
ప్రతీకాత్మక చిత్రం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌కు చెందిన 20 ఏళ్ల యువతిపై ఆధిపత్య కులానికి చెందిన నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం విదితమే. పొలంలో పనిచేసుకుంటున్న బాధితురాలిని లాక్కెళ్లి చిత్ర హింసలకు గురిచేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. నాలుక కోసి, వెన్నెముక విరిగేలా రాక్షసంగా వ్యవహరించినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. యువతి గర్భాశయం వద్ద తీవ్రమైన గాయాలున్నట్లు తేలింది. ఈ పైశాచిక దాడి అనంతరం యువతిని గొంతునులిమి చంపే ప్రయత్నం చేశారు. ఈ మేరకు బాధితురాలి మెడపై గుర్తులు ఉన్నట్లు పోస్టుమార్టంలో వెల్లడైంది. (యూపీ సర్కార్‌కు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు)
ఇక ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను తొలుత అలీఘర్‌లో చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో, ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. పక్షవాతం, శరీరంలోని ప్రధాన భాగాలన్నీ తీవ్రంగా దెబ్బతినడంతో రెండు వారాలుగా చిత్రవధ అనుభవించిన బాధితురాలు కన్నుమూసింది. అయితే అదే రోజు అర్థరాత్రి దాటిన తర్వాత హడావుడిగా అంత్యక్రియలు జరిపించడం సర్వత్రా విమర్శలకు దారితీసింది. రాజకీయ పార్టీలు, హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దళితురాలు అయినందున బాధితురాలి పట్ల మరణంలోనూ క్రూరంగా వ్యవహరించిందని మండిపడ్డాయి. (యూపీ నిర్భయ పట్ల అమానవీయం)
Comments
Please login to add a commentAdd a comment