ద్వారకా తిరుమల: మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు కుమారుడు కోటగిరి శ్రీధర్ వైఎస్ఆర్ సీపీలో చేరారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో ఆదివారం సాయంత్రం జరిగిన భారీ బహిరంగ సభలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వైఎస్ జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
ఈ రోజు వైఎస్ జగన్ హైదరాబాద్ నుంచి రాజమండ్రికి విమానంలో వెళ్లి అక్కడి నుంచి ద్వారకా తిరుమలకు చేరుకున్నారు. ద్వారకా తిరుమలలో చినవెంకన్న దర్శనం చేసుకున్న తర్వాత బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభకు వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చారు.