'మోదీ మొట్టికాయలేస్తారని బాబుకు భయం' | cm chandrababu naidu cheats all ap people: YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

'మోదీ మొట్టికాయలేస్తారని బాబుకు భయం'

Published Sun, Jan 29 2017 7:45 PM | Last Updated on Wed, Jul 25 2018 4:42 PM

cm chandrababu naidu cheats all ap people: YS Jagan Mohan Reddy

ద్వారకా తిరుమల: రైతుల సమస్యలు తీర్చడం కోసం కాకుండా రైతుల భూములు ఎలా లాక్కోవాలో చర్చించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేబినెట్‌ మీటింగులు పెడతాడరని వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో నియోజవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయిలో మంత్రులు, కేబినెట్‌ స్థాయిలో ఏకంగా ముఖ్యమంత్రి దొంగగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో జరిగిన భారీ బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు కుమారుడు కోటగిరి శ్రీధర్‌.. వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు.

అనంతరం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ చంద్రబాబు అవినీతి పాలనను ఎండగట్టారు. చంద్రబాబు ఆలోచన తీరును, ఆయన మంత్రుల పనితీరును తూర్పరాబట్టారు. సాధారణంగా ఒక ఇంటి నిర్మాణానికి అడుగుకు రూ.1500 చెల్లిస్తే చంద్రబాబు మాత్రం రాజధానిలో తాత్కాలిక భవనాలు, సెక్రటేరియట్‌ల పేరుతో అడుగుకు 10వేలు ఇస్తూ కమీషన్లు తీసుకుంటున్నాడని మండిపడ్డారు. సైబర్‌ గ్రిడ్‌, ఎర్రచందనం అంటూ అవినీతిమయం చేస్తారని అన్నారు. నేడు ఏ వీధిలో చూసినా, ఏ వాడలో వెతికినా ఇసుక, మట్టి దొంగలు తయారయ్యారని, కాంట్రాక్టు పనులు వారి వాళ్లకే ఇచ్చి మొత్తం దొంగల వ్యాపారానికి తెరతీశాడని చెప్పారు.

రాజధానికి ఒక్క రోజు భూమి పూజకు రూ.400 కోట్లు, గోదావరి, కృష్ణా పుష్కరాలకు రూ.మూడు వేల కోట్లు, మూడు రోజుల సైన్స్‌ ఫెస్టివల్‌ రూ.300 కోట్లు నామినేషన్ల వారీగా ఇచ్చి దొంగదారిన కమీషన్లు తీసుకుంటారని, గత మూడేళ్లుగా చంద్రబాబు చేస్తున్న పని ఇదే అని స్పష్టం చేశారు. ఇక్కడ వాళ్లతో అక్రమ లావాదేవీలు చేస్తే అందరికీ తెలిసిపోతుందని తెల్లచర్మం, తెల్లజుట్టు ముద్దంటూ మాములు విమానాల్లో కాకుండా ప్రైవేటు విమానాల్లో చంద్రబాబు ప్రయాణం చేసి విదేశాలకు వెళతాడని అన్నారు. సింగపూర్‌, జపాన్‌, దుబాయ్‌, స్విట్జర్లాండ్‌కు వెళ్లి ఎవ్వరికీ తెలియకుండా డాలర్లలో డబ్బు పోగేసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ మొట్టికాయలు వేస్తారని చంద్రబాబుకు భయం ఉందని, అందుకే అన్ని పనులు విదేశాల్లో చక్కబెట్టుకుంటారని మండిపడ్డారు. 
చంద్రబాబు అసమర్థ, అవినీతిపాలనపై..
  •  
  • ఖరీఫ్‌కు బ్యాంకులు రూ.48వేల కోట్లు ఇవ్వాలని టార్గెట్‌ పెట్టుకుంటే కేవలం రూ.28 వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. రబీ పంటకు బ్యాంకర్లు మొత్తం 35 వేల కోట్లు లక్ష్యం పెట్టుకుంటే రూ.5వేల కోట్లిచ్చి చేతులు దులుపుకున్నారు. అయినా, బ్యాంకర్లను ప్రశ్నించే దమ్ము చంద్రబాబుకు లేదు
  • రబీలో 24లక్షల హెక్టార్లలో పంట వేయాల్సి ఉంటే 13 లక్షల్లో కూడా వేయలేదు. రైతులు దారుణ పరిస్థితుల మధ్య ఉన్నా ఒక్క మాట మాట్లాడరు.
  • కేబినెట్‌ మీటింగ్ పెడితే రైతుల భూములు ఎలా లాక్కోవాలనే ఆలోచన చేస్తాడు.
  • తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కేసీఆర్‌కు దొరికిపోయి ఆయనను ప్రశ్నించలేక గోదావరి, కృష్ణా జలాలు తెలంగాణకు వెళుతున్నా చూస్తూ కూర్చున్నారు.
  • పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇవ్వకుంటే కనీసం అడిగే దమ్మూధైర్యం చంద్రబాబుకు లేదు
  • మోదీని గట్టిగా అడిగితే సీబీఐతో విచారణ చేయించి జైలులో పెట్టిస్తారని చంద్రబాబుకు భయం
  • ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఇస్తామని చెప్పిన ఏ ఒక్కటీ ఇవ్వలేదు
  • ఏమీ ఇవ్వకపోయినా ఇస్తున్నట్లుగా మోసం చేస్తూ ప్రజల చెవుల్లో కాలిఫ్లవర్‌ పెట్టే పనులు చేస్తున్నాడు
  • చంద్రబాబు హయాంలో ఇదే జిల్లాలో ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఓ ఎమ్మార్వో జుట్టుపట్టుకున్నా ఏం చేయలేకపోయారు
  • ఇదే జిల్లాలో టీడీపీ నేతల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే వారిపై యాక్షన్‌ తీసుకునే దమ్ములేదు
  • గతంలో ఆరోగ్యశ్రీ అంటే గొప్పగా ఉండేది. 108 నెంబర్‌ కొడితే అంబులెన్స్‌ వచ్చి ఎలాంటి ఆపరేషన్‌ అయినా కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేసి చిరునవ్వుతో ఇంటికి పంపేవారు
  • ఇప్పుడు అంబులెన్స్‌లు ఎప్పుడొస్తాయో తెలియదు.. 104 కొడితే గ్రామాల్లో పరీక్ష చేసేవారు. ఇప్పుడు వారికి ఫోన్‌ చేస్తే జీతాలు ఇవ్వడం లేదని సిబ్బంది చెబుతున్నారు.
  • ఆరోగ్యశ్రీని నడపలేని అసమర్థపాలన చంద్రబాబుది
  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నడపలేని అసమర్థపాలన చంద్రబాబునాయుడిది
  • బీసీల మీద ప్రేముందని చంద్రబాబు చెప్తాడు. ఇస్త్రీ పెట్టెలు, కత్తెరలు ఇచ్చి ప్రేమంటాడు
  • పేదవాడు అప్పులపాలు కాకుండా ఉండాలంటే అందులో నుంచి బయటకు రావాలంటే అతడి పిల్లలు చదువుకోవాలని వైఎస్‌ఆర్‌ కలలు కన్నారు. చదివించే కార్యక్రమం పెట్టారు.
  • నేడు ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ముష్టి రూ.30వేలు వేస్తున్నారు. ఫీజులు రూ.లక్ష20వేలకు పెరిగాయి. మిగితా ఫీజుకట్టేందుకు ఇళ్లు పొలం అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది.
  • 80శాతం ప్రాజెక్టుల పనులు నాన్నగారు రాజశేఖర్‌ రెడ్డిగారు పూర్తి చేశారు. 20శాతం పనులు కూడా చంద్రబాబు చేయలేదు.
  • పాలన మూడేళ్లు పూర్తవుతుంది.. ఒక్క ఇల్లు కూడా చంద్రబాబు కట్టించలేకపోయారు
  • వైఎస్‌ హయాంలో 48లక్షల ఇళ్లు నిర్మించారు. 
అసత్యాల, అబద్ధాల పాలనపై..
 
  • చంద్రబాబుకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారు
  • రైతు రుణాలు పోవాలంటే, జాబు రావాలంటే, డ్వాక్రా రుణాలు పోవాలంటే చంద్రబాబు రావాలన్నారు. వచ్చి మూడేళ్లయినా ఎవరి పరిస్థితి మారలేదు.
  • ఎన్నికలప్పుడు రైతులను వదల్లేదు. అక్కాచెల్లెమ్మలను మోసం చేశారు.
  • చంద్రబాబు పాలన అయ్యి 32 నెలలు అయింది.. నాకు చంద్రబాబు 68 వేలు బాకీ ఉన్నాడని ఓ యువకుడు అన్నాడు. అతడికి చంద్రబాబు ఏ సమాధానం చెబుతాడు?
  • కేంద్ర ప్రభుత్వం హోదాను ఎగరగొట్టింది. ప్యాకేజీ అంటూ కేంద్రం తరుపునా వకల్తా పుచ్చుకొని కొత్త అబద్ధాలు చెప్పడం బాబు మొదలుపెట్టాడు.
  • ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తే అది ప్యాకేజీ. అసలే ఇవ్వకుండా ఇస్తే అది ప్యాకేజీనా?
  • ఈ రెండేళ్లలో రూ.15లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అన్నారు.. అవెక్కడ ఉన్నాయి మరీ? 
  • రిజర్వ్‌ బ్యాంక్‌ ఇండియా సప్లిమెంటరీ విడుదల చేసింది. కేపీఎంజీ అనే సంస్థ ఆ నివేదిక ప్రకటించింది. రాష్ట్రంలో పాలన మొదలయ్యాక లక్షా ఆరువేల పరిశ్రమలు ఉంటే చంద్రబాబు పాలనలో 20 వేల పరిశ్రమలు మూతపడ్డట్టు అందులో పేర్కొంది. కరెంట్‌ లేక, పరిశ్రమల్లో డబ్బులు వసూళ్లు చేయడం మూలంగా అవి మూతపడినట్లు వివరించింది. 
  • పోలవరం కుడికాలువ 170 కిలోమీటర్లుంటే దాదాపు 140 కిలోమీటర్లు నాన్నగారు వైఎస్‌ పూర్తి చేశారు. మిగిలింది 30 కిలోమీటర్లు. అది కూడా పూర్తిచేయకుండా లస్కర్‌ మాదిరిగా గేట్లు ఎత్తి బొంకులు బొంకాడు చంద్రబాబు.
  • ఇక చంద్రబాబు అప్రజాస్వామిక పాలన గురించి చెప్పనక్కర్లేదు
  • ఓట్లు వేసి గెలిపించిన సర్పంచ్‌లకు విలువ లేకుండా చేశారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement