
సాక్షి, న్యూఢిల్లీ: నియోజకవర్గానికి కూడా వెళ్ల లేక ఢిల్లీలోనే కూర్చుంటున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సాయంత్రం పూట పిట్టకథలు, జోస్యం చెప్పుకోవచ్చని వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేశ్ హితవు పలికారు. రాష్ట్రంలో ఏ ప్రాంతం ఎక్కడుందో తెలియని వ్యక్తి ఇతరుల గురించి జోస్యం చెప్ప డం కన్నా తన భవిష్యత్తు తెలుసుకోవడం మంచిదన్నారు. ఢిల్లీలో ఏపీ భవన్ వద్ద శుక్రవారం ఎంపీ సురేశ్ మీడియాతో మాట్లాడా రు. ‘రాజధాని ప్రాంతంలో ఏమున్నాయో తెలియని పరిస్థితిలో ఉన్న వ్యక్తిని చూస్తుంటే జాలి వేస్తోంది.
చేసిన తప్పులకు అడ్డదారిలో స్టేలు తెచ్చుకొన్నప్పటికీ నియోజకవర్గానికి వెళ్లడానికి భయపడుతున్నారు. సాయంత్రం వేళ చిలక, పేకముక్కలతో జ్యోతిష్యం చెప్పుకో వచ్చు. దళితులు ఎవరితోనూ మాట్లాడకూడ దంటున్న ఆ వ్యక్తికి అసలు మానవత్వం, విలు వలు ఉన్నాయా? పతనానికి ముందు గర్వం నడుస్తుందన్న మాటలు ఆ వ్యక్తికే సరిగ్గా సరిపో తాయి. అమరావతిలో భూములు కొల్లగొట్టిన దాంట్లో ఆయన పాత్ర ఉందేమో అన్న అను మానం వస్తోంది..’ అని సురేశ్ పేర్కొన్నారు.