
చిన్నారి లోక్షిత్ నాయక్ మృత దేహం
సాక్షి, జూలూరుపాడు(ఖమ్మం) : నీటి తొట్టిలో పడి 18 నెలల బాలుడు మృతి చెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం సాయిరాంతండా గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా.. సాయిరాంతండాకు చెందిన జాటోత్ రమేష్, నాగమణి దంపతులకు ఇద్దరు సంతానం. మొదటి సంతానం తేజస్వీని కాగా రెండవ సంతానం∙జాటోత్ లోక్షిత్ నాయక్. తల్లి నాగమణి ఇంటి పనిలో నిమగ్నౖమైంది, తండ్రి రమేష్ పని మీద బయటకు వెళ్లాడు. ఈ సమయంలో బాలుడు ఆడుకుంటూ ఇంటి ఆవరణంలో ఉన్న నీటి తొట్టిలో పడి పోయాడు.
అప్పటి వరకు ఆడుకుంటున్న పిల్లవాడు కన్పించకపోవడంతో తల్లిదండ్రులు రమేష్, నాగమణిలు కంగారు పడి ఇంటి పరిసరాల్లో వెతకగా బాలుడు నీటి తొట్టిలో పడిపోయి ఉన్నాడు. బాలుడిని హుటాహుటిన జూలూరుపాడు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ)కి తరలించారు. వైద్యులు సలహామేరకు మెరుగైన వైద్యం కోసం చిన్నారి లోక్షిత్ నాయక్‌ను కొత్తగూడెం సింగరేణి ఆసుపత్రికి తరలించారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment