![Usha was not pregnant : Post-mortem Report - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/14/p.jpg.webp?itok=qm7NtsBS)
టీ.నగర్: ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ దాడిలో మృతి చెందిన ఉష గర్భిణి కాదని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. తంజావూరు జిల్లా పాపనాశం ప్రాంతానికి చెందిన రాజా (33) అతని భార్య ఉష (33). ఈ నెల 7వ తేదీ రాత్రి బైకులో వెళుతుండగా వాహన తనిఖీలు జరుపుతున్న ఇన్‌స్పెక్టర్ కామరాజ్ దాడి చేయడంతో ఉష మృతి చెందిన విషయం తెలిసిందే. ఉష మూడు నెలల గర్భిణిగా ప్రచారం జరిగింది. ప్రస్తుతం పోస్టుమార్టం నివేదికలో ఉష గర్భిణి కాదని వైద్యులు తేల్చారు. ఈ కేసు విచారణ జరుపుతున్న క్రైం బ్రాంచ్ డీఎస్పీ పుహళేంది, ఉష పోస్టుమార్టం నివేదికలోని వివరాలను సోమవారం వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment