గురుకుల విద్యార్థిని దీప్తి మృతి | Guru kula student Committed Suicde | Sakshi
Sakshi News home page

గురుకుల విద్యార్థిని దీప్తి మృతి

Published Sat, Aug 4 2018 11:42 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM

Guru kula student Committed Suicde - Sakshi

దీప్తి మృతదేహం 

ఎర్రుపాలెం ఖమ్మం : స్థానిక గురుకుల పాఠశాలలో గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించిన విద్యార్థిని దీప్తి(14), హైదరాబాద్‌ ఆస్పత్రిలో గురువారం అర్ధరాత్రి ప్రాణాలొదిలింది. దీప్తి తల్లిదండ్రులు గతించారు. ఆమె గతంలో కూడా మూడుసార్లు ఆత్మహత్యకు యత్నించిందని, ఈ విషయం తెలిసినప్పటికీ కౌన్సిలింగ్‌ ఇవ్వడంలో ఉపాధ్యాయులు పూర్తిగా విఫలమయ్యారని, వారి పర్యవేక్షణ లోపం కూడా ఉందని ఆరోపణలు వినవస్తున్నాయి. 

చదువులో, ఆటల్లో దీప్తి చురుగ్గా ఉండేదని తోటి విద్యార్థినులు చెబుతున్నారు. ఆమెకు డైరీ రాసే అలవాటుందని కూడా వారు చెప్పారు. ప్రస్తుతం ఆ డైరీ కనిపించడం లేదు. దీప్తి ఆత్మహత్య వార్తతో అక్కడ చదువున్న పిల్లల తల్లిదండ్రులు కొందరు పాఠశాలకు వచ్చారు. తమ బిడ్డలతో మాట్లాడారు. 

విద్యార్థి సంఘాల ఆందోళన 

దీప్తి ఆత్మహత్య ఘటనపై విచారణ జరిపించాలన్న డిమాండుతో పాఠశాల ఎదుట విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు మందా సురేష్, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా సహాయ కార్యదర్శి మడుపల్లి లక్ష్మణ్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు మధు తదితరులు పాల్గొన్నారు. 

మృతదేహం అప్పగింత 

దీప్తి మృతదేహానికి శుక్రవారం హైదరాబాద్‌లోని ఉస్మానియా హాస్పిటల్‌లో వైద్యులు పోస్టుమార్టం చేశారు. మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement