ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాలనంతా అవినీతి, అసమర్థత, అసత్యం, అప్రజాస్వామికంతో కూడుకున్నదని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే, చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ అవినీతిలో నెంబర్ 1గా ఉందని అన్నారు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు కుమారుడు కోటగిరి శ్రీధర్.. వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు. బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని, అవినీతి, అసమర్థ పాలన సాగుతోందని విమర్శించారు