చిత్తూరు: కుప్పం–పలమనేరు జాతీయ రహ దారి కడపల్లె వద్ద శుక్రవారం మోటార్ సైకిల్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. రాళ్లబూదుగూరు పోలీసుల కథనం మేరకు.. కెనమాకులపల్లె పంచాయతీ బోయనపల్లెకు చెందిన శివరాం(22) మోటార్ సైకిల్‌పై సొంతపనిగా కుప్పం వెళ్లాడు. తిరిగి వస్తుండగా గ్రామానికి చెందిన లోకేష్(23) కనిపించడంతో బైక్‌లో ఎక్కించుకున్నాడు.
కుప్పం వైపు నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. కడపల్లె సమీపంలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాల వద్ద మోటార్‌బైక్‌ను ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో తలకు తీవ్ర గాయాలైన శివరాం అక్కడిక్కడే మృతి చెందాడు. లోకేష్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రయాణికుల సమాచారంతో నిమిషాల్లో ప్రమాద స్థలానికి వచ్చిన 108 అంబులెన్స్ ద్వారా లోకే ష్‌ను కుప్పం పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లోకేష్ కూడా ప్రాణాలు విడిచాడు.
రెండు కుటుంబాల్లో తీరని వ్యధ
ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న బోయనపల్లెకు చెంది న నాగభూషణం, చెంగమ్మలకు శివరా రం కుమారు డు. కుమా ర్తెకు పెళ్లి చేసి పంపేశారు. చదువు అబ్బక పోవడంతో మూడు నెలల కిందట శివారంకు ఫైనాన్సులో ఆటోను కొనిచ్చారు. శుక్రవారం మోటార్‌బైక్‌లో కుప్పం వెళ్లి వస్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.
ప్రమాద స్థలంలో శివరాం మృతదేహం వద్ద తమ ఇంటి దీపం ఆరిపోయిందంటూ కన్న వారు, బంధువుల రోదనలు మిన్నంటాయి. అదే గ్రామానికి చెందిన మురుగన్, సుమతిల కుమా రుడు లోకేష్ డిగ్రీ చదువుతున్నాడు. కుప్పంలో పరీ క్ష ముగించుకుని గ్రామానికి చెందిన శివరాం తారస పడడంతో కలిసి మోటార్ సైకిల్‌పై ఇంటికి బయలుదేరి ప్రమాదంతో మృత్యుఒడిలోకి చేరాడు.
Comments
Please login to add a commentAdd a comment