మదనపల్లి శివారులో జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద గ్యాస్ లారీ, ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పుంగనూరు మండలం ఈడిగపల్లి గ్రామానికి చెందిన రెడ్డప్ప(46) అనే వ్యక్తి మృతిచెందాడు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆటోలో ఈడిగపల్లి నుంచి మదనపల్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గ్యాస్ లారీ ప్రమాదంలో ఒకరి మృతి
Published Sun, Apr 10 2016 1:03 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
Advertisement
Advertisement