
సాక్షి, కర్నూలు : నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో ఓ ఆత్మహత్య కేసులో మృతుడి బంధువులు హల్‌చల్ చేశారు. పోస్ట్‌మార్టం వద్దంటూ మృతదేహం తీసుకొని బైక్‌పై పరారయ్యారు. కర్నూలు జిల్లా దొర్నపాడు మండలం గోవిందిన్నే గ్రామానికి చెందిన రైతుకూలి నారాయణ(18) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ విఫలమే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే తమ కుమారుడికి పోస్ట్‌మార్టం అక్కర్లేదంటూ యువకుడి తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి సిబ్బందితో గొడవకు దిగారు. బైక్‌పై మృతదేహాన్ని వేసుకొని పరారయ్యారు. వెంటపడ్డ పోలీసులను తోసేసి మృతదేహాన్ని తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment