ద్వారకా తిరుమల: ఏ పార్టీలో అయినా చేరుకానీ, టీడీపీలో మాత్రం చేరవద్దని తన తండ్రి, దివంగత నేత కోటగిరి విద్యాధరరావు చెప్పారని కోటగిరి శ్రీధర్ అన్నారు. దివంగత మహానేత వైఎస్ఆర్తో తన తండ్రికి మంచి సంబంధాలున్నాయని, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి ఆయన నాయకత్వంలో పనిచేయాలని సలహా ఇచ్చారని చెప్పారు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో జరిగిన భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ సమక్షంలో కోటగిరి శ్రీధర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏం చెప్పారంటే..
- ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడానికి కారణమేంటంటే.. తమ కుటుంబంలో ప్రతి శుభకార్యక్రమం ఇక్కడి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగింది
- వెంకటేశ్వర స్వామి ముందు ఈ కార్యక్రమం పెట్టాలని వైఎస్ జగన్ను కోరాం
- ఇక్కడకు వచ్చిన వైఎస్ జగన్కు, వైఎస్ఆర్ సీపీ నాయకులకు, కార్యకర్తలకు, కోటగరి విద్యాధర రావు అభిమానులకు కృతజ్ఞతలు
- కోటగిరి విద్యాధర రావు ఇక్కడి నుంచి ఇండిపెండెంట్గా, ఆ తర్వాత వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు
- 2004లో కోటగిరి ఓడిపోయినా వైఎస్ఆర్ గెలిచారని సంతోషించారు
- గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కాబోతున్నారని సంతోషించారు
- వైఎస్ఆర్తో ఆయనకు మంచి సంబంధాలున్నాయి
- నాన్న చివరి రోజుల్లో నా తర్వాత నువ్వు రాజకీయ వారసుడిగా కొనసాగాలని చెప్పారు
- ఏ పార్టీలో చేరినా ఫర్వాలేదు కానీ టీడీపీలో మాత్రం చేరవద్దన్నారు
- నాన్న గారు మరో సలహా ఇచ్చారు. వైఎస్ జగన్తో చేరాలని చెప్పారు
- చిన్న వయసులో పార్టీ పెట్టి సమర్థవంతంగా నడిపిస్తున్నారని ప్రశంసించారు
- ఇక చంద్రబాబు గురించి కొంచెం మాట్లాడుకోవాలి
- ఆయన, ఆయన జీవితానుభవంలో ప్రతి ఎన్నికల్లో మనల్ని ఎలా మభ్యపెట్టాలో ఆలోచిస్తున్నారు
- ఎవర్ని ముందు పెట్టి ఎన్నికలకు వెళ్లాలి.. ఎలా మభ్య పెట్టాలా అని ఆలోచిస్తారు
- ఇదే ముఖ్యమంత్రి ఆ రోజు వ్యవసాయం శుద్ధ దండగ అని చెప్పారు. ఈ రోజు ఎన్నెన్నో కబుర్లు చెబుతున్నారు
- మనం ఢిల్లీ నాయకులను ముక్కు పిండి పనిచేయించుకోవాలంటే అందుకు బలమైన నాయకుడు కావాలి
- అందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రావాలి
- రాష్ట్ర విభజన జరిగినపుడు మనం ఎంతో బాధపడ్డాం
- మొదటి ముద్దాయి కాంగ్రెస్ను నామరూపాల్లేకుండా చేశాం
- వచ్చే ఎన్నికల్లో రెండో ముద్దాయి టీడీపీని బంగాళాఖాతంలో కలిపేద్దాం
- వైఎస్ జగన్ రాజకీయ అనుభవం సాధించారు. ఆయన సీఎం అవడానికి సిద్ధం
- 12 ఏళ్లు నాన్నగారికి రాజకీయాల్లో సాయం చేశాను. మూడు ఎన్నికల్లో పనిచేశాను. చాలా మందితో పరిచయం ఏర్పడింది.
- నాకు కోపం లేదు, ఓర్పు ఉంది, సహనం ఉంది, హంగూ ఆర్భాటం లేదు
- మీరు ఏ సమయంలోనైనా నా దగ్గరకు రావచ్చు
- మీరు మేనిఫెస్టోలను చూసి మోసపోవద్దు
-
మనమందరం వైఎస్ జగన్ ను గెలిపిద్దాం