Charminar police
-
CV Anand: ఆపాత మధురం.. ‘ఆనంద’ జ్ఞాపకం!
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని చార్మినార్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్గా ఉన్న కేఎస్ రవికి అరుదైన అనుభవం దక్కింది. 1997లో విద్యార్థిగా, 2022లో పోలీసు అధికారిగా సీనియర్ పోలీసు అధికారి సీవీ ఆనంద్ నుంచి ‘బహుమతులు’ అందుకున్నారు. ఈ రెండు ఫొటోలను రవి సోమవారం ట్విట్టర్లో పొందుపరిచారు. నిజామాబాద్‌కు చెందిన రవి తండ్రి పరమేశ్వర్ ఆ జిల్లా పోలీసు విభాగంలో ఆడ్మ్ రిజర్వ్ హెడ్–కానిస్టేబుల్‌గా పని చేశారు. 1996లో పదో తరగతి ఉత్తీర్ణుడైన రవి మంచి మార్కులు సాధించారు. 1998 జనవరి 1న ఆ జిల్లా ఎస్పీగా ఉన్న సీవీ ఆనంద్ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఇలా అప్పట్లో ఆనంద్ నుంచి రవికి బహుమతి దక్కింది. పోలీసు విభాగంపై మక్కువ పెంచుకున్న రవి 2009లో నగర పోలీసు విభాగంలో సబ్–ఇన్స్పెక్టర్గా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఇన్స్పెక్టర్ హోదాలో చార్మినార్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్‌కు నేతృత్వం వహిస్తున్నారు. ఇప్పుడు అదనపు డీజీ హోదాలో సిటీ కొత్వాల్‌గా ఉన్న ఆనంద్ న్యూ ఇయర్ డే నేపథ్యంలో ఆదివారం చార్మినార్ వద్దకు వెళ్లారు. అక్కడ కేక్ కట్ చేసిన కొత్వాల్ స్వయంగా రవికి తినిపించారు. ఇది కూడా తనకు బహుమతే అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసిన ఇన్స్పెక్టర్ రవి రెండు ఫొటోలను ట్వీట్ చేశారు. ఇది పోలీసు విభాగంలో వైరల్‌గా మారింది. (క్లిక్ చేయండి: ఆ రెండు లైన్లలో అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు) -
హల్చల్ చేసిన పాతబస్తీ కార్పొరేటర్
సాక్షి, హైదరాబాద్: భోలక్‌పూర్ కార్పొరేటర్ వ్యవహారం మరువక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. పాతబస్తీలో ఎంఐఎం కార్పొరేటర్ హల్చల్ చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. యునాని ఆస్పత్రి దగ్గర పార్కింగ్ విషయంలో సదరు కార్పొరేటర్ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఫిర్యాదు అందిందని ఎస్సై సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నా.. ఆ కార్పొరేటర్ మాత్రం తగ్గలేదు. ఎస్సై మాటలు పట్టించుకోకుండా.. గట్టిగట్టిగా అరుస్తూ ఆధిపత్యం ప్రదర్శించాడు. ఇక్కడ ఇలాగే చేస్తామంటూ ఎస్సైపై చిందులు తొక్కాడు. ఎస్ఐకి దాదాపు వార్నింగ్ ఇచ్చినంత పని చేశాడు. దమ్కీ ఇచ్చిన కార్పొరేటర్.. పత్తర్‌గట్టీ ఎంఐఎం కార్పొరేటర్ సయ్యద్ సొహైల్ ఖాద్రిగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. భోలక్‌పూర్ కార్పొరేటర్ వ్యవహారం మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లడం, ఆపై పోలీసులు కార్పొరేటర్‌పై కేసు నమోదు చేసి బుధవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పరోక్షంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై కామెంట్ చేశారు. రేవ్ పార్టీ రిచ్ కిడ్స్ను వదిలేశారని, చట్టం పేద, ధనిక వర్గాలకు ఒకేలా వర్తించాలంటూ హైదరాబాద్ పోలీస్, మంత్రి కేటీఆర్ ట్విటర్ ట్యాగులను జత చేసి మరీ ట్వీట్ చేశారు. Rule of law is supreme Art 13 & it is very unfortunate that cocaine was found in this “Rave party” and all offspring’s of Rich kids where released not a single arrest apart from the owner of the place Law should be applied equally to poor & rich @CPHydCity @KTRTRS https://t.co/WehHaS5BTK — Asaduddin Owaisi (@asadowaisi) April 6, 2022 -
చార్మినార్ ఘటనలో కానిస్టేబుల్ సస్పెండ్
సాక్షి, హైదరాబాద్: చార్మినార్‌లోని యునాని హాస్పిటల్ తరలింపునకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న జూనియర్ డాక్టర్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన చార్మినార్ కానిస్టేబుల్ పరమేశ్‌ను నగర సీపీ సస్సెండ్ చేశారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సీపీ యునాని ఆస్పత్రి ఘటన పై పూర్తి స్థాయి విచారణ జరపాలని సౌత్ జోన్ డీసీపీని ఆదేశించారు. -
ఆడపిల్ల పుట్టిందని ‘తలాక్’!
- మగబిడ్డ కోసం బాబా ఇచ్చిన మందులు వాడాలన్న అత్తింటివారు - కాదన్నందుకు గృహిణికి వేధింపులు... - చివరకు ఆడబిడ్డ పుట్టడంతో విడాకుల నోటీసులు హైదరాబాద్: మగబిడ్డ కోసం గృహిణిని వేధించిన అత్తింటివారు... చివరకు ఆడపిల్ల పుట్టడంతో ఆమెను వదిలించుకోవడానికి సిద్ధమయ్యారు. బాబా చెప్పినట్టు నడుచుకోనందుకు, ఆయన ఇచ్చిన మందులు వాడనం దుకే మగ పిల్లాడు పుట్టలేదంటూ కోడలిని హింసించారు. భర్తకు మొరపెట్టుకుంటే నిర్ధాక్షిణ్యంగా విడాకుల నోటీసులు పంపి అతడు నిలువునా వంచించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అత్త, మామతో పాటు నకిలీ బాబానూ చార్మినార్ పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ మండలం డీసీపీ వి.సత్య నారాయణ మంగళవారం ఈ వివరాలు వెల్లడించారు. నాంపల్లికి చెందిన ముజఫర్ హుస్సేన్ కుమార్తె హబీబా ఫాతిమా(19)ను మొఘల్పురావాసి మహ్మద్ సాదిక్ కుమారుడు మహ్మద్ మన్సూర్ అలియాస్ సైఫ్‌కు ఇచ్చి 2016 ఆగస్టులో వివాహం జరిపించారు. 10 తులాల బంగారం, 25 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.5 లక్షల నగదును కట్నంగా సమర్పించారు. పెళ్లయిన కొద్ది రోజులకే మన్సూర్ పని నిమిత్తం అబుదాబీ వెళ్లాడు. ఫాతిమా గర్భవతి అయింది. వెంటనే అత్త సమీనాసుల్తానా(50), మామ మహ్మద్ సాదిక్ (55) తమకు మగ పిల్లవాడు కావాలని, అది జరగాలంటే తమకు తెలిసిన బాబా వద్దకు వెళ్లి మందులు తీసుకోవాలన్నారు. వద్దంటున్నా ఫాతిమాను బలవం తంగా మొఘల్‌పురాలో ఉండే షేక్ అబ్దుల్ రహీం అలియాస్ బాయిమియా(68) వద్దకు తీసుకెళ్లారు. బాబా ఆమెకు కొన్ని మందులిచ్చి, గర్భంపై నూనె రాయాలని సూచించాడు. అందుకు రూ.20 వేలు తీసుకున్నాడు. బాబా అనుచిత ప్రవర్తన గమనించిన ఫాతిమా.. అత్త, మామలకు విషయం చెప్పింది. దీన్ని పట్టించుకోని అత్త.. తానూ అలా బాబా వద్ద మందులు తీసుకోవడం వల్లే నీ భర్త పుట్టాడంటూ చెప్పింది. మొరపెట్టుకున్నా పట్టించుకోని భర్త... ఈ క్రమంలో అక్టోబర్‌లో ఫాతిమా అబుదాబీలో ఉన్న భర్త వద్దకు వెళ్లి విషయాన్ని చెప్పింది. మగబిడ్డ పుట్టాలంటే బాబా చెప్పినట్టు నడుచుకోవాల్సిందేనని మన్సూర్ కూడా తెగేసి చెప్పి, ఈ ఏడాది జనవరిలో ఫాతిమాను తిరిగి పంపించాడు. తిరిగొచ్చిన కోడలిని అత్త, మామలు తరచూ బాబా వద్దకు తీసుకెళ్లారు. విసుగెత్తిన ఫాతిమా తాను బాబా వద్దకు రానని మొండికేయడంతో ఆమెను గోడకేసి కొట్టి హింసించారు. ఈ ఏడాది మేలో ఫాతిమా ఆడపిల్లకు జన్మనిచ్చింది. రూ.10 లక్షలు తెమ్మని వేధింపులు... ఆడబిడ్డ జన్మించడంతో ఆగ్రహించిన అత్త, మామలు... బాబా వద్ద మందులు తీసుకోనందుకే ఇలా జరిగిందని ఫాతిమాను హింసించారు. ఇందుకు శిక్షగా పుట్టింటి నుంచి రూ.10 లక్షలు తీసుకురావాలని అత్త, మామలతో పాటు ఆడపడచులూ డిమాండ్ చేశారు. తాను ఇచ్చుకోలేనని తండ్రి ముజఫర్ చెప్పడంతో ఫాతిమాకు ‘తలాక్–ఇ–బయీన్’ పేరుతో విడాకుల నోటీసులు పంపించారు. దీంతో బాధితురాలు చార్మినార్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అత్త, మామ, నకిలీ బాబాను అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. త్వరలోనే ఫాతిమా భర్తను అరెస్ట్ చేస్తామని డీసీపీ తెలిపారు. పాతబస్తీలో 20 మంది వరకు నకిలీ బాబాలు ఉన్నారని.. వారిలో ఆరుగురిపై రౌడీషీట్లు తెరిచామని డీసీపీ తెలిపారు.