
సాక్షి, ఢిల్లీ: రాష్ట్రంలో పలు రైల్వే అభివృద్ధి పనులకు సహకరించాలని కేంద్రాన్ని కోరామని వైఎస్సార్‌సీపీ ఎంపీ రెడ్డప్ప తెలిపారు. సోమవారం ఆయన రైల్వే స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కడప- బెంగుళూరు, చిత్తూరు-బెంగుళూరు మార్గాలకు ఇప్పటి వరకు నిధులు కేటాయించలేదని వెంటనే నిధులు కేటాయించాలని కోరినట్లు ఆయన తెలిపారు.
కుప్పం నియోజకవర్గంలో అండర్ బ్రిడ్జి లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. వెంటనే బ్రిడ్జి నిర్మించాలని కోరామన్నారు. చిత్తూరు రైల్వేస్టేషన్‌లో అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. అమరావతి నుంచి ఢిల్లీకి రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలును కేటాయించాలని అడిగామన్నారు. విశాఖ రైల్వే జోన్ పనులు వేగవంతం చేయాలని కూడా ప్రస్తావించామని ఎంపీ రెడ్డప్ప పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment