కోసం మార్చురీలో డబ్బులు అడుగుతున్నారనే కథనాలు మీడియాలో రావటంతో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్( డీఎంఈ) అధికారులు చాపలు, వస్త్రాలను ఉచితంగా అందించాలనే ఆలోచనలోకి వచ్చారు. గతంలో గుంటూరు జీజీహెచ్‌లో ఈ విధానం విజయవంతంగా అమలు చేయటంతో ఆస్పత్రి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. ఇలా చేయటం ద్వారా పోస్టుమార్టం వద్ద జరిగే మాముళ్లను కట్టడి చేయవచ్చు. -
పోస్టుమార్టం నివేదికే కీలకం
యశవంతపుర : ఉడిచి శిరూరు లక్ష్మీవర తీర్థ స్వామి అనుమానాస్పద మృతి కేసులో ఇప్పుడు పోస్టుమార్టం నివేదికే కీలకంగా మారింది. నివేదిక కోసం పోలీసులు వేచి చూస్తున్నారు. శనివారంలోపు నివేదిక వచ్చే అవకాశం ఉంది. అనుమానితులను పోలీసులు విచారణ చేస్తున్నారు. బుధవారం సాయంత్రం స్వామికి ఆప్తురాలిగా భావిస్తున్న రమ్యాశెట్టి స్నేహితుడు ఇక్బాల్ (45)ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. రమ్యాశెట్టి పోలీసుల అదుపులో ఉన్న విషయం తెల్సిందే. ఇదిలా ఉంటే పోస్టుమార్టం నివేదిక తరువాత ఎఫ్ఎస్ఎల్ నివేదిక రావడానికి ఆరు వారాల సమయం పడుతుంది. అప్పుడే శాస్త్రీంగా దర్యాప్తు మొదలువుతుందని పోలీసులు చెబుతున్నారు. డీవీర్ నిపుణులు రాక : సీసీ కెమెరా డీవీఆర్‌ను పరిశీలించడానికి బెంగళూరు నుంచి నిపుణులను రప్పించారు. ఇదే కీలక సాక్ష్యంగా పోలీసులకు ఉపయోగపడనుంది. అదే విధంగా తరచూ మఠానికి వచ్చిపోయే భక్తుల వివరాలు సేకరించారు. ముంబైకు రెండు బృందాలను పంపించారు. పశ్చిమ విభాగం ఐజీ అరుణ్ చక్రవర్తి, ఎస్పీ నింబర్గిలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. స్వామీజీ వైకుంఠ ఆరాధన 31న మూల మఠంలో నిర్వహించాలని నిర్ణయించారు. రూ. కోటి బంగారం భద్రం : స్వామి వద్దనున్న కోటి విలువ గల బంగారు అభరణాలు భద్రంగా ఉన్నట్లు ఉడిపి పోలీసులు తెలిపారు. బంగారు నగలను ఎవరూ దోచుకెళ్లలేదని, ఆయన ఆస్పత్రికి చేరే ముందు ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న సందేశాలతో పోలీసులు సతమతమవుతున్నారు. మరో అనుమానితుడు బులెట్ గణేశ్‌ను అదుపలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
గొర్రె పిల్లను కాపాడబోయి కాపరి మృతి
సాక్షి, అల్గునూర్(మానకొండూర్) : ఉపాధి పొందు తున్న గొర్రెను కాపాడబోయి గొర్రెల కాపరి ప్రాణాలు కోల్పోయిన ఘటన తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలో బుధవారం చోటు చేసుకుంది. రామకృష్ణకాలనీ పంచాయతీ పరిధిలోని చర్లపల్లికి చెందిన ఆవుల రాజయ్య(45) గొర్రెలు పెంచుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజువారీలాగే బుధవారం ఉదయం గొర్రెలను మేపెందుకు గ్రామశివారుకు తీసుకెళ్లాడు. మధ్యాహ్నం ఓ గొర్రెపిల్ల మేత కోసం సమీపంలోని బావిదగ్గరకు వెళ్లి.. అందులోనే పడిపోయింది. గమనించిన రాజయ్య వెంటనే తన కొడుకులకు ఫోన్ చేయగా.. వారు తాడు తీసుకొచ్చారు. తాడుసాయంతో బావిలోకి దిగిన రాజయ్య మొదట గొర్రెపిల్లను పైకి పంపించాడు. తర్వాత అదే తాడుసాయంతో పైకి వస్తుండగా అదుపుతప్పి పడిపోయాడు. తాడును నడుముకు కట్టుకోవడంతో బావిలోనే తిరుగుతూ బావి అంచులకు తాకడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. బావిలో నీళ్లు లేకపోవడం కూడా గాయాల తీవ్రతకు కారణమయ్యాయి. బావిలో పడ్డ తండ్రిని ఎంత పిలిచినా స్పందన రాకపోవడంతో వెంటనే గ్రామస్తులు, బంధువులకు సమాచారం ఇచ్చారు. బావిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తండ్రిని కాపాడాలంటూ తనయులిద్దరూ బతిమిలాడుతూ రోదించడం కలచివేసింది. గ్రామస్తులు బావి వద్దకు చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్ట్‌మార్టం కోసం కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆరు నెలల క్రితం విద్యుదాఘాతం ఆరు నెలల క్రితం రాజయ్యకు చెందిన 18 గొర్రెలు విద్యుదాఘాతంతో మృతిచెందాయి. ఆ సమయంలోనే రాజయ్యకు సైతం కరెంట్‌షాక్ రాగా త్రుటిలో తప్పించుకున్నారు. ఆ సమయంలో ఆర్థికంగా చాలా నష్టపోయాడు. ఆరు నెలల తర్వాత ఉపాధి పొందుతున్న గొర్రెలను కాపాడబోయి ప్రాణాలు పోగొట్టుకోవడం గ్రామస్తులను కలచివేసింది. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. నిరుపేద రాజయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
పెళ్లి ఇష్టంలేక యువతి ఆత్మహత్య
సాక్షి, విశాఖ క్రైం : పెళ్లి ఇష్టం లేని యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం జరిగిన ఈ సంఘటన వివరాలు పోలీసుల కథనం మేరకు ఇలా ఉన్నాయి. గురుద్వార కూడలి శాంతిపురం అరుణ అపార్టుమెంట్లో సత్తరు అప్పన్న, నారాయణమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కుమార్తె సత్తరు రేవతి (20), కుమారుడు చైతన్య ఉన్నారు. అప్పన్న నెల్లూరులో మెకానిక్‌గా పనిచేస్తున్నారు. కుమార్తె రేవతి డిగ్రీ పరీక్షలు రాసింది. రేవతికి బావతో పెళ్లి కుదిర్చారు. ఈనెల 22న వివాహం నిర్ణయించారు. ఈ క్రమంలో పెళ్లి పనుల్లో భాగంగా సోమవారం పెళ్లి కార్డుల పంపిణీకి రేవతి కుటుంబ సభ్యులు వెళ్లారు. ఈ నేపథ్యంలో రేవతి సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ హుక్కు చున్నితో ఉరి వేసుకొని అత్మహత్యకు పాల్పడింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన రేవతి తల్లి, కుటుంబ సభ్యులు తలుపులు ఎంత కొట్టినా తీయకపోవడంతో గట్టిగా తోసి లోపలకు ప్రవేశించారు. ఇంటిలో సిలింగ్ హుక్కుకు వేలాడుతున్న రేవతిని చూశారు. వెంటనే ఆమెను కిందకు దించి కేర్ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. రేవతి తల్లి నారాయణమ్మ ద్వారకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన హెడ్ కానిస్టేబుల్ తులసీ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం రేవతి మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. చదువుకోవాలన్న ఉద్దేశంతో ఉన్న రేవతి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసు విచారణలో వెల్లడైనట్టు తెలిసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానం.. పెనుభూతం
నెల్లూరు(క్రైమ్): దంపతుల నడుమ అనుమానం పెనుభూతంగా మారింది. ఆరు నిండుప్రాణాలను బలితీసుకొంది. ముద్దుముద్దు మాటలతో ఆడుతూ పాడుతూ గడపాల్సిన చిన్నారులను సైతం విగతజీవులుగా మార్చేసింది. ప్రకాశం జిల్లా ఉలవపాడులో ఆదివారం రాత్రి ఆ కుటుంబం రైలుపట్టాలపై ఆత్మహత్యకు పాల్ప డింది. వారి మృతదేహాలను ప్రత్యేక వాహనంలో బాధిత కటుంబసభ్యులు, బంధువులు సోమవారం సాయంత్రం నెల్లూరు నగరంలోని బోడిగాడితోటకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. నెల్లూరు సంతపేట మహాలక్ష్మమ్మగుడి ప్రాంతానికి చెందిన నారాయణ, ఉమ దంపతుల కుమారుడు పి.సునిల్(25)కు కందుకూరుకు చెందిన రమాదేవి/రమ(23)తో 2012లో వివాహమైంది. అల్యూమినియం వంటసామగ్రి విక్రయించుకుంటూ వారు జీవనం సాగించేవారు. వ్యాపార నిమిత్తం కొంతకాలం క్రితం సునిల్ కాపురాన్ని వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్‌కు మార్చాడు. వారికి ఉష(5), కవలలు కల్యాణ్(3), కల్యాణి(3), ఎనిమిది నెలల బాబు ఉన్నారు. సజావుగా సాగాల్సిన వీరి కాపురంలో అనుమానం పెనుభూతంలా దాపురించింది. భార్య ప్రవర్తనపై సునిల్ అనుమానం పెంచుకొన్నాడు. ఆమె సెల్ఫోన్లో ఎవరెవరితో మాట్లాడుతుందో వారి సంభాషణలన్నీ రికార్డ్ చేయసాగాడు. అలా ఆమె తప్పులను ప్రస్తావిసూ తరచూ నిలదీసేవాడు. దీంతో దంపతుల నడుమ విబేధాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో రమ వారం రోజుల క్రితం కందుకూరులోని తన పుట్టింటికి వచ్చింది. ఆదివారం ఉదయం సునిల్ తన తల్లిదండ్రులను, బంధువులను తీసుకొని కందుకూరు వచ్చాడు. ఇరువర్గాల íపెద్దలు వారికి సర్దిచెప్పారు. కాపురాన్ని చక్కగా చేసుకోవాలని సూచించారు. దీంతో భార్య, పిల్లలను తమ వెంట తీసుకొని ఉలవపాడు రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య తిరిగి వాగ్వాదం చోటుచేసుకుంది. ఏమైందో ఏమో తెలియదు కానీ సునిల్, రమ తమ పిల్లలతో కలిసి ఉలవపాడు రైల్వేస్టేషన్లో సంఘమిత్ర రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాల వారు ఘటనా స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. రైల్వే పోలీసులు మృతదేహాలకు శవపరీక్షలు నిర్వహించి సునిల్ కుటుంబసభ్యులకు సోమవారం అప్పగించారు. సోమవారం సాయంత్రం బాధిత కుటుంబసభ్యులు మృతదేహాలను అంబులెన్స్‌లో నెల్లూరు బోడిగాడితోటకు తరలించారు. మిన్నంటిన రోదనలు సునిల్ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన బంధువులకు, స్నేహితులకు తెలియడంతో వారు సోమవారం సాయంత్రం పెద్ద ఎత్తున బోడిగాడితోటలోని శ్మశానవాటికకు చేరుకున్నారు. మృతదేహాలను ఇంటికి తీసుకెళ్లకుండా నేరుగా శ్మశానవాటికకు తరలించారు. మృతదేహాలను చూసి గుండెలవిసేలా రోదించారు. ముద్దుముద్దు మాటలతో అందరినీ అలరించా ల్సిన చిన్నారులు విగతజీవులుగా మారి చాపల్లో చుట్టి ఉండటాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం అశ్రనయనాల నడుమ సునిల్, రమలతోపాటు వారి పిల్లల అంత్యక్రియలు జరిగాయి. మృతదేహాలను నెల్లూరుకు తీసుకొస్తున్నారన్న సమాచారంతో మృతుడి తల్లిదండ్రులు ఇంటి వద్దకు అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. గంటల తరబడి మృతదేహాలను కడసారి చూసేందుకు వేచిచూశారు. అయితే బాధిత కుటుంబసభ్యులు నేరుగా మృతదేహాలను బోడిగాడితోటలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు చేశారన్న విషయం తెలుసుకుని బాధపడ్డారు. ఆరు మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి ఒంగోలు క్రైం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒకే కుటుంబంలో ఆరుగురి ఆత్మహత్యకు సంబంధించి మృతదేహాలకు ఒంగోలు రిమ్స్ వైద్యశాలలో సోమవారం పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఆదివారం రాత్రి ప్రకాశం జిల్లా ఉలవపాడు రైల్వేస్టేషన్ సమీపంలో సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌కు ఎదురుగా వెళ్లడంతో నెల్లూరుకు చెందిన పాశం సునిల్(28), రమ(24) దంపతులతోపాటు వారి పిల్లలు ఉష(5), కవలలు కల్యాణ్, కల్యాణి(3), ఎనిమిది నెలల పసికందు అక్కడికక్కడే మృతి చెందిన సంగతి తెలిసిందే. ఘటనా స్థలంలో పంచనామా నిర్వహించిన అనంతరం మృతదేహాలను రిమ్స్‌కు తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల సమక్షంలో పూర్తి వివరాలతో కూడిన పంచనామాను రిమ్స్‌లో ఉలవపాడు తహసీల్దార్ పద్మావతి సమక్షంలో ఒంగోలు రైల్వే జీఆర్పీ సీఐ పి.శ్రీనివాసరావు, చీరాల ఎస్సై రామిరెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ ఎం.జె.కిషోర్‌బాబు నిర్వహించారు. రిమ్స్ వైద్యులు రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతుని బంధువు పాశం కొండయ్య, అన్నయ్య పాశం అని ల్ ఆరు మృతదేహాలను రిమ్స్ నుంచి నెల్లూరు పట్టణానికి తీసుకెళ్లారు. జీఆర్పీ సీఐ పి.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాంసపు ముద్దలు.. రక్తపు మరకలు ఉలవపాడు: ఉలవపాడు రైల్వేస్టేషన్లో ఆదివారం రాత్రి రైలు కింద పడి ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం తెలుసుకున్న స్థానికులు సోమవారం తెల్లవారుజామునే ఘటనా స్థలానికి చేరుకున్నారు. రైలు పట్టాల మధ్యలో మాంసపు ముద్దలు, రక్తపు మరకలు చూసి చలించిపోయారు. హృదయ విదారకరమైన ఘటనను తలచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్పర్థలు వచ్చి ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిసి కష్టాలు ఎదుర్కొని సంసారం చేయాలి కానీ ఇలా ముక్కుపచ్చలారని చిన్నారులతో సహా ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని చర్చించుకోవడం కనిపించింది. ఐదేళ్లలోపు పిల్లలు నలుగురు మృతి చెందారని తెలుసుకున్న మహిళలు భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. రైలు పట్టాలపై మాంసపు ముద్దలను చూసి కంటతడి పెట్టారు. -
ఆర్నెల్ల తర్వాత శవానికి పోస్టుమార్టం
కురబలకోట : ఆరు నెలల క్రితం మృతిచెందిన అంగళ్లుకు చెందిన శెట్టి సీతారాంరెడ్డి మృతదేహాన్ని గురువారం వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. శరీర భాగాలను తిరుపతిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపుతున్నట్లు ఇన్చార్జి రూరల్ సీఐ సురేష్‌కుమార్ వెల్లడించారు. ఆర్నెళ్ల తర్వాత కూడా మృత దేహం చెక్కు చెదరకుండా ఉండడం విశేషం. వివరాల్లోకెళితే.. అంగళ్లుకు చెందిన సీతారాంరెడ్డి ఆరు నెలల క్రితం మృతిచెందారు. ఆయన గుండెపోటుతో మృతిచెంది నట్టు భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. మదనపల్లెలో ఇటీవల జరిగిన హత్య కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొంతమంది నిందితులను అరెస్టు చేశారు. విచారణలో వారు సీతారాంరెడ్డిని హత్య చేసినట్టు అంగీకరించారు. ఆస్తి పంపకాలకు అడ్డుపడుతున్నాడన్న కారణంతో అతన్ని బంధువులు పథకం ప్రకారం హత్య చేయించినట్టు వెల్లడించారు. ఊరి బయటకు వాకింగ్‌కు వెళ్లిన ఆయనకు బలవంతంగా విషపు నీరు తాగించడంతో చనిపోయినట్లు వివరించారు. పోలీసులు తహసీల్దార్ ఆధ్వర్యంలో గురువారం సీతారాంరెడ్డి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేయించారు. ఆయన శరీర భాగాలను తిరుపతి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఐదుగురు నిందితులపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదిక అందిన తర్వాత దర్యాప్తు వేగవంతం చేస్తామన్నారు. -
కోడలిపై డౌట్.. మరణించిన 18రోజుల తర్వాత!
న్యూఢిల్లీ : తమ అదృష్టం బాగాలేదని, అందుకే కుమారుడు పక్షవాతంతో మరణించాడని భావించారు ఆ తల్లిదండ్రులు. కానీ కుమారుడి సెల్లో దొరికిన కాల్ రికార్డింగ్‌లు, కోడలి నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ కొడుకు మృతికి కోడలే కారణమనే అనుమానాలను పెంచింది. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఫలితంగా వ్యక్తి చనిపోయిన 18 రోజుల తర్వాత అతని మృతదేహాన్ని శ్మశానం నుంచి వెలికితీసి పోస్టుమార్టం పోలీసులు నిర్వహిస్తున్నారు. కలకలం రేపిన ఈ సంఘటన ఢిల్లీలోని మంగోల్పూరిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఢిల్లీలోని బెగంపూర్ నివాసికి 2007లో వివాహయ్యింది. అతడు ఫర్నిచర్ షాపు నిర్వహిస్తుండగా భార్య ఇంటి దగ్గరే ఉండేది. వీరికి ఇద్దరు పిల్లలు. మార్చి 6న ఆ వ్యక్తి ఉన్నట్టుండి కిందపడిపోయాడు. వెంటనే తల్లిదండ్రులు అతన్ని ఆస్పత్రికి తీసుకు వెళ్లగా ఈ నెల 9న మృతి చెందాడు. ఎక్కువ మొత్తంలో మత్తు పదార్థాలు తీసుకోవడం వల్లే అతడు మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. మంగోల్పూరిలోనే అతనికి దహనసంస్కారాలు నిర్వహించారు. అనుమానమొచ్చిందిలా... ఈ నెల 20న మృతుడి తల్లిదండ్రులు ఇంటిని శుభ్రం చేయడానికి వెళ్లినప్పుడు అక్కడ వారికి కోడలి డ్రైవింగ్ లైసెన్స్ దొరికింది. కానీ అది నకిలీది. దానిలో వారి కుమారుని పేరు బదులు వారి మేనల్లుని పేరు ఉంది. అదే సమయంలో వారికి కొడుకు సెల్లో కోడలు, మేనల్లుని మధ్య జరిగిన సంభాషణల రికార్డు కూడా లభించింది. మార్చి 6న జరిగిన సంభాషణ అందులో రికార్డయ్యింది. ఆ రోజు మృతుడు తెల్లవారుజామున 2గంటల ప్రాంతంలో నిద్రలేచాడు. ఆ సమయంలో అతని భార్య ఎవరితోనొ ఫోన్లో మాట్లడుతుంది. దాంతో ఆమెను భర్త కొట్టాడు. ఆ సమయంలో భార్య సహాయం కోసం భర్త సెల్నుంచే తన ప్రేమికుడికి ఫోన్ చేసింది. భర్త తన అత్తమామలకు ఫోన్‌చేసి ఈ విషయాన్ని వారికి కూడా తెలిపాడు. ఈ విషయాలన్ని ఫోన్లో రికార్డయ్యాయి. ఫోన్‌ను, నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ను మృతుడి తల్లిదండ్రులు పోలీసులకు సాక్ష్యంగా సమర్పించారు. తన కోడలు ఆమె ప్రేమికునితో కలిసి హానికారక పదార్ధాలను ఇచ్చి తమ కొడుకు మరణించేలా చేసిందని అతని తండ్రి పోలీసులకు రాత పూర్వక ఫిర్యాదు ఇచ్చారు. సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఈ కేసులో మృతదేహాన్ని తవ్వితీసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (రోహిణి) రజనీష్ గుప్తా చెప్పారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత మాత్రమే ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. -
తండ్రి మరణం...40 గంటల నిరీక్షణం
‘పది’లమైన జీవితానికి అడుగులు వేస్తూ.. పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు ఆ విద్యార్థులు..అయితే విధి ఆడిన వింతనాటకంలో కన్నవారిని కోల్పోయారు. ఆ బాధను దిగమింగుకుని పరీక్షలు రాస్తున్నారు. ఐ.పోలవరం (ముమ్మిడివరం): పది రోజులుగా పదో తరగతి పరీక్షలు రాస్తూ.. తన జీవిత లక్ష్యాలకు పునాదులు వేసుకుంటున్నాడు ఆ బాలుడు. ఇంతలో పరాయి రాష్ట్రంలో అతడి తండ్రి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహం స్వగ్రామంలోని ఇంటికి చేరేదాకా మధ్యలో ఆ కుర్రాడు పడిన మనోవేదన వర్ణనాతీతం. ఒడిశా రాష్ట్రం రాయగడలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు వ్యక్తుల్లో ఐ.పోలవరం మండలం మురమళ్ల గ్రామానికి చెందిన కిరాణా వ్యాపారి నూలు శ్రీనివాసరావు(44) ఒకరు. ఆయన కుమారుడు కౌశిక్ పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. అమలాపురానికి చెందిన శ్రీనివాసరావు బావ హోమ ద్రవ్యాల హోల్ సేల్ వ్యాపారి శ్రీకాకోళపు సుబ్రహ్మణ్యంతో పాటు మరో బంధువైన అమలాపురం రూరల్ మండలం ఇమ్మిడివరప్పాడు గ్రామ వాసి సూర్యనారాయణ ఈ ప్రమాదంలో ముగ్గురు రక్త సంబంధీకులు అక్కడిక్కడే ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. రోడ్డు ప్రమాదం పరాయి రాష్ట్రంలో జరగడం వల్ల మృతదేహాలు 40 గంటల తర్వాత అంటే సోమవారం తెల్లవారు జామున స్వగ్రామాలకు చేరాయి. పిల్లలను బాగా చదివించాలని.. శ్రీనివాసరావు తనకు ఉన్నంతలో కిరాణా వ్యాపారం చేసుకుంటూ తన పిల్లలను బాగా చదివించి మంచి ప్రయోజకులను చేయాలన్న తపనతో ఉండేవాడని మురమళ్ల గ్రామస్తులు అంటున్నారు. భార్య, ఇద్దరు కవల ఆడపిల్లలు, ఒక కుమారుడితో సాగిపోతున్న ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.ఇద్దరు కవల ఆడపిల్లలు బీటెక్‌లు పూర్తి చేశారని, వారికి పెళ్లిళ్లు చేయకుండానే శ్రీనివాసరా>వు వారికి దూరమయ్యాడని స్థానికులు వాపోతున్నారు. పదో తరగతి పరీక్షలు రాస్తున్న కౌశిక్ తండ్రి మృతదేహం కోసం రోజున్నర పాటు ఎదురు చూసి వేదనతో గడిపాడు. కడసారి కన్నతండ్రిని చూసి పరీక్ష హాలుకు.. సోమవారం తెల్లవారు జామున ఇంటికి తరలించిన తండ్రి మృతదేహంపై పడి తల్లి, అక్కలతో కలసి ఏడ్చిన కొడుకు కౌశిక ఉదయం ఎనిమిదయ్యాక దుఃఖాన్ని దిగమింగుకుని పదో తరగతి పరీక్ష రాసేందుకు పయనమయ్యాడు. బంధువులు కూడా పదో తరగతి పరీక్షలకు ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేయడంతో కౌశిక్ మురమళ్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం పదో తరగతి సోషల్ పేపర్–1 పరీక్ష రాశాడు. శ్రీనివాసరావు కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ పరామర్శించి నివాళులు అర్పించారు. -
ఆమె గర్భిణి కాదు
టీ.నగర్: ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ దాడిలో మృతి చెందిన ఉష గర్భిణి కాదని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. తంజావూరు జిల్లా పాపనాశం ప్రాంతానికి చెందిన రాజా (33) అతని భార్య ఉష (33). ఈ నెల 7వ తేదీ రాత్రి బైకులో వెళుతుండగా వాహన తనిఖీలు జరుపుతున్న ఇన్స్పెక్టర్ కామరాజ్ దాడి చేయడంతో ఉష మృతి చెందిన విషయం తెలిసిందే. ఉష మూడు నెలల గర్భిణిగా ప్రచారం జరిగింది. ప్రస్తుతం పోస్టుమార్టం నివేదికలో ఉష గర్భిణి కాదని వైద్యులు తేల్చారు. ఈ కేసు విచారణ జరుపుతున్న క్రైం బ్రాంచ్ డీఎస్పీ పుహళేంది, ఉష పోస్టుమార్టం నివేదికలోని వివరాలను సోమవారం వెల్లడించారు. -
చనిపోయిన వారు తమిళ కూలీలేనా...
సాక్షి కడప/రాజంపేట/ఒంటిమిట్ట : కడప–రేణిగుంట జాతీయ రహదారిలోని ఒంటిమిట్ట చెరువులో ఏం జరిగింది.. ఐదుగురు ఒకేసారి చనిపోవడం వెనుక కారణాలు ఏమిటి.. చనిపోయిన వారంతా తమిళ కూలీలేనా.. ఎవరిని కదిపినా ఇదే చర్చ సాగుతోంది.. చూసిన వారందరూ తమిళ కూలీలేనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శేషాచలం అడవులు సమీప ప్రాంతాల్లోనే ఉండడంతో.. రైళ్లలో వచ్చి నేరుగా అడవుల్లోకి వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే కూలీల సమాచారం పసిగట్టి వెంబడించడంతోనే కొందరు నీళ్లలోకి దూకి ఉంటారని ప్రజా సంఘాల నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఘటనను బట్టి చూస్తే రెండు, మూడు రోజుల కిందటే చెరువులో పడినట్లు తెలుస్తోంది. చెరువులో ఎలా పడ్డారు....వారిని ఎవరైనా వెంబడించారా...లేకపోతే హత్య చేసి పడేశారా అన్నది తెలియలేదు. పోలీసులు కూడా అనుమానాస్పదం కిందనే కేసు నమోదు చేశారు. ఒంటిమిట్ట చెరువులో ఒకేసారి ఐదు మృతదేహాలు కనిపించడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. శుక్రవారం రాత్రి ఒంటిమిట్ట ఫార్టెసు పరిధిలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేపట్టేందుకు తమిళ తంబీలు వచ్చినట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో గాలింపు చర్యలు చేపట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అదే రాత్రి చెర్లోపల్లె గ్రామంలో పలువురు గ్రామస్తులను విచారించారు. గ్రామసమీపంలోని పొలాలకు దగ్గరలో ఉన్న చెరువు పెద్దకుంటలో మృతదేహాలు లభ్యంకావడంతో పోలీసుల గాలింపునకు ఆధారంగా నిలుస్తోంది. ఎర్రచందనం లారీ డ్రైవర్ పరారీ అయినట్లు, అందులోని 30 మంది తమిళతంబీలు పోలీసులను చూసి పారిపోయే తరుణంలో ఐదుగురు చెరువు పెద్దకుంటలో పడి మృతిచెందినట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులు మాత్రం నిర్ధారించడంలేదు. ప్రమాదవశాత్తా.. ఆత్మ‘హత్య’ చెరువు పెద్దకుంటలో లభ్యమైన ఐదు మంది తమిళ తంబీలు ప్రమాదవశాత్తు పడ్డారా? లేక ఎన్కౌంటర్ చేసి పడేశారా..పోలీసులకు చిక్కుతామనే ఆత్మహత్య చేసుకున్నారా.. ఇవి స్థానికుల్లో నెలకొన్ని అనుమానాలు. పోలీసులకు తమిళతంబీలు ఎదురు తిరిగిన పరిస్ధితిలో ఈ సంఘటన జరిగిందా? అని కూడా పలువురు అనుమానిస్తున్నారు. ఓ పోలీసు అధికారికి గాయాలు అయినట్లు ఒంటిమిట్టలో చెప్పుకోవడం జరుగుతోంది. సంఘటన స్ధలానికి చేరుకున్న ఓఎస్డీ నయూం అస్మీ మృతదేహాలను పరిశీలింంచారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మృతదేహాలను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతూనే ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు కూంబింగ్ జరుగుతూనే ఉంటుందన్నారు. మృతిచెందిన వారు తమిళతంబీలని ఇప్పుడు చెప్పలేమని, విచారణలో తేలాల్సి ఉందన్నారు. డీఎస్పీ లక్ష్మీనారాణ, ఆర్డీఓ వీరబ్రహ్మం, తహసీల్దారు శిరీష, సీఐ రవికుమార్, సబ్‌డివిజన్‌లోని పలువురు ఎస్ఐలు ఉన్నారు.ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి కూడా మృతదేహాలను పరిశీలించారు. రిమ్స్‌కు చేరిన మృతదేహాలు ఒంటిమిట్ట చెరువులో కనిపించిన గుర్తు తెలియని వ్యక్తుల మృతదేహాలను ఆదివారం సాయంత్రం రిమ్స్ మార్చురీకి తరలించారు. సోమవారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఇప్పటికే టీవీల ద్వారా ప్రచారం జరగడం, పోలీసులు కూడా ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు సమాచారాన్ని అందించిన నేపథ్యంలో మిస్సింగ్ అయిన వారి బంధువులు కడపకు చేరుకునే అవకాశం ఉంది. ఒంటిమిట్ట చెరువులో చనిపోయిన వారికి సంబంధించి 174 సీఆర్పీసీ కింద కేసు నమోదు చేసినట్లు జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) అద్నాన్ నయీం అస్మి తెలిపారు. -
ఆర్తనాదాలతో దద్దరిల్లిన ఆస్పత్రి
శ్రీకాళహస్తి రూరల్: మండలంలోని వాంపల్లి సమీపంలో ఏర్పేడు–వెంకటగిరి రోడ్డులో బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో మృతిచెందిన వారి బంధువుల ఆర్తనాదాలతో శ్రీకాళహస్తి ఆస్పత్రి దద్దరిల్లింది. యువకుల మృతదేహాలకు గురువారం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. శ్రీకాళహస్తి రూరల్ సీఐ సుదర్శన్‌ప్రసాద్ కథనం మేరకు.. శ్రీకాళహస్తి రూరల్ వాంపల్లి సమీపంలో బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ముగ్గురు యువకులు మృతి చెందిన సంఘటన తెలిసిందే. మృతులు చిత్తూరు పట్టణానికి చెందిన కిరణ్(35), రాజేష్(34), జనశక్తి(34). వీరు మంచి స్నేహితులు. ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో గురువారం శ్రీకాళహస్తి ఆస్పత్రికి తరలివచ్చారు. మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరయ్యారు. ముగ్గురూ స్నేహితులు: చిత్తూరు పట్టణంలోని హకీంసాహెబ్ వీధికి చెందిన టౌన్ బ్యాంకు విశ్రాంతి ఉద్యోగి శంకరయ్య కుమారుడు కిరణ్ 12 ఏళ్ల నుంచి వెంకటగిరి సమీపంలోని 9వ బెటాలియన్‌లో కమాండెంట్ జీపు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఆరేళ్ల క్రితం పెళ్లి అయింది. ఇంకా పిల్లలు లేరు. ఇతని కుటుంబ సభ్యులు బెటాలియన్ ఆవరణలో ఉన్న పోలీస్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. చిత్తూరు పట్టణంలోని న్యూ బాలాజీ కాలనీకి చెందిన గణేష్ కుమారుడు రాజేష్ ఐదేళ్ల నుంచి ట్రాఫిక్ కానస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి 8 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇతనికి భార్య ఒకటిన్నర ఏడాది కలిగిన బాబు ఉన్నారు. ఇతను చిత్తూరులోనే నివాసం ఉంటున్నాడు. చిత్తూరు పట్టణంలోని కన్నయ్యనాయుడు కాలనీకి చెందిన కాశీమాణిక్యం కుమారుడు జనశక్తి ఫోటో గ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఇతనికి భార్య, ఏడాది వయస్సు కలిగిన కుమార్తె ఉన్నారు. కొద్ది రోజుల నుంచి కిరణ్ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో అతన్ని పరామర్శించడానికి చిత్తూరు నుంచి రాజేష్. జనశక్తి బెటాలియన్‌కు వచ్చారు. అనంతరం రాజేష్, జనశక్తిని బస్సు ఎక్కించడానికి కిరణ్ అతని స్కూటీలో వాంపల్లికి బయలుదేరారు. వెంకటగిరి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ఢీకొనటంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. -
ఎలుకలు పట్టేందుకు వెళ్లి..
పొదలకూరు: మండలంలోని విరువూరు గ్రామంలో శుక్రవారం గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎస్సై అల్లూరు జగత్సింగ్ కథనం మేరకు వివరాలు.. వరిచేలల్లో ఎలుకలను పట్టేందుకు వచ్చిన నల్లబోతుల గంగయ్య(38) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం నెల్లూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బొగ్గుల కుంపటి కొంపముంచిందా?
రాజాపేట (ఆలేరు): యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట శివారులోని పౌల్ట్రీఫాంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మరణం చిక్కుముడి వీడటం లేదు. వీరు తిన్న ఆహారం కలుషితమైందా.. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో మూకుమ్మడిగా ఆత్మహత్యకు పాల్పడ్డారా..? ఎవరైనా హత్య చేశారా..? అన్నది ఇంకా తేలడం లేదు. అయితే.. బొగ్గుల కుంపటి వీరి ప్రాణాలు తీసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజాపేటలోని పౌల్ట్రీఫాంలో సిద్ధిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం మునిగడపకు చెందిన దుబ్బాసి బాలరాజు (44), నిర్మల(40), వారి కుమార్తె శ్రావణి(14), చింటు(12), బన్ని(8), అత్తమామలైన జనగామ జిల్లా చిలుపూరు మండలం లింగంపల్లికి చెందిన బచ్చలి బాలనర్సయ్య(68), బచ్చలి భారతమ్మ(60) అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ మరణాల మిస్టరీ ఛేదించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. బొగ్గుల కుంపటే కారణమా? బాలరాజు కుటుంబ సభ్యులు గురువారం రాత్రి భోజనాలు ముగించుకుని నిద్రకు ఉపక్రమించారు. రాత్రి బాగా చలిగా ఉండటంతో పౌల్ట్రీఫాంలో కోడిపిల్లలకు వెచ్చదనం కోసం ఉపయోగించే బొగ్గుల కుంపటిని వేడి కోసం వారు పడుకునే గదిలో పెట్టుకున్నారు. అసలే చిన్నగది. గాలి చొరబడకుండా దానికి ఉన్న కిటికీని, తలుపులు బిగించి నిద్రించారు. గదిలో ఉన్న బొగ్గుల కుంపటి వల్ల కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. దీంతో గదిలో ఉన్నవారికి ఊపిరాడక కుటుంబ సభ్యులంతా నిద్రలోనే విగత జీవులై ఉండొచ్చని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పురుగు మందు వీరు తెచ్చుకున్నది కాదు పురుగు మందు కూడా వీరు తెచ్చుకున్నది కాదని తెలుస్తోంది. పక్క గదిలో దొరికిన క్రిమి సంహారక మందులు కాకల్ల ఐలయ్య పత్తి చేను కోసం తెచ్చుకున్నట్లు పౌల్ట్రీయజమాని చెప్పడం చూస్తుంటే బొగ్గుల కుంపటే కారణమన్న దానికి మరింత బలం చేకూరుస్తోంది. పోస్టుమార్టం నివేదికలోనూ తెలియని కారణం? పోస్టుమార్టం నివేదికలోనూ వీరి మరణానికి గల కారణాలు పూర్తి స్థాయిలో లభించలేదని విశ్వసనీయ సమాచారం. మృతుల శరీరాల నుంచి షాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపినట్లు తెలుస్తోంది. పోలీసులు శనివారం కూడా పౌల్ట్రీఫాం వద్ద మరికొన్ని ఆధారాల కోసం ప్రయత్నించారు. ఏది ఏమైనా ఒకే కుటంబానికి చెందిన ఏడుగురి మరణం మిస్టరీగా మారింది. శరీరం నుంచి సేకరించిన షాంపిల్స్ నివేదిక వచ్చాకగానీ కేసు చిక్కుముడి వీడే పరిస్థితి కనిపించడం లేదు.