Hyderabad Old City MIM Corporator Misbehaving With Police, Video Viral - Sakshi
Sakshi News home page

పాతబస్తీలో హల్‌చల్‌ చేసిన మరో కార్పొరేటర్‌.. వైరల్‌

Published Thu, Apr 7 2022 10:40 AM | Last Updated on Thu, Apr 7 2022 11:11 AM

Old City MIM Corporator Misbehaving With Police Viral - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భోలక్‌పూర్‌ కార్పొరేటర్‌ వ్యవహారం మరువక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. పాతబస్తీలో ఎంఐఎం కార్పొరేటర్‌ హల్‌చల్‌ చేసిన వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. 

యునాని ఆస్పత్రి దగ్గర పార్కింగ్‌ విషయంలో సదరు కార్పొరేటర్ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఫిర్యాదు అందిందని ఎస్సై సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నా.. ఆ కార్పొరేటర్‌ మాత్రం తగ్గలేదు. ఎస్సై మాటలు పట్టించుకోకుండా.. గట్టిగట్టిగా అరుస్తూ ఆధిపత్యం ప్రదర్శించాడు. ఇక్కడ ఇలాగే చేస్తామంటూ ఎస్సైపై చిందులు తొక్కాడు.

ఎస్‌ఐకి దాదాపు వార్నింగ్ ఇచ్చినంత పని చేశాడు. దమ్కీ ఇచ్చిన కార్పొరేటర్.. పత్తర్‌గట్టీ ఎంఐఎం కార్పొరేటర్‌ సయ్యద్ సొహైల్‌ ఖాద్రిగా తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా.. భోలక్‌పూర్‌ కార్పొరేటర్‌ వ్యవహారం మంత్రి కేటీఆర్‌ దృష్టికి వెళ్లడం, ఆపై పోలీసులు కార్పొరేటర్‌పై కేసు నమోదు చేసి బుధవారం అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఎంఐఎం చీఫ్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ పరోక్షంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై కామెంట్‌ చేశారు. రేవ్‌ పార్టీ రిచ్‌ కిడ్స్‌ను వదిలేశారని, చట్టం పేద, ధనిక వర్గాలకు ఒకేలా వర్తించాలంటూ హైదరాబాద్‌ పోలీస్‌, మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ ట్యాగులను జత చేసి మరీ ట్వీట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement