ఏడాదికి ఇక 12 సబ్సిడీ సిలిండర్లు | Cap on subsidised LPG cylinders raised to 12 | Sakshi
Sakshi News home page

ఏడాదికి ఇక 12 సబ్సిడీ సిలిండర్లు

Published Thu, Jan 30 2014 3:26 PM | Last Updated on Sat, Sep 2 2017 3:11 AM

ఏడాదికి ఇక 12 సబ్సిడీ సిలిండర్లు

ఏడాదికి ఇక 12 సబ్సిడీ సిలిండర్లు

గృహ వినియోగదారులకు సబ్సిడీ మాద ఇచ్చే గ్యాస్ సిలిండర్ల సంఖ్యను 9 నుంచి 12కు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయించింది. దేశంలోని దాదాపు 99 శాతం మంది ప్రజలు సబ్సిడీ మీద అందే గ్యాస్ సిలిండర్లనే ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం కాస్త ఉపశమనం కలిగించే అవకాశం కనిపిస్తోంది.

ఈనెల 17వ తేదీన జరిగిన ఏఐసీసీ సమావేశంలో రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ప్రస్తావించడంతో సబ్సిడీ సిలెండర్ల సంఖ్య విషయంలో సర్కారు ఆఘమేఘాల మీద స్పందించింది. ''ప్రధానమంత్రి గారూ మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏడాదికి 9 సిలిండర్లు చాలవు. దేశ మహిళలు తమకు కనీసం 12 సిలిండర్లు కావాలని అడుగుతున్నారు'' అంటూ రాహుల్ గాంధీ ఏఐసీసీ సమావేశంలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సమావేశం ముగియగానే వీరప్ప మొయిలీ విలేకరులతో మాట్లాడుతూ, కేంద్ర కేబినెట్ త్వరలోనే ఈ విషయమై నిర్ణయం తీసుకోనుందని చెప్పారు. అదే నిర్ణయం ఇప్పుడు వెల్లడైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement