
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో చెట్ల కింద కూర్చొని ప్రజలకు సిగ్గులేదంటూ పాటలు పాడేవారికి ప్రజల విలువ తెలియదని, నియో జకవర్గానికి వెళితే ప్రజల విలువ తెలుస్తుందని వైఎస్సార్‌సీపీ ఎంపీలు నందిగం సురేష్, రెడ్డెప్ప వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో మంగళవారం వారు మీడియాతో మాట్లాడారు. దొంగలా బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసులు ఇస్తే తనకేదో అయిపోయినట్లు భావించే వారికి త్వరలోనే బుద్ధి చెబుతామన్నారు.
రాజధాని ప్రాంతంలో చంద్రబాబు చేసిన మోసాలు, అక్ర మాలకు నోటీసులు ఇస్తే రఘురామకృష్ణరాజు భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశా రు. వీధికుక్కలా మొరిగేవారిని మీడియా పట్టిం చుకోవడం సరికాదన్నారు. చంద్రబాబు ఎప్పు డు జైలుకు వెళ్తారా? పగ్గాలు అందుకుందామని లోకేశ్ ఆరాటపడుతున్నట్లుగా ఉందన్నారు. రఘురామకృష్ణరాజుకు ఢిల్లీ నడిబొడ్డున సమా ధానం చెప్పగలమన్నారు. కుప్పంలో గెలుస్తా మని చెప్పి గెలిచామని మరోసారి ఎన్నికలు వస్తే ప్రస్తుతం కన్నా ఎక్కువ శాతం సీట్లతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.