చంద్రశేఖర్ మృతదేహం, చికిత్స పొందుతున్న నాగమణి
సాక్షి, కొణిజర్ల(ఖమ్మం): బిడ్డ మరణం తట్టుకోలేక.. పురుగుల మందు తాగిన తల్లి.. పరిస్థితి విషమం.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న తండ్రి.. కూతురు ఆరు నెలల క్రితం విషజ్వరంతో మృతిచెందింది. ఆనాటి నుంచి చిన్నారిపై బెంగతో తల్లి తల్లడిల్లిపోయింది. బిడ్డ లేనిదే ఉండలేనంటూ సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉది. కూతురు లేదనే బాధ, చావు బతుకుల మధ్య ఉన్న భార్య పరిస్థితిని చూసి తట్టుకోలేక ఆమె భర్త మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయ విదారక సంఘటన కొణిజర్ల మండలం తనికెళ్లలో చోటుచేసుకుంది.
ఒక్కగానొక్క కూతురు ఆరు నెలల క్రితం విషజ్వరంతో మృతిచెందింది. ఆనాటి నుంచి చిన్నారిపై బెంగతో తల్లి తల్లడిల్లిపోయింది. బిడ్డ లేనిదే ఉండలేనంటూ సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తుండగా, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. కూతురు లేదనే బాధ, చావు బతుకుల మధ్య ఉన్న భార్య పరిస్థితిని చూసి తట్టుకోలేక భర్త మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయ విదారక సంఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్లలో చోటుచేసుకుంది. వివరాలు.. తుప్పతి చంద్రశేఖర్(32), నాగమణి దంపతులకు కూతురు, కొడుకు ఉన్నారు. 6వ తరగతి చదువుతున్న కూతురు నవ్యశ్రీ(11) ఆరు నెలల క్రితం విషజ్వరంతో మృతిచెందింది. అప్పటి నుంచి నాగమణి బిడ్డ చనిపోయిన బాధతో మనోవేదనకు గురవుతోంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇంట్లో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది.
గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా.. కూతురి మరణం, చావుబతుకుల మధ్య ఉన్న భార్య కూడా దక్కదనే భయంతో భర్త చంద్రశేఖర్ మంగళవారం తెల్లవారుజామున ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చి పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయే ముందు తన స్నేహితుడికి ఫోన్ చేసి తాను ఇక ఉండకపోవచ్చని, తన కుమారుడిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పినట్లు స్థానికులు తెలిపారు. అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు గ్రామంలో వెతకగా ఊరికి సమీపంలోని వ్యవసాయ భూమిలో చెట్టుకు వేలాడుతూ విగత జీవిగా కనిపించాడు. ప్రస్తుతం ఆ దంపతుల కుమారుడు నవదీప్ ఒంటరి వాడయ్యాడు. మృతుడి బావమరిది ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మొగిలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment