
సాక్షి, ఖమ్మం : ఖమ్మం జిల్లాలో గురువారం దారుణం చోటుచేసుకుంది. రేపు పెళ్లి ఉందనగా ఇద్దరు కూతుళ్లతో కలిసి తల్లి బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని మూడో పట్టణ ప్రాంతానికి చెందిన గోవిందమ్మ(48), ఆమె కూతుళ్లు రాధిక(30), రమ్య(28) బుధవారం అర్థరాత్రి బంగారం శుభ్రం చేసే రసాయనం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే గోవిందమ్మ కుటుంబం నిరు పేదరికంలో ఉండంటంతోపాటు ఇంటి పెద్దగా ఉన్న భర్త ఏ పనిచేయకపోవడంతో ఆమెను కష్టాల్లోకి నెట్టివేశాయి. అంతేగాక ఇంట్లో పెళ్లి వయస్సు వచ్చిన ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు రాధికకు డిసెంబర్ 11న పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలో పెళ్లి దగ్గరపడుతున్న సమయంలో డబ్బులు సర్దుబాటు కాకవడంతో మనస్తాపం చెందిన తల్లి, కూతుళ్లతో కలిసి తానువు చాలించారు. చదవండి: ప్రియుడి పెళ్లి రోజే ప్రేయసి మరణం..
Comments
Please login to add a commentAdd a comment