one year compleate
-
సునాక్ పాలనకు ఏడాది
లండన్: భారతీయ మూలాలున్న రిషీ సునాక్ బ్రిటన్ ప్రధాన మంత్రిగా పగ్గాలు చేపట్టి బుధవారంతో ఏడాది పూర్తి చేసుకున్నారు. అయితే వార్షికోత్సవ సంబరాల వంటివాటికి దూరంగా రోజంతా ఆయన రోజువారీ అధికారిక విధుల్లోనే గడపడం విశేషం. 43 ఏళ్ల సునాక్ సరిగ్గా ఏడాది కింద ఎన్నో సవాళ్ల నడుమ ప్రధాని కావడం తెలిసిందే. ఆ పదవి చేపట్టిన తొలి భారత మూలాలున్న వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. ‘ఏడాదిలో ఎంతో సాధించాం. కానీ సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది’ అంటూ సోషల్ మీడియాలో ఆయన వీడియో పోస్ట్ చేశారు. అధికార కన్సర్వేటివ్ పార్టీ చైర్మన్ గ్రెగ్ హ్యాండ్స్ సైతం రిషి పాలనను ఈ సందర్భంగా ప్రశంసించారు. -
ఆకాశ ఎయిర్.. ఏడాది పూర్తి
ముంబై: విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ కాలంలో 43 లక్షల మందిని వారి గమ్యస్థానాలకు చేర్చినట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. 20 విమానాలతో వారంలో 900లకుపైగా సరీ్వసుల మైలురాయిని దాటినట్టు వెల్లడించింది. 2023 డిసెంబర్ నుంచి విదేశాలకూ సరీ్వసులను నడపనున్నట్టు ఇప్పటికే ఆకాశ ఎయిర్ తెలిపింది. దేశీయ విమానయాన రంగంలో సంస్థకు 4.9 శాతం వాటా ఉంది. ‘2022 ఆగస్ట్ 7న తొలి విమానం ముంబై నుంచి అహ్మదాబాద్‌లో అడుగుపెట్టింది. 16 నగరాలను అనుసంధానిస్తూ 35 రూట్లలో విమానాలు నడుస్తున్నాయి. సంస్థకు చెందిన విమానాల ద్వారా 25,000 టన్నులకు పైచిలుకు కార్గో రవాణా జరిగింది’ అని వివరించింది. ఇప్పటికే ఆకాశ ఎయిర్ 152 విమానాలకు ఆర్డర్లు ఇచి్చంది. వీటికి అదనంగా 2023 చివరినాటికి మూడంకెల స్థాయిలో విమానాలకు ఆర్డర్ ఇవ్వనున్నట్టు ధీమా వ్యక్తం చేసింది. శిక్షణ కోసం పెట్టుబడి చేస్తామని, దేశంలోని ప్రధాన నగరాల్లో లెరి్నంగ్ కేంద్రాలను నెలకొల్పుతామని తెలిపింది. ఆకాశ ఎయిర్‌ను ఎస్ఎన్వీ ఏవియేషన్ ప్రమోట్ చేస్తోంది. జెట్ ఎయిర్వేస్ మాజీ సీఈవో వినయ్ దూబే, ఇతరులు ఈ కంపెనీలో పెట్టుబడి చేశారు. -
Russia-Ukraine war: ఒక దురాక్రమణకు, తలవంచని తెగువకు..ఏడాది
ఏడాది క్రితం.. 2022 ఫిబ్రవరి 24... ప్రపంచం ఎన్నటికీ మర్చిపోలేని రోజు. పొరుగు దేశం ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగిన రోజు. రష్యా అపార సాయుధ సంపత్తి ముందు ఉక్రెయిన్ నిలవలేదని, దాని ఓటమితో రోజుల వ్యవధిలోనే యుద్ధం ముగుస్తుందని అంతా భావించారు. దాదాపు ఏడాది గడిచాక... పసికూనగా భావించిన ఉక్రెయిన్ పట్టువీడకుండా తెగించి పోరాడుతూనే ఉంది. పాశ్చాత్య దేశాల సాయుధ, ఆర్థిక సాయం దన్నుతో రష్యాను దీటుగా ఎదిరిస్తోంది. పలు ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యా సేనలను తరిమికొడుతూ మరిచిపోలేని పరాభవాలను పుతిన్‌కు రుచి చూపిస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధం ఇప్పుడప్పుడే ముగిసే సూచనలు ఏమాత్రం కన్పించడం లేదు. ఎంతకాలమైనా ఉక్రెయిన్‌కు మద్దతిస్తూనే ఉంటామని అమెరికా అధ్యక్షుడు బైడెన్, రష్యా ఉనికిని కాపాడుకోవడమే లక్ష్యంగా ఎంత దూరమైనా వెళ్తామంటూ పుతిన్ చేసుకున్న తాజా హెచ్చరికలు దీన్ని మరింత బలపరుస్తున్నాయి. ఉక్రెయిన్, రష్యాలనే గాక ప్రపంచ దేశాలన్నింటినీ యుద్ధం తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఐరోపా ఖండంలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరుగుతున్న అతిపెద్ద ఘర్షణ కూడా ఇదే. తొలిసారేమీ కాదు.. ఉక్రెయిన్, రష్యా మధ్య ఘర్షణలు ఇదే తొలిసారేమీ కాదు. వెయ్యేళ్ల చరిత్ర, 4.4 కోట్ల జనాభా ఉన్న ఉక్రెయిన్ ఒకప్పుడు సోవియట్ యూనియన్(యూఎస్ఎస్ఆర్)లో అంతర్భాగమే. సోవియట్ పతనానంతరం 1990ల్లో స్వతంత్ర దేశంగా అవతరించింది. పశ్చిమ దేశాల కుట్రల వల్లే ఉక్రెయిన్ తమకు దూరమైందని రష్యా ద్వేషం పెంచుకుంది. పాశ్చాత్య దేశాల చేతుల్లో ఉక్రెయిన్ కీలుబొమ్మ అని పుతిన్ తరచుగా విమర్శిస్తుంటారు. ఉక్రెయిన్ కృత్రిమంగా ఏర్పడ్డ దేశమని, నిజానికి అది, రష్యా ఒకే తల్లి బిడ్డలని ఆయన వాదిస్తుంటారు. రెండు దేశాలను ఎలాగైనా ఒక్కటి చేయాలన్నదే పుతిన్ ఆశయం. అందులో భాగంగానే 2014లో ఉక్రెయిన్‌కు చెందిన క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా ఆక్రమించింది. ఆ ఘర్షణలో ఇరువైపులా వేలాది మంది మరణించారు. మరోవైపు ఉక్రెయిన్‌లో గణనీయంగా ఉన్న రష్యన్ మాట్లాడే ప్రజలు రష్యాకు మద్దతుగా తిరుగుబాటుకు దిగారు. పరిస్థితి చెయ్యి దాటిపోతుండడం, రష్యా నుంచి ముప్పు పెరుగుతుండటంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పశ్చిమ దేశాల సాయం కోరారు. రష్యా బారినుంచి కాపాడేందుకు తమను తక్షణం నాటో కూటమిలో చేర్చుకోవాలన్న ఆయన విజ్ఞప్తికి సానుకూలత వ్యక్తమైంది. అదే జరిగితే నాటో సేనలు ఏకంగా రష్యా సరిహద్దుల్లో తిష్టవేసే ఆస్కారముండటం అధ్యక్షుడు పుతిన్‌కు ఆగ్రహం కలిగించింది. వెంటనే రంగంలోకి దిగి 2021 నవంబర్ నాటికే ఉక్రెయిన్ సరిహద్దులకు భారీగా సైన్యాన్ని తరలించారు. 2022 ఫిబ్రవరికల్లా దాన్ని లక్షకు పెంచి తీవ్ర ఉద్రిక్తతలకు తెర తీశారు. ఉక్రెయిన్‌పై దాడి తప్పదన్న వార్తల నడుమ, తీవ్ర పరిణామాలు, కఠిన ఆంక్షలు తప్పవని అమెరికా హెచ్చరించింది. తమకలాంటి ఉద్దేశం లేనే లేదంటూనే ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై పుతిన్ సైన్యం మూడువైపుల నుంచీ విరుచుకుపడింది. శిథిల చిత్రంగా ఉక్రెయిన్ రష్యా దాడుల ధాటికి ఉక్రెయిన్ సర్వం కోల్పోయి శిథిలచిత్రంగా మిగిలింది. ఎక్కడ చూసినా కూలిన భవనాలు, మృతదేహాలతో మరుభూమిని తలపించింది. ఐక్యరాజ్యసమితికి శరణార్థుల హై కమిషనర్ విడుదల చేసిన గణాంకాల ప్రకారమే 2023 జనవరి 15 నాటికి రష్యా దాడుల్లో 7,000కు పైగా ఉక్రెయిన్ పౌరులు మరణించారు. 11 వేలకు పైగా క్షతగాత్రులయ్యారు. వాస్తవానికి కనీసం 50 వేల మందికి పైగా అమాయక పౌరులు యుద్ధానికి బలయ్యారని, లక్షలాది మంది గాయపడ్డారని అంచనా. 80 లక్షల మందికిపైగా ఉక్రెయిన్ పౌరులు శరణార్థులుగా ఇతర దేశాలకు వలసవెళ్లారు. వారంతా కట్టుబట్టలతో ఇల్లూ వాకిలీ వదిలి తరలిపోతున్న దృశ్యాలు మానవతకే తీరని మచ్చగా మిగిలాయి. మరో 60 లక్షల మంది స్వదేశంలోనే నిరాశ్రయులయ్యారు. రష్యా అతలాకుతలం రష్యా కూడా ఉక్రెయిన్ చేతిలో అవమానకర ఎదురుదెబ్బలు మినహా ఇప్పటిదాకా ఇప్పటిదాకా బావుకున్నదేమీ లేదు. పైపెచ్చు యుద్ధం వల్ల రష్యా ఆర్థిక వ్యవస్థ ఎన్నడూ లేనంతగా దిగజారింది. అమెరికా, పాశ్చాత్య దేశాల తీవ్ర ఆర్థిక ఆంక్షలతో పూర్తిగా స్తంభించి కుదేలైంది. ఆర్థిక వృద్ధి నేలచూపులు చూస్తోంది. అంతర్జాతీయ సంస్థలన్నీ దేశం వీడాయి. చమురు మినహా ఎగుమతులు, దిగుమతులు పూర్తిగా పడకేశాయి. ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరలు చుక్కలనంటి సామాన్యుల బతుకు దుర్భరంగా మారింది. దాంతో యుద్ధంపై రష్యాలోనే తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఎన్నడూ లేని రీతిలో పౌరులు బాహాటంగానే ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. వేలాదిగా అరెస్టులు జరిగినా వెరవకుండా ఆందోళనలు చేశారు. దేశాల్లో ఆకలి కేకలు గోధుమలు, మొక్కజొన్న ఎగుమతిలో అగ్రస్థానాన ఉన్న రష్యా, ఉక్రెయిన్ నుంచి యుద్ధం కారణంగా తిండి గింజల సరఫరా పూర్తిగా నిలిచిపోయి 50కి పై చిలుకు దేశాలు తీవ్ర ఆహార కొరత బారిన పడి అల్లాడుతున్నాయి. అంతేగాక అటు సంపన్న, ఇటు భారత్ వంటి వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలు యుద్ధం వల్ల ఎంతగానో దెబ్బ తిన్నాయి. సాహసి... జెలెన్స్కీ రష్యాకు ఎదురొడ్డి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మొక్కవోని ధైర్య సాహసాలు ప్రదర్శించారు. తనను హతమార్చేందుకు జరిగిన ప్రయత్నాలను కాచుకున్నారు. సురక్షితంగా తప్పిస్తామంటూ అమెరికా ముందుకొచ్చినా కాదన్నారు. సైన్యంతో కలివిడిగా తిరుగుతూ వారిలో స్థైర్యం నింపారు. ప్రపంచ దేశాలను సాయం కోరుతూ ప్రతి అంతర్జాతీయ వేదిక మీదా రష్యాను దునుమాడుతూ సాగారు. పూర్వాశ్రమంలో సినిమాల్లో కమేడియన్‌గా చేసినా నిజ జీవితంలో మాత్రం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో తిరుగులేని నాయకత్వ లక్షణాలు ప్రదర్శించి హీరో అనిపించుకున్నారు. ఎవరికెంత నష్టం? యుద్ధంలో విజేతలు ఎవరో ఇప్పటిదాకా తేలకపోయినా ఇరు దేశాలు మాత్రం కనీవినీ ఎరుగని స్థాయిలో నష్టాన్ని చవి చూశాయి. లక్షల సంఖ్యలో సైనికులను, వేల సంఖ్యలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, యుద్ధ ట్యాంకులు, నౌకలను కోల్పోయాయి. ఏ దేశం ఎవరి వైపు... అమెరికా బ్రిటన్ సహా 30 నాటో సభ్య దేశాలు యుద్ధంలో ఉక్రెయిన్‌కు పూర్తిగా వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. భారీగా ఆయుధ, ఆర్థిక సాయం చేస్తూ వస్తున్నాయి. వీటితో పాటు మరెన్నో దేశాలు రష్యా దాడిని ఖండించి ఉక్రెయిన్‌కు నైతిక మద్దతు ప్రకటించాయి. ఇక రష్యాకు ప్రధానంగా పొరుగు దేశమైన బెలారస్ తొలినుంచీ గట్టి మద్దతుదారుగా ఉంది. చైనాతో పాటు ఉత్తర కొరియా, క్యూబా, వెనెజువెలా, ఇరాన్, సిరియా, కిర్గిస్తాన్ కూడా రష్యాకు మద్దతు ప్రకటించాయి. యూఏఈ, సౌదీ అరేబియా తటస్థంగా నిలిచినా రష్యా దాడిని ఖండించేందుకు తిరస్కరించాయి. యుద్ధానికి తక్షణం ముగింపు పలికి చర్చలు, మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలన్నది తొలినుంచీ భారత్ వైఖరిగా ఉంది. యుద్ధంలో కీలక మలుపులు ఫిబ్రవరి: 24న యుద్ధం ప్రారంభం. ఉక్రెయిన్ నిస్సైనికీకరణకు సైనిక చర్య ముసుగులో తూర్పు, ఉత్తర, దక్షిణాల నుంచి రష్యా ముప్పేట దాడి. మార్చి: ఖెర్సన్ నగరం స్వాధీనమైందన్న రష్యా. యూరప్‌లోకెల్లా పెద్దదైన జపోరిజియా అణు విద్యుత్కేంద్రం ఆక్రమణ. కీవ్ శివార్లలో ఉక్రెయిన్ డ్రోన్ల దాడిలో అపార నష్టం ధాటికి రష్యా సేనల పలాయనం. రష్యాపై అమెరికా, యూరప్ దేశాల భారీ ఆర్థిక, తదితర ఆంక్షలు. ఏప్రిల్: కీవ్, బుచాల్లో వందలాది పౌరులను రష్యా సైన్యం చిత్రహింసల పాలు చేసి చంపినట్టు వెల్లడి. రష్యాపై యుద్ధ నేరాల అభియోగాలు మోపాలంటూ ప్రపంచవ్యాప్తంగా డిమాండ్లు. ఉక్రెయిన్ సైన్యం ఎదురుదాడి. రష్యా యుద్ధ నౌక మాస్క్వాను క్షిపణి దాడితో నల్లసముద్రంలో ముంచి సంబరాలు చేసుకున్న ఉక్రెయిన్. మే: మారియుపోల్‌ను పూర్తిగా ఆక్రమించుకున్న రష్యా. రష్యా దూకుడు పట్ల ఆందోళనతో నాటోలో చేరుతామంటూ దరఖాస్తు చేసుకుని పుతిన్‌కు షాకిచ్చిన ఫిన్లండ్, స్వీడన్. జూన్: ఉక్రెయిన్ దాడుల దెబ్బకు యుద్ధం మొదట్లో నల్లసముద్రంలో ఆక్రమించిన స్నేక్ ఐలాండ్ నుంచి వైదొలిగిన రష్యా సేనలు. జూలై: ప్రపంచ ఆహార భద్రత దృష్ట్యా ఉక్రెయిన్ రేవు పట్టణాల నుంచి ఆహార ధాన్యాల సరఫరా. ఆగస్టు: క్రిమియాపై ఉక్రెయిన్ దాడుల్లో తీవ్రంగా దెబ్బ తిన్న రష్యా వైమానిక స్థావరాలు, ఆయుధాగారాలు. సెప్టెంబర్: ఖర్కీవ్‌లో ఆకస్మిక దాడులతో రష్యా దళాలను తరిమికొట్టిన ఉక్రెయిన్ సైన్యం. రిఫరెండం ముసుగులో డొనెట్స్క్, లుహాన్స్క్, ఖెర్సన్, జపోరిజియా ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకుంటున్నట్టు పుతిన్ ప్రకటన. అక్టోబర్: క్రిమియాను రష్యాతో కలిపే కీలక బ్రిడ్జిని పేల్చేసిన ఉక్రెయిన్. నవంబర్: రష్యాకు పరాభవం. దాడులకు తాళలేక ఖెర్సన్ నగరం నుంచి పుతిన్ సేనల పలాయనం. డిసెంబర్: రష్యాలోని సరిహద్దు ప్రాంతాలు, పట్టణాలు, నగరాలపై దాడులు, భారీ నష్టం. 2023 జనవరి: మకీవ్కాలో క్షిపణి దాడులతో వందలాది మంది రష్యా సైనికులను మట్టుబెట్టామన్న ఉక్రెయిన్. 89 మంది మరణించారన్న రష్యా. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తిరుగుబాటుకు ఏడాది పూర్తి.. వేల మంది బలిదానం!
అనూహ్యంగా మొదలైన సైన్యం తిరుగుబాటు పరిణామాలతో.. ఏడాదిగా పౌరుల వ్యతిరేక నిరసనలు కొనసాగుతూనే వస్తున్నాయి. ఈ నిరసనల్లో చెలరేగిన హింసతో వేలమంది బలికాగా.. కొన్ని వేలమందిని నిర్భంధానికే పరిమితం చేసింది సైన్యం. ఇక ఈ పరిస్థితులు కొనసాగుతుండగా.. మయన్మార్ సంక్షోభం గురించి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయం అధికారికంగా ఒక నివేదిక విడుదల చేసింది. ఏడాదిపాటుగా మయన్మార్‌లో కొనసాగుతున్న సంక్షోభంపై ఐరాస మంగళవారం అధికారికంగా స్పందించింది. ఈ ఏడాది కాలంలో పదిహేను వందల మంది బలికాగా.. 11, 782 మందిని చట్టాన్ని అతిక్రమించి సైన్యం నిర్భంధించిందని, వీళ్లలో 8,792 మంది ఇంకా నిర్భంధంలోనే ఉన్నారని ఐరాస మానవ హక్కుల విభాగం ప్రతినిధి రవీనా శమ్దాసానీ తెలిపారు. అయితే మయన్మార్‌లో పాలక జుంటా సైన్యం.. హక్కుల సంఘాలు విడుదల చేసిన మరణాల సంఖ్యను ఖండించిన విషయం తెలిసిందే. జెనీవాలోని జరిగిన యూఎన్ సమావేశంలో ఏకపక్ష నిర్బంధాల గణాంకాలపై శమ్సదానీ వివరణ ఇచ్చారు. ఏడాది కాలంగా సైన్యానికి వ్యతిరేకంగా వినిపిస్తున్న నిరసన ఇది. శాంతియుత ప్రదర్శనలు, ఆన్లైన్ ద్వారా తమ నిరసన గళం వినిపిస్తున్నారు. కానీ, ప్రాణ నష్టం తప్పలేదు. చంపబడ్డ 1,500 మందిని మేం డాక్యుమెంట్ చేశాం. అయితే ఇది నిరసనల సందర్భంలో మాత్రమే’’ అని శామ్సదానీ వివరించారు. వీళ్లలో 200 మంది మిలిటరీ కస్టడీలో వేధింపుల ద్వారానే చనిపోయారు అని ఆమె ధృవీకరించారు. ఈ 1,500 మందిలో సాయుధ పోరాటం కారణంగా మరణించిన వ్యక్తులను చేర్చలేదు! ఎందుకంటే మరణించిన వాళ్లు వేలల్లో ఉన్నారని మేము అర్థం చేసుకోగలం’ ఆమె భావోద్వేగంగా ప్రసంగించారు. ఇదిలా ఉంటే ఫిబ్రవరిలో ఉవ్వెత్తున ఎగిసిన మయన్మార్ సైన్య దురాగతాలు.. వేలమంది పౌరులను బలిగొనడంతో పాటు ఆంక్షలతో, కఠిన నిర్భంధాలతో ఇబ్బందులు పెడుతూ వస్తోంది. మరోవైపు గత పాలకులపైనా సైన్యం ప్రతీకారం కొనసాగుతూ వస్తోంది. ఆంగ్‌సాన్ సూకీతోపాటు పలువురు నేతలను నిర్బంధంలో ఉంచి సైన్యం పలు అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే. -
జనతా కర్ఫ్యూకి ఏడాది
న్యూఢిల్లీ: ప్రపంచంపై విరుచుకుపడుతున్న కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో భాగంగా భారతదేశం జనతా కర్ఫ్యూ పాటించి నేటికి సరిగ్గా సంవత్సరం. మార్చి 22 ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత సంవత్సరం మార్చి 19న ప్రకటించారు. ఆ రోజు ఇళ్ల నుంచి ఎవరు బయటకు రావద్దని, ఇది రానున్న రోజులకు సిద్ధమవడం, స్వీయ నియంత్రణ అలవాటు చేసుకోవడం వంటిదని పేర్కొన్నారు. అలాగే, ఆ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రజలంతా తమ ఇంటి ముందుకు లేదా బాల్కనీల్లోకి వచ్చి 5 నిమిషాల పాటు చప్పట్లు కొట్టడం కానీ, పళ్లేలపై శబ్దం చేయడం కానీ చేసి కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు తదితర ఫ్రంట్‌లైన్ వారియర్లకు కృతజ్ఞతలు తెలియజేయాలని కోరారు. కచ్చితంగా భౌతిక దూరం పాటించడం అలవాటు చేసుకోవాలని ప్రజలను కోరారు. ప్రధాని పిలుపునకు దేశమంతా స్పందించింది. ఆ రోజు అత్యవసర సేవలు మినహా జనజీవనం స్తంభించింది. దాదాపు అదే సమయంలో, కరోనా వైరస్ వ్యాప్తి చైనాలోని వుహాన్ నుంచి ప్రారంభమైందని తేలింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు అప్పటికే లాక్డౌన్ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అప్పటికి, భారత్‌లో కరోనా వ్యాప్తి తక్కువగానే ఉంది. పరిస్థితి చాలావరకు మెరుగ్గానే ఉంది. అయినప్పటికీ, వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించాలని కేంద్రం నిర్ణయించింది. మార్చి 24 రాత్రి ప్రధాని మోదీ లాక్డౌన్ ప్రకటన చేశారు. మార్చి 25 నుంచి 21 రోజుల పాటు తొలివిడత లాక్డౌన్ ప్రకటించారు. ఎక్కడివారు అక్కడే ఉండిపోవాలని, ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని స్పష్టం చేశారు. నిత్యావసరాలకు మాత్రం మినహాయింపునిచ్చారు. లాక్‌డౌన్‌తో ఒక్కసారిగా జనజీవితం అస్తవ్యస్తమైంది. ఒకవైపు వైరస్ భయం, మరోవైపు, నిలిచిపోయిన జీవనోపాధితో ఆదాయం కోల్పోయి లక్షలాది కుటుంబాలు కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. ఉపాధి సహా వివిధ కారణాలతో స్వస్థలం విడిచినవారు అనూహ్యంగా ఎక్కడివారక్కడ చిక్కుకుపోయారు. పేదలు, సామాన్యులను ఆదుకునేందుకు ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీ సహా పలు కార్యక్రమాలను కేంద్రం ప్రారంభించింది. కరోనా సవాళ్లను ఎదుర్కొనేందుకు ‘కోవిడ్ 19 టాస్క్‌ఫోర్స్’ను ఏర్పాటు చేసింది. కరోనా వైరస్‌తో వచ్చే వ్యాధి ‘కోవిడ్ 19’ బాధితులకు చికిత్స అందించేందుకు దేశవ్యాప్తంగా ఆరోగ్య వసతులను కల్పించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. మరోవైపు, ఉపాధి కోసం ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ వంటి మహా నగరాలకు వచ్చిన వలస కూలీలు అక్కడి నుంచి తమ స్వస్థలాలకు కాలినడకన వెళ్లడం ప్రారంభించారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు కష్టనష్టాలను ఓర్చుకుని వందల కిలోమీటర్ల దూరంలోని సొంతూళ్లకు కాలి నడకన పయనమయ్యారు. ఆ క్రమంలో ఎంతోమంది అభాగ్యులు ప్రాణాలు కోల్పోయారు. అకస్మాత్తుగా లాక్డౌన్ విధించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్‌కు మించిన ప్రత్యామ్నాయం లేదన్న వాదన ప్రారంభమైంది. ముఖ్యంగా, ఆరోగ్య వసతులు అరకొరగా ఉన్న భారత్‌లో ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగితే.. దేశంలోని వైద్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదమున్న నేపథ్యంలో లాక్డౌన్ తప్పనిసరి అని భావించారు. లాక్డౌన్ ప్రకటించేనాటికి భారత్‌లో నమోదైన కరోనా కేసుల సంఖ్య 536. కోవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 10. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం కరోనా విలయ తాండవాన్ని చూస్తున్న వారు.. భారత్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతోందని భయపడ్డారు. కానీ ఇప్పుడు, సంవత్సరం తరువాత, ప్రస్తుత గణాంకాలను పరిశీలిస్తే.. అభివృద్ధి చెందిన చాలా దేశాల కన్నా కరోనాను భారత్ సమర్ధంగా ఎదుర్కొన్న విషయం స్పష్టమవుతుంది. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పాటు, భారతీయుల్లోని సహజసిద్ధ రోగ నిరోధక శక్తి అందుకు కారణంగా విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 70కి పైగా దేశాలకు భారత్ కరోనా వ్యాక్సీన్‌ను పంపిస్తోంది. లాక్‌డౌన్‌తో ప్రజల జీవన విధానంలో, వారి ఆలోచన విధానంలో గణనీయ మార్పు వచ్చింది. ఆరోగ్యంపై శ్రద్ధ, ఆర్థిక ప్రణాళిక అలవాటయ్యాయి. దీంతోపాటు లాక్‌డౌన్‌తో కుదేలయిన భారత ఆర్థిక రంగం.. లాక్డౌన్ ముగిసిన తరువాత, అదే స్థాయిలో పునరుజ్జీవనం దిశగా వేగంగా పరుగులు తీయడం ప్రారంభించింది. -
భరత్ అనే నేను..
కెరటం నాకు ఆదర్శం.. లేచి పడుతున్నందుకు కాదు.. పడినా లేస్తున్నందుకు అంటారు.. జిల్లా కలెక్టర్ నారాయణభరత్‌గుప్త. కష్టాలకు ఎదురొడ్డి అనుకున్న లక్ష్యాన్ని పూర్తిచేశారు. కలెక్టర్ అనే దర్పం లేకుండా.. అందరితో కలిసిపోతున్నారు. ప్రజాసేవకే అంకితమవుతున్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముందుకు సాగుతున్నారు. ఆయన కలెక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. సాక్షి, చిత్తూరు: డాక్టర్ వృత్తిని వదులుకుని ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఐఏఎస్ వైపు అడుగులు వేశారు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్‌గుప్త. అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ఆయన ఉన్నత విద్య అనంతరం ఎంబీబీఎస్ చేశారు. డాక్టర్ వృత్తిలో స్థిరపడ్డారు. డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో చికిత్స కోసం వచ్చే పేదల కష్టాలను చూసి ఐఏఎస్ కావాలని నిర్ణయించుకున్నారు. ఆ వృత్తిని వదులుకుని ఐఏఎస్‌కు శిక్షణ పొందారు. మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించారు. శిక్షణ ముగించుకున్న తరువాత జిల్లాలోని మదనపల్లె సబ్ కలెక్టర్‌గా మొదటి పోస్టింగ్ పొందారు. కలెక్టర్ నారాయణ భరత్‌గుప్తకు జ్ఞాపిక ఇస్తున్న తిరుపతి కమిషనర్ గిరీషా, ఇతర అధికారులు సబ్ కలెక్టర్ నుంచి కలెక్టర్ వరకు జిల్లాలో సబ్ కలెక్టర్‌గా విధుల్లో చేరిన నారాయణభరత్‌గుప్త ప్రస్తుతం ఇదే జిల్లాలో కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కెరీర్ ప్రారంభంలో మదనపల్లె సబ్ కలెక్టర్‌గా, అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, శ్రీశైలం ఈఓగా, రాష్ట్ర పవర్ కార్పొరేషన్ శాఖలో విధులు నిర్వర్తించారు. 2019 జూన్ 6న కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. మూడు పోస్టుల్లో పనిచేసిన ఆయనకు జిల్లాపై మంచి పట్టు ఉంది. చదవండి: ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటర్‌కు నోటీసులు మృధు స్వభావి కలెక్టర్ అనే దర్పం లేదు. అందరితోనూ కలిసిపోయే స్వభావం. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తిగా, మృధు స్వభావిగా భరత్‌గుప్త పేరు తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా జిల్లాలో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారు. రెండు నెలలుగా జిల్లాలో కరోనా విపత్కర పరిస్థితి నెలకొంది. జిల్లా ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా ఆయన నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రెడ్జోన్లలో కలియతిరుగుతున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన ప్రాంతాలకు వెంటనే చేరుకుని అక్కడ అధికారికంగా చేపట్టాల్సిన చర్యలపై దగ్గరుండి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెబుతున్నారు. కరోనా కట్టడికి విశేషంగా కృషి చేస్తున్నారు. ఆయన విధుల్లో చేరి శనివారంతో ఏడాది పూర్తయ్యింది. జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) మార్కండేయులు, జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) చంద్రమౌళి, తిరుపతి మునిసిపల్ కమిషనర్ గిరీషా, ట్రైనీ కలెక్టర్ విష్ణుచరణ్, చిత్తూరు మునిసిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, పుంగనూరు మునిసిపల్ కమిషనర్ వర్మ, పలువురు జిల్లా అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
గ్లోబల్ లీడర్‌గా భారత్!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా శనివారం దేశ పౌరులకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖను హిందీలో చదివి వినిపించి తన ట్విటర్ అకౌంట్లో పోస్టు చేశారు. కోవిడ్–19పై పోరాటంలో విజయం వైపుగా భారత్ ప్రయాణిస్తోందని ఆత్మవిశ్వాసంతో చెప్పారు. భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదగాలన్న కల సాకారమయ్యే రోజు ఎంతో దూరంలో లేదన్న మోదీ తన లేఖలో గత ఏడాది పాలనాకాలంలో సాధించిన విజయాలను, ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను, కరోనా గడ్డు పరిస్థితుల్లోనూ భారత్ చేస్తున్న పోరాటాన్ని ప్రస్తావించారు. మోదీ లేఖలోని కొన్ని ముఖ్యమైన అంశాలు.. ఎన్నో సమస్యలకు పరిష్కారం ‘గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో మా గెలుపు భారత ప్రజాస్వామ్య చరిత్రలో స్వర్ణయుగం. కొన్ని దశాబ్దాల తర్వాత పూర్తి స్థాయి మెజార్టీతో వరసగా రెండో సారి ఒకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన శుభ సమయం. భారత్‌ని అత్యున్నత స్థానంలోకి తీసుకువెళ్లి గ్లోబల్ లీడర్‌గా చూడాలని కలలు కన్న భారతీయులు మమ్మల్ని గెలిపించారు. ఆ కల సాకారం చేసే దిశగా గత ఏడాదిలో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం. ఆర్టికల్ 370 రద్దు ద్వారా జాతి ఐక్యత, సమగ్రతా స్ఫూర్తిని చాటి చెప్పాం. రామజన్మభూమి వివాదానికి సుప్రీంకోర్టు తీర్పు ద్వారా పరిష్కారం లభించడం హర్షణీ యం. అత్యంత అనాగరికమైన ట్రిపుల్ తలాక్ విధానాన్ని చెత్తబుట్టలో పడేశాం. పౌరసత్వ చట్ట సవరణల ద్వారా భారత్ దయాగుణం, కలిసిపోయే తత్వాన్ని తెలియజేశాం’. రైతులు, మహిళలు, యువత సాధికారత ‘మహిళలు, యువత, రైతుల సా«ధికారతకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తాం. పీఎం సమ్మాన్ నిధి పథకం ద్వారా 9 కోట్ల 50 లక్షల మందికిపైగా రైతుల అకౌంట్లలో రూ.72 వేల కోట్లు జమచేశాం. గ్రామీణ భారత్‌లో 15 కోట్ల ఇళ్లకు జల్ జీవన్ మిషన్ ద్వారా స్వచ్ఛమైన మంచినీరు అందించే ప్రయత్నాలు సాగుతున్నాయి. రైతులు, రైతు కూలీలు, అసంఘటిత రంగంలో ఉన్న 60 ఏళ్లు పై బడిన వారికి నెలకి రూ.3 వేలు పింఛన్ ఇవ్వాలని హామీ ఇచ్చాం’ తొలిగిపోతున్న గ్రామీణ, పట్టణ అంతరాలు ‘పట్టణాలు, గ్రామాల మధ్య అంతరాలు తొలగిపోతున్నాయి. పట్టణాల్లో ప్రజల కంటే 10శాతం ఎక్కువగా గ్రామీణ ప్రాంత ప్రజలు ఇంటర్నెట్ను వాడుతున్నారు. స్వయం సహాయక గ్రూపుల్లో 7 కోట్ల మందికిపైగా గ్రామీణ మహిళలకు ఆర్థికంగా అండగా ఉంటున్నాం. ఇన్నాళ్లూ రూ.10 లక్షల రుణ పరిమితిని రూ.20 లక్షలకు పెంచాం. ఆదివాసీ పిల్లల విద్య కోసం 400కిపైగా ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలల్ని నిర్మిస్తున్నాం’ కరోనాపై ఐక్య పోరాటం ‘ఏడాది కాలంలో తీసుకున్న ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలతో దేశం ప్రగతి పట్టాలెక్కింది. అయితే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఎన్నో సమస్యలు మనకి సవాళ్లు విసురుతున్నాయి. నేను రేయింబగళ్లు కష్టపడుతున్నాను. నాలోకూడా కొన్ని లోటుపాట్లు ఉండే ఉంటాయి. కానీ మన దేశానికి లోటు లేదు. నా మీద నాకున్న నమ్మకం కంటే మీ మీద, మీ బలం మీద, మీ సామర్థ్యం మీద ఉన్న విశ్వాసం ఎక్కువ. కరోనాపై పోరులో ఐక్యతను చూసి ప్రపంచ దేశాలు విస్తుపోయాయి’ ఆత్మనిర్భర్ భారత్‌తో కొత్త దశ దిశ ‘లాక్డౌన్ సమయంలో మన కూలీలు, వలస కార్మికులు, చేతివృత్తుల వారు, కళాకారులు, కుటీర పరిశ్రమల్లో పనిచేసేవారు, ఇలా సాటి పౌరులెందరో చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. వారిని సమస్యల నుంచి గట్టెక్కించడానికి మనందరం పట్టుదలతో, ఐక్యతగా పనిచేస్తున్నాం. స్వయం సమృద్ధ భారత్‌ను సాధించడం ద్వారా మనం దేని మీదనైనా విజయం సాధించగలం. ఇటీవల ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీతో మన దేశ దశ, దిశ మారుతుంది. ఈ ప్యాకేజీ ద్వారా రైతులు, కార్మికులు, యువత, చిన్న తరహా పరిశ్రమలు నడిపేవారు ప్రతీ భారతీయుడికి ఉపాధి దొరికి కొత్త శకం ప్రారంభమవుతుంది’. -
అందరివాడు... దాస్
న్యూఢిల్లీ: దేశీ బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా శక్తికాంత దాస్ బాధ్యతలు చేపట్టి సంవత్సరమవుతోంది. గతేడాది డిసెంబర్ 12న ఆర్బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ అర్ధంతరంగా నిష్క్రమించిన తర్వాత అనూహ్యంగా ఆ స్థానంలో దాస్ నియమితులయ్యారు. బ్యూరోక్రాట్ స్థాయి నుంచి స్వతంత్ర ప్రతిపత్తి గల ఆర్బీఐ 25వ గవర్నర్‌గా ఎదిగారాయన. 1980 బ్యాచ్ తమిళనాడు కేడర్ ఐఏఎస్ అధికారి అయిన దాస్.. గతంలో కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సహా పలు హోదాల్లో సేవలు అందించారు. అందరినీ కలుపుకుపోవడం, అందరూ తమ అభిప్రాయాలు తెలిపేందుకు అవకాశమివ్వడం .. దాస్ స్టయిల్ అంటారు ఆయన్ను గురించి తెలిసినవారు. ప్రభుత్వానికి నిధుల బదిలీ, మొండిబాకీల పరిష్కారానికి కొత్త విధానం ప్రవేశపెట్టడం మొదలుకుని వరుసగా పలు దఫాలు కీలక రేట్లను తగ్గించడం దాకా ఈ ఏడాది కాలంలో ఆర్బీఐ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. బ్యాంకింగ్ రంగంలో సంక్షోభాలు, మందగిస్తున్న ఆర్థిక వృద్ధి తదితర సవాళ్ల మధ్య దాస్ సారథ్యంలో ఆర్బీఐ పనితీరును ఒకసారి సింహావలోకనం చేస్తే .. ► ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే క్రమంలో ఆర్బీఐ 2019 ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా అయిదు విడతల్లో 135 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించింది. ఆగస్టులో అసాధారణంగా 35 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అయితే, కచ్చితంగా మరో విడత రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలను తల్లకిందులు చేస్తూ నవంబర్‌లో నిర్ణయం తీసుకోవడం అందర్నీ విస్మయపర్చింది. ► స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి అంచనాలను కూడా మొత్తం మీద 240 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ► ఆర్బీఐ వద్ద ఎంత మేర నిధులు ఉండాలన్న వివాదాస్పద చర్చకు ముగింపునిచ్చి, కేంద్రానికి రూ. 1,76,051 కోట్ల మేర మిగులు నిధులను రిజర్వ్ బ్యాంక్ బదలాయించింది. ► చిన్న, మధ్యతరహా సంస్థలకు ఊరటనిస్తూ వన్ టైమ్ రుణ పునర్వ్యవస్థీకరణ వెసులుబాటు కల్పించింది. ► సత్వర దిద్దుబాటు చర్యలకు (పీసీఏ) సంబంధించిన ఆంక్షలు ఎదుర్కొంటున్న 11 బ్యాంకుల్లో నుంచి మూడు బ్యాంకులను (బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్) బైటికి తెచ్చింది. ► సంస్కరణలపరంగా చూస్తే.. ద్రవ్య పరపతి విధానాల ప్రయోజనాలు సత్వరం బదిలీ అయ్యేలా... బ్యాంకులు రుణాలకు సంబంధించి రెపో ఆధారిత ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ విధానానికి మళ్లేలా దాస్ కృషి చేశారు. ► రోజంతా చెల్లింపుల వ్యవస్థలు పనిచేసేలా చూసేందుకు నెఫ్ట్ సదుపాయం 24 గంటలూ అందుబాటులో ఉండేలా ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఇది 2020 జనవరి నుంచి అమల్లోకి వస్తోంది. ఆర్బీఐదే తుది నిర్ణయం.. ఆర్బీఐ, ప్రభుత్వం మధ్య చాలా విషయాలపై విస్తృతంగా చర్చలు జరుగుతాయి. కానీ, అంతిమంగా నిర్ణయం తీసుకునేది రిజర్వ్ బ్యాంకే. నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్బీఐకి 100 శాతం పైగా స్వయం ప్రతిపత్తి ఉంది. ఇందులో ఎవరి జోక్యం ఉండదు. – శక్తికాంత దాస్, గవర్నర్, ఆర్బీఐ అందర్నీ ఒకే తాటిపైకి తెచ్చారు నిబద్ధత, పారదర్శకత, నిజాయితీ గల వ్యక్తి శక్తికాంత దాస్. ప్రభుత్వాన్ని, వ్యవస్థను ఒకే తాటిపైకి తేవడంలోనూ, బోర్డును సమగ్రంగా తీర్చిదిద్దడంలోను అన్ని విధాలా సఫలీకృతమయ్యారు. – సచిన్ చతుర్వేది, ఆర్బీఐ సెంట్రల్ బోర్డు సభ్యుడు -
పాలకు, మెర్సిడెజ్‌కు ఒకే పన్నా?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని వస్తువులపై ఒకే జీఎస్టీ రేటును అమలుచేయడం సాధ్యం కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పాలకు, మెర్సిడెజ్ కారుకు ఒకే పన్ను విధించడం సరికాదన్నారు. అన్ని వస్తువులపై ఏకరూపకంగా 18% జీఎస్టీ ఉండాలన్న కాంగ్రెస్ పార్టీ ఆలోచన సరైంది కాదని.. ఇలాంటి నిర్ణయాల ద్వారా ఆహార ధాన్యాలు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతాయన్నారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జీఎస్టీ అమలుకు ఏడాది పూర్తయిన సందర్భంగా ‘స్వరాజ్య’ అనే మేగజైన్‌కు ప్రధాని ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్, వివిధ రకాల కేంద్ర, రాష్ట్రాల పన్నులను కలిపి పరోక్ష పన్నుల విధానాన్ని సరళతరం చేసేందుకే జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చామని మోదీ తెలిపారు. జీఎస్టీ ద్వారా ఇన్స్పెక్టర్ రాజ్ తగ్గిపోయిందన్నారు. రాష్ట్రాలు, వ్యాపారులు, ఇతర భాగస్వామ్య వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఎప్పటికప్పుడు జీఎస్టీలో సానుకూల మార్పులు కూడా తెస్తున్నామని ప్రధాని వెల్లడించారు. జీఎస్టీ అమల్లోకి వచ్చి ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా దేశ ప్రజలందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ‘దేశ ప్రజలకు అభినందనలు. సహకార సమాఖ్య విధానానికి, టీమిండియా స్ఫూర్తికి ఇదో గొప్ప ఉదాహరణ. ఒకే దేశం–ఒకే పన్ను విధానం ద్వారా అభివృద్ధి జరగడంతోపాటు పన్ను విధానంలో సరళత, పారదర్శకత పెరిగాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో జీఎస్టీ ఓ సానుకూల మార్పు తీసుకొచ్చింది’ అని ఆదివారం ఉదయం మోదీ ట్వీట్ చేశారు. ఏడాదిలో జీఎస్టీ ద్వారా సాధించిన విజయాలతో కూడిన పోస్టర్‌ను అందులో ఉంచారు. ధరలు పెంచడమే వారి ఆలోచన ‘అన్ని వస్తువులకు ఒకే పన్నురేటు అమల్లో ఉంటే చాలా సులభంగా, సౌకర్యంగా ఉండేది. కానీ దీని ప్రకారం చూస్తే.. ఆహార వస్తువులపై 0% పన్నురేటు ఉండటం సాధ్యం కాదు. పాలకు, విలాసవంతమైన మెర్సిడెజ్ కారుకు ఒకే పన్నురేటు ఉండటం సమంజసమేనా? కాంగ్రెస్ పార్టీలోని మన మిత్రులు ఒకే జీఎస్టీ రేటు ఉండాలని అడుగుతున్నారు. అంటే.. ప్రస్తుతం 0–5% పన్ను రేటు మధ్యనున్న ఆహార వస్తువులు, నిత్యావసర వస్తువులకు కూడా 18 శాతం పన్ను విధించాలనేది వారి ఆలోచన’ అని మోదీ ‘స్వరాజ్య’ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. స్వాతంత్య్రానంతరం నుంచి నేటి వరకు దేశంలో 66 లక్షల మంది పన్ను చెల్లింపుదారులుంటే.. ఇందులో 48 లక్షల మంది 2017, జూలై 1న జీఎస్టీ అమల్లోకి వచ్చాకే పన్ను చెల్లింపులోకి వచ్చారని ప్రధాని వెల్లడించారు. ‘ఏడాది కాలంలో 350 కోట్ల బిల్లులు ప్రాసెస్ అయ్యాయి. 11 కోట్ల రిటర్న్స్ ఫైల్ అయ్యాయి. దేశవ్యాప్తంగా చెక్‌పోస్టులు రద్దయ్యాయి. రాష్ట్రాల సరిహద్దుల వద్దనున్న వాణిజ్య పన్నుల కార్యాలయాల వద్ద క్యూలు కట్టాల్సిన పనిలేకుండా పోయింది. ఇది ట్రక్కు డ్రైవర్ల విలువైన సమయాన్ని ఆదా చేస్తోంది. లాజిస్టిక్స్ రంగానికి భారీగా ఊతమందుతోంది. తద్వారా దేశంలో ఉత్పత్తి పెరుగుతోంది. ఒకవేళ జీఎస్టీ సంక్లిష్టంగా ఉండుంటే ఇవన్నీ జరిగేవేనా?’ అని మోదీ ప్రశ్నించారు. నిత్యావసరాల ధరలు తగ్గాయ్..! ‘మీరు ఏం చూస్తున్నారో.. అదే చెల్లిస్తున్నారు. దాదాపు 400 వస్తువులపై ప్రభుత్వం పన్నులు తగ్గించింది. 150 వస్తువులు 0% పన్ను పరిధిలో ఉన్నాయి. నిత్యావసర వస్తువుల ధరలను గమనించినట్లయితే.. వాటి ధరలన్నీ తగ్గాయి. బియ్యం, గోధుమలు, చక్కెర, మసాలా దినుసులు వంటి వాటిపై పన్నులు చాలామేర తగ్గించాం. రోజువారీ వినినియోగంలో వచ్చే దాదాపు అన్ని వస్తువులను 5%లోపు పరిధిలోనే ఉంచాం. దాదాపు 95% వస్తువులు 18% లోపు జీఎస్టీ శ్లాబ్ లోనే ఉన్నాయి’ అని మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్‌లో పన్నువిధానంలో భారీగా మార్పు తీసుకువచ్చే ప్రయత్నం చేశామన్న ప్రధాని.. ఈ క్రమంలో (జీఎస్టీ అమలులో) కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ‘17 పన్నులు, 23 సెస్సులను సంస్కరించి ఒక పన్నుగా మార్చాం. సరళంగా, వ్యవస్థ సున్నితత్వానికి తగినట్లుగా దీన్ని రూపొందించాం. ఓ గొప్ప సంస్కరణ వచ్చినపుడు బాలారిష్టాలు సహజమే. కానీ మేం వీటిని ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వాటిని పరిష్కరిస్తూనే ఉన్నాం. సహకార సమాఖ్య విధానానికి జీఎస్టీ సంస్కరణే గొప్ప ఉదాహరణ’ అని మోదీ తెలిపారు. కేంద్రంలో గత కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాలతో ఈ ఏకాభిప్రాయం సాధించడంలోనే విఫలమయ్యాయన్నారు. -
నోట్లు.. అవే పాట్లు
చింతలపూడి/జంగారెడ్డిగూడెం : కేంద్ర ప్రభుత్వం 1,000, 500 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించి సరిగ్గా నేటికి ఏడాది పూర్తైంది. నల్ల ధనంపై యుద్ధం అంటూ ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేశారు. అయితే పెద్ద నోట్లు రద్దు చేసి సంవత్సరం పూర్తయినా ఇప్పటికీ ప్రజల కరెన్సీ కష్టాలు మాత్రం విడనాడలేదు. ప్రభుత్వ చర్యతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్రంగా దెబ్బతిన్నారు. ప్రజలకు నగదు చెలామణీ చేసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఏటీఎంలు దిష్టిబొమ్మల్లా మారాయి. ఏటీఎంలలో డబ్బులు డ్రా చేయాలంటే అధికంగా చార్జీలు వసూలు చేస్తుండటంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికీ ఎక్కడ చూసినా బ్యాంకుల్లో బారులు, ఏటీఎంల వద్ద చిన్నా, పెద్దా తేడా లేకుండా జనం క్యూలు కడుతున్నారు. ఈ సంవత్సరం మొత్తం జనం ఇబ్బందులు తారస్థాయికి చేరుకున్నాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలు, వాయిదాపడ్డాయి. పెళ్లిళ్ల సీజన్లో కేంద్రం నోట్ల రద్దు ప్రకటించడంతో వధువు, వరుడి కుటుంబాలపై పెను భారమేపడింది. పెళ్లి ఖర్చులకు చేతిలో నగదు లేక పెళ్లి బట్టలు, నగలు కొనడానికి తీవ్ర అవస్థలు పడ్డారు. వ్యాపారాలు కుంటు పడ్డాయి. ముఖ్యంగా చిల్లర కష్టాలతో ప్రజలు తీవ్రఇబ్బందులు పడ్డారు. వ్యాపార, వాణిజ్య కేంద్రాల్లో ఆన్లైన్ చెల్లింపులు తప్ప ప్రత్యామ్నాయ చర్యలు లేకపోవడంతో పడరాని పాట్లు పడ్డారు. నోట్ల రద్దు తరువాత మూలనపడ్డ కొన్ని ఏటీఎంలు నేటికీ తెరుచుకోలేదు. కుదేలైన రియల్ ఎస్టేట్ వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం నోట్ల రద్దుతో పూర్తిగా కుదేలైంది. అమ్మేవారు ఉన్నా కొనేవారు ముందుకు రాకపోవడంతో రియల్ బిజినెస్ కుప్ప కూలిపోయింది. ఇక సామాన్యుల అవస్థలైతే చెప్పనలవి కాదు. అటు మార్కెట్లో నగదు కొరత ఏర్పడటంతో కూలి పనులు లేక ఒక వేళ కూలికి వెళ్లినా సకాలంలో కూలి డబ్బులు అందక ఇబ్బందులు పడ్డారు. ఇక రైతుల పరిస్థితి అయితే మరీ దారుణంగా మారిందని చెప్పవచ్చు. వ్యవసాయానికి పెట్టుబడులు అందక, పండించిన పంటలకు నగదు రూపంలో చెల్లింపులు జరక్క బాధపడ్డారు. ఒక పక్క నోట్ల రద్దుతో ప్రజలకు ఇబ్బందులు తప్ప ఒరిగిందేమీ లేదన్న వాదనలు వినపడుతున్నాయి. ఇదిలా ఉంటే రూ.2 వేలు, రూ. 500 నోట్లు మార్కెట్లో చలామణి తగ్గిపోయాయి. చాలావరకు పెద్దనోట్లు బ్లాక్‌మనీగా వెళ్లిపోయినట్టు పలువురు పేర్కొంటున్నారు. దీంతో పెద్దనోట్లు మార్కెట్లో పెద్దగా కనిపించడం లేదు. జాడే లేదు తాజా ప్రభుత్వం చిల్లర సమస్య తీర్చేందుకు రూ.200, రూ.50 కొత్త నోట్లను ప్రవేశపెట్టింది. అయితే ఈ నోట్లు విడుదల చేసి సుమారు రెండు నెలలు కావస్తున్నా నేటికీ పూర్తిగా చలామణిలోకి రాలేదు. అటు పెద్దనోట్లు చలామణిలో లేకపోగా, విడుదల చేసిన కొత్త నోట్లు రూ.200, రూ.50 ఇంకా పూర్తిగా చలామణిలోకి రాకపోవడం, కేవలం రూ.100 నోట్లు, పాత రూ.50 నోట్లు మాత్రమే మార్కెట్లో చలామణిలో ఉన్నాయి. వ్యాపారి ప్రాణం తీసిన నోట్ల రద్దు కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు జిల్లాకు చెందిన ఓ వ్యాపారి ప్రధాని మోడీకి లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నరేంద్ర మోడీ గారు మీరు తీసుకున్న పెద్ద నోట్ల రద్దు ఎంతమందికి ఉపయోగపడిందో తెలియదు కానీ ఒక సామాన్యుడి ప్రాణం తీసింది. ఎందుకంటే నేను అప్పుల్లో ఉన్నాను. మీ రద్దు నిర్ణయం పుణ్యమా అంటూ ఒక్క రూపాయి కూడా దొరకక, చీటీలు కట్టలేకపోయాను. అప్పు ఇచ్చేవారు కూడా లేక ఎవరికీ సమాధానం చెప్పలేక చనిపోతున్నాను... అంటూ లేఖ రాసి నరసాపురం మండలం కొప్పర్రుకు చెందిన పోలిశెట్టి నర్సింహమూర్తి (నాని) హనుమకొండ లాడ్జిలో ఆత్మహత్య చేసుకోవడం జిల్లాలో కలకలం రేపింది. నోట్ల రద్దు వల్ల తాను ఇబ్బందులు పడ్డానని, అప్పులు తీర్చగలిగినన్ని తీర్చానని, ఇంకా తీర్చలేకపోవడంతో వారికి మొహం చూపించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని, మోడీ నిర్ణయం వల్ల జీవించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని లేఖలో పేర్కొన్నాడు. -
ఈవ్ టీజర్లకు సింహస్వప్నం
- వారిలో మార్పు తీసుకొస్తున్న పోలీసులు - సైబరాబాద్‌లో ఏడాది పూర్తి చేసుకున్న ‘షీ టీమ్స్’ ఏడాది గణాంకాలివి... - దొరికిన ఈవ్‌టీజర్లు , మైనర్లు 118 - మేజర్లు 707 (50 నుంచి 60 ఏళ్ల మధ్యవారు 16, 60పైబడినవారు 4) - మొత్తం 660 కేసులు, పెట్టీ కేసులు..550, ఎఫ్ఐఆర్ కేసులు...110 ఇలా ఫిర్యాదు చేయొచ్చు... - డయల్ 100, ఫేస్బుక్ షీటీమ్ సైబరాబాద్, వాట్సాప్ 9490617444 సాక్షి, హైదరాబాద్: ‘షీ టీమ్స్’... మిహ ళలకు రక్షణ కవచం... ఈవ్ టీజర్లకు సింహస్వప్నం.. వారి భరతం పట్టే సైన్యం. ఈవ్ టీజింగ్‌కు గురైన వారు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు ఒకప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించేవారు. కుటుం బం పరువుపోతుందేమోనని కొందరు, ఠాణా చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుందని మరికొందరు ఫిర్యాదు చేసేందుకు వెనుకంజ వేసేవారు. మహిళల రక్షణ కోసం గతేడాది ప్రారంభించిన షీ-టీమ్స్‌తో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. షీ టీమ్స్ నీడలా తమను వెంటాడుతుండటంతో పోకిరీలు మహిళలను టీజింగ్ చేసేందుకు భయపడుతున్నారు. బాధితులకు షీమ్స్ అండగా ఉండటంతో ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు ముందుకొస్తున్నారు. మరోవైపు తమకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన వారికి షీటీమ్స్ వారి తల్లిదండ్రుల సమక్షంలోనే కౌన్సెలింగ్ చేసి మళ్లీ అలాంటి ఉదంతానికి పాల్పడకుండా వారిలో మార్పు తీసుకొస్తోంది. ఆదివారంతో ఏడాది పూర్తి చేసుకున్న సైబరాబాద్ షీ టీమ్స్‌కు ప్రజలు హ్యాట్సాఫ్ అంటున్నారు. షీ టీమ్ పట్టుకున్న ఆకతాయిలకు ఇచ్చే కౌన్సెలింగ్‌ను గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ప్రత్యక్షంగా మీడియాకు చూపించారు. గతేడాది శ్రీకారం... ఈవ్‌టీజింగ్, మహిళలపై వేధింపులను అరికట్టేందుకు ప్రభుత్వ నిర్ణయం మేరకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ షీ టీమ్స్‌కు గతేడాది శ్రీకారం చుట్టారు. కార్యాలయాలు, కళాశాలలు, రైల్వేస్టేషన్లు, బస్టాప్లుతో పాటు బహిరంగప్రదేశాల్లో మహిళలను, విద్యార్థులను వేధించే వారి భరతం పట్టేందుకు షీ టీమ్స్‌ను రంగంలోకి దింపుతున్నారు. తమిళనాడులో ఉన్న ప్రొహిబిషన్ ఆఫ్ ఈవ్ టీజింగ్, ఏపీ యాంటీ ర్యాగింగ్ మార్గదర్శకాలను అనుసరించి నిందితులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఏడాదిళక్ష 660 కేసులు నమోదు చేశారు. మఫ్టీలో పట్టేస్తారు... ఈవ్‌టీజర్లను పట్టుకోవడంతో పాటు వ్యవహరించాల్సిన తీరుపై షీ టీమ్ సభ్యులు ప్రత్యేక తర్ఫీదు నిచ్చారు. వీరు బస్‌స్టాపులు, బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లలో అమ్మాయిలను వేధిస్తున్న వారిని కనిపెడతారు. రహస్య కెమెరాలతో ఆకతాయిల ఆగడాలను షూట్ చేసి పట్టేస్తారు. దాదాపు 60 టీమ్‌లు బహిరంగ ప్రదేశాల్లో పని చేస్తున్నాయి. ఈవ్‌టీజింగ్ వ్యతిరేక కమిటీలు... ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల్లో షీటీమ్ సభ్యులు ఈవ్‌టీజింగ్ వ్యతిరేక ప్రచారం చేపట్టారు. ఇందువల్ల తలెత్తే పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి కళాశాలలో ఈవ్‌టీజింగ్ వ్యతిరేక కమిటీలు ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటివరకు ఈవ్‌టీజింగ్ వ్యతిరేకంగా 496 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. హాట్స్పాట్లపై దృష్టి మల్కాజిగిరి, ఎల్బీనగర్, మాదాపూర్, ఐటీ కారిడార్, బాలానగర్, శంషాబాద్ జోన్లో 400కు పైగా ఉన్న హాట్‌స్పాట్స్ (ఆకతాయిల వేధింపులపై ఎక్కువ ఫిర్యాదు వచ్చే ప్రాంతాలు)పై షీ టీమ్స్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాయి. అక్కడ పోలీసులు ఉదయం సాయంత్రం వేళల్లో పెట్రోలింగ్ పెంచారు. మరో పక్క ఫోన్లో వేధింపులకు గురవుతున్న మహిళలు పోలీసుల భరోసాతో నేరుగా ఠాణాలకు వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు. ‘ఈయర్’తో ఈవ్‌టీజర్లలో మార్పు... ఈయర్ (ఎగ్జామిన్, అక్సెప్ట్, రిజెక్ట్) పద్ధతితో ఈవ్టీజర్ల పరివర్తనలో మార్పు తీసుకొస్తున్నారు. షీ టీమ్ సభ్యులు, కౌన్సెలర్లు (మానసిక నిపుణులు) ఈవ్టీజర్ల వ్యక్తిత్వాన్ని తెలుసుకునేందుకు వారి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో పాటు స్నేహితులకు సంబంధించిన విషయాలపై ప్రశ్నావళి ఇచ్చి పూర్తి చేయమంటారు. దీని ఆధారంగానే అతడిని ఎగ్జామిన్ చేస్తున్నారు కౌన్సెలర్లు. అతడు ఈవ్ టీజింగ్ చేశానని ఒప్పుకోకపోతే షీ టీమ్ బృందాలు షూట్ చేసిన వీడియో ను వారి తల్లిదండ్రుల సమక్షంలోనే చూ పిస్తున్నారు. ఆ దృశ్యాలను చూసిన త ర్వాత సారీ సార్ తప్పైపోయిందని నిం దితుడు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. మరోమారు ఈవ్‌టీజింగ్ చేయమని వారితో పోలీసులు ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. దీంతో ఆకతాయిల్లో మా ర్పు వస్తోందని అధికారులు భావిస్తు న్నారు. ఆకతాయిలు భయపడుతున్నారు విద్యార్థినులు, యువతులు, మహిళలు నిత్యం ఎదుర్కొంటున్న వేధింపులు, ఈవ్‌టీజింగ్‌ను అరికట్టడంలో మా కృషి ఫలించింది. ఏడాదిలో మేం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ఛేదించినా...కొంతమాత్రమే సాధించామని అనుకుంటున్నాం. అమ్మాయిల్ని వేధిస్తే పోలీసులు పట్టుకుంటారన్న భయాన్ని పోకిరీల్లో కలిగించాం. బాధిత మహిళలు 100కు డయల్ చేయాలి. సైబరాబాద్‌లో మహిళలకు ఎక్కడా, ఎలాంటి వేధింపులు లేకుండా చేయాలన్నదే మా తదుపరి లక్ష్యం’. - సీవీ ఆనంద్