సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని చార్మినార్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న కేఎస్ రవికి అరుదైన అనుభవం దక్కింది. 1997లో విద్యార్థిగా, 2022లో పోలీసు అధికారిగా సీనియర్ పోలీసు అధికారి సీవీ ఆనంద్ నుంచి ‘బహుమతులు’ అందుకున్నారు. ఈ రెండు ఫొటోలను రవి సోమవారం ట్విట్టర్‌లో పొందుపరిచారు.
నిజామాబాద్‌కు చెందిన రవి తండ్రి పరమేశ్వర్ ఆ జిల్లా పోలీసు విభాగంలో ఆడ్మ్ రిజర్వ్ హెడ్–కానిస్టేబుల్‌గా పని చేశారు. 1996లో పదో తరగతి ఉత్తీర్ణుడైన రవి మంచి మార్కులు సాధించారు. 1998 జనవరి 1న ఆ జిల్లా ఎస్పీగా ఉన్న సీవీ ఆనంద్ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఇలా అప్పట్లో ఆనంద్ నుంచి రవికి బహుమతి దక్కింది. పోలీసు విభాగంపై మక్కువ పెంచుకున్న రవి 2009లో నగర పోలీసు విభాగంలో సబ్–ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికయ్యారు.
ప్రస్తుతం ఇన్‌స్పెక్టర్ హోదాలో చార్మినార్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్‌కు నేతృత్వం వహిస్తున్నారు. ఇప్పుడు అదనపు డీజీ హోదాలో సిటీ కొత్వాల్‌గా ఉన్న ఆనంద్ న్యూ ఇయర్ డే నేపథ్యంలో ఆదివారం చార్మినార్ వద్దకు వెళ్లారు. అక్కడ కేక్ కట్ చేసిన కొత్వాల్ స్వయంగా రవికి తినిపించారు. ఇది కూడా తనకు బహుమతే అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసిన ఇన్‌స్పెక్టర్ రవి రెండు ఫొటోలను ట్వీట్ చేశారు. ఇది పోలీసు విభాగంలో వైరల్‌గా మారింది. (క్లిక్ చేయండి: ఆ రెండు లైన్‌లలో అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు)
Comments
Please login to add a commentAdd a comment