
సాక్షి, తిరుపతి : తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి మరోసారి కరోనా సోకింది. బుధవారం ఆయన కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది. దీంతో గురువారం ఆయనకు రుయా ఆస్పత్రిలో మరోసారి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయనకు బీపీ, షుగర్ నార్మల్‌గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. (కరోనా కష్టంతో 9.6% క్షీణత)
ఎంపీ కోటగిరి శ్రీధర్‌కు కరోనా పాజిటివ్
ఏలూరు టౌన్: ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన హైదరాబాదులో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆయనతో పాటు మరో నలుగురు కార్యాలయ సిబ్బందికి పాజిటివ్ అని తేలింది. గత వారం రోజుల్లో తనను కలిసిన వారందరూ కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని ఎంపీ కోటగిరి శ్రీధర్ విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment