హైదరాబాద్ : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని మాజీమంత్రి కోటగిరి విద్యాధరరావు కుమారుడు శ్రీధర్ కలిశారు. ఆయన ఆదివారం లోటస్ పాండ్‌లో వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. కోటగిరి శ్రీధర్ ఈ నెల 28న వైఎస్‌ఆర్ సీపీలో చేరనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో జరిగే బహిరంగ సభలో ఆయన అధికారికంగా పార్టీలో చేరతారు.
శ్రీధర్‌తో పాటు పార్టీ నేతలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నాని కూడా వైఎస్ జగన్‌తో సమావేశం అయ్యారు. కాగా ఇటీవలే మాజీమంత్రి కాసు కృష్ణారెడ్డి తనయుడు కాసు మహేష్ రెడ్డి, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా వైఎస్‌ఆర్ సీపీలో చేరిన విషయం తెలిసిందే.