
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్‌సీపీ చిత్తూరు ఎంపీ రెడ్డెప్పను రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి శనివారం పరామర్శించారు. ఎంపీ రెడ్డప్ప ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు రావడంతో ఆయన్ను ఢిల్లీలోని ఫోర్టీస్ హాస్పిటల్లో చేర్పించారు. ఆయనకు వైద్యులు గుండె ఆపరేషన్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment