dwaraka tirumala meeting
-
మహిళలకు విజయవాడ సీపీ అభయం..
సాక్షి, అమరావతి : ‘అమ్మా... మీకేదైనా ప్రమాదం సంభవించినా, సమస్య ఏదైనా తలెత్తవచ్చనే అనుమానం కలిగినా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయోద్దు.. తక్షణం 100కు డయిల్ చేయండి. వాట్సాప్ నంబరు 73289 09090కు సమాచారం ఇవ్వండి. నగర పరిధిలో నాలుగు నిమిషాల్లో మీ చెంతకు చేరుకుంటాం. శివారు ప్రాంతాలకైతే ఆరు నిమిషాల్లో వచ్చేస్తాం. సమస్య మీదే కాకపోవచ్చు.. మీ పక్కన, పరిసరాల్లో ఎక్కడైనా, ఎవరికైనా ప్రమాదం పొంచి ఉందనే అనుమానం కలిగినా ఆలోచించవద్దు..’ అని విజయవాడ నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు నగర ప్రజలకు భరోసా కల్పించారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో పశువైద్య శాలలో వైద్యురాలిగా పనిచేస్తున్న ప్రియాంకరెడ్డి దారుణహత్య నేçపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా మహిళలు, యువతులు, ఆడపిల్లలు తగుజాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఏ సమయంలోనైనా పోలీసులు అందుబాటులో ఉన్నారన్న విషయాన్ని మరచిపోవద్దని కోరారు. వెనువెంటనే స్పందిస్తారు.. విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఎవరైనా ఆపదలో ఉండి డయల్ 100కి ఫోన్ చేస్తే పోలీసులు సగటున నాలుగు నిమిషాల్లోనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్యపై స్పందిస్తారన్నారు. నగర శివార్లకు వెళ్లేందుకు ఆరు నిమిషాలు తీసుకుంటున్నా... సత్వరమే ఫిర్యాదీదారులు చెప్పిన ప్రాంతానికి పోలీసులు చేరుకుంటారని చెప్పారు. డయల్ 100కి ఫోన్ వచ్చిన వెంటనే సమీపంలో ఉన్న రక్షక్, బ్లూకోట్స్ సిబ్బందికి సమాచారం చేరవేయడమే కాకుండా వెనువెంటనే వచ్చేస్తారని పేర్కొన్నారు. ఇవే కాకుండా ఇంటర్సెప్టార్ 12 వాహనాలు ప్రజలకు అందుబాటులో ఉంచామని.. నగరంలోని బెంజిసర్కిల్, స్టేట్ గెస్ట్‌హౌస్, బస్టాండు, రైల్వేస్టేషన్, బీసెంట్ రోడ్డు తదితర ముఖ్య కూడళ్ల వద్ద ఈ వాహనాలు 24 గంటలు అందుబాటులో ఉంటాయన్నారు. ఉదాహరణకు ఎవరైనా వ్యక్తిని కిడ్నాప్ చేసి వాహనంలో తీసుకెళుతున్నా... ఏదైనా వాహనం అతి వేగంతో వెళుతున్నా వాటిని నియంత్రించడానికి, చర్యలు తీసుకోవడానికి సిబ్బంది వెంబడిస్తారన్నారు. 7328909090 నంబరుకు చెపితే... డయల్ 100 మాదిరిగానే విజయవాడ నగర పోలీసులు ప్రత్యేకంగా రూపొందించిన 7328909090 వాట్సాప్ నంబరు కూడా ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని సీపీ చెప్పారు. ఈ వాట్సాప్ నంబరుకు సంక్షిప్త సందేశం కాని, చిత్రాలు కాని, వీడియోలు కాని పంపవచ్చని చెప్పారు. 24 గంటలు టోల్‌ఫ్రీ నంబర్లు 100, 112, 181, 1091. చేరువ ద్వారా అవగాహన.. నగరంలో జరుగుతున్న నేరాల పట్ల, సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండేలా ప్రజల్లో అవగాహన కలి్పంచడానికి చేరువ కార్యక్రమాన్ని చేపట్టామని సీపీ ద్వారకా తిరుమల రావు చెప్పారు. చేరువ వాహనాల ద్వారా సిబ్బంది వీధివీధినా తిరుగుతూ ప్రజలకు నేరాలు, చట్టాల పట్ల అవగాహన కలి్పస్తున్నారని వివరించారు. జీపీఆర్ఎస్తో అనుసంధానం మహిళల రక్షణ కోసం పోలీసులు ప్రత్యేక సర్వీసును ప్రవేశపెట్టారు. మీరు ఎప్పుడైనా కారు, కాబ్, ఆటోలో ఒంటరిగా ప్రయాణిస్తుంటే..ఆ వాహనం నంబర్‌ను 9969777888కు ఎస్ఎంఎస్ చేయాలి. ఆ నంబర్‌ను వెంటనే జీపీఆర్‌ఎస్‌కు అనుసంధానించి.. మీరు పంపిన నంబర్‌కు ఒక రిటర్న్ ఎస్ఎంఎస్ వస్తుంది. వాహన గమనం ఎలా ఉందో గుర్తిస్తుంది. జాగ్రత్తలు చెప్పాలి.. పిల్లలకు తల్లిదండ్రులు, ఇంట్లోని పెద్దలు భద్రత గురించి చెప్పాలని, ఏదైనా సమస్య తలెత్తితే ఎలా దాన్ని అధిగమించాలో వివరిస్తుండాలని సీపీ సూచించారు. ప్రస్తుతం సెల్ఫోన్ల వినియోగం ఎక్కువగా ఉన్నందున ఆపత్కాలంలో ఎవరిని సంప్రదించాలో ప్రత్యేకంగా నంబర్లు నోట్ చేసుకోవాలని కోరారు. విద్యా సంస్థలు కూడా ఈ విషయంలో విద్యార్థులకు అవగాహన కల్పించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రమాదం ఏదీ చెప్పి రాదని అందువల్లే అప్రమత్తత ముఖ్యమన్నారు. -
టీడీపీలో మాత్రం చేరవద్దన్నారు
ద్వారకా తిరుమల: ఏ పార్టీలో అయినా చేరుకానీ, టీడీపీలో మాత్రం చేరవద్దని తన తండ్రి, దివంగత నేత కోటగిరి విద్యాధరరావు చెప్పారని కోటగిరి శ్రీధర్ అన్నారు. దివంగత మహానేత వైఎస్ఆర్తో తన తండ్రికి మంచి సంబంధాలున్నాయని, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి ఆయన నాయకత్వంలో పనిచేయాలని సలహా ఇచ్చారని చెప్పారు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో జరిగిన భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ సమక్షంలో కోటగిరి శ్రీధర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏం చెప్పారంటే.. ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడానికి కారణమేంటంటే.. తమ కుటుంబంలో ప్రతి శుభకార్యక్రమం ఇక్కడి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగింది వెంకటేశ్వర స్వామి ముందు ఈ కార్యక్రమం పెట్టాలని వైఎస్ జగన్‌ను కోరాం ఇక్కడకు వచ్చిన వైఎస్ జగన్‌కు, వైఎస్ఆర్ సీపీ నాయకులకు, కార్యకర్తలకు, కోటగరి విద్యాధర రావు అభిమానులకు కృతజ్ఞతలు కోటగిరి విద్యాధర రావు ఇక్కడి నుంచి ఇండిపెండెంట్‌గా, ఆ తర్వాత వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు 2004లో కోటగిరి ఓడిపోయినా వైఎస్ఆర్ గెలిచారని సంతోషించారు గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కాబోతున్నారని సంతోషించారు వైఎస్ఆర్తో ఆయనకు మంచి సంబంధాలున్నాయి నాన్న చివరి రోజుల్లో నా తర్వాత నువ్వు రాజకీయ వారసుడిగా కొనసాగాలని చెప్పారు ఏ పార్టీలో చేరినా ఫర్వాలేదు కానీ టీడీపీలో మాత్రం చేరవద్దన్నారు నాన్న గారు మరో సలహా ఇచ్చారు. వైఎస్ జగన్‌తో చేరాలని చెప్పారు చిన్న వయసులో పార్టీ పెట్టి సమర్థవంతంగా నడిపిస్తున్నారని ప్రశంసించారు ఇక చంద్రబాబు గురించి కొంచెం మాట్లాడుకోవాలి ఆయన, ఆయన జీవితానుభవంలో ప్రతి ఎన్నికల్లో మనల్ని ఎలా మభ్యపెట్టాలో ఆలోచిస్తున్నారు ఎవర్ని ముందు పెట్టి ఎన్నికలకు వెళ్లాలి.. ఎలా మభ్య పెట్టాలా అని ఆలోచిస్తారు ఇదే ముఖ్యమంత్రి ఆ రోజు వ్యవసాయం శుద్ధ దండగ అని చెప్పారు. ఈ రోజు ఎన్నెన్నో కబుర్లు చెబుతున్నారు మనం ఢిల్లీ నాయకులను ముక్కు పిండి పనిచేయించుకోవాలంటే అందుకు బలమైన నాయకుడు కావాలి అందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రావాలి రాష్ట్ర విభజన జరిగినపుడు మనం ఎంతో బాధపడ్డాం మొదటి ముద్దాయి కాంగ్రెస్‌ను నామరూపాల్లేకుండా చేశాం వచ్చే ఎన్నికల్లో రెండో ముద్దాయి టీడీపీని బంగాళాఖాతంలో కలిపేద్దాం వైఎస్ జగన్ రాజకీయ అనుభవం సాధించారు. ఆయన సీఎం అవడానికి సిద్ధం 12 ఏళ్లు నాన్నగారికి రాజకీయాల్లో సాయం చేశాను. మూడు ఎన్నికల్లో పనిచేశాను. చాలా మందితో పరిచయం ఏర్పడింది. నాకు కోపం లేదు, ఓర్పు ఉంది, సహనం ఉంది, హంగూ ఆర్భాటం లేదు మీరు ఏ సమయంలోనైనా నా దగ్గరకు రావచ్చు మీరు మేనిఫెస్టోలను చూసి మోసపోవద్దు మనమందరం వైఎస్ జగన్ ను గెలిపిద్దాం -
అవినీతి పాలనే చంద్రబాబు ఘనత
-
'మోదీ మొట్టికాయలేస్తారని బాబుకు భయం'
ద్వారకా తిరుమల: రైతుల సమస్యలు తీర్చడం కోసం కాకుండా రైతుల భూములు ఎలా లాక్కోవాలో చర్చించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేబినెట్ మీటింగులు పెడతాడరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో నియోజవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయిలో మంత్రులు, కేబినెట్ స్థాయిలో ఏకంగా ముఖ్యమంత్రి దొంగగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో జరిగిన భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు కుమారుడు కోటగిరి శ్రీధర్.. వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ చంద్రబాబు అవినీతి పాలనను ఎండగట్టారు. చంద్రబాబు ఆలోచన తీరును, ఆయన మంత్రుల పనితీరును తూర్పరాబట్టారు. సాధారణంగా ఒక ఇంటి నిర్మాణానికి అడుగుకు రూ.1500 చెల్లిస్తే చంద్రబాబు మాత్రం రాజధానిలో తాత్కాలిక భవనాలు, సెక్రటేరియట్ల పేరుతో అడుగుకు 10వేలు ఇస్తూ కమీషన్లు తీసుకుంటున్నాడని మండిపడ్డారు. సైబర్ గ్రిడ్, ఎర్రచందనం అంటూ అవినీతిమయం చేస్తారని అన్నారు. నేడు ఏ వీధిలో చూసినా, ఏ వాడలో వెతికినా ఇసుక, మట్టి దొంగలు తయారయ్యారని, కాంట్రాక్టు పనులు వారి వాళ్లకే ఇచ్చి మొత్తం దొంగల వ్యాపారానికి తెరతీశాడని చెప్పారు. రాజధానికి ఒక్క రోజు భూమి పూజకు రూ.400 కోట్లు, గోదావరి, కృష్ణా పుష్కరాలకు రూ.మూడు వేల కోట్లు, మూడు రోజుల సైన్స్ ఫెస్టివల్ రూ.300 కోట్లు నామినేషన్ల వారీగా ఇచ్చి దొంగదారిన కమీషన్లు తీసుకుంటారని, గత మూడేళ్లుగా చంద్రబాబు చేస్తున్న పని ఇదే అని స్పష్టం చేశారు. ఇక్కడ వాళ్లతో అక్రమ లావాదేవీలు చేస్తే అందరికీ తెలిసిపోతుందని తెల్లచర్మం, తెల్లజుట్టు ముద్దంటూ మాములు విమానాల్లో కాకుండా ప్రైవేటు విమానాల్లో చంద్రబాబు ప్రయాణం చేసి విదేశాలకు వెళతాడని అన్నారు. సింగపూర్, జపాన్, దుబాయ్, స్విట్జర్లాండ్‌కు వెళ్లి ఎవ్వరికీ తెలియకుండా డాలర్లలో డబ్బు పోగేసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ మొట్టికాయలు వేస్తారని చంద్రబాబుకు భయం ఉందని, అందుకే అన్ని పనులు విదేశాల్లో చక్కబెట్టుకుంటారని మండిపడ్డారు. చంద్రబాబు అసమర్థ, అవినీతిపాలనపై.. ఖరీఫ్‌కు బ్యాంకులు రూ.48వేల కోట్లు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకుంటే కేవలం రూ.28 వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. రబీ పంటకు బ్యాంకర్లు మొత్తం 35 వేల కోట్లు లక్ష్యం పెట్టుకుంటే రూ.5వేల కోట్లిచ్చి చేతులు దులుపుకున్నారు. అయినా, బ్యాంకర్లను ప్రశ్నించే దమ్ము చంద్రబాబుకు లేదు రబీలో 24లక్షల హెక్టార్లలో పంట వేయాల్సి ఉంటే 13 లక్షల్లో కూడా వేయలేదు. రైతులు దారుణ పరిస్థితుల మధ్య ఉన్నా ఒక్క మాట మాట్లాడరు. కేబినెట్ మీటింగ్ పెడితే రైతుల భూములు ఎలా లాక్కోవాలనే ఆలోచన చేస్తాడు. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కేసీఆర్‌కు దొరికిపోయి ఆయనను ప్రశ్నించలేక గోదావరి, కృష్ణా జలాలు తెలంగాణకు వెళుతున్నా చూస్తూ కూర్చున్నారు. పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇవ్వకుంటే కనీసం అడిగే దమ్మూధైర్యం చంద్రబాబుకు లేదు మోదీని గట్టిగా అడిగితే సీబీఐతో విచారణ చేయించి జైలులో పెట్టిస్తారని చంద్రబాబుకు భయం ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఇస్తామని చెప్పిన ఏ ఒక్కటీ ఇవ్వలేదు ఏమీ ఇవ్వకపోయినా ఇస్తున్నట్లుగా మోసం చేస్తూ ప్రజల చెవుల్లో కాలిఫ్లవర్ పెట్టే పనులు చేస్తున్నాడు చంద్రబాబు హయాంలో ఇదే జిల్లాలో ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఓ ఎమ్మార్వో జుట్టుపట్టుకున్నా ఏం చేయలేకపోయారు ఇదే జిల్లాలో టీడీపీ నేతల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే వారిపై యాక్షన్ తీసుకునే దమ్ములేదు గతంలో ఆరోగ్యశ్రీ అంటే గొప్పగా ఉండేది. 108 నెంబర్ కొడితే అంబులెన్స్ వచ్చి ఎలాంటి ఆపరేషన్ అయినా కార్పొరేట్ ఆస్పత్రిలో చేసి చిరునవ్వుతో ఇంటికి పంపేవారు ఇప్పుడు అంబులెన్స్‌లు ఎప్పుడొస్తాయో తెలియదు.. 104 కొడితే గ్రామాల్లో పరీక్ష చేసేవారు. ఇప్పుడు వారికి ఫోన్ చేస్తే జీతాలు ఇవ్వడం లేదని సిబ్బంది చెబుతున్నారు. ఆరోగ్యశ్రీని నడపలేని అసమర్థపాలన చంద్రబాబుది ఫీజు రీయింబర్స్మెంట్ నడపలేని అసమర్థపాలన చంద్రబాబునాయుడిది బీసీల మీద ప్రేముందని చంద్రబాబు చెప్తాడు. ఇస్త్రీ పెట్టెలు, కత్తెరలు ఇచ్చి ప్రేమంటాడు పేదవాడు అప్పులపాలు కాకుండా ఉండాలంటే అందులో నుంచి బయటకు రావాలంటే అతడి పిల్లలు చదువుకోవాలని వైఎస్ఆర్ కలలు కన్నారు. చదివించే కార్యక్రమం పెట్టారు. నేడు ఇంజినీరింగ్ విద్యార్థులకు ముష్టి రూ.30వేలు వేస్తున్నారు. ఫీజులు రూ.లక్ష20వేలకు పెరిగాయి. మిగితా ఫీజుకట్టేందుకు ఇళ్లు పొలం అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. 80శాతం ప్రాజెక్టుల పనులు నాన్నగారు రాజశేఖర్ రెడ్డిగారు పూర్తి చేశారు. 20శాతం పనులు కూడా చంద్రబాబు చేయలేదు. పాలన మూడేళ్లు పూర్తవుతుంది.. ఒక్క ఇల్లు కూడా చంద్రబాబు కట్టించలేకపోయారు వైఎస్ హయాంలో 48లక్షల ఇళ్లు నిర్మించారు. అసత్యాల, అబద్ధాల పాలనపై.. చంద్రబాబుకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారు రైతు రుణాలు పోవాలంటే, జాబు రావాలంటే, డ్వాక్రా రుణాలు పోవాలంటే చంద్రబాబు రావాలన్నారు. వచ్చి మూడేళ్లయినా ఎవరి పరిస్థితి మారలేదు. ఎన్నికలప్పుడు రైతులను వదల్లేదు. అక్కాచెల్లెమ్మలను మోసం చేశారు. చంద్రబాబు పాలన అయ్యి 32 నెలలు అయింది.. నాకు చంద్రబాబు 68 వేలు బాకీ ఉన్నాడని ఓ యువకుడు అన్నాడు. అతడికి చంద్రబాబు ఏ సమాధానం చెబుతాడు? కేంద్ర ప్రభుత్వం హోదాను ఎగరగొట్టింది. ప్యాకేజీ అంటూ కేంద్రం తరుపునా వకల్తా పుచ్చుకొని కొత్త అబద్ధాలు చెప్పడం బాబు మొదలుపెట్టాడు. ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తే అది ప్యాకేజీ. అసలే ఇవ్వకుండా ఇస్తే అది ప్యాకేజీనా? ఈ రెండేళ్లలో రూ.15లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అన్నారు.. అవెక్కడ ఉన్నాయి మరీ? రిజర్వ్ బ్యాంక్ ఇండియా సప్లిమెంటరీ విడుదల చేసింది. కేపీఎంజీ అనే సంస్థ ఆ నివేదిక ప్రకటించింది. రాష్ట్రంలో పాలన మొదలయ్యాక లక్షా ఆరువేల పరిశ్రమలు ఉంటే చంద్రబాబు పాలనలో 20 వేల పరిశ్రమలు మూతపడ్డట్టు అందులో పేర్కొంది. కరెంట్ లేక, పరిశ్రమల్లో డబ్బులు వసూళ్లు చేయడం మూలంగా అవి మూతపడినట్లు వివరించింది. పోలవరం కుడికాలువ 170 కిలోమీటర్లుంటే దాదాపు 140 కిలోమీటర్లు నాన్నగారు వైఎస్ పూర్తి చేశారు. మిగిలింది 30 కిలోమీటర్లు. అది కూడా పూర్తిచేయకుండా లస్కర్ మాదిరిగా గేట్లు ఎత్తి బొంకులు బొంకాడు చంద్రబాబు. ఇక చంద్రబాబు అప్రజాస్వామిక పాలన గురించి చెప్పనక్కర్లేదు ఓట్లు వేసి గెలిపించిన సర్పంచ్‌లకు విలువ లేకుండా చేశారు -
బాబు పాలనలో ఏపీ అవినీతిలో నెంబర్ 1
ద్వారకా తిరుమల: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాలనంతా అవినీతి, అసమర్థత, అసత్యం, అప్రజాస్వామికంతో కూడుకున్నదని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే, చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ అవినీతిలో నెంబర్ 1గా ఉందని అన్నారు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు కుమారుడు కోటగిరి శ్రీధర్.. వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు. బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని, అవినీతి, అసమర్థ పాలన సాగుతోందని విమర్శించారు. వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.. వైఎస్ఆర్ సీపీలోకి కోటగిరి శ్రీధర్‌ను ఆహ్వానిస్తున్నాను యువకుడు, ఉత్సాహవంతుడు అయిన శ్రీధర్ ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చాడు మంచి చేస్తాడనే నమ్మకం నాకు ఉంది రాష్ట్రం వైపు ఓ సారి తిరిగి చూస్తే చంద్రబాబు పరిపాలన కనిపిస్తుంది మనం ఎవరికైనా ఎందుకు ఓటు వేస్తాం అభివృద్ధి కోసం. నిన్నటి కన్నా ఈ వాళ, ఈ రోజు కన్నా రేపు బాగుంటే అభివృద్ధి జరుగుతోందని చెబుతాం చంద్రబాబు పాలనలో అవినీతి, అసమర్థ పాలన జరుగుతోంది ఇవాళ అసత్యాల, అప్రజాస్వామిక పాలన జరుగుతోంది దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే.. చంద్రబాబు పాలనలో ఏపీ అవినీతిలో నెంబర్ 1గా ఉంది. చంద్రబాబు వ్యవస్థలను, మనుషుల్ని, మీడియాను మేనేజ్ చేసుకుని ప్రజలను మోసం చేస్తున్నాడు దేశంలో చాలా మంది సీఎంలు ఉన్నారు. రాష్ట్రాన్ని చాలా మంది పరిపాలించారు. ఇలాంటి సీఎంను ఎప్పుడైనా చూశారా? సూట్ కేసుల్లో బ్లాక్ మనీ తీసుకువెళ్లి ఎమ్మెల్యేలను కొంటున్నారు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడినా సీఎం రాజీనామా చేయకపోవడం, జైలుకు వెళ్లకపోవడం ఎక్కడైనా చూశామా..? ఒక్క చంద్రబాబు విషయంలోనే జరుగుతోంది రాజధాని ఫలానా ప్రాంతంలో వస్తుందని తెలిసినా ఎక్కడో వస్తుందని చెప్పారు రాజధాని ప్రాంతంలో మంత్రులు, చంద్రబాబు బినామీలు భూములు కొనుగోలు చేస్తారు భూములు కొనుగోలు చేశాక రాజధాని అక్కడ కాదు ఇక్కడే అంటారు దీనివల్ల రైతులు నష్టపోతారు, చంద్రబాబు ఆయన బినామీలు లాభపడతారు రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు గుంజుకుని, తనకు ఇష్టమైన వారికి కమీషన్లు తీసుకుని ఇస్తున్నారు ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులలో నీళ్లు రావడం లేదు, చంద్రబాబు పాలనలో అవినీతి పొంగిపొర్లుతోంది కాంట్రాక్టర్లతో కమీషన్లు మాట్లాడుకుని నచ్చినవారికి చెక్‌లు ఇచ్చేస్తున్నారు పోలవరం ప్రాజెక్టు వ్యయం పెంచేశారు అవినీతి జరిగిందని తెలిసినా కాంట్రాక్టర్లను కొనసాగిస్తున్నారు మద్యం షాపులు, బొగ్గు కొనుగోళ్లు అన్నింటా అవినీతి కనిపిస్తోంది చివరకు దేవుడి భూములను కూడా వదిలిపెట్టడం లేదు రెండున్నరేళ్ల పాలనలో ఎక్కడ చూసినా అవినీతిమయం రెండున్నరేళ్లు కావస్తున్నా చంద్రబాబు ట్రైబల్ అడ్వైజరీ కమిటీ వేయలేదు ఇందులో గిరిజన ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉంటారు. వైఎస్ఆర్ సీపీకి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. కమిటీ వేస్తే వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఉంటారని వేయలేదు. పేదలకు అన్యాయం చేస్తున్నాడు చంద్రబాబు ఎమ్మెల్యేలకు విలువ లేకుండా చేస్తున్నాడు, పంచాయతీ సర్పంచ్‌లకు విలువ లేదు పేద ప్రజల నుంచి భూములు ఎలా లాక్కోవాలా అని చంద్రబాబు ఆలోచిస్తున్నాడు చింతలపూడి ప్రాజెక్టును చూస్తే ఒకే ప్రాజెక్టు పరిధిలో ఒక్కో గ్రామానికి ఒక్కో ధర ఇస్తున్నారు గిరిజనులం కాబట్టి అడగలేకపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు వేరే పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి చేర్చుకుంటున్నారు వాళ్లతో రాజీనామా చేయించి ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేదు గాంధేయ పద్ధతిలో రిపబ్లిక్ డే రోజున ప్రత్యేక హోదా కోసం కొవ్వొత్తుల ప్రదర్శన చేయకుండా అడ్డుకున్నాడు చంద్రబాబు అప్రజాస్వామిక పాలన పోవాలి. మేధావులు, యువకులు కదలాలి. గ్రామస్థాయి నుంచి ప్రతి ఒక్కరూ రావాలి