traffic inspector
-
ఒట్టేసి..బంధంతో కట్టేసి..
ఉప్పల్ : అది ఉప్పల్ నల్ల చెరువు సెంటర్.. ఆదివారం రాత్రి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.. అదే సమయంలో ఓ వ్యక్తి తన ఫ్యామిలీతో కలిసి అటుగా బైక్‌పై వెళ్తున్నాడు.. ఇంకేముంది డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డాడు. పక్కనే ఫ్యామిలీ ఉండటంతో పరుపోతుందన్న భయంతో బైక్ పక్కగా ఆపి ఇన్స్పెక్టర్తో కాళ్లబేరానికి వచ్చాడు.. అంత వరకూ బాగానే నడిచినా..ఇందులో వింతేముంది? ఎప్పుడూ జరిగే తంతేగా అనుకోవద్దు.. ఇక్కడే ఉంది అసలైన కిక్కు.. కాస్తా భిన్నంగా ఆలోచించిన ఇన్స్పెక్టర్ లక్ష్మి మాధవి.. కొద్దిసేపు అతడి భార్య, కుమారుడితో మాట్లాడారు. అనంతరం తండ్రికి కొడుకుతో కౌన్సెలింగ్ ఇప్పించారు. ‘నాన్నా నువ్వు నాకు కావాలి.. నువ్వు ఇలా తాగి బైక్ నడపడం ఎంతో ప్రమాదం.. నీకేమైనా అయితే మేమేం కావాలి? అంటూ.. చెప్పడమే కాకుండా.. మరోసారి తాగి డ్రైవింగ్ చేయనని తనపై ఒట్టు వేయమని అడిగించారు..వచ్చీ రాని మాటలతో కొడుకు చెప్పినదానికి భావోద్వేగానికి గురైన తండ్రి కొడుకుకు ప్రామిస్ చేశాడు.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. -
CV Anand: ఆపాత మధురం.. ‘ఆనంద’ జ్ఞాపకం!
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని చార్మినార్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్గా ఉన్న కేఎస్ రవికి అరుదైన అనుభవం దక్కింది. 1997లో విద్యార్థిగా, 2022లో పోలీసు అధికారిగా సీనియర్ పోలీసు అధికారి సీవీ ఆనంద్ నుంచి ‘బహుమతులు’ అందుకున్నారు. ఈ రెండు ఫొటోలను రవి సోమవారం ట్విట్టర్లో పొందుపరిచారు. నిజామాబాద్‌కు చెందిన రవి తండ్రి పరమేశ్వర్ ఆ జిల్లా పోలీసు విభాగంలో ఆడ్మ్ రిజర్వ్ హెడ్–కానిస్టేబుల్‌గా పని చేశారు. 1996లో పదో తరగతి ఉత్తీర్ణుడైన రవి మంచి మార్కులు సాధించారు. 1998 జనవరి 1న ఆ జిల్లా ఎస్పీగా ఉన్న సీవీ ఆనంద్ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఇలా అప్పట్లో ఆనంద్ నుంచి రవికి బహుమతి దక్కింది. పోలీసు విభాగంపై మక్కువ పెంచుకున్న రవి 2009లో నగర పోలీసు విభాగంలో సబ్–ఇన్స్పెక్టర్గా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఇన్స్పెక్టర్ హోదాలో చార్మినార్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్‌కు నేతృత్వం వహిస్తున్నారు. ఇప్పుడు అదనపు డీజీ హోదాలో సిటీ కొత్వాల్‌గా ఉన్న ఆనంద్ న్యూ ఇయర్ డే నేపథ్యంలో ఆదివారం చార్మినార్ వద్దకు వెళ్లారు. అక్కడ కేక్ కట్ చేసిన కొత్వాల్ స్వయంగా రవికి తినిపించారు. ఇది కూడా తనకు బహుమతే అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసిన ఇన్స్పెక్టర్ రవి రెండు ఫొటోలను ట్వీట్ చేశారు. ఇది పోలీసు విభాగంలో వైరల్‌గా మారింది. (క్లిక్ చేయండి: ఆ రెండు లైన్లలో అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు) -
అసభ్య ప్రవర్తన?.. ట్రాఫిక్ ఎస్సైను చితకబాదేశారు
మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ.. డ్యూటీలో ఉన్న ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ను చితకబాదిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. దేశ రాజధానిలో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. దక్షిణ ఢిల్లీ సంగమ్ విహార్ ప్రాంతంలో.. ట్రాఫిక్ జామ్‌ను క్లియర్ చేస్తుండగా స్థానిక ట్రాఫిక్ ఎస్సైతో కొందరు వాగ్వాదానికి దిగారు. ఉన్నట్లుండి జనాలంతా కలిసి ఆ ఎస్సైను చితకబాదేశారు. ఘటనకు కారణం ఏంటన్నదానిపై అధికారిక స్పష్టత లేకుంది. కానీ, ఓ యువతి సదరు ట్రాఫిక్ ఎస్సై కాలర్ పట్టుకుని మరీ రెండు చెంపలను చెడామడా వాయించడం ఆధారంగా.. ఆ యువతితో ఎస్సై అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. సదరు యువతితో పాటు ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు సైతం అతనిపై దాడికి పాల్పడ్డారు. గాయపడిన ట్రాఫిక్ ఎస్సైను ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి టిగ్రి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ట్రాఫిక్ ఉల్లంఘించిన సదరు యువతి.. ఆ ట్రాఫిక్ ఎస్సై తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. యువతి, ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు, చుట్టూ చేరిన కొందరు ఆ ట్రాఫిక్ ఎస్సైను ఉతికి ఆరేశారు. అయితే పక్కనే వైట్ డ్రెస్‌లో ఉన్న ట్రాఫిక్ సిబ్బంది కొందరు ఆ ట్రాఫిక్ ఎస్సైను రక్షించే ప్రయత్నం చేశారు. COP ASSAULTED IN DELHI A traffic cop was assaulted in public in South #Delhi's Sangam Vihar. The cop was later dragged by his collar and slapped. @nagar_pulkit reports. pic.twitter.com/FY2Sn9JYyr — Mirror Now (@MirrorNow) June 8, 2022 #WATCH | Delhi: A man and two girls misbehaved with and manhandled Police and Traffic Police personnel. They were stopped as they were triple riding on a motorcycle that was coming from the wrong side and had no front number plate. (Source: Viral video, verified by Police) pic.twitter.com/1ZwP2iBI0N — ANI (@ANI) June 8, 2022 -
ఆమె గర్భిణి కాదు
టీ.నగర్: ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ దాడిలో మృతి చెందిన ఉష గర్భిణి కాదని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. తంజావూరు జిల్లా పాపనాశం ప్రాంతానికి చెందిన రాజా (33) అతని భార్య ఉష (33). ఈ నెల 7వ తేదీ రాత్రి బైకులో వెళుతుండగా వాహన తనిఖీలు జరుపుతున్న ఇన్స్పెక్టర్ కామరాజ్ దాడి చేయడంతో ఉష మృతి చెందిన విషయం తెలిసిందే. ఉష మూడు నెలల గర్భిణిగా ప్రచారం జరిగింది. ప్రస్తుతం పోస్టుమార్టం నివేదికలో ఉష గర్భిణి కాదని వైద్యులు తేల్చారు. ఈ కేసు విచారణ జరుపుతున్న క్రైం బ్రాంచ్ డీఎస్పీ పుహళేంది, ఉష పోస్టుమార్టం నివేదికలోని వివరాలను సోమవారం వెల్లడించారు. -
బైక్‌ను తన్నిన పోలీసు.. గర్భిణి మృతి
సాక్షి ప్రతినిధి, చెన్నై: హెల్మెట్ చెకింగ్ కోసం ఆగకుండా వెళ్లిపోతున్న ఓ వ్యక్తి బైక్‌ను ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంబడించి కాలితో తన్నడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ గర్భిణి మరణించింది. బైక్ నడుపుతున్న ఆమె భర్తకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ ఘటన తమిళనాడులోని తిరుచ్చిరాపల్లిలో జరిగింది. తిరుచ్చిరాపల్లిలోని తువకూడీ టోల్‌ప్లాజా సమీపంలో ట్రాఫిక్ పోలీసులు బుధవారం హెల్మెట్ చెకింగ్ నిర్వహించారు. హెల్మెట్ ధరించకుండా భార్యతో కలసి బైక్‌పై బయలుదేరిన రాజాను ఆపడానికి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కామరాజ్ యత్నించారు. కానీ రాజా బైక్‌ను ఆపలేదు. వెంటనే మరో బైక్‌పై వెంబడించిన కామరాజ్.. తిరుచ్చిరాపల్లి–తంజావూరు హైవేపై రాజా బైక్‌ను కాలితో తన్నారు. దీంతో బైక్‌పై ఉన్న దంపతులిద్దరూ అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ నాలుగు నెలల గర్భిణి ఉషాను ఆస్పత్రికి తరలించగా.. మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై పోలీసులు కామరాజ్‌ను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఉషా మృతికి సంతాపం తెలిపిన సీఎం పళనిస్వామి.. మృతురాలి కుటుంబ సభ్యులకు రూ.7 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ఉష కుటుంబానికి రూ.రెండు లక్షల ఆర్థిక సాయాన్ని మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కమల్ హాసన్ ప్రకటించారు. -
అందరూ చూస్తుండగానే..విశాఖ జిల్లాలో విషాదం
విశాఖ : విశాఖ జిల్లాలో పదవి విరమణ రోజే ఓ ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అందరూ చూస్తుండగానే లారీ కిందపడి ప్రాణం వదిలాడు. గాజువాక చిన్న గంట్యాడ కూడలిలో శనివారం జరిగిన ఈ ఘటన అందరిని కలచివేసింది. గాజువాకకు చెందిన కేపీ నాయుడు సింహాచలం ఆర్టీసీ డిపోలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు. శనివారం పదవి విరమణ పొందాల్సి ఉంది. అయితే ఇంటి నుంచి బయలు దేరిన నాయుడు .. గంట్యాడ కూడలిలో లారీ వెనుక టైర్ కిందపడి మృతి చెందాడు.. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ..అక్కడి సీసీ ఫుటేజీని పరిశీలించారు. అందులో నాయుడు లారీ కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు తేలింది. ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా కేపీ నాయుడు ఈ ఘటనకు పాల్పడటంపై కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు...మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యలమంచిలి మండలం మర్రిబండ వద్ద టాటా ఎస్ వెహికల్, లారీ ఢీ కొట్టింది. ఈఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. టాటా వెహికల్ ను లారీ వెనుక నుంచి ఢీ కొట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. మృతులిద్దరూ తూర్పుగోదావరి జిల్లా వీలుపూడి గ్రామానికి చెందిన రాంబాబు, యేసుబాబులుగా గుర్తించారు. వీరు కాయగూరల వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో టాటా ఎస్ వెహికల్ డ్రైవర్‌కు కూడా గాయాలయ్యాయి. రెండు మృతదేహాలను మార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
అందరూ చూస్తుండగానే.. ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్య
-
ఇన్‌స్పెక్టర్‌నే మోసం చేశాడు
రాజంపేట టౌన్: బ్యాంకు ఖాతా నెంబర్లు, ఏటీఎం నెంబర్లు ఎవరికీ చెప్పవద్దని ఇటు పోలీసు, అటు బ్యాంకు అధికారులు పదేపదే హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. అలాగే ఈ విషయాలపై పత్రికల్లోను, టీవీల్లోనూ తరచూ కథనాలు ప్రసారం అవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ప్రజలు మాత్రం ఘరానా మోసగాళ్ల మాయలో పడుతూనే ఉన్నారు. తాజాగా రాజంపేట పట్టణం ఎస్వీ నగర్‌కు చెందిన ఆర్టీసీ రిటైర్డ్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మాచవరం బ్రహ్మయ్యఆచారి ఓ మోసగాడి మాటలు నమ్మి తన ఎస్బీఐ ఖాతాలోని 6,778 రూపాయిల నగదును పోగొట్టుకున్నాడు. తనకు జరిగిన మోసాన్ని బ్రహ్మయ్య ఆచారి ఇక్కడి విలేకరుల ఎదుట ఏకరవు పెట్టుకున్నాడు. బాధితుని కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఈనెల 17వ తేదీ ఓ వ్యక్తి కాల్ చేసి తాను ఎస్బీఐ హెడ్ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాను అంటూ హిందీలో చెప్పుకొచ్చాడు. అనంతరం హిందీలోనే మీ ఏటీఎం కార్డుకు ఆధార్ లింక్ అప్ చేయాలని తొలుత ఆధార్ నెంబర్ అడిగాడు. అనంతరం మీ ఏటీఎం కార్డు గడువు కూడా అయిపోయిందని, రెన్యువల్ చేస్తామని, కార్డు రెన్యువల్ అయిన వెంటనే మీకు మెసేజ్ వస్తుందని చెప్పాడు. దీంతో బ్రహ్మయ్య ఆచారి ముందు వెనుక ఆలోచించకుండా ఏటీఎం కార్డుపై ఉండే నెంబర్ చెప్పాడు. దీంతో ఆ మోసగాడు అదే రోజు పలు మార్లు బాధితుని ఖాతాలో ఉన్న 6,778 రూపాయిలు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. అయితే మోసగాడు ఏటీఎం కార్డు రెన్యువల్ అయిన వెంటనే మెసేజ్ వస్తుందని చెప్పిన విషయం బ్రహ్మయ్య ఆచారికి గుర్తుకు వచ్చి ఏటీఎంలో మినీ స్టేట్మెంట్ తీసుకున్నాడు. దీంతో తన ఖాతా నుంచి పలుమార్లు డబ్బు ట్రాన్స్ఫర్ అయ్యి ఖాతాలోని డబ్బంతా ఖాళీ కావడంతో మోసపోయినట్లు బాధితుడు గ్రహించాడు. తెలియని వ్యక్తులు ఎవరు ఫోన్ చేసినా, ఇంటివద్దకు వచ్చి ప్రజలు ఎవరు కూడా ఆధార్, ఏటీఎం కార్డు నెంబర్లు చెప్పవద్దని పత్రికా ముఖంగా బాధితుడు కోరాడు. తెలియని వ్యక్తులకు నెంబర్లు చెపితే తనలాగే మోసపోవాల్సి వస్తుందని బాధితుడు తెలిపాడు.