ముంబై: విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ కాలంలో 43 లక్షల మందిని వారి గమ్యస్థానాలకు చేర్చినట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. 20 విమానాలతో వారంలో 900లకుపైగా సరీ్వసుల మైలురాయిని దాటినట్టు వెల్లడించింది. 2023 డిసెంబర్ నుంచి విదేశాలకూ సరీ్వసులను నడపనున్నట్టు ఇప్పటికే ఆకాశ ఎయిర్ తెలిపింది. దేశీయ విమానయాన రంగంలో సంస్థకు 4.9 శాతం వాటా ఉంది. ‘2022 ఆగస్ట్ 7న తొలి విమానం ముంబై నుంచి అహ్మదాబాద్‌లో అడుగుపెట్టింది.
16 నగరాలను అనుసంధానిస్తూ 35 రూట్లలో విమానాలు నడుస్తున్నాయి. సంస్థకు చెందిన విమానాల ద్వారా 25,000 టన్నులకు పైచిలుకు కార్గో రవాణా జరిగింది’ అని వివరించింది. ఇప్పటికే ఆకాశ ఎయిర్ 152 విమానాలకు ఆర్డర్లు ఇచి్చంది. వీటికి అదనంగా 2023 చివరినాటికి మూడంకెల స్థాయిలో విమానాలకు ఆర్డర్ ఇవ్వనున్నట్టు ధీమా వ్యక్తం చేసింది. శిక్షణ కోసం పెట్టుబడి చేస్తామని, దేశంలోని ప్రధాన నగరాల్లో లెరి్నంగ్ కేంద్రాలను నెలకొల్పుతామని తెలిపింది. ఆకాశ ఎయిర్‌ను ఎస్‌ఎన్‌వీ ఏవియేషన్ ప్రమోట్ చేస్తోంది. జెట్ ఎయిర్‌వేస్ మాజీ సీఈవో వినయ్ దూబే, ఇతరులు ఈ కంపెనీలో పెట్టుబడి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment