భర్తను హతమార్చిన భార్య, ప్రియుడు? | Wife Illegal Affairs Murder In Khammam | Sakshi
Sakshi News home page

భర్తను హతమార్చిన భార్య, ప్రియుడు?

Published Sat, Jun 8 2019 6:53 AM | Last Updated on Sat, Jun 8 2019 6:53 AM

Wife Illegal Affairs Murder In Khammam - Sakshi

రోదిస్తున్న కుటుంబ సభ్యులు, నందు మృతదేహంలు  

టేకులపల్లి: మండలంలోని తావుర్యాతండాలో  మద్యం మత్తులో నిద్రిస్తున్న వ్యక్తిని గొంతు నులిమి హత్య చేసిన ఘటన జరిగింది. వివాహేతర సంబంధం వల్లనే హత్య జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..  తావుర్యా తండాకు చెందిన దారావత్‌ నందు (25)కి అదే గ్రామానికి చెందిన సుప్రియతో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి  ఇద్దరు కుమారులు సిద్దు (3), అజయ్‌ (ఒకటిన్నర) ఉన్నారు. నందు కొత్తగూడెంలోని ఓ షాపులో పనిచేస్తూ కుటుం బాన్ని పోషిస్తున్నాడు. సుప్రియ కొత్తగూడెంలో టైలరింగ్‌ నేర్చుకునేందుకు వెళ్తోంది. ఈ క్రమంలో టేకులపల్లి మండలం కోక్యాతండాకు చెందిన గుగులోత్‌ కృష్ణతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది.

వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నదని అనుమానించిన భర్త నందు భార్యను మందలించాడు. ఈ విషయంలో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. రెండు వారాల క్రితమే ఇంట్లో భర్తతో గొడవపెట్టుకుని సుప్రియ పుట్టింటికి వెళ్లింది. మృతుడి తల్లి లక్ష్మి, అన్న దేవా సుప్రియ పుట్టింటికి వెళ్లి నచ్చజెప్పి భర్త దగ్గరకు పంపించారు. గురువారం ఉదయం కొత్తగూడేనికి పనికి వెళ్లిన నందు రాత్రి 9 గంటల తరువాత ఇంటికొచ్చాడు. భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మద్యం సేవించి నందు నిద్రపోయాడు.

శుక్రవారం ఉదయం సుప్రియ అన్న సుమన్‌ మృతుడి అన్న దేవాకు ఫోన్‌ చేసి మీ తమ్ముడు ఇంట్లో స్పృహ కోల్పోయి ఉన్నాడని చెప్పడంతో మృతుడి కుటుంబ సభ్యులు వచ్చి చూడగా తొంతుకు తీగతో నులిమి చనిపోయి ఉన్నాడు. గురువారం రాత్రి సుప్రియ ప్రియుడు కృష్ణ మరికొందరితో వచ్చి  నిద్రిస్తున్న నందు గొంతు నులిమి హత్య చేసినట్లు చర్చించుకుంటున్నారు. తన కుమారుడిని సుప్రియ, ప్రియుడు కృష్ణ, మరి కొందరు కలిసి హత్య చేశారని తల్లి లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ మడిపల్లి నాగరాజు, ఎస్‌ఐ గడ్డం ప్రవీణ్‌కుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్ప గించారు. మృతుడి భార్య సుప్రియ, ప్రియుడు కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement