Difficulties in cash
-
రేపే పెళ్లి.. పెళ్లికూతురితో సహా తల్లి ఆత్మహత్య
సాక్షి, ఖమ్మం : ఖమ్మం జిల్లాలో గురువారం దారుణం చోటుచేసుకుంది. రేపు పెళ్లి ఉందనగా ఇద్దరు కూతుళ్లతో కలిసి తల్లి బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని మూడో పట్టణ ప్రాంతానికి చెందిన గోవిందమ్మ(48), ఆమె కూతుళ్లు రాధిక(30), రమ్య(28) బుధవారం అర్థరాత్రి బంగారం శుభ్రం చేసే రసాయనం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే గోవిందమ్మ కుటుంబం నిరు పేదరికంలో ఉండంటంతోపాటు ఇంటి పెద్దగా ఉన్న భర్త ఏ పనిచేయకపోవడంతో ఆమెను కష్టాల్లోకి నెట్టివేశాయి. అంతేగాక ఇంట్లో పెళ్లి వయస్సు వచ్చిన ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు రాధికకు డిసెంబర్ 11న పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలో పెళ్లి దగ్గరపడుతున్న సమయంలో డబ్బులు సర్దుబాటు కాకవడంతో మనస్తాపం చెందిన తల్లి, కూతుళ్లతో కలిసి తానువు చాలించారు. చదవండి: ప్రియుడి పెళ్లి రోజే ప్రేయసి మరణం.. -
తీరని నోట్ల తిప్పలు
అల్లీపూర్లో క్యూలో వ్యక్తులకు బదులు చెప్పులు మల్యాల: మల్యాల మండల కేంద్రంలో నగదు కష్టాలు కొనసాగుతున్నాయి. యూనియన్ బ్యాంకు ఎదుట తెల్లవారు నుంచే క్యూకడుతున్నారు. బీడీ కార్మికుల వేతనాలుసైతం బ్యాంకు ఖాతాల్లో వేస్తుండడంతో రోజురోజుకు ఖాతాదారుల క్యూ పెరుగుతోంది. దీనికితోడు ఏటీఎం సైతం పనిచేయకపోవడంతో ఇటు పింఛన్‌దారులు, బీడీ కార్మికులు, రైతులు డబ్బుల కోసం బ్యాంకు వద్ద గంటల తరబడి క్యూ కడుతున్నారు. రాయికల్: రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎదుట శనివారం ఉదయం 9 గంటలకు ఖాతాదారులు చెçప్పులతో నిరసన వ్యక్తం చేశారు. వివిధ గ్రామల నుంచి వచ్చిన ఖాతాదారులు క్యూలైన్ లో నిలబడే ఓపిక క లేవడంతో ఇలా చెప్పులు పెట్టారు. -
క్యాష్ కష్టాలు..
బ్యాంక్‌లకు నాలుగో శనివారం సెలవు కావడంతో ప్రజలకు నగదు కష్టాలు తప్పలేదు. చాలా ప్రాంతాల్లో ఏటీఎంలు సైతం పనిచేయకపోవడం మరింత ఇబ్బందులకు గురిచేసింది. నగదు ఉన్న ఏటీఎంల వద్ద భారీగా క్యూలు కనిపించారుు. పలుచోట్ల ‘నో సర్వీస్, నో క్యాష్ బోర్డులు’ దర్శనం ఇచ్చారుు. ఇవి ఎప్పుడైనా పనిచేయవచ్చన్న నమ్మకంతో పలువురు వాటివద్దే పడిగాపులు కాశారు. నిత్యం వేలాది మంది ప్రయాణికుల రాకపోకలు సాగించే శంషాబాద్ విమానాశ్రయంలో సైతం ఏటీఎంలన్నీ ఖాళీగానే దర్శనమిచ్చారుు. దీంతో ప్రయాణికులతో పాటు వారి వెంట వచ్చినవారు డబ్బుల కోసం తీవ్ర అవస్థలు పడ్డారు. - సాక్షినెట్‌వర్క్