మందుబాబు కిక్కు.. ఇన్‌స్పెక్టర్ లాజిక్కు..
తాగుబోతు తండ్రికి కొడుకుతో కౌన్సెలింగ్
ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మి మాధవి వినూత్న ప్రయోగం
ఉప్పల్ : అది ఉప్పల్ నల్ల చెరువు సెంటర్.. ఆదివారం రాత్రి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.. అదే సమయంలో ఓ వ్యక్తి తన ఫ్యామిలీతో కలిసి అటుగా బైక్‌పై వెళ్తున్నాడు.. ఇంకేముంది డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డాడు. పక్కనే ఫ్యామిలీ ఉండటంతో పరుపోతుందన్న భయంతో బైక్ పక్కగా ఆపి ఇన్‌స్పెక్టర్‌తో కాళ్లబేరానికి వచ్చాడు.. అంత వరకూ బాగానే నడిచినా..ఇందులో వింతేముంది? ఎప్పుడూ జరిగే తంతేగా అనుకోవద్దు.. ఇక్కడే ఉంది అసలైన కిక్కు.. కాస్తా భిన్నంగా ఆలోచించిన ఇన్‌స్పెక్టర్ లక్ష్మి మాధవి.. కొద్దిసేపు అతడి భార్య, కుమారుడితో మాట్లాడారు.
అనంతరం తండ్రికి కొడుకుతో కౌన్సెలింగ్ ఇప్పించారు. ‘నాన్నా నువ్వు నాకు కావాలి.. నువ్వు ఇలా తాగి బైక్ నడపడం ఎంతో ప్రమాదం.. నీకేమైనా అయితే మేమేం కావాలి? అంటూ.. చెప్పడమే కాకుండా.. మరోసారి తాగి డ్రైవింగ్ చేయనని తనపై ఒట్టు వేయమని అడిగించారు..వచ్చీ రాని మాటలతో కొడుకు చెప్పినదానికి భావోద్వేగానికి గురైన తండ్రి కొడుకుకు ప్రామిస్ చేశాడు.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment