reddappa
-
టీడీపీ అల్లరిమూకల పైశాచికత్వం
గంగవరం (చిత్తూరు జిల్లా): వైఎస్సార్సీపీ నేత, ఆయన కుటుంబసభ్యులపై టీడీపీ అల్లరిమూకలు దాడులకు తెగబడిన ఘటన చిత్తూరు జిల్లాలో శనివారం రాత్రి జరిగింది. ఘటనపై బాధితులు ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గంగవరం మండలంలోని మార్జేపల్లికి చెందిన వైఎస్సార్సీపీ నేత, గ్రామ సచివాలయ కన్వినర్ చిన్నరెడ్డెప్ప కుటుంబ సభ్యులపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత శంకరప్ప కుటుంబ సభ్యులైన ఆ పార్టీ కార్యకర్తలు 20 మందికి పైగా దాడి చేశారు. శనివారం జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా టీడీపీ కార్యకర్తలు కొంతమంది చిన్నరెడ్డెప్ప ఇంటి ముందు టపాసులు కాల్చడంతో పశువులు బెదిరాయి. దీంతో కాస్త పక్కన కాల్చుకోవాలని చిన్నరెడ్డెప్ప కోరాడు. దీంతో టీడీపీ కార్యకర్తలు ‘మాకు నువ్వేంది చెప్పేది.. టపాసులు ఇక్కడే పెడతాం’ అంటూ చిన్నరెడ్డెప్పపై దాడికి తెగబడ్డారు. టీడీపీ కార్యకర్తలు సునీల్, చరణ్, విశ్వేశ్వరయ్య, యువరాజు, భాను, బాలరాజు, అశోక్, అమర్నాథరెడ్డి, కార్తీక్, మరికొంతమంది కలిసి చిన్నరెడ్డెప్ప, అతని భార్య సుభద్ర, తండ్రి శ్రీరాములు, తల్లి మునివెంకటమ్మ, సమీప బంధువులు రత్నారెడ్డి, యశ్వంత్, చంద్రప్పపై దాడి చేశారు. ఇంటిపై రాళ్లు విసరడంతో కిటికీలు, తలుపులు పగిలిపోగా కర్రలు, రాళ్లతో దాడి చేసి ఇంట్లో ఉన్నవారిని తీవ్రంగా గాయపరిచారు. క్షతగాత్రులు ప్రస్తుతం పలమనేరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, గతంలో టీడీపీ కార్యకర్త చరణ్ గ్రామంలోని ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో చిన్నరెడ్డప్ప, యువతి బంధువులు చరణ్‌ను మందలించారు. దీంతో కక్షగట్టిన చరణ్.. యువతి అన్నపై అప్పట్లో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ నేపథ్యంలో పాతకక్షలను మనసులో పెట్టుకుని ఉద్దేశపూర్వకంగానే చరణ్, ఇతర టీడీపీ కార్యకర్తలు తమపై దాడికి పాల్పడినట్లు బాధితులు చెప్పారు. టీడీపీ నేతల నుంచి తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ ప్రతాప్‌రెడ్డి గ్రామానికి చేరుకుని ఘటనపై విచారించారు. శంకరప్పతో సహా దాడికి పాల్పడిన వారందరిపై కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన అశోక్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
ప్రత్యేక హోదాపై గళమెత్తుతాం: వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు కోసం పార్లమెంటులో ప్రైవేటు మెంబరు బిల్లు ప్రవేశ పెడతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తలారి రంగయ్య, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎన్.రెడ్డప్ప తెలిపారు. వారు ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం( క్లోజ్డ్ చాప్టర్) కాదని, పవిత్రమైన పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీ అని ఎంపీలు గుర్తు చేశారు. విభజన హామీలు సాధించుకోవడం కోసం పార్లమెంటులో గళమెత్తుతామని తెలిపారు. ప్రత్యేక హోదా అనేది క్లోజ్డ్ చాఫ్టర్ కాదు: ఎంపీ తలారి రంగయ్య అనంతపురం ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం చెప్తున్నట్లుగా ప్రత్యేక హోదా అనేది క్లోజ్డ్ చాఫ్టర్ కాదు. ఎట్టిపరిస్థితుల్లోనూ అది క్లోజ్డ్ చాప్టర్ కాదు.. వాళ్లు ఎన్నిసార్లు హోదా ఇవ్వలేము చెప్పినా మేం అన్నిసార్లు ఇవ్వమని అడుగుతూనే ఉంటాం. విభజన చట్టంలో ప్రతిపాదించి ఇప్పటి వరకూ అమలు కాని అంశాలపై కూడా ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడతాం. అయితే ఇవాళ దానిపై చర్చ ఉన్నా సభ వాయిదా పడటంతో కుదరలేదు. అవకాశం రాగానే మిగతా పార్టీల మద్దుతు కూడగట్టుకుని ఓటింగ్ కి వచ్చేలా కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసినట్లే..: సుభాష్ చంద్రబోస్ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ, ఏపీ విభజన సందర్భంగా.. అప్పట్లో కేంద్రం ఇచ్చిన హామీలను ఇంకా నెరవేర్చని పరిస్థితి ఉంది. బడ్జెట్లో మా లాంటి చిన్న రాష్ట్రాలకు చేయూత ఇస్తారని ఆశించాం. ప్రత్యేక హోదా కోరిక నెరవేర్చకపోవడం, విశాఖ రైల్వే జోన్ ఇవ్వకపోవడం వంటివి బాధపెట్టాయి. దేశంలో ఉన్న అన్ని ఎయిమ్స్‌లకు కలిపి రూ.6700 కోట్లు ఇచ్చారు. అమరావతిలోని ఎయిమ్స్ కొత్తగా పెట్టిన ఆస్పత్రి.. వచ్చే ఆ నిధులు ఎందుకూ సరిపోవు.. మరిన్ని నిధులు ఇస్తేగానీ అక్కడ అభివృద్ధి జరగదు. అరకొర నిధులతో ఇంకా కొనసాగిస్తున్నారంటే తీవ్రమైన అన్యాయాన్ని రాష్ట్రానికి చేసినట్లే పవిత్ర దేవాలయం లాంటి పార్లమెంటులో ఇచ్చిన హామీని అమలు చేయడంలో విఫలమైతే ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగే ప్రమాదం ఉందని ప్రధాని గమనించాలి. ఒక ప్రభుత్వం పార్లమెంటులో ఒక హామీ ఇచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారనే విశ్వాసం ప్రజల్లో ఉంటుందని ఎంపీ అన్నారు. ప్రత్యేక హోదా రానివ్వకుండా చేసిన ఘనుడు చంద్రబాబు: రెడ్డప్ప ఎంపీ ఎన్. రెడ్డప్ప మాట్లాడుతూ, బడ్జెట్లో ఏపీకి మొండి చేయి చూపినందున ప్రజలు తీవ్రంగా బాధపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టింది కానీ దేశవ్యాప్తంగా తనకు మనుగడ లేకుండా చేసుకుంది. అనేక సంక్షేమ పథకాలతో జగన్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రత్యేక హోదాపై గత నాలుగేళ్లుగా మేం పార్లమెంటులో విన్నపాలు చేస్తూనే ఉన్నాం. మా ముఖ్యమంత్రి సుమారు 20 సార్లు ఢిల్లీ వచ్చి హోదా ఇవ్వమని కేంద్రాన్ని కోరారు. ఇంతకాలం ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ పోరాటాలు చేస్తూనే ఉన్నాం...స్పందన లేదు కాబట్టే ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడుతున్నాం. కచ్చితంగా పార్లమెంటులో మా గళాన్ని వినిపించి హోదాను సాధించుకుంటాం. రాష్ట్రాన్ని విడగొట్టింది చంద్రబాబే... ప్రత్యేక హోదా, నిధులు రానివ్వకుండా చేసిన ఘనుడు చంద్రబాబు-మళ్లీ ఆయనే మమ్మల్ని తప్పు పడుతున్నారు. ఎంతో అనుభవం ఉందన్న చంద్రబాబు కనీసం కుప్పానికి మంచినీళ్లు కూడా తీసుకురాలేకపోయాడు. కుప్పంలో లోకేశ్‌కు కనీసం వెయ్యి మంది కూడా రావడం లేదు..పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లయ్యింది లోకేష్ పాదయాత్ర. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా సీఎం జగన్ ప్రభంజనం ఉంటుందని రెడ్డప్ప అన్నారు. చదవండి: థ్యాంక్యూ సీఎం జగన్ సార్.. మా కల నెరవేరుస్తున్నారు’ -
శ్రీలంకతో ఏపీని ఎలా పోలుస్తారు?: వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీలంకతో పోలికలెందుకు? కేంద్రం తన ఆర్థిక పరిస్థితి చూసుకుంటే మంచిదని వైఎస్సార్సీపీ ఎంపీల హితవు పలికారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో గురజాడ హాల్లో వైఎస్సార్సీపీ ఎంపీలు డాక్టర్ తలారి రంగయ్య, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎన్.రెడ్డప్ప మీడియా సమావేశంలో మాట్లాడుతూ, శ్రీలంకతో రాష్ట్రాలను ఎలా పోలుస్తారు? ఆర్థిక క్రమశిక్షణ కేంద్రానికీ అవసరమే కదా? అంటూ ప్రశ్నించారు. చదవండి: ఒక్కసారిగా మారిపోయిన సీన్.. అక్కడ ఎకరం కోటి రూపాయలపైనే.. కేంద్రంతో పోలిస్తే రాష్ట్రం అప్పులు తక్కువ. శ్రీలంక జీడీపీ కన్నా, రాష్ట్ర జీఎస్డీపీ ఎక్కువ. వాణిజ్య ఎగుమతుల్లోనూ చాలా ముందున్నాం. ఏటేటా వాణిజ్య ఎగుమతులు పెరుగుతున్నాయన్నారు. రాష్ట్ర అప్పుల్లో ప్రతి రూపాయి సద్వినియోగమవుతోంది. ఎక్కడా అవినీతికి తావు లేకుండా నేరుగా పంపిణీ అవుతుందన్నారు. మూడేళ్లలో డీబీటీ ద్వారా రూ.1.65 లక్షల కోట్లు. టీడీపీ ప్రభుత్వం మాదిరిగా వ్యయం చేయలేదు. అనుత్పాదక రంగాల్లోనే ఆ ప్రభుత్వం నిధుల వ్యయం. మా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిందని వైఎస్సార్సీపీ ఎంపీలు గుర్తు చేశారు. ఇకనైనా వాస్తవాలు గుర్తించి దుష్ప్రచారాలు మానాలని, శ్రీలంకతో రాష్ట్రాన్ని అస్సలు పోల్చవద్దు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు వద్దు’’ అని ఎంపీలు స్పష్టీకరించారు. వైఎస్సార్సీపీ ఎంపీలు ఏం మాట్లాడారంటే..: శ్రీలంకతో పోల్చడం సరికాదు: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని శ్రీలంకతో పోల్చడం ఏ మాత్రం సరికాదు. మనది ఒక రాష్టం. శ్రీలంక ఒక దేశం. ఆ దేశ ఆర్ధిక వ్యవస్థ పతనం కావడానికి వేర్వేరు కారణాలున్నాయి. అందువల్ల ఏ విధంగా కూడా రాష్ట్రాన్ని శ్రీలంకతో పోల్చలేం. అక్కడి పరిస్థితులు పూర్తిగా వేరు. ఉదాహరణకు కొన్ని అంశాలు చూస్తే.. గణనీయంగా వాణిజ్య ఎగుమతులు: శ్రీలంకలో వాణిజ్య ఎగుమతులు గత మూడేళ్లలో చూస్తే తగ్గాయి. అదే సమయంలో రాష్ట్రంలో వాణిజ్య ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. శ్రీలంకలో వాణిజ్య ఎగుమతులు 2019-20లో 19 బిలియన్ డాలర్లు కాగా, ఆ తర్వాత ఏడాది 2020-21లో అవి 13 బిలియన్ డాలర్లకు తగ్గాయి. 2021-22లో 14 బిలియన్ డాలర్ల వాణిజ్య ఎగుమతులు నమోదయ్యాయి. అదే ఆంధ్రప్రదేశ్‌లో మూడేళ్లలో వాణిజ్య ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. 2019-20లో ఇక్కడి నుంచి వాణిజ్య ఎగుమతుల మొత్తం 11 బిలియన్ డాలర్లు కాగా, అవి 2020-21లో 15 బిలియన్ డాలర్లకు చేరాయి. ఆ తర్వాత ఏడాది 2021-22లో వాణిజ్య ఎగుమతుల మొత్తం ఏకంగా 25 బిలియన్ డాలర్లు. అంటే మూడేళ్లలో వాణిజ్య ఎగుమతులు 14 బిలియన్ డాలర్లు పెరిగాయి. ఇక దేశ పరిస్థితి చూస్తే 2019-20లో 535 బిలియన్ డాలర్ల వాణిజ్య ఎగుమతులు జరగ్గా, 2020–21లో 500 బిలియన్ డాలర్లు, 2021–22లో దాదాపు 600 బిలియన్ డాలర్ల వాణిజ్య ఎగుమతులు జరిగాయి. మన జీఎస్డీపీ బాగా మెరుగు: అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందన్నది వాస్తవం. రాష్ట్ర జీఎస్డీపీని శ్రీలంక జీడీపీతో పోల్చితే మన జీఎస్డీపీ చాలా బాగుంది. శ్రీలంక జీడీపీ 81 బిలియన్ డాలర్లు కాగా, మన జీఎస్డీపీ 160 బిలియన్ డాలర్లు. అంటే ఒక దేశం కంటే మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చాలా బాగుంది. కేంద్రం అప్పులు ఎక్కువ: అప్పుల్లో కూడా మన రాష్ట్రానికి, శ్రీలంకకు ఎక్కడా పోలిక లేదు. నిజం చెప్పాలంటే మన రాష్ట్ర అప్పుల కంటే ఇవాళ కేంద్రం చేసిన అప్పులే ఎక్కువ. జీడీపీలో అప్పులు (డెట్ టు జీడీపీ) శ్రీలంకలో 101 శాతం ఉంటే, మన రాష్ట్రంలో చూస్తే అది 32.4 శాతం మాత్రమే. అదే కేంద్రంలో చూస్తే.. డెట్ టు జీడీపీ 59 శాతంగా ఉంది. దీనికి కేంద్రం ఏం సమాధానం చెబుతుంది?. ఇవాళ కేంద్రం అప్పులు ఏకంగా 133 లక్షల కోట్లకు చేరుకున్నాయి. కాబట్టి కేంద్రం తన ఆర్థిక పరిస్థితి చూసుకుంటే మంచిది. అందుకే ఇంకా ప్రజలను మభ్య పెట్టొద్దు. వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దు. వాస్తవం ఇలా ఉంది కాబట్టే కేంద్ర మంత్రి వ్యాఖ్యలను మిగతా రాష్ట్రాలు కూడా ఖండించాయి. ప్రతి రూపాయికి లెక్క ఉంది: రాష్ట్ర అప్పుల్లో ప్రతి రూపాయికి లెక్క ఉంది. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మూడేళ్లలో రూ.1.65 లక్షల కోట్లు నగదు బదిలీ (డీబీటీ) ద్వారా నేరుగా ప్రజలకు చేరాయి. ఎక్కడా అవినీతికి తావు లేకుండా, పూర్తి పారదర్శకంగా అది జరిగింది. అదే గత ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేసి అనుత్పాదక రంగాలపై ఖర్చు చేసింది. కరోనా కష్టకాలంలో నిరుపేద కుటుంబాలను అనేక పథకాల ద్వారా ఆదుకున్నాం. నగదు బదిలీ ద్వారా వారు నిలదొక్కకోగలిగారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడింది. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. ఒక్కో కుటుంబానికి కనీసం లక్ష నుంచి దాదాపు రూ.10 లక్షల వరకు అందింది. అభివృద్ధి -సంక్షేమం: ప్రభుత్వం ఇస్తున్న ప్రతి రూపాయి నిరుపేదల ఖాతాల్లో చేరుతోంది. ఇంక నాడు–నేడు కార్యక్రమంతో స్కూళ్లు, ఆస్పత్రుల రూపురేఖలు పూర్తిగా మారుతున్నాయి. ఆ విధంగా ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. అందుకే శ్రీలంకతో రాష్ట్రాన్ని అస్సలు పోల్చవద్దు. విపక్షం ఇకనైనా విమర్శలు విడనాడాలి పోలవరం బాధ్యత కేంద్రానిదే: పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది. అందుకే ఆ ప్రాజెక్టు బాధ్యత పూర్తిగా కేంద్రానిదే. అయితే నిర్మాణ బాధ్యతను గత ప్రభుత్వం తీసుకుంది. అందుకే ఇప్పుడు కూడా నిర్మాణం పనులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ప్లానింగ్, డిజైన్ బాధ్యతలు పూర్తిగా కేంద్రానివే. -
రేషన్ షాపుల్లో మినీ ఎల్పీజీ సిలిండర్లు.. కేంద్రమంత్రి ప్రకటన
ఢిల్లీ: రేషన్ దుకాణాల ద్వారా మినీ-ఎల్పీజీ సిలిండర్ల విక్రయానికి వెసులుబాటు కల్పించామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో రేషన్ షాపుల్లో ఆహార ధాన్యాలతో పాటు ఇతర వస్తువులు కూడా అందుబాటులో ఉంచామని అందులో భాగంగా మినీ ఎల్పీజీ సిలిండర్లు విక్రయిస్తున్నట్టు తెలిపారు. రేషన్ షాపుల్లో మినీ ఎల్పీజీ సిలిండర్ల విక్రయానికి సంబంధించి ఇప్పటికే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో చర్చించామని మంత్రి తెలిపారు. అయితే రేషన్ షాపుల నిర్వహణ పూర్తిగా రాష్ట్రాల చేతుల్లో ఉందన్నారు. ఆసక్తి ఉన్న రాష్ట్రాలు రేషన్ షాపుల్లో మినీ-ఎల్పీజీ అందిస్తున్నాయని ఆయన వెల్లడించారు. రేషన్ షాపుల్లో ఎల్పీజీ సిలిండర్లకు సంబంధించి వైఎస్సార్సీపీ ఎంపీలు కోటగిరి శ్రీధర్, ఎన్. రెడ్డెప్పలు అడిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమాధానం ఇచ్చారు. చదవండి:రెండేళ్లలో కోటి ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు -
‘కుప్పంలో చంద్రబాబు ప్రజల విశ్వాసం కోల్పోయారు’
సాక్షి, న్యూఢిల్లీ: కుప్పంలో చంద్రబాబు ప్రజల విశ్వాసం కోల్పోయాడని చిత్తూరు వైఎస్సార్సీపీ ఎంపీ రెడ్డప్ప అన్నారు. ఆయన ఢిల్లీ మీడియాతో మాట్లాడుతూ.. సొంత నియోజకవర్గంలో ప్రజలు ఆయనకు రాజకీయ సమాధి కట్టారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన తప్పులు తెలుసుకోవాలని హితవు పలికారు. కోర్టుల ద్వారా సీఎం జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూశారని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన తప్పులకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని అన్నారు. ఇకనైనా చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు మానుకోవాలన్నారు. ఎన్నికల్లో ఓటమి భయంతో బహిష్కరణ నాటకం మొదలు పెట్టారని మండిపడ్డారు.టీడీపీ నేతలకు సిగ్గు, శరం లేదని బహిష్కరణ చేసిన వాళ్లు బీఫాంతో నామినేషన్ ఎలా వేశారని సూటిగా ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన పథకాల వల్లే భారీ విజయం సాధించామని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయం సాధిస్తుందని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని అన్నారు. -
ఎంపీ రెడ్డప్పను పరామర్శించిన మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్సీపీ చిత్తూరు ఎంపీ రెడ్డెప్పను రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి శనివారం పరామర్శించారు. ఎంపీ రెడ్డప్ప ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు రావడంతో ఆయన్ను ఢిల్లీలోని ఫోర్టీస్ హాస్పిటల్లో చేర్పించారు. ఆయనకు వైద్యులు గుండె ఆపరేషన్ చేశారు. -
వైఎస్సార్సీపీ ఎంపీ రెడ్డప్పకు అస్వస్థత
పుంగనూరు: పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గురువారం సాయంత్రం గుండెపో టు రావడంతో ఆయన్ను ఢిల్లీలోని ఫోర్టీస్ హాస్పిటల్లో చేర్పించారు. వైద్యులు పరీక్షలు చేసి పేస్‌మేకర్‌ను అమర్చారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం. రెండుమూడు రోజుల్లో ఆపరేషన్ చేయనున్నట్టు ఆయన కుమార్తె డాక్టర్ హిమబిందు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే కుమార్తెతో పాటు, భార్య రెడ్డెమ్మ, అల్లుడు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. -
ప్రభుత్వంపై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేదిలేదు
-
నియోజకవర్గానికి వెళితే ప్రజల విలువ తెలుస్తుంది
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో చెట్ల కింద కూర్చొని ప్రజలకు సిగ్గులేదంటూ పాటలు పాడేవారికి ప్రజల విలువ తెలియదని, నియో జకవర్గానికి వెళితే ప్రజల విలువ తెలుస్తుందని వైఎస్సార్సీపీ ఎంపీలు నందిగం సురేష్, రెడ్డెప్ప వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో మంగళవారం వారు మీడియాతో మాట్లాడారు. దొంగలా బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసులు ఇస్తే తనకేదో అయిపోయినట్లు భావించే వారికి త్వరలోనే బుద్ధి చెబుతామన్నారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు చేసిన మోసాలు, అక్ర మాలకు నోటీసులు ఇస్తే రఘురామకృష్ణరాజు భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశా రు. వీధికుక్కలా మొరిగేవారిని మీడియా పట్టిం చుకోవడం సరికాదన్నారు. చంద్రబాబు ఎప్పు డు జైలుకు వెళ్తారా? పగ్గాలు అందుకుందామని లోకేశ్ ఆరాటపడుతున్నట్లుగా ఉందన్నారు. రఘురామకృష్ణరాజుకు ఢిల్లీ నడిబొడ్డున సమా ధానం చెప్పగలమన్నారు. కుప్పంలో గెలుస్తా మని చెప్పి గెలిచామని మరోసారి ఎన్నికలు వస్తే ప్రస్తుతం కన్నా ఎక్కువ శాతం సీట్లతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. -
ఎంపీలు రెడ్డప్ప, మాధవిలకు పాజిటివ్
సాక్షి,న్యూఢిల్లీ : చిత్తూరు వైఎస్సార్సీపీ ఎంపీ రెడ్డప్ప కరోనా వైరస్ బారినపడ్డారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన ఎంపీకి పార్లమెంట్ సచివాలయంలో నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఎటువంటి లక్షణాలు లేకుండానే కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఐసోలేషన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. అరకు ఎంపీ మాధవికి కూడా కరోనా సోకింది. గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఎంపీ.. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో రెండు వారాల పాటు ఢిల్లీలోనే చికిత్స తీసుకోనున్నారు. కాకినాడ ఎంపీ వంగ గీతా సైతం ఇదివరకే వైరస్ బారినపడిన విషయం తెలిసిందే. గత శనివారం ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. కాగా దేశంలో కరోనా వైరస్ విజృంభణ కారణంగానే ప్రత్యేక పరిస్థితుల నడుమ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. మరోవైపు దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 24 మంది ఎంపీలకు, 8 మంది కేంద్రమంత్రులకు కరోనా పాజిటవ్‌గా తేలింది. ఇక స్వల్ప లక్షణాలు ఉన్నా.. సభలోకి అనుమతి లేదని స్పీకర్ ఇదివరకే ప్రకటించారు. (పార్లమెంట్లో కరోనా కలకలం..!) -
ఏపీలో రైల్వే అభివృద్ధికి సహకరించండి
సాక్షి, ఢిల్లీ: రాష్ట్రంలో పలు రైల్వే అభివృద్ధి పనులకు సహకరించాలని కేంద్రాన్ని కోరామని వైఎస్సార్సీపీ ఎంపీ రెడ్డప్ప తెలిపారు. సోమవారం ఆయన రైల్వే స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కడప- బెంగుళూరు, చిత్తూరు-బెంగుళూరు మార్గాలకు ఇప్పటి వరకు నిధులు కేటాయించలేదని వెంటనే నిధులు కేటాయించాలని కోరినట్లు ఆయన తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో అండర్ బ్రిడ్జి లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. వెంటనే బ్రిడ్జి నిర్మించాలని కోరామన్నారు. చిత్తూరు రైల్వేస్టేషన్లో అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. అమరావతి నుంచి ఢిల్లీకి రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలును కేటాయించాలని అడిగామన్నారు. విశాఖ రైల్వే జోన్ పనులు వేగవంతం చేయాలని కూడా ప్రస్తావించామని ఎంపీ రెడ్డప్ప పేర్కొన్నారు. చదవండి: ఐటీ, నైపుణ్యాభివృద్ధిపై సీఎం కీలక నిర్ణయాలు -
‘రాజధానిపై రెండు కమిటీల నివేదికలు అందాయి’
సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అమ్మ ఒడి’ పథకం ప్రారంభంలో భాగంగా ఈనెల 9న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ జిల్లా పర్యటన నేపథ్యంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఎంపీ రెడ్డప్పలు తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘నవరత్నాల్లో అతిముఖ్యమైన అమ్మ ఒడి పథకాన్ని చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. రాజధానిపై రెండు కమిటీల నివేదికలు అందాయి. హైపవర్ కమిటీలో దీనిపై చర్చిస్తాము. కొత్త ఐటీ, పారిశ్రామిక పాలసీలు రూపొందిస్తున్నాం. వచ్చే బడ్జెట్లో దీనిని ప్రకటిస్తాం. అదానీ సంస్థ విశాఖలో పరిశ్రమ ఏర్పాటుకు ఆసక్తిగా ఉంది. వాళ్లు 400 ఎకరాలు అడగలేదు. రూ. 79 వేల కోట్ల పెట్టుబడులు అన్నదానిలో వాస్తవం లేదు. మూడు నుంచి నాలుగు వేల కోట్ల పెట్టుబడితో వారు పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. చంద్రబాబు హయాంలో విశాఖ పారిశ్రామిక సదస్సుల ద్వారా రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రచారం చేశారు. కానీ అందులో పది శాతం కూడా పెట్టుబడులు రాలేదు. సౌదీ అరేబియా నుంచి రూ. 3 వేల కోట్ల పెట్టుబడులతో నాలుగు కంపెనీలు రాష్ట్రానికి రానున్నాయి’అని మంత్రులు పేర్కొన్నారు. -
అంత సీన్ లేదు: ఎమ్మెల్యే రోజా
ప్రజలతో మెలగాలి. వారి కష్టసుఖాలను తెలుసుకోగలగాలి. కేవలం సినిమా ఆకర్షణతో సీఎం సీటు ఎక్కేంత సీన్ లేదు..అని ఏపీఐఐసీ చైర్పర్సన్ ఆర్కే రోజా అన్నారు. కష్టనష్టాలకు ఎదురీది, అగ్ర రాజకీయకీయ నేతలకు ఎదురొడ్డి ప్రజలతో మమేకమైన వైఎస్ జగన్మోహన్రెడ్డే నేటి తరం రాజకీయాలకు ఆదర్శప్రాయుడని ఆమె చెప్పారు. సాక్షి, చెన్నై: రైల్వే సమస్యల పరిష్కారం కోసం చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డెప్ప, రోజా చెన్నైలోని దక్షిణరైల్వే ప్రధాన కార్యాలయానికి వచ్చారు. నగరి సమస్యల పరిష్కారం కోసం జనరల్ మేనేజర్‌ను కలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రజనీ, కమల్ గురించి మీడియా ప్రశ్నించగా, రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు.. ప్రజలు ఎవరిని నమ్మి ఓట్లు వేస్తారో వాళ్లే ముఖ్యమంత్రి అవుతారన్నారు. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు నేను ఉన్నాననే భరోసా ఇవ్వగలగాలి. అలా కాకుండా ఊరికే ఏసీ గదుల్లో ఉంటే సీఎం ఎప్పటికీ కాలేరు. జగన్మోహన్రెడ్డి అనే వ్యక్తిని లేకుండా చేయడానికి ఎన్నెన్ని చేస్తున్నారో చూస్తున్నాం. ఇన్ని జరిగినా ప్రతిపక్ష నేతగా తొమ్మిదేళ్లు ప్రజల్లోనే ఉన్నారు. ఢిల్లీలో మోదీ, సోనియాగాం«దీ, ఏపీలో చంద్రబాబు ఎవరైనా సరే‡ ప్రజల కోసం ఆయన ఫైట్ చేస్తున్నారు. అందువల్లే ఆయన ఇప్పుడు సీఎం అయ్యారు. అలా కాకుండా నేను నటుడిని, నాకు పెద్ద ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.. అనేది ఇప్పుడు లేదు. ఆ రోజులు పోయాయి. సోషల్ మీడియాలో ఎవరు, ఏమిటి.. ఎలా అనేది అంతా చూస్తున్నారు. ప్రజలు బాగా తెలివిమంతులు, వారికి తెలుసు ఎవరిని అందలం ఎక్కించాలనేది. జయలలిత కన్నుమూసిన తర్వాత అన్నాడీఎంకే పార్టీ, ప్రభుత్వంæ ఉండదని అనుకున్నారు. గతంలో ఎవ్వరికీ అంతగా తెలియని ఎడపాడి పళనిస్వామి మంచి రాజకీయవేత్తగా, లీడర్‌గా గుర్తింపు పొందారు. వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చేస్థాయికి అన్నాడీఎంకే ఎదిగిందని చెప్పారు. నగరి నియోజకవర్గంలో రూ.200 కోట్ల రైల్వే అభివృద్ధి చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత నాలుగోసారి దక్షిణరైల్వే జనరల్ మేనేజర్‌ను కలుసుకున్నాను. గతంలో మూడు సార్లు వచ్చినపుడు అప్పటి జనరల్ మేనేజర్లు కూడా తాము చేసిన విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించి రూ.100 కోట్ల విలువైన 75 శాతం పనులు పూర్తిచేశారు. అప్పుడు పెట్టిన ఉత్తరంలో సుమారు మరో రూ.100 కోట్ల పనులు మంజూరై టెండర్ల దశలో ఉన్నాయి. మూడు నెలల్లో టెండర్లు ఖరారై పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నగరికి, చెన్నైకి అవినావభావ సంబంధం ఉంది. అక్కడ ఎక్కువగా చేనేత కార్మికులు ఉండడం వల్ల వారి వృత్తి రీత్యా చెన్నైకి రావడం జరుగుతోంది. వైద్యసేవల కోసం చెన్నై ఆసుపత్రులకు వస్తుంటారు. ఎముకలు విరిగిపోయిన స్థితిలో రోగులు తమిళనాడు నుంచి ఈసలాపురానికి వస్తూ ఉంటారు. రైళ్లు కూడా ఈ మార్గంలో ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. వీరి వల్ల రైల్వేకు ఎంతో ఆదాయం. అందువల్లే మేము అడిగినవన్నీ జీఎం అంగీకరించడం ఆనందంగా ఉంది. తిరుపతి – చెన్నై ఫోల్లైన్ రోడ్డు వేయకుండానే అధికంగా డబ్బులు వసూలు చేస్తూ రాయపాటి మనుషులు ఇబ్బంది పెట్టడంపై సంబంధితశాఖకు ఫిర్యాదు చేశాం. కేంద్రమంత్రులకు సైతం ఫిర్యాదు చే శాం. నగరి నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న జీఎం, ఇతర అధికారులకు ధన్యవాదాలు. అలాంటి సీఎం కావాలని కోరుతున్నారు జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి వద్ద ఎమ్మెల్యేగా పని చేయడం గర్వంగా చెప్పుకుంటున్నాం. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఇలా ఏ రాష్ట్రానికి వెళ్లినా జగన్మోహన్ రెడ్డి సీఎం మాకు లేరే అని మాట్లాడుకుంటున్నారు. ఐదు నెలల్లోనే అన్ని చేస్తున్నారంటే, 5 ఏళ్లలో ఎవరూ ఆయన్ను బీట్ చేయలేరు. మరో 20 ఏళ్లు జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు అని అన్నారు. అబద్ధాల కోరు చంద్రబాబు చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ చంద్రబాబు నిత్యం అబద్ధాలు చెబుతారు, అన్యాయం చేస్తారు. ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పినా, అమరావతిలో సంవత్సరానికి నాలుగు పంటలు పండే భూమిని రైతుల వద్ద నుంచి గుంజేసుకున్నాడు కాబట్టే వారి శాపాలు తగిలాయి అన్నారు. ఇక చంద్రబాబు కోలుకునే ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి, ప్రజల కష్టనష్టాలు తెలుసుకుని, ఆయన మేనిఫెస్టోలో ప్రజలకు ఉపయోగపడే విధంగా పెట్టి పథకాలన్నింటినీ ప్రతి ఇంటికీ అందేవిధంగా చేస్తున్నాడు.. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆయన దగ్గర గుణపాఠాలు నేర్చుకోవాలి. అబద్ధాలు చెప్పడం ఇప్పటికైనా ఆయన మానుకోవాలన్నారు. -
మేము తలుపులు తెరిస్తే టీడీపీ ఖాళీ
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు బీజేపీతో టచ్‌లో ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బీజేపీతో తమ పార్టీ ఎంపీలు ఎవరు టచ్‌లో ఉన్నారో చెప్పాలని సవాల్ విసిరారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు శుక్రవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో టీడీపీపై నిప్పులు చెరిగారు. తమ పార్టీ ఎంపీలపై అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. చిత్తూరు ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తలుపులు తెరిస్తే టీడీపీ ఖాళీ అవుతుంది. సీఎం జగన్ అనుకుంటే అర్థగంటలో అందరూ వైఎస్సార్ సీపీలోకి వచ్చేస్తారు. కానీ అటువంటి పనులకు తమ నాయకుడు దూరం. బీజేపీతో వైఎస్సార్ సీపీ ఎంపీలు ఎవరు టచ్‌లో ఉన్నారో చెప్పాలి. బీజేపీలో ఉన్న సుజనా చౌదరి ఇంకా టీడీపీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారు. అయిదు నెలలుగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధి టీడీపీకి కనిపించడం లేదా?. ఇసుక అమ్ముకుని బతికిన ఘటన టీడీపీది. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ప్రజలంతా జగన్ పాలన శభాష్ అంటున్నారు. సుజనా చౌదరి ఎవరూ అంటే బ్యాంక్ దొంగ అని అందరూ అంటారు. గూగుల్‌లో సెర్చ్ చేసినా బ్యాంక్ దొంగ అనే వస్తుంది. ఆయన తన పబ్బం గడుపుకోవడానికి వైఎస్సార్ సీపీ ఎంపీలపై నిందలు వేస్తున్నారు. బ్యాంకులకు రూ.6 వేలకోట్లు ఎగ్గొట్టిన దానిపై సుజనా చౌదరి మాట్లాడాలి. మా కొన ఊపిరి ఉన్నంతవరకూ వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే ఉంటాం. ఏ మాత్రం స్తోమత లేని మమ్మల్ని ఎంపీలుగా వైఎస్ జగన్ గెలిపించారు. మాపై పత్రికల్లో అన్యాయంగా, అక్రమంగా, అబద్ధాలు రాస్తూనే ఉన్నారు. రాధాకృష్ణ పేపర్ సర్క్యులేషన్ పెంచుకోవడానికి అబద్ధాలు ప్రచారం చేయొద్దు అని హితవు పలికారు. సుజనా చౌదరి నీతులు చెప్పడం మానుకో.. వైఎస్సార్ సీపీ ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ... ‘ఎంగిలి మెతుకులు తిని సుజనా చౌదరి మాట్లాడవద్దు. ఏపీలో టీడీపీ చచ్చిపోయింది. భవిష్యత్‌లో బతికే అవకాశమే లేదు. ఇంగ్లీష్ మీడియంపై లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారు. బీజేపీలో ఉంటూ టీడీపీ నాయకుడిలా సుజనా చౌదరి ఎలా మాట్లాడతారు?. మేము రెండు పూటలా తిండి కోరుకునేవాళ్లం. మీకులా బ్యాంకులకు కన్నాలు వేసేవాళ్లం కాదు. పైసా ఖర్చు చేయకుండా మేం ఎన్నికల్లో గెలిచాం. ఏపీని సూట్‌కేసుల చంద్రబాబు దోచుకున్నారు. మీ పాలనలో అమరావతిలో ఒక్క శాశ్వత భవనం ఎందుకు కట్టలేదు. సుజనా చౌదరి పార్టీ మారినా...చంద్రబాబు కోవర్టుగా పని చేస్తున్నారు. చనిపోతున్న టీడీపీని బతికించుకునేందుకు బీజేపీలో చేరారు. పోలవరం కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. బ్యాంకులను మోసం చేసిన చౌదరి నీతులు చెప్పడం మానుకో. అరెస్ట్‌ల భయంతో బీజేపీ నేతల కాళ్లు మొక్కి ఆ పార్టీలో చేరారు. జైలుకు వెళ్లకుండా నిన్ను నువ్వ కాపాడుకో. మా మీద ఫోకస్ కాకుండా నీ పని చూసుకో. తమతో టచ్‌లో ఉన్నారని అవాకులు చెవాకులు పేలితే తీవ్ర పరిణామాలు తప్పవు. పేదవాడికి టికెట్ ఇచ్చి గెలిపించిన నాయకుడు వైఎస్ జగన్. ఆయన ఆశయ సాధనకు పని చేస్తాం’ అని తెలిపారు. -
చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది!
సాక్షి, చిత్తూరు : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోరు అదుపులో పెట్టుకోవాలని చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప హెచ్చరించారు. రామకుప్పం మండలంలోని బగళనత్తం, ఉన్సిగానిపల్లి గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు రాజకీయ జీవితం హత్యా రాజకీయాల నుంచి ప్రారంభమైందని, వెన్నుపోటు రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారన్నారు. అలాంటి రాజకీయ నేపథ్యం ఉన్న ఆయన పెద్దిరెడ్డి కుటుంబాన్ని విమర్శించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. పింగళి దశరథరామయ్య, వంగవీటి మోహనరంగా, మాధవ రెడ్డి, బాలయోగి తదితర రాజకీయ నాయకుల మరణాలకు గల కారణాలను చంద్రబాబు నాయుడు చెప్పాలని ఎంపీ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పినా ఇంకా బాబుకు బుద్ధిరాలేదన్నారు. టీడీపీ సమీక్షా సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు, మచ్చలేని మనిషి మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం భజన ఎందుకని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీకి చెందిన మంత్రులు, డెప్యూటీ సీఎం, ఎమ్మెల్యేలపై టీడీపీ నిరాధార ఆరోపణలు చేస్తే ప్రజలు హర్షించరని హితవు పలికారు. జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం జోలికి వస్తే ప్రజల ఆగ్రహానికి గురికావల్సి వస్తుందని ఎంపీ హెచ్చరించారు. ఇక ఇసుక సమస్య పదిరోజుల్లో పరిష్కారమవుతుందన్నారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రమౌళి కుమారుడు భరత్, మండల పార్టీ అధ్యక్షుడు విజలాపురం బాబు రెడ్డి, కో–కన్వీనర్ చంద్రారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రామకృష్ణా రెడ్డి, మాజీ ఎంపీపీ జయప్ప, సిద్ధప్పపాల్గొన్నారు. -
గ్యాస్ లారీ ప్రమాదంలో ఒకరి మృతి
మదనపల్లి శివారులో జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద గ్యాస్ లారీ, ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పుంగనూరు మండలం ఈడిగపల్లి గ్రామానికి చెందిన రెడ్డప్ప(46) అనే వ్యక్తి మృతిచెందాడు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆటోలో ఈడిగపల్లి నుంచి మదనపల్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏనుగుల బీభత్సం
గుడుపల్లె, న్యూస్‌లైన్: మండలంలోని అటవీ సమీప గ్రా మాల్లో శనివారం రాత్రి ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పంట పొలాలను తొక్కి సర్వనాశనం చేశాయి. బోరు పైపులను ధ్వంసం చేశాయి. గ్రామాల మీదకొచ్చి ప్రాణాలు తీస్తాయేమోనని పలువురు భయాందోళనకు గురవుతున్నారు. 20 రోజులుగా మల్లప్పకొండ అటవీ ప్రాంతంలో 24 ఏనుగులు తిష్టవేశాయి. అందులో 15 ఏనుగులు ఓ గ్రూపుగా విడిపోయి కర్ణాటక రాష్ర్టం లోని అటవీ ప్రాంతాలకు వెళ్లిపోయాయి. మిగిలిన ఏనుగులు అక్కడే ఉంటూ అడపాదడపా సమీప గ్రామాల మీదకు దూసుకొస్తున్నాయి. రాత్రి పూట పంట పొలాలను తొక్కి నాశనం చేస్తున్నాయి. శనివారం రాత్రి అటవీ సమీప గ్రామాలైన కోడిగానిపల్లె నుంచి వూలవానికొత్తూరు వరకు సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేశాయి. అయ్యువార్లగొల్లపల్లె సమీపంలోకి రావడంతో కుక్కలు అడ్డుపడ్డాయి. ఓ కుక్కపిల్ల ను తొక్కి చంపేశాయి. అక్కడి నుంచి వూలవానికొత్తూరుకు చేరుకుని రైతు నారాయుణప్ప రాగికుప్పలను ఆరగించాయి. తిమ్మయ్యకు చెందిన బోరు పైపులు, కేసింగ్ పైపు, డ్రిప్ పరికరాలను ధ్వంసం చేశాయి. పక్కనే ఉన్న టమాట పంటనూ తొక్కి నాశనం చేశాయి. *2 లక్షల మేర నష్టం వాటిల్లినట్టు రైతు ఆవేదన చెందాడు. బోరులో రాళ్లు పడి ఉంటే మోటారు పనిచేయదని వాపోయాడు. విషయం తెలుసుకున్న కుప్పం అటవీశాఖ ఎఫ్ఆర్వో రెడ్డెప్ప, డీఆర్వో వెంకటరవుణ ధ్వంసమైన పంటలు, బోరును పరిశీలించారు. నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు.