సునాక్‌ పాలనకు ఏడాది | Rishi Sunak Completes One Year As Britain First Indian orgin | Sakshi
Sakshi News home page

సునాక్‌ పాలనకు ఏడాది

Published Thu, Oct 26 2023 6:33 AM | Last Updated on Thu, Oct 26 2023 6:33 AM

Rishi Sunak Completes One Year As Britain First Indian orgin - Sakshi

లండన్‌: భారతీయ మూలాలున్న రిషీ సునాక్‌ బ్రిటన్‌ ప్రధాన మంత్రిగా పగ్గాలు చేపట్టి బుధవారంతో ఏడాది పూర్తి చేసుకున్నారు. అయితే వార్షికోత్సవ సంబరాల వంటివాటికి దూరంగా రోజంతా ఆయన రోజువారీ అధికారిక విధుల్లోనే గడపడం విశేషం.

43 ఏళ్ల సునాక్‌ సరిగ్గా ఏడాది కింద ఎన్నో సవాళ్ల నడుమ ప్రధాని కావడం తెలిసిందే. ఆ పదవి చేపట్టిన తొలి భారత మూలాలున్న వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. ‘ఏడాదిలో ఎంతో సాధించాం. కానీ సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది’ అంటూ సోషల్‌ మీడియాలో ఆయన వీడియో పోస్ట్‌ చేశారు. అధికార కన్సర్వేటివ్‌ పార్టీ చైర్మన్‌ గ్రెగ్‌ హ్యాండ్స్‌ సైతం రిషి పాలనను ఈ సందర్భంగా ప్రశంసించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement