
సాక్షి, పశ్చిమగోదావరి : వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో త్వరలోనే తీర్పు వెలువడుతుందని వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడుకి మైండ్ బ్లాక్ అవ్వడం వల్లనే సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా చట్టం చేశారని ఆయన మండిపడ్డారు. జగన్‌పై హత్యయత్నం కేసును సీబీఐకి అప్పగిస్తారనే భయంతోనే ఈ చట్టం చేశారని ఆయన అన్నారు. ఈ ఘటనలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఉన్నాడనటానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేముందని, సీబీఐ విచారణ వేస్తే టీడీపీ నేతలు ఉండటానికి రాష్ట్రంలోని జైళ్లు సరిపోవని పేర్కొన్నారు.
జిల్లాలోని కాళ్ల మండలం పెదఅమిరంలో శుక్రవారం జరిగిన బూత్ కన్వీనర్ల సమావేశంలో పాల్గొన్న సుబ్బారెడ్డి.. జన్మభూమి కమిటీలతో పచ్చచొక్కాల వారికే సంక్షేమ పథకాలు అందిస్తున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరాచకాలు చూస్తుంటే రౌడీ రాజ్యం, దోపిడి రాజ్యం తలపిస్తోందని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను భయపెట్టేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మీ వెనుక జగన్ ఉన్నారని కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment