british prime minister
-
G20 Summit: మళ్లీ ఎఫ్‌టీఏ చర్చలు
రియో డి జనిరో: బ్రిటన్, భారత్ మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై నెలకొన్న అనుమానాలకు తెర పడింది. దీనిపై చర్చలను పునఃప్రారంభిస్తామని బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ స్పష్టం చేశారు. బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అనంతరం ఆయన ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. జీ20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా నేతలిద్దరూ సమావేశమయ్యారు. బ్రిటన్‌లో లేబర్ పార్టీ గెలుపుతో ఎఫ్‌టీఏ భవితవ్యం అయోమయంలో పడటం తెలిసిందే. దానికి నేతలిద్దరూ తాజాగా తెర దించారు. పరస్పరం లాభసాటిగా ఉండేలా ఎఫ్‌టీఏ విధివిధానాలు రూపొందుతాయని ఆశాభావం వెలిబుచ్చారు. బెల్ఫాస్ట్, మాంచెస్టర్ నగరాల్లో నూతన కాన్సులేట్లు తెరవాలని నిర్ణయించారు. పరారీలో ఉన్న వ్యాపారవేత్తలు విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని స్టార్మర్‌కు మోదీ విజ్ఞప్తి చేశారు.మెరుగైన భవితకు కృషి మెరుగైన భవిష్యత్తు కోసం చర్యలు చేపట్టాల్సిందిగా జీ20 సభ్య దేశాలకు మోదీ పిలుపునిచ్చారు. సదస్సులో రెండో రోజు సుస్థిరాభివృద్ధి, ఇంధన రంగంలో మార్పులపై ఆయన ప్రసంగించారు. అభవృద్ధి చెందుతున్న దేశాలకు ఇచి్చన హామీలను అమలు చేయడం సంపన్న దేశాల బాధ్యత అని గుర్తు చేశారు. పర్యావరణ సవాళ్లను కలసికట్టుగా ఎదుర్కోవడం మానవాళి మనుగడకు చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. గాజాకు మరింత మాన వతా సాయం అందించాలని, ఉక్రెయిన్ యుద్ధానికి తెర పడాలంటూ సదస్సు డిక్లరేషన్ విడుదల చేసింది. వీటితో పాటు పలు అంశాలపై బుధవారం సదస్సు చివరి రోజు ఉమ్మడి తీర్మానం చేసే అవకాశముంది. దేశాధినేతలతో మోదీ భేటీలుఆతిథ్య దేశం బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వాతో పాటు పలువురు దేశాధినేతలతో మోదీ వరుస భేటీలు జరిపారు. ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (ఫ్రాన్స్), గాబ్రియెల్ బోరిక్ ఫోంట్ (చిలీ), జేవియర్ మెయిలీ (అర్జెంటీనా), జార్జియా మెలోనీ (ఇటలీ), ప్రబోవో సుబియాంటో (ఇండొనేసియా), పెడ్రో శాంచెజ్ (స్పెయిన్), అబ్దెల్ ఫతా ఎల్ సిసీ (ఈజిప్ట్), యూన్ సుక్ యోల్ (దక్షిణ కొరియా), జోనాస్ గర్ స్టోర్ (నార్వే), లూయీస్ మాంటెనెగ్రో (పోర్చుగీస్), లారెన్స్ వాంగ్ (సింగపూర్), యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లియన్, అంతర్జాతీయ ద్రవ్య నిధి డిప్యూటీ ఎండీ గీతా గోపీనాథ్ తదితరులు వీరిలో ఉన్నారు. -
స్టార్మర్ దీపావళి వేడుకలు
లండన్: బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. మంగళవారం రాత్రి తన అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్ ముందు ఆయన స్వంగా దీపాలు వెలిగించారు. అనంతరం నుదుట కుంకుమ దిద్దుకుని హిందూ సంప్రదాయ ప్రార్థనల్లో పాల్గొన్నారు. అరుణిమా కుమార్ బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యాన్ని ఆస్వాదించారు. ప్రస్తుతం ప్రపంచాన్ని చాలారకాల చీకట్లు కమ్ముకున్నాయని ఈ సందర్భంగా స్టార్మర్ ఆవేదన వెలిబుచ్చారు. వాటన్నింటినీ పారదోలేలా ఈ వెలుగుల పండుగ మనందరికీ స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు. దీపావళి భిన్న వర్గాల వారిని ఒక్కటి చేసే పండుగ అన్నారు. భారతీయులపై ప్రశంసల జల్లుబ్రిటిష్ ఇండియన్ సమాజం కష్టించి పని చేస్తుందని, తమ విలువలు, సేవా భావంతో సమాజంలో ఎనలేని గౌరవం సంపాదించుకుందని స్టార్మర్ కొనియాడారు. వారి భాగస్వామ్యం బ్రిటిష్ సమాజాన్ని సుసంపన్నం చేసిందన్నారు. ‘‘ప్రభుత్వ పనితీరులో వారెంతో కీలకం. నా అధికార నివాసం తలుపులు వారికోసం ఎప్పటికీ తెరిచే ఉంటాయి’’ అన్నారు. ఉప ప్రదాని ఏంజెలా రేయ్నర్, మంత్రులు సీమా మల్హోత్రా తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. -
UK PM Rishi Sunak: హిందూ ధర్మమే నాకు స్ఫూర్తి
లండన్: హిందూ ధర్మమే తనకు ప్రేరణను, సాంత్వనను అందిస్తుందని భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ చెప్పారు. ’’భగవద్గీతపై పార్లమెంట్ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు గర్వంగా ఉంది. ఫలితాన్ని గురించి ఆలోచించకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని భగవద్గీత బోధిస్తుంది’ అని ఆయన అన్నారు. ఆదివారం రిషి సునాక్ భార్య అక్షతా మూర్తితో కలిసి లండన్‌లోని నియాస్డెన్ ప్రాంతంలో ఉన్న స్వామి నారాయణ్ మందిరాన్ని సందర్శించుకున్నారు. వచ్చే 4వ తేదీన బ్రిటన్ పార్లమెంట్‌కు ఎన్నికలు జరగనున్న వేళ వారు ఆలయంలో పూజలు చేశారు. అంతకుముందు రిషి సునాక్ దంపతులకు ఆలయంలోకి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా జై స్వామినారాయణ్ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన సునాక్ టీ20 ప్రపంచ కప్‌ను భారత జట్టు గెలుచుకున్న విషయాన్ని ప్రస్తావించడం విశేషం. చీర ధరించిన అక్షతా మూర్తి అక్కడి మహిళలు, చిన్నారులతో ముచ్చటించారు. ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంటున్న వేళ ప్రతిపక్ష లిబరల్ పార్టీ నేత కీర్ స్టార్మర్ హిందూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శుక్రవారం లండన్‌లోని కింగ్స్బరీ ప్రాంతంలో ఉన్న స్వామి నారాయణ్ ఆలయాన్ని సందర్శించుకున్నారు. జై స్వామి నారాయణ్ అంటూ స్టార్మర్ ప్రసంగించారు. అధికారంలోకి వస్తే భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తామని ప్రకటించారు. 2021 గణాంకాల ప్రకారం బ్రిటన్‌లో హిందువులు సుమారు 10 లక్షల మంది ఉన్నారు. దాంతో ప్రధాన పార్టీలు హిందువుల ఓట్లపై కన్నేశాయి. -
G7 Summit 2024: స్వేచ్ఛా వాణిజ్యంపై మోదీ, రిషీ సమీక్ష
జీ7 భేటీ కోసం వచ్చిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తోనూ మోదీ భేటీ అయ్యారు. భారత్–యూకే వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పట్టిష్టంచేస్తామని ప్రధాని మోదీ అన్నారు. బ్రిటన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో పురోగతిపై సునాక్‌తో కలిసి మోదీ సమీక్ష చేశారు. మూడోసారి ప్రధాని అయ్యారంటూ మోదీని సునాక్ అభినందనలు తెలపగా త్వరలో జరగబోయే బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలంటూ సునాక్‌కు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతకు చేయాల్సిన కృషిపై కూలంకషంగా చర్చించారు. ‘‘ రక్షణ, భద్రత, వాణిజ్యం, ఆర్థిక లావాదేవీలు, కీలక, అధునాతన సాంకేతిక రంగాలతోపాటు ప్రజాసంబంధాల్లోనూ ఇరుదేశాల మధ్య భాగస్వామం మరింత బలపడటంపై ఇరు నేతలు చర్చించారు’’ అని భేటీ తర్వాత భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదలచేసింది. -
UK Prime Minister: చిన్నతనంలో వివక్షకు గురయ్యా: సునాక్
లండన్: చిన్నతనంలో జాతి వివక్షకు గురయినట్లు భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ వెల్లడించారు. ఇంగ్లిష్ ఉచ్చారణలో యాస లేకుండా తన తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను వెల్లడించారు. ‘చిన్నప్పుడు జాతి వివక్షకు గురయ్యా. నాతోబుట్టువుల నుద్దేశించి కొందరు చేసిన వెటకారం, వెక్కిరింపులను ప్రత్యక్షంగా చూశా. ఎంతో బాధేసింది’అని సునాక్ బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. ఇప్పుడు తన పిల్లలు జాతి వివక్షను ఎదుర్కోవడం లేదని అన్నారు. తన భారతీయ వారసత్వం గురించి చెబుతూ సునాక్... ఆకారం, రూపం ఒక అవరోధంగా మారకూడదని తల్లిదండ్రులు తమకు చెప్పేవారన్నారు. భారతీయ తరహా యాస బయటపడకుండా మాట్లాడాలని వారు పదేపదే చెప్పేవారు. మేం మాట్లాడే భాషపై వారు ప్రత్యేకంగా దృష్టి పెట్టేవారు. అలా, సరైన అభ్యాసంతో బ్రిటిష్ యాసను మేం సరిగ్గా అనుకరించ గలిగేవాళ్లం. అది చూసి మా అమ్మ చాలా సంతోషించారు’అని సునాక్ అన్నారు. జాత్యహంకార ధోరణి ఏ రూపంలోనిదైనా ఆమోదం యోగ్యం కాదని రిషిసునాక్ చెప్పారు. -
బ్రిటన్ మంత్రివర్గంలో కుదుపు
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సోమవారం తన మంత్రివర్గంలో ఆకస్మిక మార్పుచేర్పులు చేశారు. కొంతకాలంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న భారత మూలాలున్న హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్ను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ ముందుగా నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్‌ను విదేశాంగ మంత్రిగా నియమిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పటిదాకా విదేశాంగ మంత్రిగా ఉన్న జేమ్స్ క్లెవర్లీని బ్రేవర్మన్ స్థానంలో హోం మంత్రిగా నియమించారు. ప్రధాని సిఫార్సుల మేరకు వారిద్దరి నియామకాలకు రాజు చార్లెస్ ఆమోదముద్ర వేసినట్టు డౌనింగ్ స్ట్రీట్ ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు హౌజింగ్ మంత్రి రేచల్ మెక్‌లీన్‌ను కూడా సునాక్ పదవి నుంచి తప్పించారు.ఈ నేపథ్యంలో మరో ఆరుగురు జూనియర్ మంత్రులు కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు! థెరెసా కోఫీ, నిక్ గిబ్, నీల్ ఓబ్రియాన్, విల్ క్విన్స్, జెస్సీ నార్మన్ ఈ జాబితాలో ఉన్నారు. కామెరాన్... అనూహ్య ఎంపిక 57 ఏళ్ల కామెరాన్‌కు రిషి విదేశాంగ బాధ్యతలు అప్పగించడం అనూహ్యమేనని చెప్పాలి. ఒక మాజీ ప్రధానిని ఇలా మంత్రివర్గంలోకి తీసుకోవడం బ్రిటన్‌లో చాలా అరుదు. పైగా ప్రధానిగా రాజీనామా చేశాక కామెరాన్ ఏడేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అంతేగాక ప్రస్తుతం ఎంపీ కూడా కాదు. ఈ నేపథ్యంలో ఆయన్ను ఎగువ సభ హౌస్ ఆఫ్ లార్డ్స్‌లోకి తీసుకున్నారు. బ్రిటన్‌లో ఇలా విదేశాంగ మంత్రి ఎగువ సభ్య సభ్యుడిగా ఉండటం 40 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1980ల్లో లార్డ్స్ సభ్యుడైన పీటర్ కారింగ్టన్ మార్గరెట్ థాచర్ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా పని చేశారు. కష్టకాలంలో ప్రధానిగా రిషి పనితీరు గొప్పగా ఉందంటూ కామెరాన్ ఈ సందర్భంగా మెచ్చుకున్నారు. ‘‘కొన్ని వ్యక్తిగత నిర్ణయాల విషయంలో రిషితో నేను గతంలో విభేదించ ఉండొచ్చు. కానీ ఆయన అత్యంత సమర్థుడైన ప్రధాని’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దేశ భద్రత, ప్రగతి తదితర కీలకాంశాల్లో ఆశించిన ఫలితాల సాధనలో రిషికి శక్తివంచన లేకుండా తోడ్పడతా. ఏడేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నా కీలక సవాళ్లను దీటుగా ఎదుర్కోవడంలో రిషికి దన్నుగా నిలిచేందుకు నా రాజకీయ అనుభవమంతటినీ రంగరిస్తా’’ అని చెప్పారు. 2010 నుంచి 2016 దాకా ఆరేళ్లపాటు ఆయన బ్రిటన్ ప్రధానిగా ఉన్నారు. బ్రిటన్ యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో కొనసాగాలని గట్టిగా వాదించారు. ఈ విషయమై 2016లో మూడు రెఫరెండాలు తెచ్చారు. కానీ ప్రజలు ఈయూ నుంచి వైదొలగేందుకు (బ్రెగ్జిట్)కే ఓటేయడంతో రాజీనామా చేశారు. సునాక్ కూడా బ్రెగ్జిట్‌కే మద్దతిచ్చారు. పైగా ఆ సమయంలో కామెరాన్ మంత్రివర్గంలో సునాక్ జూనియర్ మంత్రి కూడా కావడం విశేషం! విదేశాంగ మంత్రి జై శంకర్ ఐదు రోజుల పర్యటన నిమిత్తం ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్నారు. ఆదివారం సునాక్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు కూడా. పర్యటనలో భాగంగా క్లెవర్లీతో జై శంకర్ సమావేశాలు జరపాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా విదేశాంగ బాధ్యతలు స్వీకరించిన కామెరాన్‌తో జై శంకర్ చర్చలు ఎలా జరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. బ్రేవర్మన్.. రెండోసారి ఉద్వాసన ఇక రిషి మంత్రివర్గంలో సీనియర్ సభ్యురాలైన 43 ఏళ్ల బ్రేవర్మన్ హోం శాఖ మంత్రిగా తప్పుకోవాల్సి రావడం ఇది రెండోసారి! ఈసారి ఆమెపై వేటు ఒకవిధంగా ఊహిస్తున్నదే. గోవా మూలాలున్న ఆమె రెచ్చగొట్టే మాటలు, వివాదాస్పద వ్యాఖ్యలతో పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. ఇటీవల లండన్‌లో జరిగిన పాలస్తీనా మద్దతుదారుల ర్యాలీని నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శిస్తూ ద టైమ్స్ పత్రికలో బ్రేవర్మన్ రాసిన వ్యాసంపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తాయి. హోం మంత్రిగా ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సహించరానిదంటూ విపక్షాలతో పాటు అధికార కన్సర్వేటివ్ పార్టీ సీనియర్ నాయకులు కూడా మండిపడ్డారు. వ్యాసంలోని సదరు విమర్శలను తొలగించాలని ప్రధాని కార్యాలయం ఆదేశించినా ఆమె బేఖాతరు చేసినట్టు తేలింది. ఈ నేపథ్యంలో బ్రేవర్మన్ను తప్పించడం ఖాయమని అంతా భావించారు. అంతకుముందు లిజ్ ట్రస్ మంత్రివర్గం నుంచి కూడా ఆమె రాజీనామా చేయడం విశేషం. అప్పుడు కూడా మంత్రిగా పలుసార్లు వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. పలు కీలకాంశాలపై ట్రస్ సర్కారు అయోమయంలో ఉందని ఆమె బాహాటంగా విమర్శించడం సంచలనం సృష్టించింది. వలసదారులపై ఆమె వ్యాఖ్యలూ దుమారమే రేపాయి. తర్వాత వలసలకు సంబంధించి అధికార పత్రాలను నిబంధనలకు విరుద్ధంగా సహచర పార్టీ ఎంపీకి చూపించిన అంశంలో రాజీనామా చేయాల్సి వచి్చంది. ట్రస్ స్థానంలో రిషి ప్రధాని అయ్యాక బ్రేవర్మన్ను అనూహ్యంగా మంత్రివర్గంలోకి తీసుకోవడమే గాక మళ్లీ కీలకమైన హోం శాఖ బాధ్యతలే అప్పగించారు. దీనిపై అప్పట్లోనే ఆశ్చర్యం వ్యక్తమైంది. తాజా వేటు నేపథ్యంలో సునాక్‌కు ఆమె కంట్లో నలుసుగా మారడం ఖాయమంటున్నారు. కన్సర్వేటివ్ పారీ్టలోని తన మద్దతుదారుల దన్నుతో ప్రభుత్వానికి సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తారన్న అభిప్రాయం వినిపిస్తోంది. రాజీనామా అనంతరం విడుదల చేసిన సంక్షిప్త ప్రకటనలో ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా దీన్ని బలపరిచేలానే ఉన్నాయి. ‘‘ఇంతకాలం హోం మంత్రిగా పని చేయడం నాకు గొప్ప గౌరవం. సమయం వచి్చనప్పుడు చాలా సంగతులు చెప్తా’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు! వివాదాస్పద వ్యాఖ్యలు ► బ్రిటన్‌లో వీసా కాల పరిమితి ముగిసినా దేశం వీడని వారిలో అత్యధికులు భారతీయులేనన్న బ్రేవర్మన్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ► భారత్‌తో ఓపెన్ మైగ్రేషన్ విధానాన్నీ ఆమె తప్పుబట్టారు. ► మరో సందర్భంలో బ్రిట న్లోని అక్రమ వలసదారులను ఆఫ్రికాలోని రువాండాకు తరలిస్తానన్నారు. ► బ్రిటన్‌లో ఎక్కడ పడితే అక్కడ వీధుల్లోనే నివసిస్తున్న వారు చాలావరకు అక్రమ వలసదారులేనన్నారు. ► శరణార్థుల తాకిడిని వలసదారుల దండయాత్రగా అభివరి్ణంచారు. ► అతి వేగంగా కారు నడిపిన కేసులో జరిమానా, ఫైన్ పడ్డ విషయాన్ని దాచేందుకు ప్రయతి్నంచారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. -
రిషి సునాక్ ఇంట దీపావళి వేడుక
లండన్: భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, అక్షతా మూర్తి దంపతులు 10 డౌనింగ్ స్ట్రీట్‌లోని తమ అధికార నివాసంలో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. బుధవారం జరిగిన ఈ వేడుకల్లో పలువురు ప్రవాస భారతీయులు, పార్లమెంటేరియన్లు, పారిశ్రామిక వేత్తలు, బాలీవుడ్ ప్రముఖులు పాల్గొ న్నారు. ప్రధానిగా సునాక్ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం సాయంత్రం ప్రధానమంత్రి నివాసాన్ని రంగురంగుల దీపాలతో అలంకరించారు. ప్రధాని రిషి సునాక్, అక్షతామూర్తి దంపతులు కలిసి దీపాలు వెలిగిస్తున్న దృశ్యాలను ప్రధాని కార్యాలయం ‘ఎక్స్’లో పోస్టు చేసింది. ప్రధాని రిషి సునాక్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. కమలా హ్యారిస్ నివాసంలోనూ.. వాషింగ్టన్: భారత సంతతికి చెందిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మంగళవారం వాషింగ్టన్‌లోని తన అధికార నివాసంలో దీపావళి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు భారతీయ అమెరికన్లు సహా 300 మంది వరకు పాల్గొన్నారు. దీపాలు వెలిగించిన అనంతరం చట్టసభల ప్రతినిధులైన రో ఖన్నా, శ్రీ థానెదార్, రాజా కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్ తదితరులతో ఆమె మాట్లాడారు. ఈసందర్భంగా ఆమె ఇజ్రాయెల్, హమాస్ మధ్య పోరును ప్రస్తావించారు. పాలస్తీనియన్లకు సాయం అందించేందుకు అమెరికా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. -
సునాక్ పాలనకు ఏడాది
లండన్: భారతీయ మూలాలున్న రిషీ సునాక్ బ్రిటన్ ప్రధాన మంత్రిగా పగ్గాలు చేపట్టి బుధవారంతో ఏడాది పూర్తి చేసుకున్నారు. అయితే వార్షికోత్సవ సంబరాల వంటివాటికి దూరంగా రోజంతా ఆయన రోజువారీ అధికారిక విధుల్లోనే గడపడం విశేషం. 43 ఏళ్ల సునాక్ సరిగ్గా ఏడాది కింద ఎన్నో సవాళ్ల నడుమ ప్రధాని కావడం తెలిసిందే. ఆ పదవి చేపట్టిన తొలి భారత మూలాలున్న వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. ‘ఏడాదిలో ఎంతో సాధించాం. కానీ సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది’ అంటూ సోషల్ మీడియాలో ఆయన వీడియో పోస్ట్ చేశారు. అధికార కన్సర్వేటివ్ పార్టీ చైర్మన్ గ్రెగ్ హ్యాండ్స్ సైతం రిషి పాలనను ఈ సందర్భంగా ప్రశంసించారు. -
భారత్–కెనడాల మధ్య ఉద్రిక్తతలు సమసిపోవాలి
లండన్: భారత్–కెనడాల మధ్య విభేదాలు సమసిపోవాల్సిన అవసరం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అభిప్రాయపడ్డారు. భారత్–కెనడాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ రిషి సునాక్, ట్రూడోలు ఫోన్లో మాట్లాడుకున్నారు. కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది, భారత్‌లో మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ఏజెంట్ల హస్తముందనేందుకు ఆధారాలున్నాయంటూ ట్రూడో చేసిన ప్రకటన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైంది. అదేవిధంగా, బ్రిటన్‌లోని ఓ గురుద్వారా కమిటీ సమావేశానికి వెళ్లిన భారత దౌత్యాధికారి విక్రమ్ దొరైస్వామిని ఖలిస్తానీ అనుకూలవాదులు అడ్డుకోవడం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఇరు దేశాల ప్రధానులు సంభాషించుకున్నారు. భారత్‌తో విభేదాలకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో, జెనీవా ఒప్పందంతోపాటు దేశాల సార్వభౌమాధికారాన్ని, చట్ట నియమాలను గౌరవించాలన్నారు. భారత్‌తో సంబంధాలు త్వరలోనే మెరుగుపడతాయని రిషి సునాక్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
డౌనింగ్ స్ట్రీట్ మార్జాల మిత్రుడు
నిష్క్రమించే ప్రధాని వీడ్కోలు కార్యక్రమ గౌరవ ఆహ్వానితుల జాబితాలో ‘ల్యారీ’ ఎందుకు కనిపించడు అని బ్రిటన్ ప్రజలు తరచూ ఆలోచిస్తూ ఉంటారు. బహుశా ఆహూతుల అందరి దృష్టీ తన వైపు మళ్లేందుకు ల్యారీ ఎప్పటికప్పుడు కళాత్మకమైన మార్గాలను కొనుగొంటూ ఉండడం అందుకు కారణం కావచ్చు. అవడానికి అది మామూలు మార్జాలమే అయినప్పటికీ దానిని ‘సివిల్ సర్వెంట్’గా పరిగణించాలని 2016లో నాటి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరున్ పార్లమెంటులో ప్రకటించారు. ప్రస్తుతం చీఫ్ మౌజర్ హోదాలో ఉన్న ఆ సివిల్ సర్వెంట్ పేరే ‘ల్యారీ’. 2011 నుంచి ల్యారీ బ్రిటన్ ప్రధాని నివాసంలో ఉంటోంది. డేవిడ్ కామెరున్, థెరెసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రుస్, రుషి సునాక్... ప్రధానులుగా ఇంతమంది మారారు కానీ, ల్యారీ అక్కడే ఉంది. కాలధర్మం లేదా వృద్ధాప్యం మాత్రమే ల్యారీని డౌనింగ్ స్ట్రీట్ నుంచి కదలించగలవు. పెంపుడు కుక్కలపై మక్కువ కలిగిన వారిగా బ్రిటిషర్లు లోక విదితం అయినప్పటికీ, వారి ప్రధానమంత్రి అధికారిక నివాసంలో ప్రాముఖ్యం పొందే చతుష్పాదం మాత్రం మార్జాలమే. పిల్లిది అక్కడ ‘చీఫ్ మౌజర్’ హోదా. చీఫ్ మౌజర్ ప్రధాన విధి డౌనింగ్ స్ట్రీట్‌లో ఒక్క ఎలుకైనా లేకుండా చూడటం. డౌనింగ్ స్ట్రీట్‌లోనే ప్రధాని నివాసం, ప్రధాని కార్యాలయాలు ఉంటాయి. అవడానికి అది మామూలు మార్జాలమే కానీ, దానిని ‘సివిల్ సర్వెంట్’గా పరిగణించాలని 2016లో నాటి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరున్ పార్లమెంటులో ప్రకటించారు. ప్రస్తుతం చీఫ్ మౌజర్ హోదాలో ఉన్న ఆ సివిల్ సర్వెంట్ పేరు ‘ల్యారీ’. ‘బ్యాటర్‌సీ డాగ్స్ అండ్ క్యాట్స్ హోమ్’ నుంచి తప్పించి, దానిని అక్కడికి తెప్పించారు. 2011 నుంచి ల్యారీ బ్రిటన్ ప్రధాని నివాసంలో ఉంటోంది. డేవిడ్ కామెరున్, థెరెసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రుస్, రుషి సునాక్... ప్రధానులుగా ఇంతమంది మారారు కానీ, ల్యారీ అక్కడే ఉంది. కాలధర్మం లేదా వృద్ధాప్యం మాత్రమే ల్యారీని డౌనింగ్ స్ట్రీట్ నుంచి కదలించగలవు. జీవిత చరిత్రల రచనలో ప్రావీణ్యం కలిగిన నా మేనకోడలు నారాయణీ బసు బ్రిటిష్ ప్రభుత్వ అధికారిక మార్జాలాల జీవిత చరిత్రను సంక్షిప్తంగా సంకలన పరిచారు. ఎనిమిదవ హెన్రీ చక్రవర్తి కాలం నాటి బ్రిటిష్ ప్రభుత్వ మార్జాల జీవిత చరిత్రతో సంకలనం మొదలౌతుంది. ఆ కాలపు రాజనీతిజ్ఞుడు, క్యాథలిక్ బిషప్ అయిన లార్డ్ ఛాన్స్లర్... థామస్ వోల్సే దగ్గర ఆ మార్జాలం ఉండేది. 1929కి ముందే బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా పిల్లి సంరక్షణ బాధ్యతలను చేపట్టినట్లు రికార్డులను బట్టి తెలుస్తోంది. పిల్లి పోషణ, పాలన కోసం రోజుకు ఒక పెన్నీ కేటాయించినట్లు అప్పటి బడ్జెట్ లెక్కలు వెల్లడిస్తున్నాయి. నాటి నుంచి పిల్లి ఖర్చు క్రమంగా పెరుగుతూ వచ్చి 21వ శతాబ్దానికి ‘చీఫ్ మౌజర్’ బ్రిటిష్ ఖజానాకు పెట్టిస్తున్న ఖర్చు 100 పౌండ్లకు చేరుకుంది. డౌనింగ్ స్ట్రీట్ వెబ్సైట్ ప్రకారం ల్యారీ విధులు ఇలా ఉన్నాయి: ఇంటికి వచ్చే అతిథులను పలకరించడం, భద్రతకు ఉద్దేశించిన రక్షణ ఏర్పాట్లను తనిఖీ చేయడం, కునుకు తీయడానికి పురాతన ఫర్నిచర్ ఏ మాత్రం నాణ్యతను కలిగి ఉన్నదో పరీక్షించడం. అలాగే, భవంతిలో ఎలుకలు చేరకుండా ఉండేందుకు పరిష్కారం ఆలోచించడం కూడా చేస్తోందనీ, ఆ పరిష్కారం ఇంకా వ్యూహాత్మక ప్రణాళిక దశలోనే ఉందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లిందని కూడా వెబ్సైట్లో ఉంది. స్పష్టంగా చెప్పాలంటే ల్యారీ తన బాధ్యతల కంటే కూడా ప్రధాని కార్యాలయ అవసరాలను చూడ్డానికే ఎక్కువ ఇష్టపడుతుంది. నారాయణి పరిశోధనను బట్టి కామెరున్ దగ్గర తన తర్వాత వచ్చిన ప్రధానుల కంటే కూడా ల్యారీ గురించి చెప్పడానికే ఎక్కువ సమాచారం ఉంది. ఆ పిల్లి గురించి సునాక్ అభిప్రాయాన్ని నారాయణి ప్రస్తావించలేదు. కనుక ల్యారీని అర్థం చేసుకోవాలంటే మనం కామెరున్ మీద ఆధారపడాలి. ఆయన చెబుతున్న దానిని బట్టి ల్యారీ పురుషుల సమక్షంలో కాస్త బెరుకుగా ఉంటాడు. అయితే అందుకు బరాక్ ఒబామా మినహా యింపు. ‘‘తమాషా ఏంటంటే ఒబామాను ల్యారీ ఇష్టపడతాడు. ఒబామా అతడికి మృదువైన చిన్న తాటింపు వంటి స్పర్శను ఇస్తాడు. దాంతో ల్యారీ ఒబామా దగ్గర సౌఖ్యంగా ఉంటాడు. అయితే ల్యారీ ప్రధానమంత్రుల సతీమణులను కలవరపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ల్యారీ ఒంటి వెంట్రుకలు తన భర్త సూట్లపై కనిపించడంతో సమంతా కామెరున్ ల్యారీని ప్రధాని నివాసంలోకి అడుగు పెట్టనివ్వకుండా చేశారు. అంతెందుకు, పక్కనే ఉండే విదేశాంగశాఖ కార్యాలయంలోకి ల్యారీని ప్రవేశించనివ్వకుండా క్యాట్–ప్రూఫ్‌ను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. విదేశాంగ కార్యదర్శి విలియం హేగ్ దానిని కిందికి తీసుకెళ్లండి అని కోరారు. అయితే హేగ్‌కి ల్యారీ పట్ల కొంత ఆపేక్ష ఉండేదట. కఠోర వాస్తవం ఏంటంటే ల్యారీకి ఉన్న ప్రజాదరణ కారణంగా తరచూ ప్రధాన మంత్రి కంటే కూడా ఎక్కువగా ల్యారీకి భద్రతా బలగం అవసరం అయ్యేది. కామెరాన్ దంపతులు ఆ పిల్లిని ఇష్ట పడటం లేదని కథలు వ్యాప్తి చెందడం ప్రారంభవమడంతో ల్యారీ, తను ‘పర్–ఫెక్ట్లీ వెల్’ అని ప్రధాని కామెరున్ తప్పనిసరై ట్వీట్ చేయవలసి వచ్చింది. ఆ ట్వీట్ బ్రిటిష్ ప్రభుత్వానికి భరోసాను ఇచ్చింది. నిష్క్రమించే ప్రధాని వీడ్కోలు కార్యక్రమ గౌరవ ఆహ్వానితుల జాబితాలో ల్యారీ ఎందుకు కనిపించడు అని బ్రిటన్ ప్రజలు తరచూ ఆలోచిస్తూ ఉంటారు. బహుశా ఆహుతుల అందరి దృష్టీ తన వైపు మళ్లేందుకు ల్యారీ ఎప్పటికప్పుడు కళాత్మకమైన మార్గాలను కనుగొంటూ ఉండడం అందుకు కారణం కావచ్చు. 10 డౌనింగ్ స్ట్రీట్ ప్రవేశ ద్వారం వద్ద ట్రంప్‌తో కలిసి థెరెసా మే, ఆమె భర్త ఫొటోలు దిగుతున్నప్పుడు ల్యారీ వారి వెనుక కిటికీ అంచుపై నిలబడి ప్రతి ఫొటోలోనూ కనిపించింది. తర్వాత వర్షం నుంచి తలదాచుకోడానికి సాయుధుల కనురెప్పల కాపలాలో ఉన్న ట్రంప్ క్యాడిలాక్ కారు కింద దూరిన ల్యారీని ఎంత నచ్చచెప్పీ బయటకు రప్పించలేక పోయారు. బి.బి.సి.కి చెందిన జోన్ సోపెల్ ఆ ఘటనను... ‘‘బ్రేకింగ్ న్యూస్: ట్రంప్ వ్యతిరేక ప్రదర్శనకారులు డొనాల్డ్ ట్రంప్ వాహన శ్రేణిని నిలువరించడంలో విఫలమయ్యారు. కానీ 10 డౌనింగ్ స్ట్రీట్ పిల్లి ఆ పని చేయగలిగింది’’... అని ట్వీట్ చేశారు. కొంతకాలంగా ల్యారీపై మునుపెన్నడూ లేని విధంగా తరచూ విమర్శలు వినవస్తున్నాయి. ల్యారీ స్వభావం, పనితీరు చుట్టూ కేంద్రీకృతం అయిన విమర్శలవి. వేటాడి చంపే క్రూర స్వభావం ల్యారీలో విస్పష్టంగా లోపించడాన్ని డౌనింగ్ స్ట్రీట్ అధికారులు గమనించారు. ‘‘ఎలుకల్ని వేటాడడం కన్నా ఎక్కువ సమయం ల్యారీ నిద్రలోనే గడుపుతున్నాడు’’ అని కొందరు ఫిర్యాదు చేశారు. అయితే నేను విన్నదేమంటే సునాక్ అతడిని విధుల నుంచి విరమింపజేసే ప్రమాదం లేదని. ఏ విధంగా చూసినా కూడా సునాక్ దంపతులకు వీడ్కోలు పలికి, కొత్తగా వచ్చేవాళ్ల మెప్పు పొందే వరకైనా ల్యారీ అక్కడ ఉంటాడు. ల్యారీ మాంసం కూరను ఇష్టపడతాడా లేక పప్పూ, అన్నం అంటాడా అనేది బహుశా అప్పుడు మనం తెలుసుకోవచ్చు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
G20 Summit: అతిథులొస్తున్నారు...
ప్రపంచంలోని ప్రధాన దేశాల అధినేతలు శుక్రవారం ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు. జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొని తమ వాణిని వినిపించనున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ మొదలు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వరకు పలు దేశాల నాయకగణం నేడే హస్తినకు చేరుకోనుంది. మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ 2012లో అధికార పగ్గాలు చేపట్టాక తొలిసారిగా జీ20 సదస్సుకు హాజరుకావడం లేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైతం ఈ భేటీకి గైర్హాజరు అవుతున్నారు. ఏయే దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు శుక్రవారం ఏ సమయానికి విచ్చేస్తున్నారో ఓసారి చూద్దామా! ► రేపు ఢిల్లీలో ప్రారంభంకానున్న జీ–20 శిఖరాగ్ర సదస్సు బ్రిటన్ :: రిషి సునాక్ జీ20 సదస్సు కోసం అందరికంటే ముందే భారత్‌కు చేరుకుంటున్న కీలక నేత రిషి సునాక్. భారతీయ మూలాలున్న బ్రిటన్ ప్రధాని అయిన సునాక్ శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట 40 నిమిషాలకు ఢిల్లీకి చేరుకుంటారు. కేంద్ర సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌదరి ఈయనకు సాదర స్వాగతం పలకనున్నారు. ‘భారత్ జీ20కి సారథ్య బాధ్యతలు వహిస్తున్న ఈ ఏడాదికాలంలో భారత ప్రధాని మోదీ చేస్తున్న కృషి అమోఘం. ఆయన నాయకత్వంలో ప్రపంచ యవనికపై భారత్ సాధిస్తున్న విజయాలు అద్వితీయం’అని రిషి సునాక్ శ్లాఘించారు. జపాన్ :: ఫుమియో కిషిదా సునాక్ విమానం ల్యాండ్ అయిన కొద్దిసేపటికే పాలెం విమానాశ్రయంలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా విమా నం ల్యాండ్ కానుంది. మధ్యా హ్నం 2.15 గంటలకు ఆయన భారత గడ్డపై అడుగుపెడతారు. ఈయనను సైతం కేంద్ర సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌదరి రిసీవ్ చేసుకోనున్నారు. కిషిదా భారత్‌కు రావడం ఇది రెండోసారి. ఇటీవల మార్చి నెలలో భారత్‌లో రెండు రోజులపాటు పర్యటించి ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అమెరికా :: జో బైడెన్ అగ్రరాజ్యాధినేత జో బైడెన్ రాకపైనే అందరి కళ్లు. ఈయన సాయంత్రం 6 గంటల 55 నిమిషాలకు ఢిల్లీ చేరుకుంటారు. కేంద్ర సహాయ మంత్రి జనరల్(రిటైర్డ్) వీకే సింగ్ బైడెన్‌కు సాదర ఆహ్వానం పలుకుతారు. బైడెన్ సతీమణి జిల్కు కరోనా పాజిటివ్ రావడంతో బైడెన్ జీ20 సదస్సుకు వస్తారో రారో అనే సందిగ్ధత నెలకొంది. బైడెన్‌కు చేసిన కరోనా టెస్ట్‌లో నెగటివ్ ఫలితం రావడంతో ఆయన పర్యటన ఖాయమైంది. అయినా సరే సదస్సు సందర్భంగా ఆయన మాస్క్ ధరించే పాల్గొంటారని అధికార వర్గాలు వెల్లడించాయి. కెనడా :: జస్టిన్ ట్రూడో అమెరికా తర్వాత ఆ దేశానికి ఉత్తరవైపు పొరుగు దేశం కెనడా తరఫున ఆ దేశ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో భారత్‌లో అడుగుపెడతారు. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్న విమానం పాలెం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ జస్టిన్‌కు సాదర స్వాగతం పలుకుతారు. ఖలిస్తాన్ వేర్పాటువాదులకు చిరునామాగా నిలిచిన కెనడాలో ఇటీవల వేర్పాటువాద సంస్థలు రెచ్చిపోయాయి. భారత వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ కెనడా–భారత్ సత్సంబంధాలను క్షీణింపజేశాయి. ప్రతిపాదిత వాణిజ్య ఒడంబడికను కెనడా అర్ధంతరంగా ఆపేసింది. ఈ తరుణంలో జీ20 వేదికగా కెనడా అగ్రనేత భారత్‌లో పర్యటించడం ఇరుదేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. చైనా :: లీ కియాంగ్ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వాస్తవానికి ఈ సదస్సులో పాల్గొనాలి. కానీ ఈసారి ఆయన బదులు చైనా ప్రధాని లీ కియాంగ్ వస్తున్నారు. శుక్రవారం రాత్రి ఏడు గంటల 45 నిమిషాల ప్రాంతంలో ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. ‘జిన్‌పింగ్ గైర్హాజరు ఊహించిందే. ఇది జీ20 కూటమి పరస్పర ఉమ్మడి నిర్ణయాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావంచూపబోదు’అని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కుండబద్దలు కొట్టారు. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్, అకాŠస్య్ చిన్ ప్రాంతాలను తమవిగా పేర్కొంటూ తమ కొత్త భౌగోళిక పటాన్ని చైనా విడుదలచేయడంతో డ్రాగన్ మీద భారత్ ఆగ్రహంగా ఉంది. జర్మనీ, ఫ్రాన్స్‌ల నేతలూ.. యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ రాత్రి ఏడున్నరకు ఢిల్లీలో దిగుతారు. యురోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మైఖేల్ సైతం జీ20 సదస్సుకు వస్తున్నారు. సింగపూర్ ప్రధాని లూంగ్ లీని కేంద్ర సహాయ మంత్రి మురుగన్ రిసీవ్ చేసుకుంటారు. జర్మనీ చాన్స్‌లర్ స్కోల్జ్ శనివారం సాయంత్రం ఆరు గంటలకు వస్తున్నారు. ఈయనను సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి భాను ప్రతాప్ సింగ్ వర్మ రిసీవ్ చేసుకోనున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ శనివారం మధ్యాహ్నం 12.35 నిమిషాలకు వస్తారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మహిళా మంత్రి అనుప్రియా సింగ్ పాటిల్ మేక్రాన్‌కు స్వాగతం పలుకుతారు. క్యూ కట్టనున్న నేతలు సౌదీ అరేబియా ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఢిల్లీకి చేరుకుంటారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు సుక్ ఇయోల్ యూన్ సాయంత్రం 5.10కి వస్తున్నారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసీ, ఆ్రస్టేలియా ప్రధాని అల్బనీస్ సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో చేరుకుంటారు. ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడొడో రాత్రి సమయంలో రానున్నారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ పదిగంటలకు చేరుకుంటారు. స్పెయిన్ అధ్యక్షుడు పెట్రో పెరిజ్ రాత్రి 10.15కు చేరుకుంటారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భారత మూలాలు... నాకెంతో గర్వకారణం...!
న్యూఢిల్లీ: ఆయన రిషి సునాక్. బ్రిటన్ ప్రధాని. ఆ పీఠమెక్కిన తొలి భారత మూలాలున్న నేత. అత్తామామలు ఇన్ఫోసిస్ వంటి దిగ్గజం ఐటీ కంపెనీ వ్యవస్థాపకులు. అంతా కలిస్తే భోజనాల బల్ల దగ్గర వాళ్ల మధ్య ఏ అంశాలు చర్చకు వస్తాయి? రాజకీయాలా? అస్సలు కాదట. కేవలం క్రికెట్ గురించి మాత్రమే మాట్లాడుకుంటారట. చివరికి రిషి ఇద్దరు కూతుళ్లు కూడా క్రికెట్ అంటే ప్రాణం పెడతారట. ఎంతగా అంటే, సర్వ కాల సర్వావస్థల్లోనూ భారత జట్టునే సమరి్థంచేటంతగా. అయితే, ఫుట్‌బాల్‌లో మాత్రం ఇంగ్లాండ్ జట్టును సమరి్థంచాలన్నదే వారికి ఆయన విధించే ఏకైక షరతు! సునాక్ తల్లిదండ్రులు ఇద్దరూ భారత మూకాలున్న వారే. తూర్పు ఆఫ్రికా నుంచి ఇంగ్లాండ్ వెళ్లారు. ఇక ఆయన భార్య అక్షతా మూర్తి నారాయణ మూర్తి, సుధా మూర్తి దంపతుల ఏకైక సంతానం. జీ 20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత్ వస్తున్న నేపథ్యంలో బుధవారం పీటీఐ వార్తా సంస్థకు ఇచి్చన ఇ– మెయిల్ ఇంటర్వ్యూలో రిషి పలు అంశాలు పంచుకున్నారు. సరదా సంగతుల నుంచి భారత్, ఇంగ్లాండ్ ద్వైపాక్షిక బంధం దాకా అన్ని అంశాలనూ స్పృశించారు. భారత మూలాలు తనకెంతో గర్వకారణమని పునరుద్ఘాటించారు రిషి. బ్రిటన్ ప్రధానిగా తాను బాధ్యతలు చేపట్టినప్పుడు భారతీయుల నుంచి వ్యక్తమైన హర్షాతిరేకాలు చెప్పలేని అనుభూతి ఇచ్చాయని గుర్తు చేసుకున్నారు. అత్తామామలతో ముచ్చటించేటప్పుడు భారత రాజకీయాలు, టెక్నాలజీ, ప్రధానిగా బ్రిటన్ను నడిపించడంలో ఆయన ఎదుర్కొంటున్న సమస్యల వంటివి ఎంతమాత్రమూ ప్రస్తావనకు రావని ఒక ప్రశ్నకు బదులుగా రిషి చెప్పారు. ‘ రాజకీయాలను, కుటుంబాన్ని విడిగా ఉంచడం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. మోదీతో భేటీ కోసం ఎదురు చూస్తున్నా... ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్టు రిషి చెప్పారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్, ఇంగ్లాండ్ ద్వైపాక్షిక కృషి పాత్రపై లోతుగా చర్చిస్తామన్నారు. గత ఏడాది కాలంలో భారత్‌లో పర్యటించిన తన మంత్రివర్గ సహచరులు రెట్టించిన ఉత్సాహంతో తిరిగొచ్చారని చెప్పారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారత్–ఇంగ్లాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరేందుకు మరి కాస్త సమయం పడుతుందని రిషి అభిప్రాయపడ్డారు. కానీ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 కల్లా రెట్టింపు చేయడమే లక్ష్యంగా అధునాతన ఒప్పందం కుదురుతుందని విశ్వాసం వెలిబుచ్చారు. ‘బ్రిటన్ వాణిజ్య మార్కెట్లో 4.8 కోట్లకు పైగా భారతీయ చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలున్నాయి. భారత ఎగుమతిదారులకు వాటితో యాక్సెస్ కల్పించేలా ఒప్పందం ఉండాలి. వార్షిక ద్వైపాక్షిక వర్తకం ఇప్పటికే రూ.3.5 లక్షల కోట్లు దాటేసింది‘ అని అన్నారు. ఇంగ్లాండ్‌లో 16 లక్షలకు పైగా భారతీయులున్నారు. భారత్ కు జీ 20 సారథ్యం... జీ 20 సారథ్యానికి భారత్ సరైన దేశమని రిషి అన్నారు. అపార వైవిధ్యానికి నెలవు భారత్. కొన్నేళ్లుగా అన్ని రంగాల్లోనూ అసాధారణ విజయాలు సాధిస్తూ ప్రపంచ దేశాలన్నింటికీ ఆదర్శంగా నిలుస్తోంది. అలాంటి దేశం జీ 20 సదస్సుకు సారథ్యం వహిస్తుండటం సరైన సమయంలో జరుగుతున్న చక్కని ఘటన‘ అని అభిప్రాయపడ్డారు. మోదీ నాయకత్వ సామర్థ్యానికి నిజంగా సెల్యూట్ చేస్తున్నా. ప్రపంచ సారథిగా భారత్ పోషిస్తున్న కీలక పాత్ర నిజంగా శ్లాఘనీయం‘ అన్నారు. ► బ్రిటన్ ప్రధాని కాగానే నేను చేసిన మొదటి పని అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్‌లో దీపావళి విందు ఇవ్వడమే. భవనమంతా విద్యుద్దీపాలు, పూలతో మెరిసిపోతుంటే చూసి చెప్పలేనంత భావోద్వేగానికి లోనయ్యా. ఒక భారతీయునిగా నాకెంతో గర్వకారణమైన విషయమది. ► నా గాథ నిజానికి లోతైన భారత మూలాలున్న ఎంతోమంది బ్రిటన్ వాసుల కథే. ఈ భిన్నత్వంలో ఏకత్వం బ్రిటన్ బలం. ► నేను పాటించే విలువలకు నా భార్య, ఇద్దరు కూతుళ్లు, తల్లిదండ్రులు, అత్తామామలు దారి చూపే దీపాలుగా నిలుస్తారు. ముఖ్యంగా అత్తామామల ఘనతలు చూసి నేనెంతో గరి్వస్తాను. ఏమీ లేని స్థితి నుంచి మొదలై ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఐటీ దిగ్గజ కంపెనీని స్థాపించే దాకా వాళ్ల ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకం. భారత్, ఇంగ్లాండ్‌ల్లో వేలాది మందికి అది ఉపాధి కలి్పస్తోంది. ప్రతి పౌరుడూ అలాంటి విజయాన్ని సాధించేందుకు వీలు కలి్పంచేలా బ్రిటన్ను తీర్చిదిద్దాలన్నది నా సంకల్పం. ► జీ 20 సదస్సు కోసం భార్య అక్షతతో కలిసి భారత్ లో పర్యటించనుండటం పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నా. బిజీ బిజీగా గడిపేలా ఇప్పటికే మొత్తం ప్లానింగ్ చేసుకున్నాం. భారత్‌లో మేం గతంలో వెళ్లాలని అనుకున్న పలు ప్రాంతాలకు వెళ్తాం. -
రిషి కేబినెట్లోకి మరో భారత సంతతి మహిళ
లండన్: బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ కొత్తగాకేబినెట్లోకి క్లెయిర్ కౌటిన్హో(32) అనే భారత సంతతి మహిళా సభ్యురాలిని చేర్చు కున్నారు. ఇంధన భద్రత మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మెన్తోపాటు క్లెయిర్ పూర్వీకులు కూడా గోవాకు చెందిన వారే. రక్షణ మంత్రి బెన్ వాలెస్ రాజీనామాతో ఆ బాధ్యతలను ఇంధన మంత్రి గ్రాంట్ షాప్స్కి అప్పగించారు. షాప్స్ నిర్వహించిన శాఖను క్లెయిర్‌కు ఇచ్చారు. ఈస్ట్ సర్రే నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. -
సునాక్ ఇంటిపై నల్లవస్త్రం
లండన్: బ్రిటన్ ప్రధాని ఇంటిపై నల్లటి వ్రస్తాన్ని కప్పిన నలుగురు పర్యావరణ కార్యకర్తలను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఉత్తర ఇంగ్లాండ్‌లో నార్త్ యార్క్‌షైర్ ప్రాంతంలోని రిచ్మండ్లో ఉన్న రిషి సునాక్ ఇంటిపై వారు నల్లటి వస్త్రం కప్పి తమ నిరసనను తెలియజేశారు. వీరు ‘గ్రీన్‌పీస్’ అనే పర్యావరణ పరిరక్షణ సంస్థలో సభ్యులుగా ఉన్నారు. సముద్రంలో చమురు, గ్యాస్ వెలికితీతను మరింత విస్తరిస్తూ సునాక్ ఇటీవల తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఇలా నిరసన వ్యక్తం చేశారు. సునాక్ ఇంటిపైకి ఎక్కి 200 చదరపు మీటర్ల నల్ల వస్త్రాన్ని కప్పారు. అలాగే సునాక్ ఇంటి ముందు మరో ఇద్దరు కార్యకర్తలు ‘చమురు లాభాలు ముఖ్యమా? లేక మా భవిష్యత్తు ముఖ్యమా?’ అని ప్రశ్నిస్తూ బ్యానర్‌ను ప్రదర్శించారు. ఈ సమయంలో సునాక్ కుటుంబసభ్యులెవరూ ఆ ఇంట్లో లేరు. -
ఖలిస్థానీల ముసుగులో అక్రమ వలసలు..
లండన్: భారత అక్రమ వలసదారులకు ఇంగ్లాండ్‌లో ఎలాగోలా ఆశ్రయం కల్పించేందుకు బ్రిటీష్ లాయర్లలో కొంతమంది అడ్డదారులు తొక్కుతున్నారు. వీరంతా మాఫియాలా ఏర్పడి బాధితుల నుండి నగదు వసూలు చేసి బదులుగా ఖలిస్తానీలుగానూ, స్వలింగ సంపర్కులగానూ చెప్పి భారత్‌లో తమ ప్రాణాలకు ముప్పు ఉన్నట్లు కోర్టుకు చెప్పమని చెబుతున్నట్టు ఓ ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది. ఓ స్టింగ్ ఆపరేషన్ ఆధారంగా ఈ విషయాన్ని తెలుసుకున్న బ్రిటన్ ప్రధాని తీవ్రస్థాయిలో స్పందించారు. వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భారత్ నుంచి ఇంగ్లాండ్ వలసవచ్చే వారిలో ఎవరైనా సరైన డాక్యుమెంట్లు లేకుండా అక్కడ అడుగుపెట్టారా.. వారు అక్కడి లాయర్ల చేతికి చిక్కినట్లే. పడవల్లో వలస వచ్చే భారతీయులే ఈ లాయర్ల ప్రధాన లక్ష్యం. వీరికి ఇంగ్లాండ్‌లో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే మతాంతర వివాహం చేసుకున్నామని, స్వలింగ సంపర్కులమని, ఖలిస్తానీ మద్దతుదారులమని చెప్పమంటున్నారు. మీరు కోర్టుకి ఈ మాట చెబితే చాలు మీ ప్రాణానికి భారత్‌లో ప్రాణహాని ఉందని కోర్టుని నమ్మిస్తానని దీనికోసం 5500 యూరో పౌండ్లను సిద్ధం చేసుకోవాలని ఒక రిపోర్టర్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో లాయర్ చెబుతుండగా వీడియో తీశారు. ఈ వీడియో ప్రధాని రిషి సునాక్ కు చేరడంతో ఆయన ఈ వ్యవహారంపై చాలా సీరియస్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇటువంటి కార్యకలాపాలకు మేమెప్పుడూ వ్యతిరేకమే. ప్రతిపక్ష లేబర్ పార్టీవారు, కొంతమంది లాయర్లు, క్రిమినల్ గ్యాంగులు వారి జేబులు నింపుకోవడం కోసం అక్రమ వలసదారులకు చట్టవ్యతిరేక మార్గంలో సహాయపడుతున్నారు. దీన్ని ఎలా ఆపాలో నాకు తెలుసనీ అన్నారు. This is what we’re up against. The Labour Party, a subset of lawyers, criminal gangs - they're all on the same side, propping up a system of exploitation that profits from getting people to the UK illegally. I have a plan to stop it. Here’s how 🧵https://t.co/ez3rYIU0uQ — Rishi Sunak (@RishiSunak) July 25, 2023 ఇది కూడా చదవండి: ఏకాంతంగా బ్రతకాలనుకున్నారు.. చివరికి... -
అమెరికా అధ్యక్షుడి చేతిలో న్యూక్లియర్ బ్రీఫ్ కేస్..?
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌తో లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్‌లో భేటీ అయిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వద్ద న్యూక్లియర్ బ్రీఫ్ కేస్ దర్శనమిచ్చింది. ఆయన ఎక్కడికెళ్తే అక్కడకు ఆయనతో పాటు ఈ బ్లాక్ లెదర్ సూట్ కేసును వెంట తీసుకెళ్లడం రష్యాకు కీడు శంకిస్తోందని చెబుతున్నాయి స్థానిక మీడియా వర్గాలు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అత్యవసర సమయంలో వైట్ హౌస్ దాటి ఎక్కడికైనా బయటకు వెళ్ళినపుడు ఈ న్యూక్లియర్ బ్రీఫ్ కేసును అయన తన వెంట తీసుకెళ్లడం చేస్తుంటారు. కానీ లండన్ పర్యటనకు ఈ బ్రీఫ్ కేసును తీసుకెళ్లడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. న్యూక్లియర్ బ్రీఫ్ కేస్ అంటే.. అమెరికా కమాండర్ ఇన్ చీఫ్ హోదాలో అమెరికా అధ్యక్షుడు ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా అణుబాంబుల ప్రయోగానికి ఈ న్యూక్లియర్ బ్రీఫ్ కేసు నుంచి ఆదేశించవచ్చు. 20 కిలలో బరువుండే ఈ బ్యాగ్‌లో న్యూక్లియర్ లాంచ్ కు సంబంధించిన కోడ్ పొందుపరచి ఉంటుంది. దీన్నే అటామిక్ బాంబు గానూ ప్రెసిడెంట్ అత్యవసర హ్యాండ్ బ్యాగ్ గానూ చెబుతూ ఉంటారు. సాయుధ దళానికి చెందిన సైనికుడు అధ్యక్షుడి వెంట దీన్ని తీసుకెళ్తూ ఉంటారు. రష్యా గురించేనా..? రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలోనే జో బైడెన్ ఈ న్యూక్లియర్ బ్రీఫ్ కేసును తనవెంట తీసుకుని వెళ్లినట్లు చెబుతున్నాయి మీడియా వర్గాలు. ఉక్రెయిన్ పై రష్యా అణుబాంబులు ప్రయోగానికి సిద్ధమైందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ కు ఆదేశాలిచ్చేందుకే అమెరికా అధ్యక్షుడు తన చేతిలో న్యూక్లియర్ బ్రీఫ్ కేసు తీసుకెళ్లారని వారంటున్నారు. నాటో సమావేశానికి ముందు సన్నాహకంగా బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌తో భేటీ అయిన బైడెన్ ఉక్రెయిన్ నాటో సభ్యత్వం గురించి ఆయనతో చర్చించినట్టు సమాచారం. రష్యాతో యుద్ధం ముగిసిన తర్వాతే ఉక్రెయిన్ సభ్యత్వం గురించి పరిగణిస్తామని ఇదివరకే చెప్పిన బైడెన్ వారికి అడుగడుగునా అండగా నిలుస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఈ సమావేశాలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇది కూడా చదవండి: ఉద్యోగిని వేధించిన కంపెనీ.. నష్టపరిహారం కోట్లలోనే..? -
సునాక్‌పై పార్లమెంటరీ కమిషనర్ విచారణ!
లండన్: తన భార్య అక్షతా మూర్తి నిర్వహిస్తున్న ‘కొరు కిడ్స్ లిమిటెడ్’ అనే సంస్థకు లబ్ధి చేకూరేలా బడ్జెట్లో కొత్త పథకాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రకటించారని బ్రిటిష్ ప్రధానమంత్రి రిషి సునాక్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణల్లో నిజానిజాలు నిగ్గుతేల్చడానికి ‘యూకే పార్లమెంటరీ కమిషనర్ ఫర్ స్టాండర్స్’ విచారణ ప్రారంభించింది. అతి త్వరలో రిషి సునాక్‌ను ప్రశ్నించనుంది. కొరు కిడ్స్ లిమిటెడ్ సంస్థ చిన్నపిల్లల సంరక్షణ సేవలను అందిస్తోంది. -
భారత వ్యతిరేక శక్తులపై గట్టి చర్యలు తీసుకోండి
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ గురువారం బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ యూకేలో దౌత్య కార్యాలయాల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఖలిస్తానీ అనుకూలవాదులు కొందరు ఇటీవల లండన్‌లో భారత దౌత్య కార్యాలయంపై దాడికి దిగడం, భారత జాతీయ పతాకాన్ని అవమానించిన ఘటనలను ఈ సందర్భంగా రిషి సునాక్‌తో ప్రస్తావించారు. భారత వ్యతిరేక శక్తులపై గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా, ఆర్థిక నేరస్తులను భారత్‌కు తిరిగి అప్పగించేందుకు తీసుకుంటున్న చర్యలను వేగవంతం చేయాలన్నారు. ఇద్దరు నేతలు పలు ద్వైపాక్షిక అంశాలు, ముఖ్యంగా వాణిజ్యం, ఆర్థిక రంగాల పురోగతిని సమీక్షించారని అధికారులు తెలిపారు. -
ఏ చర్యలకైనా సిద్ధం!
లండన్: తమ దేశాన్ని భద్రంగా ఉంచేందుకు ఎటువంటి చర్యకైనా వెనుకాడబోమని బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ అన్నారు. అట్లాంటిక్ మిత్ర దేశాలతో నిత్యం టచ్‌లో ఉంటూ, రక్షణపరంగా సన్నద్ధతతో ఉన్నట్లు ఆయన తెలిపారు. సోమవారం ఆయన ఉత్తర ఇంగ్లండ్‌లోని ఓ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు అవసరమైన ఎటువంటి చర్యలకైనా సిద్ధంగా ఉన్నామని ప్రజలు గ్రహించాలని కోరారు. తమ దేశ గగనతలాన్ని కాపాడుకునేందుకు టైఫూన్ యుద్ధ విమానాలను అప్రమత్తంగా ఉంచామన్నారు. అనుమానిత చైనా నిఘా బెలూన్లను అమెరికా సైన్యం కూల్చివేయడం, యూకేకు కూడా బెలూన్ల బెడద ఉందన్న వార్తలపై రిషి పై విధంగా స్పందించారు. -
2024లో రిషి గెలుపు కష్టమే!
లండన్: భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో పాటు ఆయన కేబినెట్లోని 15 మంది మంత్రులు 2024 ఎన్నికల్లో గెలవడం కష్టమేనని తాజా సర్వేలో తేలింది. ఈ మేరకు వివరాలను ది ఇండిపెండెంట్ వెల్లడించింది. రిషి, డిప్యూటీ పీఎం డొమినిక్ రాబ్, ఆరోగ్య మంత్రి స్టీవ్ బార్క్లేతో పాటు అధికార కన్జర్వేటివ్ పార్టీలోని సీనియర్ సభ్యులకు ఓటమి గండముందని ఒక్కో సీటుకు వేర్వేరుగా చేపట్టిన ఫోకల్‌డేటా పోలింగ్‌లో వెల్లడైంది. బెస్ట్ ఫర్ బ్రిటన్ అనే సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. రిషి కేబినెట్లో జెరెమీ హంట్, సుయెల్లా బ్రేవర్మన్, మైకేల్ గోవ్, నదీమ్ జహావీ, కేమీ బడెనోక్ మాత్రమే గెలిచే అవకాశాలున్నాయని తెలిపింది. రిషి కేబినెట్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోతుందని ‘బెస్ట్ ఫర్ బ్రిటన్’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నవోమి స్మిత్ చెప్పారు. అయితే తమ సర్వేలో ఓటెవరికో చెప్పలేని వారు ఎక్కువగా ఉన్నారని ఆయనన్నారు. వచ్చే ఎన్నికల నాటికి వీరు కన్జర్వేటివ్ పార్టీ వైపు మొగ్గు చూపితే ఫలితం వేరుగా ఉంటుందని తెలిపారు. -
2023లో సమస్యలతో సావాసమే: సునాక్
లండన్: బ్రిటన్‌వాసులకు ప్రధాని రిషి సునాక్ తన న్యూ ఇయర్ సందేశంలో చేదు వార్త విన్పించారు. దేశాన్ని వేధిస్తున్న పెను సమస్యలు 2023లో పూర్తిగా పరిష్కారం కాబోవని స్పష్టం చేశారు. ‘‘నేనలాంటి డొల్ల మాటలు చెప్పబోను. ఉక్రెయిన్–రష్యా యుద్ధం ఆర్థికంగా బ్రిటన్‌తో పాటు ప్రపంచం వెన్ను విరిచింది. రుణ భారాన్ని అదుపులోకి తెచ్చే క్రమంలో కఠినమే అయినా సరైన నిర్ణయాలు తీసుకుంటున్నాం’’ అంటూ చెప్పుకొచ్చారు. -
బకింగ్‌హాం ప్యాలెస్ రేసిజం ఉదంతం: నేనూ రేసిజం బాధితున్నే.. రిషి సునాక్
లండన్: జాత్యహంకార భూతం తననూ బాధించిందని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వెల్లడించారు. భారత మూలాలున్న ఆయన బ్రిటన్‌లోనే పుట్టి పెరగడం తెలిసిందే. ‘‘బాల్యంలో, పెరిగి పెద్దవుతున్న దశలో నేను రేసిజాన్ని ఎదుర్కొన్నా. అయితే ఈ సామాజిక సమస్యను ఎదుర్కొనే విషయంలో నాటితో పోలిస్తే బ్రిటన్ ఇప్పుడు ఎంతో ప్రగతి సాధించింది’’ అని అభిప్రాయపడ్డారు. బకింగ్‌హాం ప్యాలెస్‌లో తాజాగా రేసిజం ఉదంతం వెలుగులోకి రావడం తెలిసిందే. దివంగత రాణి ఎలిజబెత్ 2 సన్నిహితురాలు, ప్రిన్స్ విలియం గాడ్‌మదర్ లేడీ సుసాన్ హసీ ప్యాలెస్‌లో పని చేస్తున్న ఒక ఆఫ్రికన్ ఉద్యోగిని పదేపదే ఆమె స్వస్థలం గురించి గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. ‘‘నేను బ్రిటిషర్నే అని ఎన్నిసార్లు చెప్పినా ఆఫ్రికాలో ఎక్కడి నుంచి వచ్చానంటూ సుసాన్ నన్ను పదేపదే నిలదీసింది. నా జుట్టును పక్కకు తోసి మరీ నా నేమ్ బ్యాడ్జ్‌ను పట్టి పట్టి చూసింది. ఇది నన్నెంతో బాధించింది’’ అంటూ సదరు ఉద్యోగి ట్వీట్ చేయడంతో వివాదం రేగింది. చివరికి సుసాన్ క్షమాపణలు చెబుతూ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇది చాలా బాధపడాల్సిన విషయమని బకింగ్‌హాం ప్యాలెస్ పేర్కొంది. జాత్యహంకారానికి బ్రిటిష్ సమాజంలో స్థానం లేదంటూ ప్రిన్స్ విలియం దంపతులు కూడా ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో రిషి మీడియాతో మాట్లాడుతూ తన వ్యక్తిగత అనుభవాన్ని వివరించారు. ‘‘రేసిజం ఎక్కడ కన్పించినా తీవ్రంగా వ్యతిరేకించాల్సిందే. దాన్ని తుదముట్టించే దిశగా చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది. గతం నుంచి పాఠాలు నేర్చుకుంటూ మెరుగైన భవిష్యత్తు దిశగా సాగాలి’’ అన్నారు. -
భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్యానికి సై: బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్
లండన్: భారత్–బ్రిటన్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) అమలుకు కట్టుబడి ఉన్నట్లు బ్రిటన్ నూతన ప్రధాని రిషీ సునాక్ మరోమారు స్పష్టంచేశారు. ఒప్పందం వాస్తవరూపం దాల్చేందుకు కృషిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. విదేశాంగ విధానంపై బ్రిటన్ పారిశ్రామిక వేత్తలు, వివిధ దేశాల అతిథులు, ఆర్థిక నిపుణులు పాల్గొనే వార్షిక లండన్ మేయర్ బ్యాంకెట్ కార్యక్రమంలో సోమవారం సునాక్ ప్రసంగించారు. ‘ ప్రపంచ వ్యాప్తంగా స్వేచ్ఛాయుత వాణిజ్యానికి బ్రిటన్ ముందునుంచీ మద్దతు పలుకుతోంది. రాజకీయాల్లోకి రాకమునుపు నేను ప్రపంచంలోని వేర్వేరు దేశాల్లో వ్యాపారం చేశా. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో వ్యాపార అవకాశాలు పుష్కలం. 2050కల్లా ప్రపంచవాణిజ్యంలో సగం వాటాను ఇండో–పసిఫిక్ హస్తగతం చేసుకుంటుంది. అందుకే ఇండో–పసిఫిక్ సమగ్రాభివృద్ధి ఒప్పందం(సీపీటీపీపీ)లో భాగస్వాములం అవుతున్నాం. ఇందులోభాగంగా భారత్‌లో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వీలైనంత త్వరగా అమల్లోకి వచ్చేందుకు కృషిచేస్తున్నాను’ అని సునాక్ అన్నారు. చైనాతో స్వర్ణయుగ శకం ముగిసినట్లే ‘చైనాతో బ్రిటన్ కొనసాగించిన వాణిజ్యం, ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన స్వర్ణయుగం ముగిసింది. ఇరు దేశాల మధ్య వాణిజ్యం పెరిగాక అది సామాజిక, రాజకీయ సంస్కరణలు, సత్సంబంధాలకు దారితీయాలి. కానీ చైనా రాజ్యవిస్తరణవాదం, ఆధిపత్య ధోరణి కారణంగా అవి సాధ్యపడలేదు. చైనాతో బ్రిటన్ అద్భుత వాణిజ్యానికి తెరపడినట్లే’ అన్నారు. -
రిషి తోటలో రూ.12 కోట్ల శిల్పం.. వివాదాస్పదంగా ప్రధాని అధికార నివాసం
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ లండన్‌లోని డౌనింగ్ స్ట్రీట్‌లోని తన అధికార నివాసం తోటలో దాదాపు రూ.12.83 కోట్ల విలువైన శిల్పాన్ని ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. ప్రముఖ శిల్పి హెన్రీ మూర్ రూపొందించిన ఈ శిల్పాన్ని గత నెలలో క్రిస్టీ సంస్థ నిర్వహించిన వేలంలో బ్రిటన్ ప్రభుత్వ సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఒక వైపు దేశంలో జీవన వ్యయం పెరిగిపోయి, జనం కష్టాలు పడుతున్న వేళ పన్నుల రూపంలో వసూలు చేసిన సొమ్మును ఇలా ఖర్చు చేయడమేంటంటూ విమర్శలు చుట్టుముడుతున్నాయి. -
రిషి, ద వెండర్!
మెడలో ట్రే వేలాడదీసుకుని పాపీస్ అమ్ముతున్నదెవరో గుర్తు పట్టారు కదూ! అవును. బ్రిటన్ ప్రధాని రిషియే. గురువారం ఉదయం పూట మంచి రష్ అవర్‌లో వెస్ట్‌మినిస్టర్ మెట్రో స్టేషన్లో ఇలా దర్శనమిచ్చి ప్రయాణికులను సర్ప్రైజ్ చేశారాయన. రాయల్ బ్రిటిష్ లెజియన్కు నిధుల సేకరణ కోసం సైనికులతో కలిసి ఇలా వెండర్ అవతారమెత్తారు. పేపర్‌తో చేసిన ఒక్కో పాపీని ఐదు పౌండ్లకు అమ్మారు! చాలామంది ఆయన నుంచి వాటిని కొనుగోలు చేస్తూ కన్పించారు. పలువురు రిషితో సెల్ఫీలు తీసుకుంటూ గడిపారు. రిషి చర్యను మెచ్చుకుంటూ, ఆయన వద్ద తాము పాపీస్ కొన్నామని పేర్కొంటూ చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. -
UK PM: తొలిరోజే విమర్శల జడివాన.. బ్రేవర్మన్ నియామకంపై వ్యతిరేకత
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ బాధ్యతలు తీసుకున్న వెంటనే విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. డేటా ఉల్లంఘన తప్పిదాలపై లిజ్ ట్రస్ హయాంలో హోంమంత్రిగా రాజీనామా చేసిన భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్మన్ని తిరిగి నియమించడాన్ని ప్రతిపక్ష లేబర్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. రాజీనామా చేసిన వారం రోజుల్లోనే ఆమెను అదే పదవిలో నియమించడాన్ని తప్పు పట్టింది. బ్రేవర్మన్ నియామకాన్ని రిషి సమర్థించారు. ఆమె తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పారని గుర్తు చేశారు. ఆర్థిక మంత్రిగా జెరెమి హంట్, విదేశాంగ మంత్రిగా జేమ్స్ క్లెవెర్లీలను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. కొత్త మంత్రులతో ఆయన బుధవారం మొట్టమొదటి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. తొలిసారి ప్రధాని హోదాలో ప్రైమ్ మినిస్టర్ క్వశ్చన్స్ (పీఎంక్యూస్) ఎదుర్కోవడానికి ముందు కేబినెట్ కొత్త మంత్రులతో కలిసి చర్చించారు. యూకే రాజకీయాల్లో పీఎంక్యూస్ కార్యక్రమం అత్యంత కీలకమైనది. ప్రతీ బుధవారం సాయంత్రం జరిగే ఈ కార్యక్రమంలో విపక్ష పార్టీలు, ఎంపీలు ఏ అంశం మీద అడిగిన ప్రశ్నలకైనా ప్రధాని బదులివ్వాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే నిర్ణయాలను రిషి నవంబర్ 17 దాకా వాయిదా వేశారు. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే సన్నాహాలే ఇందుకు కారణమని హంట్ చెప్పారు. కేబినెట్ సమావేశంలోనూ ప్రధానిగా పార్లమెంటు తొలి భేటీలోనూ రిషి చేతికి హిందువులకు పవిత్రమైన దీక్షా కంకణం (మంత్రించిన ఎర్ర తాడు) ధరించి పాల్గొన్నారు. దీనిపై చర్చ జరుగుతోంది. దుష్ప్రభావాలు పోయి మంచి జరగడానికి దీనిని ధరిస్తే దేవుడు రక్షగా ఉంటాడని హిందువులు నమ్ముతారు. హిందూ మత విశ్వాసాలకు చెందిన దీనిని ధరించడంతో రిషి తాను నమ్ముకున్న సంప్రదాయాలను ఎంతో గౌరవిస్తారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
UK political crisis: బ్రిటన్‌లో రిషీరాజ్..
లండన్: నూటా యాభయ్యేళ్లకు పైగా మనల్ని పాలించిన బ్రిటన్ను ఇక మనవాడు పాలించనున్నాడు. దేశ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ (42) సరికొత్త చరిత్ర లిఖించారు. సోమవారం పలు ఆసక్తికర పరిణామాల నడుమ అధికార కన్జర్వేటివ్ పార్టీ నేతగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తద్వారా బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టిన తొలి భారత మూలాలున్న నేతగా రికార్డు సృష్టించారు. ఈ ఘనత సాధించిన తొలి శ్వేతేతరుడు కూడా రిషియే కావడం మరో విశేషం! అంతేగాక గత 210 ఏళ్లలో అతి పిన్న వయస్కుడైన బ్రిటన్ పీఎంగా కూడా రిషి మరో రికార్డు నెలకొల్పారు. ప్రధాన పోటీదారుగా భావించిన మాజీ ప్రధాని బోరిస్ సోమవారం అనూహ్యంగా తప్పుకోవడంతో ఆయనకు ఒక్కసారిగా లైన్ క్లియరైంది. మూడో అభ్యర్థి పెన్నీ మోర్డంట్ గడువు లోపు 100 మంది ఎంపీల మద్దతు కూడగట్టడంలో విఫలమవడంతో రిషి ఎన్నిక ఏకగ్రీవమైంది. అలా, నెలన్నర క్రితం లిజ్ ట్రస్‌తో హోరాహోరీగా జరిగిన పోటీలో అందినట్టే అంది తృటిలో చేజారిన ప్రధాని పదవి ఈసారి రిషిని వచ్చి వరించింది. తాను హిందువునని ప్రతి వేదికపైనా సగర్వంగా ప్రకటించుకునే రిషి సరిగ్గా దీపావళి పర్వదినం నాడే ప్రధానిగా ఎన్నికవడం భారతీయుల హర్షోత్సాహాలను రెట్టింపు చేసింది. మంగళవారం టోరీ ఎంపీలనుద్దేశించి ప్రసంగించాక ఆయన రాజు చార్లెస్–3ని కలిశారు. అనంతరం దేశ 57వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అస్తవ్యస్తంగా మారిన బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే గురుతర బాధ్యత ఇప్పుడు రిషి భుజస్కంధాలపై ఉంది. ఈ విషయంలో విఫలమవడం వల్లే ట్రస్ కేవలం 45 రోజులకే రాజీనామా చేయాల్సి రావడం, బ్రిటన్ చరిత్రలో అత్యంత తక్కువ కాలం పీఎంగా కొనసాగిన చెత్త రికార్డును మూటగట్టుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా తన అపారమైన ఆర్థిక అనుభవాన్ని రంగరించి దేశాన్ని రిషి ఎలా ఒడ్డున పడేస్తారన్నది ఆసక్తికరం. ప్రధాని అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్ నుంచి చేసిన తొలి అధికారిక ప్రసంగంలోనూ రిషి ఇదే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. బ్రిటన్ అత్యంత కఠినమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని అంగీకరించారు. ‘‘ఈ సవాలును దీటుగా ఎదుర్కొనేందుకు ఏ మాత్రం వెనకాడబోను. నాపై ఉన్న ఆకాంక్షలను పూర్తిగా నెరవేరుస్తా’’అంటూ ప్రతిజ్ఞ చేశారు. దేశాన్ని బంగారు భవిష్యత్తులోకి నడిపిస్తానంటూ నిండైన ఆత్మవిశ్వాసంతో దేశవాసులకు హామీ ఇచ్చారు. రెండు నెలల్లో మూడో ప్రధాని! బోరిస్ జాన్సన్, ట్రస్ తర్వాత గత ఏడు వారాల్లో బ్రిటన్‌కు రిషి మూడో ప్రధాని కావడం విశేషం. పార్టీ గేట్ కుంభకోణం తదితరాల దెబ్బకు మంత్రులు సొంత పార్టీ ఎంపీల డిమాండ్‌కు తలొగ్గి జాన్సన్ రాజీనామా చేయడం తెలిసిందే. అనంతరం సెప్టెంబర్‌లో జరిగిన హోరాహోరీ పోరులో రిషిపై నెగ్గి ట్రస్ ప్రధాని అయ్యారు. కానీ పన్ను కోతలు, అనాలోచిత మినీ బడ్జెట్‌తో ఆర్థిక పరిస్థితిని పెనం నుంచి పొయ్యిలో పడేశారంటూ ఇంటా బయటా తీవ్ర విమర్శల పాలయ్యారు. తప్పుకోవాలంటూ సొంత ఎంపీలే డిమాండ్ చేయడం, అవసరమైతే అవిశ్వాసం పెట్టేందుకూ సిద్ధమవడంతో మరో మార్గం లేక ఆమె గురువారం రాజీనామా ప్రకటించారు. మంగళవారం ఆపద్ధర్మ ప్రధాని హోదాలో ట్రస్ చివరి కేబినెట్ సమావేశానికి సారథ్యం వహించారు. అనంతరం బకింగ్‌హం ప్యాలెస్‌కు వెళ్లి చార్లెస్–3కి లాంఛనంగా రాజీనామా సమర్పించారు. తర్వాత రిషి రాజసౌధానికి వెళ్లి రాజుతో లాంఛనంగా భేటీ అయ్యారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న రాజు ఆహ్వానాన్ని అంగీకరిస్తూ రాచరిక సంప్రదాయాన్ని అనుసరించి ఆయన ముంజేతిని ముద్దాడారు. కల్లోల సమయంలో కఠిన బాధ్యతలను చేపడుతున్న రిషి తన బాధ్యతలను సమర్థంగా నెరవేర్చాలంటూ ప్రార్థించాల్సిందిగా బ్రిటన్ పౌరులకు కాంటర్బరీ ఆర్చిబిషప్ జస్టిన్ వెల్బీ పిలుపునిచ్చారు. ‘‘ఇది మన దేశానికి అత్యంత కష్టకాలం. ఈ అస్థిర పరిస్థితుల్లో బాధ్యతలు చేపడుఉతన్న రిషి కోసం నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా’’అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశాన్ని గ్టటెక్కించగలిగే సత్తా ఉన్న నేత రిషి మాత్రమేనని టోరీ ఎంపీల్లో అత్యధికులు నమ్ముతున్నారు. వారిలో సగం మందికి పైగా ఆయనకు బాహాటంగా మద్దతు ప్రకటించడం అందుకు నిదర్శనంగా నిలిచింది. అభినందనల వెల్లువ... రిషికి నా హార్దిక శుభాభినందనలు. బ్రిటన్‌తో భారత్ చారిత్రక సంబంధాలను ఆధునిక భాగస్వామ్యంగా మార్చుకుంటున్న వేళ ఇది నిజంగా గొప్ప పరిణామం. ప్రపంచ సమస్యల పరిష్కారానికి రిషితో కలిసి పని చేసేందుకు, 2030–రోడ్‌మ్యాప్‌ను అమలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నా – ప్రధాని నరేంద్ర మోదీ రిషి సాధించింది అపురూప విజయం. ఇదో చరిత్రాత్మక మైలు రాయి. ప్రపంచ భద్రత, ప్రగతికి సంబంధించిన పలు అంశాలపై ఆయనతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా – అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, యూరప్, మిగతా ప్రపంచంపై దాని ప్రభావాలను రిషితో కలిసి ఉమ్మడిగా ఎదుర్కొంటాం – ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రిషికి హార్దిక అభినందనలు. ఆయన హయాంలో బ్రిటన్–ఉక్రెయిన్ బంధం మరింత బలపడాలి – ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పలు అంశాలపై ఆయనతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం – ఐర్లండ్ ప్రధాని మైఖేల్ మార్టిన్ రిషి హయాంలో బ్రిటన్–ఈయూ సంబంధాలు ఇరుపక్షాల ఒప్పందాలను పరస్పరం గౌరవిస్తూ సాగుతాయని ఆశిస్తున్నాం – యూరోపియన్ కమిషన్ ప్రసిడెంట్ ఉర్సులా వాండెర్ లియాన్ ఇదో చరిత్రాత్మక రోజు. రిషికి అభినందనలు. టోరీ ఎంపీలంతా కొత్త ప్రధానికి పూర్తి మద్దతివ్వాల్సిన వేళ ఇది – బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రధానిగా పని చేయడం నాకు దక్కిన అతి గొప్ప గౌరవం. రిషికి నా అభినందనలు. అన్ని అంశాల్లో నూ ఆయనకు నా పూర్తి మద్దతుంటుంది – బ్రిటన్ తాజా మాజీ ప్రధాని లిజ్ ట్రస్ రిషికి శుభాకాంక్షలు – కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రిషికి అభినందనలు. కానీ దేశంలో తక్షణం ఎన్నికలు జరపాల్సిన అవసరముంది – బ్రిటన్ విపక్ష లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ రిషి వచ్చినా బ్రిటన్‌తో సమీప భవిష్యత్తులోనూ రష్యా సంబంధాలు మెరుగు పడతాయన్న ఆశలేమీ లేవు – రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ రిషి హయాంలో బ్రిటన్‌తో చైనా సంబంధాలు ముందుకు వెళ్తాయని ఆశిస్తున్నాం – చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ రిషిని చూసి ఎంతో గర్విస్తున్నాం. ప్రధానిగా అద్భుతంగా పాలించాలని కోరుకుంటున్నాం. – రిషి మామ, ఇన్ఫోసిస్ సహ–వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి -
ఆర్థికంగా... అడకత్తెరలో బ్రిటన్?
భారత సంతతికి చెందిన రిషీ సునాక్ బ్రిటన్ ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించడంతో... సమస్యల నుండి ఆయన దేశాన్ని ఎలా బయటపడ వేయగలడా అనే చర్చ జరుగుతోంది. మాజీ ప్రధాని లిజ్ ట్రస్ తన మినీ బడ్జెట్లో బ్యాంకర్లకు బోనసులు పెంచటం, కార్పొరేట్లకు పన్నులను తగ్గించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని ప్రయత్నించారు. కానీ మార్కెట్ ఆమె సంస్కరణలను తిరస్కరించింది. ఫలితంగా పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే రిషీ సునాక్ అయినా, మరొకరు అయినా కూడా స్థూలంగా ఈ కార్పొరేట్ అనుకూల చట్రం నుంచి బయటకు రాలేనంత కాలమూ, నయా ఉదారవాద సంస్కరణల చట్రాన్ని బద్దలు కొట్టనంతకాలమూ బ్రిటన్ ఆర్థిక పరిస్థితిలో ఏ మార్పూ ఉండదు. బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా భారతీయ మూలాలున్న రిషీ సునాక్ పదవిని చేపట్టారు. అంతకుముందరి ప్రధాని లిజ్ ట్రస్ కేవలం 45 రోజులపాటు మాత్రమే బ్రిటన్ ప్రధానిగా కొనసాగగలిగారు. గత రెండు నెలల కాలంలో బ్రిటన్‌లో ముగ్గురు ప్రధానులు మారారు. ఇటువంటి పరి స్థితి సాధారణంగా మనం ధనిక దేశాలలో, అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్యాలు అనబడే వాటిలో చూడం. మరి ప్రస్తుతం ఈ దుఃస్థితి బ్రిటన్‌కి ఎందుకు దాపురించింది? ఈ కారణాలలోకి పోయేముందు – కొత్త ప్రధాని సునాక్ అయినా నిల దొక్కుకోగలడా? అన్న ప్రశ్న ఎటూ ఎదురవుతూనే ఉంది. దీనికి జవాబుగా ‘గార్డియన్’ పత్రిక మూడు అంశాలను ముందుకు తెచ్చింది: 1. నిన్నటి ప్రధాని లిజ్ ట్రస్ ఏ సమస్యలను అయితే ఆర్థిక రంగంలో ఎదుర్కొన్నారో అదే సమస్యలు నేడు సునాక్ ముందు∙అలాగే అపరిష్కృతంగా నిలబడి ఉన్నాయి. 2. సునాక్ తాలూకూ కన్జర్వేటివ్ పార్టీ వారే ఆయనను ప్రజల మద్దతుతో ఎంపిక అయిన ప్రధానిగా చూడటం లేదు. 3. పైగా, కన్జర్వేటివ్ పార్టీలోని అనేక మంది అభిప్రాయం ప్రకారం – పార్టీని సమైక్యంగా ముందుకు తీసుకెళ్లగలగటం కష్టమైపోతోంది. అదీ పరిస్థితి! అంటే స్థూలంగా కన్జర్వేటివ్ పక్షంలోనే అనేక గందరగోళాలున్నాయి. వీటన్నింటికీ మూలం, వెనుకన ఉన్నది – బ్రిటన్ దేశంలో అపరిష్కృతంగా ఉండిపోయిన ఆర్థిక సమస్యలు. బెడిసికొట్టిన లిజ్ ట్రస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్ తాలూకు సారాంశం – ఆ దేశంలో అమలు జరుగుతోన్న ఆర్థిక విధానాల లోపాన్ని పట్టి ఇస్తుంది. ఆ బడ్జెట్లోని కీలక అంశాలు – బ్యాంకర్లు పొందగల బోనస్ మొత్తం పరిమితిని పెంచేయటం, కార్పొరేట్ ట్యాక్స్‌లను తగ్గించటం. ఈ చర్యలు – ఇప్పటికే భారీ బోనస్‌లు పొందుతోన్న బ్యాంకర్లకు, బ్రిటన్ కార్పొరేట్లకు మాత్రమే లాభం కలిగించేవి. అయితే ఈ చర్యలతోనే బ్రిటన్ పురోగతిని సాధిస్తుందని లిజ్ ట్రస్ అభిప్రాయాల సారాంశం. కానీ, ఆమె ఆలోచనలను – కడకు ఆ దేశం తాలూకు ఫైనాన్స్ మార్కెట్లు కూడా తిప్పికొట్టాయి. అయితే ఈ ఆలోచనలు కేవలం లిజ్ ట్రస్వి మాత్రమే కాదు. అవి ఆ దేశంలో మొదలై నేడు ప్రపంచ వ్యాపితంగా అమలు జరుగుతోన్న ఉదారవాద సంస్కరణల ఆత్మగా ఉన్నాయి. సామాన్య జనం, కింది వర్గాలకు కాకుండా... పై వర్గాల వారైన ధనికులూ, కార్పొరేట్లకూ మరిన్ని రాయితీలు ఇస్తే ఆర్థికాభివృద్ధి మరింత బాగా జరుగుతుందనీ, ఈ వర్గాల పెట్టుబడుల వల్ల ప్రజలకు మరింతగా ఉపాధి కల్పించబడుతుందనీ ఈ విధాన సారాంశం. 1979–80లలో ఆరంభమైన ఈ ప్రపంచీకరణ విధానాలు... సంక్షో భాలు లేని ఆర్థిక వ్యవస్థ కోసం ప్రజల కొనుగోలు శక్తి బాగుండటం (మార్కెట్లో డిమాండ్ ఉండటం) అనే అంశాన్ని విస్మరించాయి. ఈ విధానాలతోపాటుగా రంగ ప్రవేశం చేసిందే – ‘ద్రవ్యలోటు ఉండటం తప్పనే’ ఆర్థిక సిద్ధాంతం. ఒక దేశ ప్రభుత్వం తాలూకు ఖర్చులు, దాని ఆదాయంకంటే ఎక్కువగా ఉండరాదనే దీని అర్థం. దీనివల్ల ద్రవ్యోల్బణం పెరిగిపోతుందని అంటున్నారు. దీనిని నియం త్రించేందుకు ప్రభుత్వాలు పొదుపు చర్యలను పాటించాలనీ... ఖర్చు లను తగ్గించుకోవాలనీ బోధిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచం లోని పలు ఇతర దేశాలలోలాగానే – బ్రిటన్‌లో కూడా ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలపై రానురానూ కోతలు పెరిగి పోతున్నాయి. కాగా, కోవిడ్ కాలంలో అనివార్యమైన అధిక ప్రభుత్వ వ్యయాల వల్ల బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం కట్టలుదాటింది. నేడు అది 10.1 శాతంగా ఉంది. పెరిగిన ధరలతో వారి కొనుగోలు శక్తి పడి పోయింది. ఫలితంగా నేడు ప్రతి ఐదుగురిలో ఒకరు రోజూ పస్తులు ఉండవలసిన పరిస్థితి దాపురించింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధంవల్ల ఇంధన ధరలు బ్రిటన్‌లో కూడా నింగినంటాయి. దీనికోసం ప్రభుత్వం ప్రజలకు మరింతగా ఇంధన వ్యయాల రాయితీలు ఇవ్వడం, సంక్షేమాన్ని మెరుగుపరచాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, మరోపక్కన ఈ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే పేరిట బ్రిటన్ కేంద్ర బ్యాంక్ వడ్డీరేట్లను పెంచుతోంది. ఫలితంగా ప్రజల కొనుగోలు శక్తి మరింత పడిపోతోంది. అలాగే, ఆర్థిక వృద్ధి రేటు కూడా మందగిస్తోంది. అంటే ద్రవ్యోల్బణం అదుపుకు వడ్డీరేట్లు పెంచితే అది అసలుకే ముప్పు తెచ్చి ఆర్థిక వృద్ధి రేటును దిగజారు స్తోందన్నమాట! ఫలితంగా నిరుద్యోగం పెరిగిపోతోంది. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాలలాగానే బ్రిటన్ కూడా ఈ ద్రవ్యోల్బణం – వృద్ధి రేటు పతనం అడకత్తెరలో చిక్కుకుంది. అంటే, వృద్ధి రేటు పడి పోయి... నిరుద్యోగం పెరిగిపోతోందని తిరిగి మరలా వృద్ధి రేటును పెంచేందుకు ఆర్థిక వ్యవస్థలోకి ఉద్దీపనల రూపంలో డబ్బును పంప్ చేస్తే– రెండోపక్కన ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. అలాగని ద్రవ్యోల్బ ణాన్ని అదుపు చేసేందుకు – వడ్డీ రేట్ల పెంపుదల వంటి డబ్బు చలామణిని తగ్గించే చర్యలు తీసుకుంటే వృద్ధి రేటు మరలా తక్షణమే పతనం అవుతోంది. ఈ ద్రవ్యోల్బణ సమస్య కేవలం ప్రజలకే కాక, షేర్ మార్కెట్లలో అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడిదారుల పెట్టుబడులకూ... అలాగే, కార్పొరేట్ల లాభాల మార్జిన్లకూ కూడా కంటగింపుగానే ఉంది. నిజా నికి నేడు బ్రిటన్‌లో కావచ్చూ, ఇతర దేశాలలోనూ కావచ్చు... ఆయా దేశాల ప్రభుత్వాలు ద్రవ్యోల్బణం అదుపు పేరిట బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచడం... ప్రజలను ధరల పెరుగుదల నుంచి కాపాడేందుకు కాదు. ప్రధానంగా షేర్ మార్కెట్లలోని ఫైనాన్స్ పెట్టుబడిదారుల మదుపుల తాలూకు విలువను కాపాడటం. అంటే, ఒక ఫైనాన్స్ పెట్టుబడి దారుడు షేర్ మార్కెట్లో 100 పౌండ్లు పెట్టుబడి పెట్టి దానిపై మరో పది పౌండ్లు లాభం సంపాదిస్తే గనుక... ఈ అసలు+లాభం (110 పౌండ్లు) తాలూకు సంపూర్ణ ఫలితం అతనికి దక్కా లంటే – పౌండ్ కరెన్సీ విలువ కాపాడబడాలి. అంటే, అతను ఆ పెట్టుబడి పెట్టే నాటి కంటే – దానిని సొమ్ము చేసుకునే నాటికి గనుక పౌండ్ విలువ తగ్గితే, ఆ మేరకు అతని రాబడి తాలూకు నికర విలువ తగ్గిపోతుంది. కాబట్టి ఫైనాన్స్ పెట్టుబడిదారుల రాబడులను కాపాడాలంటే ద్రవ్యోల్బ ణాన్ని నిలువరించాలి. అదీ కథ. ఆయా దేశాలలోని సామాన్య జనం తాలూకు ప్రయోజనాలూ, వారిపై పడుతోన్న ధరాభారానికి పరిష్కారం అనేవి కేవలం ముసు గులు మాత్రమే. అందుచేతనే ప్రస్తుతం నిరుద్యోగం పెరిగి... ధరలూ పెరిగిపోయి సతమతమవుతోన్న జనాన్ని ఆదుకునేందుకు ఆర్థిక ప్రణాళికలను రూపొందించే బదులు... ప్రస్తుత బ్రిటన్ ప్రభుత్వం కార్పొరేట్ రాయితీలు ఇచ్చి సమస్యను పరిష్కరించ జూస్తోంది. ఇక నేడు రిషీ సునాక్ కూడా కొద్దిపాటిగా ప్రజలకు కొన్ని రాయితీలు ఇచ్చే ప్రయత్నం చేసినా– స్థూలంగా కార్పొరేట్ అనుకూల చట్రం నుంచి ఆయన కూడా బయటకు రాలేడు. అంతిమంగా అది సునాక్ అయినా, మరొకరయినా ఈ కార్పొరేట్, షేర్ మార్కెట్ అనుకూల చట్రం నుంచీ బయటపడలేనంత కాలం సమస్యలు పరిష్కారం కావు. రష్యా విప్లవనేత వ్లాదిమిర్ లెనిన్ బోధించిన విప్లవ పరిస్థితి గురించిన 3 అంశాలలోని ఒకటి ఇక్కడ గమనించి తీరవలసింది. ఒక దేశంలో విప్లవాత్మక (రచయిత: హింసాత్మకమే కానక్కర లేదు) మార్పునకు పరిస్థితి ముంచుకొచ్చిందనటానికి ఒక ప్రధాన తార్కాణం – ఆ దేశం లోని పాలక వర్గం ఇక ఎంతమాత్రమూ పాత పద్ధతులలో పరిపా లించ లేకపోవడం! ప్రస్తుతం ప్రపంచమంతటా జరుగుతుంది ఇదే. వివిధ ప్రభుత్వాలు నయా ఉదారవాద సంస్కరణల ఊబిలో కూరుకు పోయి – ద్రవ్యోల్బణం – వృద్ధి పతనం అడకత్తెరకు పరిష్కారం చూప లేక ఒకదాని తరువాత ఒకటిగా సంక్షోభంలోకి పోతున్నాయి. ఈ చట్రాన్ని బద్ధలు కొట్టనంతవరకు ఏ దేశంలోని ప్రజలకూ స్థిమితం ఉండదు... పాలకులకు స్థిరత్వం ఉండదు! డి. పాపారావు వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు ‘ 98661 79615 -
ఆపద్బాంధవుడు అవుతారా?
రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు. తాజా ఉదాహరణ – బ్రిటన్ ప్రధానమంత్రి పగ్గాలను రిషీ సునాక్ చేపట్టడం. సొంత పార్టీ సారథ్యానికి జరిగిన పోటీలో ఓటమి పాలై నిండా నెలన్నరైనా గడవక ముందే ఆ పదవి ఆయనను వరిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. కనీసం రిషి సైతం కలగని ఉండరు. కానీ అదే జరిగింది. బ్రిటన్ పీఠంపై భారతీయ మూలాలున్న తొలి ప్రధానిగా, 200 ఏళ్ళ బ్రిటన్ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన ప్రధానిగా 42 ఏళ్ళ రిషి అవతరించారు. కానీ, ఆర్థిక సంక్షోభంలో ఉన్న బ్రిటన్‌కూ, అంతర్గత విభేదాలతో ఉన్న అధికార కన్జర్వేటివ్ పార్టీకీ ఆయన ఆపద్బాంధవుడు కాగలరా? ఇటీవలి ప్రధానులు డేవిడ్ కామెరాన్, థెరెసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్లు నలుగురిలో ముగ్గురి కన్నా తక్కువ అనుభవం ఉన్న ఆయన నెగ్గుకు రాగలరా? రెండేళ్ళ క్రితం భగవద్గీతపై ప్రమాణం చేసి మంత్రి పదవి చేపట్టి, దీపావళికి ఇంటి ముందు దీపాలు వెలిగించి సనాతన సంప్రదాయాన్ని పాటించినందుకు బ్రిటన్‌లో విమర్శల పాలైన పంజాబీ హిందూ రిషి తీరా ఈ దీపావళి నాడు అదే దేశానికి ప్రధాని కావడం కాకతాళీయం. మాజీ బాస్ బోరిస్ జాన్సన్, మరో పోటీదారు పెన్నీ మార్డాంట్లు బరిలో నిలిచేందుకు కావాల్సిన 100 మంది ఎంపీల మద్దతును కూడగట్టుకోలేకపోవడంతో, ఈసారి ప్రధాని పీఠానికి రిషి పయనం నల్లేరు మీద బండి నడక అయింది. కానీ, 45 రోజుల్లోనే పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చిన బ్రిటన్ తాజా మాజీ ప్రధాని లిజ్ ట్రస్ అందుకు తనను తాను తప్ప వేరెవరినీ నిందించలేరు. అనాలోచిత చర్యలతో కూడిన ‘మినీ బడ్జెట్’ను ప్రవేశపెట్టి, పౌండ్ విలువ భారీగా తగ్గడానికీ, మార్కెట్ పతనానికీ కారణమయ్యారనే అపకీర్తిని ఆమె మూటగట్టుకున్నారు. కరోనా కాలంలో చేపట్టిన చర్యలకు మంచి పేరు తెచ్చుకున్న రిషి తాజా గందరగోళాన్ని ఎలా చక్కదిద్దుతారో చూడాలి. తప్పులను సరిదిద్దడానికే తనకు బాధ్యత అప్పగించారనీ, తక్షణమే ఆ పని మొదలుపెడుతు న్నాననీ రిషి మాట. కేవలం ఏడేళ్ళ పార్లమెంటరీ అనుభవమే ఉన్న రిషి అయిదేళ్ళకే ఆర్థిక మంత్రి, ఆ పైన రెండేళ్ళకే ప్రధానీ అయ్యారు. విశ్వసనీయత, ప్రొఫెషనలిజమ్, జవాబుదారీతనం ముఖ్యమైన వేళ కోరి తలపై పెట్టుకున్న ప్రధాని పట్టం అన్ని విధాలా ముళ్ళకిరీటమని రిషికి తెలుసు. ఒకపక్క అంతర్గత కుమ్ములాటల్లో పడిపోయిన స్వపక్షీయులైన కన్జర్వేటివ్‌ల మధ్య ఐక్యత తేవడానికి ఆయన శ్రమించాలి. మరోపక్క కట్టుదిట్టమైన చర్యలతో దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాలి. ఈ శ్వేతేతర జాతి నేత పదవి చేపట్టిన మంగళవారమే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. లిజ్ సారథ్యంలో పనిచేసిన పలువురు మంత్రులకు ఉద్వాసన పలికారు. మునుపటి లిజ్ మంత్రివర్గంలోకి ఆఖరి రోజుల్లో వచ్చిన ఆర్థిక మంత్రి జెరెమీ హంట్‌ను అదే పదవిలో పునర్నియమించారు. పార్టీకి కొత్త ఛీఫ్ విప్‌ను పెట్టారు. అన్నట్టుగానే వెంటనే పనిలోకి దిగారు. కారణాలు ఏమైనా, ఒకే ఏడాదిలో బ్రిటన్ ముచ్చటగా మూడో ప్రధానమంత్రిని చూసేలా చేసింది అధికార పార్టీ. గడచిన 12 ఏళ్ళ పాలన దేశాన్ని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టిందనే ఆరోపణ ఉంది. ఇప్పుడు 700 మిలియన్ పౌండ్లకు పైగా ఆస్తులతో ఆ పార్టీలోని రిషీ సునాక్ దంపతులు సాక్షాత్తూ బ్రిటన్ రాజు కన్నా అధిక ధనవంతులనే చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో కనీసం కొత్త ప్రభుత్వమైనా సుస్థిర ఆర్థిక విధానాలను అనుసరించాలనీ, ఘడియకో మార్పు చేయరాదనీ బ్రిటన్ ఆర్థిక విపణి భావిస్తోంది. రిషి ఆ ఆకాంక్షకు తగ్గట్టు వ్యవహరిస్తే మునుపటిలా మార్కెట్ పతనం కాకపోవచ్చు. దేశానికి ఓ దిశ, దశ కల్పించడం క్లిష్టమే. ‘ఆర్థిక సుస్థిరత, సమర్థత ప్రభుత్వ అజెండా’ అంటున్న రిషి అదుపు తప్పి పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయ సంక్షోభాలకు కళ్ళెం వేయాలి. కఠిన నిర్ణయాలు తప్పవంటూ పగ్గాలు చేపడుతూనే ప్రకటించినా, అందుకు చిక్కులు లేకపోలేదు. కన్జర్వేటివ్‌ల సర్వసాధారణ సిద్ధాంతమే పన్నుల తగ్గింపు. తీరా ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పన్నులు విధిస్తే, సొంత పార్టీలోనే ఆయనకు నిరసన ఎదురు కావచ్చు. ప్రతిపక్ష లేబర్ పార్టీ ఆశ కూడా అదే. రిషి మాత్రం సంక్షోభ పరిష్కారానికి మంత్ర దండమేదీ లేదనీ, కాకమ్మ కథల్లో తనకు నమ్మకం లేదనీ అంటున్నారు. అందుకే, రాబోయే రోజుల్లో ఆయన ఏం చేస్తారు, ఎలా దేశాన్ని గట్టెక్కిస్తారన్నది ఆసక్తికరం. ఏళ్ళ తరబడి మనల్ని బానిసలను చేసుకొని పాలించి, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడడానికి అనేక అభ్యంతరాలు పెట్టిన రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్యం... తీరా మనకు స్వాతంత్య్రం దక్కిన సరిగ్గా 75 ఏళ్ళ తర్వాత ఇప్పుడు విచిత్రంగా భారతీయ మూలాలున్న వ్యక్తి ఏలుబడిలోకి రావడం విధి చేసిన వింత. నిజానికి, అప్పటి బ్రిటన్, ఇప్పటి బ్రిటన్ అనేక రీతుల్లో వేరు. అయితేనేం, మన భారతీయుల వరకు ఇది అహాన్ని సంతృప్తిపరచే అంశమే. మన దేశాన్ని మరొకరు పాలించడానికి ఇచ్చగించకపోయినా, మరో దేశంలో మనవాడు జెండా ఎగరేశాడంటూ సహజమైన సంతోషాన్నీ వ్యక్తం చేస్తాం. బ్రిటన్‌తో మన బంధం బలపడుతుందనీ ఆశిస్తాం. సంక్లిష్టమైన, ఈ సరికొత్త బాధ్యతల్లో రిషి విజయం సాధించి, రాజకీయ, ఆర్థిక సుస్థిరత అందించాలనే కోరుకుందాం. తప్పేమీ కాదు. కానీ, అది అనుకున్నంత తేలిక కాదు. చిన్న తేడా జరిగినా, ఆపైన దేశంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారాన్ని ప్రతిపక్ష లేబర్ పార్టీకి అప్పనంగా అందించారనే అపకీర్తి రిషి మెడ మీద కత్తిలా వేలాడుతూనే ఉంటుంది. -
Liz Truss: 45 రోజుల్లో ఏం జరిగింది ?
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ పదవి మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. బ్రెగ్జిట్, కోవిడ్, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో అప్పుల కుప్పగా మారి దేశం ఆర్థికంగా పెనుసవాళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పదవిని చేపట్టిన లిజ్ ట్రస్ దేశాన్ని ఆర్థికంగా గాడిలో పెట్టడంలో దారుణంగా విఫలమయ్యారు. ప్రధాని పదవి చేపట్టిన తర్వాత లిజ్ ట్రస్ ప్రభుత్వం తీసుకున్న ప్రతీ నిర్ణయం వివాదాస్పదమైంది. బ్రిటన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో ఏర్పడిన ఆర్థిక, మార్కెట్ ప్రకంపనలు సొంత పార్టీలోనూ ఆమెపై వ్యతిరేకతను పెంచాయి. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీలే ట్రస్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి సిద్ధపడుతూ ఉండడంతో ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది. కేవలం 45 రోజుల మాత్రమే పదవిలో కొనసాగి అత్యంత తక్కువ కాలం ప్రధానిగా ఉన్న వ్యక్తిగా బ్రిటన్ చరిత్రలో లిజ్ ట్రస్ మిగిలిపోయారు. 1827లో కన్జర్వేటివ్ ప్రధాని జార్జ్ కానింగ్ పదవి చేపట్టిన 119 రోజుల్లో న్యుమోనియాతో మరణించారు. ఇన్నాళ్లూ బ్రిటన్ చరిత్రలో తక్కువ కాలం కొనసాగిన ప్రధానిగా ఆయనే ఉన్నారు. విద్యుత్ బిల్లులు ఫ్రీజ్ ప్రజాసంక్షేమం పేరుతో లిజ్ ట్రస్ తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వ ఖజానాపై మోయలేని భారాన్ని వేశాయి. రష్యా గ్యాస్ కోతలతో బ్రిటన్‌లో విద్యుత్ బిల్లులు తడిసి మోపెడవతూ ఉండడంతో వాటిని కట్టలేక జనం హడలెత్తిపోతున్నారు. దీంతో లిజ్ ట్రస్ ప్రభుత్వం రెండేళ్ల పాటు విద్యుత్ బిల్లుల్ని ఫ్రీజ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వ ఖజానాపై 8,900 కోట్ల పౌండ్ల భారం పడింది. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రభుత్వం మరింత సంక్షోభంలోకి కూరుకుపోయింది మినీ బడ్జెట్ ప్రకంపనలు బ్రిటన్ ఆర్థిక మంత్రి క్వాజీ క్వార్టెంగ్ సెప్టెంబర్ 23న పార్లమెంటులో ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ఈ మినీ బడ్జెట్లో ప్రవేశపెట్టిన పన్ను కోతలు కనీవినీ ఎరుగనివి. 1972 తర్వాత ఈ స్థాయిలో పన్ను రాయితీలు ఏ ప్రభుత్వమూ ఇవ్వలేదు. సామాన్య ప్రజలతో పాటు సంపన్నులకి 4,500 కోట్ల పౌండ్ల పన్ను మినహాయింపులివ్వడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలను బడ్జెట్లో చూపించకుండా విద్యుత్ బిల్లుల రాయితీలకే కోట్లాది పౌండ్లు కేటాయించడం ఆర్థికంగా ప్రకంపనలు సృష్టించింది. డాలర్‌తో పోల్చి చూస్తే పౌండ్ విలువ భారీగా పడిపోయింది. ఈ సంక్షోభాన్ని గట్టెక్కించడానికి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ 6,500 కోట్ల పౌండ్ల విలువైన బాండ్లను కొనుగోలు చేస్తామని చెప్పడం కొన్ని పెన్షన్ స్కీమ్స్‌ను ప్రమాదంలోకి నెట్టేశాయి. ఇది రాజకీయంగా లిజ్ ట్రస్‌కు ఎదురు దెబ్బగా మారింది. కొందరు ఎంపీలు ఆమె రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేయడం ప్రారంభించారు. అయినప్పటికీ కొద్ది రోజులు ఆమె తన చర్యల్ని సమర్థించుకుంటూ వచ్చారు. అయితే సొంత పార్టీలోనే ఆమెపై వ్యతిరేకత మరింతగా పెరిగిపోవడంతో మినీ బడ్జెట్‌పై యూ టర్న్ తీసుకున్నారు. తనకు అత్యంత సన్నిహితుడైన ఆర్థిక మంత్రి క్వాజీ క్వార్టెంగ్పై వేటు వేశారు. కొత్త ఆర్థిక మంత్రిగా జెరెమి హంట్‌ను నియమించారు. మినీబడ్జెట్లో ప్రతిపాదనల్ని వెనక్కి తీసుకున్నా అప్పటికే రాజకీయంగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. హోంమంత్రి రాజీనామాతో రాజకీయ అనిశ్చితి బ్రిటన్ హోంమంత్రి సుయెల్లా బ్రేవర్మన్ చేసిన ఒక పొరపాటుతో బుధవారం ఆమె తన పదవికి రాజీనామా చేయడం కూడా లిజ్ ట్రస్‌కు ఎదురు దెబ్బగా మారింది. బ్రిటన్ వలస విధానాలకు సంబంధించిన ఒక డాక్యుమెంట్‌ను బ్రేవర్మన్ తన వ్యక్తిగత ఈ మెయిల్ నుంచి సహచర ఎంపీగా పంపడం తీవ్ర దుమారానికి దారి తీసింది. దీంతో ఆమె తన తప్పుని అంగీకరిస్తూ రాజీనామా చేశారు. మరోవైపు లిజ్‌ట్రస్‌పై కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 100 మంది సభ్యులు అక్టోబర్ 31లోగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి దింపాలన్న ప్రచారం జరిగింది. ఆర్థికంగా, రాజకీయంగా ఎదురవుతున్న సవాళ్లను తట్టుకోలేక దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పిన ఒక్క రోజులోనే ఆమె పదవిని వీడారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆర్థిక విధానంపై అప్పుడే యూ టర్న్.. చిక్కుల్లో బ్రిటన్ ప్రధాని
దాదాపు నెలన్నర క్రితం సంగతి. సెప్టెంబర్ 5న భారత సంతతికి చెందిన మాజీ మంత్రి రిషి సునాక్‌ను ఓడించి లిజ్ ట్రస్ బ్రిటన్ ప్రధాని పీఠమెక్కారు. అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోయిన జీవన వ్యయాన్ని తగ్గిస్తానని, చుక్కలనంటుతున్న ఇంధన ధరలకు ముకుతాడు వేస్తానని, కట్టు తప్పుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతానని ప్రకటించారు. ‘చేసి చూపిస్తా’మంటూ ప్రతిజ్ఞ చేశారు. కానీ నెల రోజుల్లోనే అన్నివైపుల నుంచీ ఆమెకు గట్టిగా సెగ తగులుతోంది. ఆర్థిక వ్యవస్థను పట్టాలకెక్కించేందుకు ఆమె ప్రతిపాదించిన విధానాలన్నీ ద్రవ్యోల్బణ కట్టడిలో ఒక్కొక్కటిగా విఫలమవుతున్నాయి. ట్రస్ తొలి మినీ బడ్జెట్ అన్ని వర్గాల్లోనూ తీవ్ర విమర్శల పాలైంది. ప్రధానంగా కార్పొరేషన్ ట్యాక్స్‌ను 19 శాతానికి తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని దాన్ని ఎప్పట్లా 25 శాతంగానే కొనసాగిస్తామంటూ యూ టర్న్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామాలన్నీ కన్జర్వేటివ్ నేతలు, ఎంపీలను బాగా కలవరపెడుతున్నాయి. వారిలో ట్రస్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని బ్రిటిష్ మీడియా పేర్కొంటోంది. ఆర్థిక మంత్రిపై ఇప్పటికే వేటు పడింది. ప్రధాని మార్పు కూడా అనివార్యమని ఎంపీల్లో అత్యధికులు భావిస్తున్నారని చెబుతోంది. సమస్యలను చక్కదిద్దడంలో, సొంత పార్టీ నేతల విశ్వాసాన్ని నిలుపుకోవడంలో విఫలమవుతున్న ట్రస్ ఏ క్షణమైనా తప్పుకోవాల్సి రావచ్చంటున్నారు! ఆమె రాజీనామాకు టోరీ ఎంపీలు త్వరలో బహిరంగ పిలుపు ఇచ్చే అవకాశముందని బ్రిటిష్ మీడియాలో వార్తలొస్తున్నాయి!! ఆరేళ్లు, నలుగురు ప్రధానులు ఆరేళ్లుగా అధికార కన్జర్వేటివ్ పార్టీకి అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడంపై 2016లో బ్రెగ్జిట్ రిఫరెండం నిర్వహించినప్పటి నుంచి ఏకంగా నలుగురు ప్రధానులు మారారు! 2016లో డేవిడ్ కామెరాన్ తప్పుకుని థెరెసా మే ప్రధాని అయ్యారు. కానీ బ్రెగ్జిట్ ఒప్పందంపై ప్రతిష్టంభన ఆమె పీఠానికి ఎసరు పెట్టింది. 2019లో బోరిస్ జాన్సన్ పగ్గాలు చేపట్టారు. మూడేళ్లయినా నిండకుండానే ఆయనా అనేకానేక వివాదాల్లో చిక్కుకున్నారు. దాంతో అయిష్టంగానే గత జూలైలో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడిక ట్రస్ వంతు కూడా వచ్చినట్టేనంటూ ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఆర్థిక విధానాలపై యూ టర్న్ తీసుకోవడం ఆమెకు అప్రతిష్ట తెచ్చిపెట్టిందంటున్నారు. ఇవీ ‘తప్పు’టడుగులు... ► ఆర్థిక మంత్రిగా తొలిసారిగా నల్ల జాతీయుడైన క్వాసీ క్వార్టెంగ్ను ట్రస్ ఎంచుకున్నారు. పౌరుల నివాస పన్నులు, ఇంధన ఖర్చులను తగ్గించడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రతిష్టంభనను వదిలించేందుకు ఆయన ప్రకటించిన మినీ బడ్జెట్ పూర్తిగా బెడిసికొట్టింది. ఏకంగా 4,500 కోట్ల పౌండ్ల మేరకు పన్ను తగ్గింపులను ప్రకటించారు. ద్రవ్యోల్బణం చుక్కలనంటుతున్న వేళ ఇది ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేస్తుందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. బ్రిటన్ కరెన్సీ పౌండ్ విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. ► తొలుత ఆర్థిక మంత్రి నిర్ణయాన్ని సమర్థించిన ట్రస్, కొద్ది రోజులకే యూ టర్న్ తీసుకుంటూ అత్యధిక స్థాయి ఆదాయ పన్ను రేటు తగ్గింపును రద్దు చేయడం వివాదానికి దారితీసింది. పైగా ఇది సొంత పార్టీలోనూ ఆమెపై తీవ్ర అసంతృప్తికి దారి తీయడంతో ఎటూ పాలుపోక క్వాసీని తప్పించి జెరెమీ హంట్‌కు ఆర్థిక శాఖ అప్పగించారు. రిషి పన్నుల పెంపు ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించిన ఆమె, ఇప్పుడు ఆయన బాటలోనే నడవడాన్ని అసమర్థతగానే అంతా భావిస్తున్నారు. రిషివైపే టోరీ ఎంపీల మొగ్గు? ట్రస్ తప్పుకుంటే తదుపరి ప్రధానిగా రిషి పేరే ప్రముఖంగా విన్పిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనే సమర్థ ప్రత్యామ్నాయమని కన్జర్వేటివ్ ఎంపీలు భావిస్తున్నట్టు బ్రిటిష్ మీడియా చెబుతోంది. రిషీని ప్రధానిగా, పెన్నీ మోర్డంట్ను ఆయనకు డిప్యూటీగా నియమించే ఆలోచన సాగుతోందంటున్నారు. లేదంటే మోర్డంట్ ప్రధానిగా, రిషి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టొచ్చని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. చివరికి మళ్లీ బోరిస్ జాన్సనే తిరిగొచ్చినా ఆశ్చర్యం లేదంటున్న వాళ్లూ ఉన్నారు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
పగ్గాలు చేపట్టిన లిజ్
లండన్: హోరాహోరి పోరులో నెగ్గి కన్జర్వేటివ్ పార్టీ నేతగా ఎన్నికైన లిజ్ ట్రస్ (47)ను బ్రిటన్ ప్రధానిగా రాణి ఎలిజబెత్2 లాంఛనంగా నియమించారు. ట్రస్ మంగళవారం స్కాట్లండ్ వెళ్లి అక్కడి బాల్మోరల్ క్యాజిల్‌లో వేసవి విడిదిలో సేదదీరుతున్న 96 ఏళ్ల రాణితో భేటీ అయ్యారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఈ సందర్భంగా రాణి ఆమెను ఆహ్వానించారు. అంతకుముందు తాత్కాలిక ప్రధాని బోరిస్ జాన్సన్ (58) రాణికి తన రాజీనామా సమర్పించారు. కొత్త ప్రధానిని ప్రభుత్వ ఏర్పాటుకు రాణి ఆహ్వానించే ప్రక్రియ లండన్‌లోని బకింగ్‌హం ప్యాలెస్‌లో జరగడం ఆనవాయితీ. కానీ వృద్ధాప్యంతో రాణి ప్రయాణాలు బాగా తగ్గించుకున్నారు. దాంతో తొలిసారిగా వేదిక బాల్మోరల్ క్యాజిల్‌కు మారింది. ఎలిజబెత్2 హయాంలో ట్రస్ 15వ ప్రధాని కావడం విశేషం! 1952లో విన్స్టన్ చర్చిల్ తొలిసారి ఆమె ద్వారా ప్రధానిగా నియమితుడయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు ఆహ్వానం అందుకున్న అనంతరం ట్రస్ లండన్ తిరిగి వచ్చారు. ప్రధానిగా తొలి ప్రసంగం అనంతరం తన కేబినెట్‌ను ఆమె ప్రకటించనున్నారు. భారత సంతతికి చెందిన అటార్నీ జనరల్ సుయెల్లా బెవర్మన్‌ను హోం మంత్రిగా ట్రస్ ఎంచుకున్నారు. ప్రధాని పీఠం కోసం ట్రస్‌తో చివరిదాకా హోరాహోరీ పోరాడిన భారత సంతతికి చెందిన రిషి సునాక్ మాత్రం ఆమె కేబినెట్లో చేరబోనని దాదాపుగా స్పష్టం చేశారు. రాజీనామాకు ముందు జాన్సన్ వీడ్కోలు ప్రసంగం చేశారు. ‘ఆట మధ్యలో నిబంధనలు మర్చేయడం ద్వారా’ సహచర పార్టీ నేతలే తనను బలవంతంగా సాగనంపారంటూ ఆక్రోశించారు. తనను తాను అప్పగించిన పని విజయవంతంగా పూర్తి చేసిన బూస్టర్ రాకెట్‌గా అభివర్ణించుకున్నారు. మున్ముందు కూడా అవసరాన్ని బట్టి తళుక్కుమని మెరుస్తుంటానని చమత్కరించారు. ట్రస్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు. -
UK PM Election Results 2022: బ్రిటన్ పీఠం ట్రస్‌దే
లండన్/న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధాని పీఠం కోసం జరిగిన పోరులో విదేశాంగ మంత్రి మేరీ ఎలిజబెత్ (లిజ్) ట్రస్ (47)దే పై చేయి అయింది. హోరాహోరి పోరులో భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ (42)పై ఆమె విజయం సాధించి కన్జర్వేటివ్ పార్టీ నేతగా ఎన్నికయ్యారు. తద్వారా బోరిస్ జాన్సన్ వారసురాలిగా ప్రధాని పదవి చేపట్టనున్నారు. సోమవారం వెల్లడైన ఫలితాల్లో ట్రస్ 81,326 ఓట్లు సాధించారు. రిషికి 60,399 ఓట్లు పోలయ్యాయి. ఫలితాల అనంతరం ట్రస్ మాట్లాడారు. పార్టీ నేతగా ఎన్నికవడం గొప్ప గౌరవమన్నారు. తనపై నమ్మకముంచినందుకు పార్టీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘మేం చేసి చూపిస్తాం’ అంటూ ముమ్మారు ప్రతిజ్ఞ చేశారు. ‘‘పన్నులకు కోత విధించి ప్రజలపై భారం తగ్గించి చూపిస్తాం. ఇంధన సంక్షోభాన్ని అధిగమిస్తాం. ఈ కష్టకాలం నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి సాహసోపేతమైన చర్యలు చేపడతా. యునైటెడ్ కింగ్డమ్ సామర్థ్యం ఏమిటో ప్రపంచానికి మరోసారి చూపిద్దాం’’ అంటూ అనంతరం ట్వీట్ చేశారు. రిషి చివరిదాకా తనకు పోటీ ఇచ్చారంటూ అభినందించారు. ప్రధానిగా బోరిస్ ఘన విజయాలు సాధించారంటూ ఆకాశానికెత్తారు. మార్గరెట్ థాచర్, థెరిసా మే తర్వాత బ్రిటన్ ప్రధాని కానున్న మూడో మహిళ ట్రస్. పన్నుల తగ్గింపు హామీలు, రిషిపై కోపంతో జాన్సన్ లోపాయికారీ మద్దతు తదితరాలు ట్రస్ గెలుపుకు ప్రధానంగా పని చేశాయని చెబుతున్నారు. తాత్కాలిక ప్రధాని జాన్సన్ లాంఛనంగా రాజీనామా సమర్పించిన అనంతరం మంగళవారం ట్రస్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఆమె నిర్ణయాత్మక విజయం సాధించారంటూ జాన్సన్ అభినందించారు. ‘‘నానాటికీ పెరిగిపోతున్న జీవన వ్యయం వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు, పార్టీని, దేశాన్ని ముందుకు నడిపేందుకు ట్రస్ వద్ద సరైన ప్రణాళికలున్నాయి. పార్టీ నేతలంతా ఆమె వెనక నిలవాల్సిన సమయమిది’’ అంటూ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ట్రస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె నాయకత్వంలో ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాలు మరింత పటిష్టమవుతాయని ఆశాభావం వెలిబుచ్చారు. రిషి సంచలనం పార్టీ గేట్, విశ్వసనీయతకు సంబంధించిన ఆరోపణలతో ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేయాల్సి రావడం తెలిసిందే. నైతికత లేని జాన్సన్ సారథ్యంలో పని చేయలేనంటూ ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేయడం ద్వారా రిషి సంచలనం సృష్టించారు. మంత్రులంతా ఆయన బాటే పట్టి వరుసగా రాజీనామా చేయడంతో జాన్సన్ అయిష్టంగానే తప్పుకోవాల్సి వచ్చింది. తద్వారా వచ్చి పడ్డ కన్జర్వేటివ్ పార్టీ నేత ఎన్నికలో మెజారిటీ ఎంపీల మద్దతు కూడగట్టడం ద్వారా తొలుత రిషియే ముందంజలో ఉన్నారు. తర్వాత ట్రస్ అనూహ్యంగా దూసుకెళ్లారు. 1,72,437 లక్షల కన్జర్వేటివ్ ఓటర్లను ఎక్కువ మందిని ఆకర్షించడంలో సఫలమయ్యారు. ఆమెకు 57.4 శాతం ఓట్లు పోలవగా రిషికి 42.6 శాతం వచ్చాయి. ఆయన ఓటమి చవిచూసినా బ్రిటన్ ప్రధాని పదవి కోసం తలపడ్డ తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. తనకు ఓటేసిన అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ‘‘కన్జర్వేటివ్ సభ్యులమంతా ఒకే కుటుంబం. ఈ కష్టకాలం నుంచి గట్టెక్కించే ప్రయత్నాల్లో మనమంతా కొత్త ప్రధాని ట్రస్‌కు దన్నుగా నిలుద్దాం’’ అంటూ ట్వీట్ చేశారు. పన్నుల విషయంలో ట్రస్‌తో విధానపరమైన వైరుధ్యం కారణంగా రిషి ఆమె కేబినెట్లో చేరడం అనుమానమేనంటున్నారు. అంచెలంచెలుగా ఎదిగి... బ్రిటన్ నూతన ప్రధాని లిజ్ ట్రస్ కరడుగట్టిన కమ్యూనిస్టుల కుటుంబం నుంచి వచ్చారు. ఆమె 1975లో ఆక్స్‌ఫర్డ్‌లో జన్మించారు. తండ్రి మ్యాథ్స్ ప్రొఫెసర్ కాగా తల్లి నర్స్ టీచర్. యూకేలో పలు ప్రాంతాల్లో విద్యాభ్యాసం సాగింది. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ వచ్చారు. 2001, 2005ల్లో ఓటమి పాలైనా 2010లో నార్ఫోక్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2014లో కేమరూన్ కేబినెట్లో పర్యావరణ మంత్రిగా, 2016లో థెరిసా మే ప్రభుత్వంలో న్యాయ శాఖ మంత్రిగా చేశారు. 2019లో బోరిస్ జాన్సన్ ప్రధాని అయ్యాక ట్రస్‌కు ప్రాధాన్యం పెరిగింది. తొలుత ఇంటర్నేషనల్ ట్రేడ్ సెక్రెటరీగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో భారత్‌లో పటిష్టమైన ఆర్థిక బంధం కోసం కృషి చేశారు. భారత్–ఇంగ్లండ్ వర్తక భాగస్వామ్యం (ఈటీపీ)లో కీలక పాత్ర పోషించారు. రెండేళ్లకు కీలకమైన విదేశాంగ శాఖ బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు జాన్సన్ వారసురాలిగా ఎన్నికయ్యారు. అకౌంటెంట్ హ్యూ ఓ లియరీని ట్రస్ పెళ్లాడారు. వారికి ఇద్దరమ్మాయిలు. పరిస్థితిని బట్టి విధానాలు మార్చుకునే నేతగా కూడా ట్రస్ పేరుబడ్డారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడాన్ని (బ్రెగ్జిట్) తొలుత తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ అది అనివార్యమని తేలాక బ్రెగ్జిట్‌కు జైకొట్టారు. కన్జర్వేటివ్ సభ్యుల మద్దతు సాధించే ప్రయత్నాల్లో భాగంగా మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ వస్త్రధారణను అనుకరించారు. -
Rishi Sunak: ఔను.. వెనుకంజలో ఉన్నా
లండన్: బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రి పదవి కోసం జరుగుతున్న పోటీలో తాను వెనుకంజలో ఉన్నట్లు కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ, మాజీ మంత్రి రిషి సునాక్ అంగీకరించారు. ప్రత్యర్థి లిజ్ ట్రస్ ముందంజలో ఉన్నారన్నారు. అయినా పట్టుదల వీడబోనని, ప్రతి ఓటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే పన్నులు తగ్గిస్తానని ట్రస్ హామీ ఇస్తున్నారు. రిషి మాత్రం దేశంలో ఆర్థిక సంక్షోభానికి తెరపడే దాకా పన్నుల తగ్గింపు సాధ్యం కాదని అంటున్నారు. రిషి, ట్రస్ గురువారం రాత్రి యార్క్‌షైర్‌లోని లీడ్స్ పట్టణంలో ఒకే వేదికపైకి వచ్చి తమ పార్టీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రధానమంత్రి పదవి దక్కితే తాము అమలు చేయబోయే ఆర్థిక విధానాల గురించి వివరించారు. సభ్యుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. మంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేశారంటూ ఈ సందర్భంగా రిషిని ఓ సభ్యుడు ప్రశ్నించారు. తద్వారా మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు వెన్నుపోటు పొడిచారంటూ ఆక్షేపించారు. ‘10, డౌనింగ్ స్ట్రీట్’ (ప్రధాని నివాసం)లో రిషిని చూడాలని జనం కోరుకోవడం లేదన్నారు. ఆర్థిక విధానాలపై బోరిస్‌తో విభేదాలు తీవ్రతరం కావడం వల్ల రాజీనామా చేయక తప్పలేదని రిషి బదులిచ్చారు. అందుకు దారి తీసిన కారణాలను వివరించి ఆకట్టుకున్నారు. కన్జర్వేటివ్ పార్టీలోని 1,75,000 మంది సభ్యులు పార్టీని నేత, తద్వారా తదుపరి ప్రధానిని ఎన్నుకోనున్నారు. సెప్టెంబర్ 5 విజేతను ప్రకటిస్తారు. -
బ్రిటన్ ప్రధాని పీఠం కోసం...రిషి X ట్రస్
లండన్: భారత మూలాలున్న బ్రిటన్ మాజీ మంత్రి రిషి సునాక్ (42) చరిత్ర సృష్టించేందుకు మరింత చేరువయ్యారు. బ్రిటన్ ప్రధాని పదవిని అధిష్టించే అధికార కన్జర్వేటివ్ పార్టీ నేత ఎన్నికకు జరుగుతున్న పార్టీపరమైన పోరులో కీలకమైన తుది అంకానికి అర్హత సాధించారు. బుధవారం జరిగిన చివరిదైన ఐదో రౌండ్ పోరులో 137 మంది ఎంపీల మద్దతు సాధించి అగ్ర స్థానాన్ని నిలుపుకున్నారు. ప్రధాని పదవికి గట్టి పోటీదారుగా అంతా భావించిన వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డంట్ అనూహ్యంగా 105 ఓట్లతో మూడో స్థానంలో నిలిచి రేసు నుంచి వైదొలిగారు! నాలుగో రౌండ్ దాకా మూడో స్థానంలో కొనసాగిన విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ కీలకమైన ఐదో రౌండ్ ముగిసే సరికి నాటకీయ పరిణామాల మధ్య 113 ఓట్లతో రెండో స్థానానికి ఎగబాకి తుది పోరుకు అర్హత సాధించారు. మంగళవారం రేసు నుంచి తప్పుకున్న కేమీ బదెనోక్ తాలూకు 59 ఓట్లలో ఏకంగా 27 ఓట్లను సాధించడం ట్రస్‌కు బాగా కలిసొచ్చింది. వాటిలో మోర్డంట్ 13 ఓట్లు రాబట్టగా రిషికి 19 ఓట్లు పడ్డాయి. రిషి ఇక ట్రస్‌తో ముఖాముఖి తలపడతారు. సోమవారం ఆమెతో లైవ్ డిబేట్ ద్వారా అందుకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం ఆగస్టు 1 నుంచి దాదాపు నెల పాటు దశలవారీగా జరిగే పోలింగ్‌లో 1.6 లక్షల పై చిలుకు కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిన ఓటింగ్‌లో పాల్గొంటారు. వీటిలో మెజారిటీ ఓట్లు సాధించేవారే కన్జర్వేటివ్ పార్టీ నేతగా ఎన్నికవుతారు. తద్వారా ప్రధాని పీఠమూ ఎక్కుతారు. ఈ నేపథ్యంలో కీలకమైన టోరీ సభ్యుల మద్దతు కూడగట్టుకునేందుకు రిషి, ట్రస్ త్వరలో దేశవ్యాప్తంగా పర్యటిస్తారు. ఇప్పటిదాకా రిషిదే హవా పార్టీగేట్, పించర్‌గేట్ వంటి కుంభకోణాల్లో ఇరుక్కుని అబద్ధాలకోరుగా ఇంటాబయటా విమర్శల పాలై ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేయడం తెలిసిందే. ఆయన వారసుని ఎన్నిక ప్రక్రియలో భాగంగా రెండు వారాలుగా జరిగిన ఐదు రౌండ్ల పోరులోనూ రిషియే అగ్ర స్థానంలో నిలవడం విశేషం. ఆయనతో పాటు మొత్తం 8 మంది రంగంలోకి దిగగా భారత మూలాలున్న అటార్నీ జనరల్ సుయెల్లా బ్రేవర్మన్ తొలి రౌండ్లోనే తప్పుకున్నారు. తర్వాత పాక్ మూలాలున్న నదీం జహావీ, జెరెమీ హంట్, టామ్ టగన్హాట్, కేమీ బదెనొక్ వరుసగా వైదొలిగారు. తాత్కాలిక ప్రధాని జాన్సన్ బుధవారం పార్లమెంటులో తుది ప్రసంగం చేశారు. కొత్త ప్రధాని పన్నులను తగ్గించాలని, అమెరికాతో సన్నిహిత బంధం కొనసాగించాలని సూచించారు. ‘హస్త ల విస్త బేబే (మళ్లీ కలుద్దాం)’ అంటూ ఎంపీలకు స్పానిష్‌లో వీడ్కోలు పలికారు. మొగ్గు ట్రస్ వైపే! కన్జర్వేటివ్ ఎంపీల మద్దతు విషయంలో రిషిదే పై చేయి అయినా కీలకమైన పార్టీ సభ్యుల్లో మాత్రం మెజారిటీ ట్రస్ వైపే మొగ్గుతున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే జరిగిన పలు సర్వేల్లో ఆమే ఫేవరెట్‌గా నిలిచారు. యూగవ్ పేరిట సోమ, మంగళవారాల్లో జరిగిన తాజా సర్వేలోనూ ఇదే తేలింది. అందులో పాల్గొన్న 725 మంది టోరీ సభ్యుల్లో 54 మంది ట్రస్ నెగ్గుతారని చెప్పగా 35 శాతం రిషిని సమర్థించారు. అయితే దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదని బ్రిటిష్ పరిశీలకులు అంటున్నారు. ‘‘రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో లేబర్ పార్టీని ఓడించగల నేతకే టోరీ సభ్యులు జై కొడతారు. బరిలో ఉన్న ఇద్దరిలో ఆ సత్తా ఉన్నది రిషికే. కాబట్టి ఆయన విజయం ఖాయం’’ అని చెబుతున్నారు. -
పార్టీ గేట్ వివాదం; బ్రిటన్ ప్రధానికి షాక్
లండన్ : బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ చుట్టూ బిగుసుకున్న పార్టీ గేట్ వివాదం మరింత ముదురుతోంది. కరోనా మహమ్మారి కోరలు చాచిన వేళ తన అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్‌లో విందులు వినోదాలు చేసుకున్నారన్న వివాదంపై విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2020 జూన్ 19న జాన్సన్ 59వ పుట్టిన రోజునాడు కేక్ పార్టీ జరిగినట్టు తమకు సమాచారం అందిందని మెట్రోపాలిటన్ పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే పార్టీ గేట్ వివాదంపై ఇంటర్నల్ కేబినెట్ ఆఫీసు ఎంక్వయిరీ జరుగుతోంది. ఈ వారంలో దాని నివేదిక వచ్చే అవకాశం ఉంది. ఆ విచారణ సందర్భంగానే జాన్సన్ బర్త్ డే రోజు కూడా పార్టీ జరిగిందని వెల్లడైంది. గత రెండేళ్లలో డౌనింగ్ స్ట్రీట్, వైట్ హాలులో లెక్కలేనన్ని పార్టీలు జరిగాయని వాటిపై మెట్రోపాలిటన్ పోలీసుల బృందం విచారణ జరుపుతుందని కమిషనర్ డేమ్ క్రెస్సిడా డిక్ చెప్పారు. మరోవైపు 10 డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధులు మాత్రం జాన్సన్ తన పుట్టినరోజు నాడు సి బ్బంది శుభాకాంక్షలు చెప్పడానికి వస్తే కేవలం 10 నిముషాలే ఉన్నారని వాదిస్తున్నారు. (చదవండి: ఉరిమి ఉరిమి.. యూఏఈ నెత్తిన! ఎందుకిలా జరుగుతోంది?) -
బ్రిటన్ తదుపరి ప్రధాని మనోడేనా ?
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి పదవి భారత సంతతికి చెందిన వ్యక్తికి లభిస్తుందా? బ్రిటన్ ఆర్థిక శాఖ మంత్రి రిషి సునక్ ప్రధాని రేసులో ముందున్నారా ? ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడైన రిషి చరిత్ర సృష్టిస్తారా ? ఇప్పుడు ఇవే ప్రశ్నలు బ్రిటన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. బ్రిటన్‌లో కరోనా మొదటి వేవ్ లాక్డౌన్ అమల్లో ఉన్నప్పుడు 2020 మేలో ప్రధాని బోరిస్ జాన్సన్ ఇచ్చిన మందు పార్టీ వివాదం ముదురుతోంది. కోవిడ్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ బోరిస్ జాన్సన్ ఇచ్చిన పార్టీ వీడియో ఒకటి ఇటీవల వెలుగులోకి రావడంతో విపక్ష లేబర్ పార్టీలో, సొంత పార్టీ కన్జర్వేటివ్‌లలో వ్యతిరేకత పెరుగుతోంది. బ్రిటన్ ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలు జరిగిన గత ఏడాది ఏప్రిల్ 17 ముందు రోజు రాత్రంతా డౌనింగ్ స్ట్రీట్‌లో 30 మంది మందులు, చిందులతో కాలం గడిపారన్న ఆరోపణలు తాజాగా వస్తున్నాయి. ఫిలిప్ భౌతిక కాయం ఉన్న సమయంలో అలాంటి పార్టీలు జరుపుకోవడంపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ‘పార్టీ గేట్’ వివాదంపై బోరిస్ జాన్సన్ బ్రిటన్ పార్లమెంటులో క్షమాపణ చెప్పినప్పటికీ ఆయన ప్రధాని పీఠం దిగాలన్న డిమాండ్లు ఎక్కువయ్యాయి. బోరిస్ జాన్సన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తే ఆయన స్థానంలో భారతీయ మూలాలున్న రిషి ప్రధాని పగ్గాలు చేపట్టే అవకాశాలను కొట్టి పారేయలేమని బ్రిటన్ మీడియాలో వార్తలొచ్చాయి. బెట్టింగ్‌లు సాగుతున్నాయి. బోరిస్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో క్షమాపణ చెప్పే సమయంలో రిషి సభలో లేకపోవడం ఈ ప్రచారానికి ఊతమిస్తోంది. ఆర్థిక మంత్రి అయినప్పట్నుంచే రిషి ప్రధాని పీఠంపై మక్కువ పెంచుకున్నారని, అందుకే ‘పార్టీగేట్’ వివాదానికి దూరంగా ఉండాలన్న ఉద్దేశంతో సభకు హాజరుకాలేదని బోరిస్ సన్నిహితులు చెబుతున్నారు. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టిన రిషి తన శాఖకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉండడం వల్లే సభకు హాజరు కాలేదంటూ ట్వీట్ చేశారు. కోవిడ్ విలయంతో తరచూ లాక్డౌన్లతో కునారిల్లుతున్న దేశ ఆర్థిక వ్యవస్థని తిరిగి పట్టాలెక్కించడానికి రిషి ఎన్నో చర్యలు చేపడుతున్నారు. బ్రిటన్‌లో పుట్టి పెరిగిన రిషి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షతను వివాహం చేసుకున్నారు. వీరికి కృష్ణ, అనుష్క అనే కుమార్తెలు ఉన్నారు. -
మోదీజీ.. ‘జీ–7’కు రండి
లండన్: ఈ ఏడాది జరగనున్న జీ–7 దేశాల శిఖరాగ్ర సమావేశాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆహ్వానించినట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆదివారం వెల్లడించారు. బ్రిటన్ అధ్యక్షతన ఈ ఏడాది జూన్ 11 నుంచి 13వ తేదీ వరకు జరగనున్న అభివృద్ధి చెందిన దేశాల సమావేశాలకు తీర ప్రాంతమైన కార్న్‌వాల్ వేదికగా మారనుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిఖరాగ్ర భేటీకి భారత్‌తోపాటు దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా లను ఆతిథ్య హోదాలో ఆహ్వానిం చామన్నారు. గత ఏడాది భారత ప్రధాని మోదీతో ఫోన్ కాల్ సంభాషణ సమయంలోనే ఈ విషయం తెలిపానన్నారు. జనవరి 26వ తేదీన భారత గణతంత్ర ఉత్సవాలకు ముఖ్య అతిథిగా వెళ్లాల్సి ఉండగా దేశంలో కరోనా సంక్షోభం కారణంగా ఆ పర్యటన రద్దయిందని ఆయన చెప్పారు. త్వరలోనే, జీ–7 భేటీలకు ముందే భారత్ సందర్శించే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. జూన్‌లో జీ7 భేటీకి హాజరయ్యే 10 మంది నేతలు ప్రపంచంలోని ప్రజాస్వామ్యదేశాల్లోని 60% ప్రజలకు ప్రాతినిధ్యం వహించనున్నారని బోరిస్ జాన్సన్ తెలిపారు. తగరం, రాగి గనులతో 200 ఏళ్ల క్రితం బ్రిటన్‌లో పారిశ్రామిక విప్లవానికి కీలకంగా నిలిచిన కార్న్‌వాల్‌లో జీ7 భేటీ జరుగుతుందన్నారు. జీ 7 (గ్రూప్ ఆఫ్ సెవెన్)బృందంలో ప్రపంచంలో పలుకుబడి కలిగిన అమెరికా, యూకే, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాలున్నాయి. ఈ ఏడాది ఈ దేశాల మధ్య కోవిడ్ మహమ్మారిపైనే ప్రధాన చర్చ జరుగుతుందని భావిస్తున్నారు. దాదాపు రెండేళ్లకు ముఖాముఖి జరగనున్న ఈ భేటీకి ముందుగా బ్రిటన్ వర్చువల్‌గా, నేరుగా వివిధ దేశాలతో మంత్రుల స్థాయిలో విస్తృతంగా చర్చలు జరపనుంది. యూకే ఈ ఏడాది ఫిబ్రవరిలోనే భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలను చేపట్టనుంది. ప్రపంచ ఔషధాగారం భారత్ ప్రపంచ వ్యాక్సిన్ అవసరాల్లో 50% వరకు సరఫరాచేసిన భారత్ ప్రపంచ ఔషధాగారంగా మారిందని యూకే విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్ మహమ్మారి విషయంలో యూకే, భారత్ కలిసికట్టుగా పనిచేస్తున్నాయని తెలిపింది. భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి మద్దతిచ్చిన పీ–5 దేశాల్లో యూకే మొట్టమొదటిదని పేర్కొంది. 2005లో భారత్‌ను జీ–7 సమ్మిట్‌కు యూకే మొదటగా ఆహ్వానం పంపింది. త్వరలో బ్రిక్స్ అధ్యక్ష హోదాతోపాటు, 2023లో జీ20 అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టనుందంది. -
బ్రిటన్ ప్రధానికి మళ్లీ కరోనా
లండన్: బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ మరోసారి కరోనా బారిన పడ్డారు. పార్లమెంటు సభ్యుడు ఒకరు కోవిడ్ పాజిటివ్‌గా తేలిన నేపథ్యంలో కొంత కాలంగా స్వీయ నిర్బంధంలో ఉన్న బోరిస్ జాన్సన్‌కు నిర్వహించిన పరీక్షల్లో ఆయనకూ వైరస్ సోకినట్లు తేలిందని బ్రిటన్ ప్రధాని అధికార నివాస వర్గాలు సోమవారం తెలిపాయి. అధికారుల సూచనలను అనుసరించి ప్రధాని నవంబర్ 26 వరకూ తన ఇంటి నుంచే అధికారిక కార్యకలాపాలు చేపడతారని, కరోనా వైరస్ నిరోధానికి తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షిస్తారని వివరించారు. బోరిస్ జాన్సన్ కోవిడ్ బారిన పడినప్పటికీ లక్షణాలేవీ కనిపించడం లేదని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో బ్రిటన్ ప్రధాని తొలిసారి కోవిడ్–19 బారిన పడటమే కాకుండా.. పరిస్థితి తీవ్రం కావడంతో ఐసీయూలో చికిత్స అందించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. కోవిడ్–19 నియంత్రణకు జాన్సన్ అండ్ జాన్సన్ అనుబంధ సంస్థ జాన్సెన్ తయారు చేసిన టీకా తుది పరీక్షలకు రంగం సిద్ధమైంది. యూకే మొత్తమ్మీద 6వేల మందికి ఈ టీకా ఇచ్చి 12 నెలలపాటు పరీక్షించనుంది. దశలవారీగా ఈ టీకా పరీక్షల కోసం ఆరు దేశాల నుంచి సుమారు 30 వేల మందిని ఎంపిక చేస్తామంది. -
ఆస్పత్రి నుంచి ప్రధాన మంత్రి డిశ్చార్జ్
లండన్ : కరోనా వైరస్ మహమ్మారి బారిన పడి ఆస్పత్రిలో చేరిన బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. కరోనా లక్షణాలు కనిపించడంతో మార్చి 26 నుంచి ఆయన స్వీయ నిర్బంధంలో ఉంటూ చికిత్స తీసుకున్నారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడంతో వైద్యుల సూచన మేరకు ఏప్రిల్ 5న హాస్పిటల్‌కు వెళ్లారు. వ్యాధి తీవ్రత పెరగడంతో ఆయన్ను ఐసీయూకి తరలించి చికిత్స అందించారు. అయితే ఇప్పుడు ఆయన కోలుకున్నారని, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారని డౌనింగ్ స్ట్రీట్ వర్గాలు తెలిపాయి.మెడికల్ టీమ్ సూచన మేరకు ఆయన తిరిగి తన వర్క్ ను వెంటనే ప్రారంభించరని తెలిపాయి. కాగా, సెయింట్ థామస్ ఆస్పత్రిలో తనకు వైద్య సేవలు అందించిన నేషనల్ హెల్త్ సిబ్బందికు జీవితాంతం రుణపడి ఉంటానని బోరీస్ పేర్కొన్నారు. మరోవైపు బ్రిటన్ లో ఇప్పటివరకు 78,991కరోనా కేసులు నమోదుకాగా, 9,875 మంది ఈ మహమ్మారి బారిన పడి మృతి చెందారు. -
మంచి వార్త తెలిసింది : ట్రంప్
లండన్ : కరోనా వైరస్ మహమ్మారితో బాధపడుతున్న బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ పరిస్థితి నిలకడగా ఉంది. దీంతో ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలించారు. మరికొన్నాళ్లు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స తీసుకోవాలని లండన్‌లోని సెయింట్ థామస్ ఆస్పత్రిలోని వైద్య నిపుణుల బృందం ఆయనకు సూచించింది. బోరిస్ జాన్సన్‌ను ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలించారని తెలియగానే, మంచి వార్త తెలిసిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్విటర్లో స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. (‘క్లాప్స్ ఫర్ బోరిస్’కు భారీ స్పందన) Great News: Prime Minister Boris Johnson has just been moved out of Intensive Care. Get well Boris!!! — Donald J. Trump (@realDonaldTrump) April 9, 2020 కాగా, వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో వైద్యులు బోరిస్ జాన్సన్‌ను సోమవారం ఐసీయూకు తరలించిన విషయం తెలిసిందే. బోరిస్‌ను ఐసీయూకు తరలించారనే వార్తలు వెలువడగానే బ్రిటన్‌తో సహా యావత్ ప్రపంచదేశాలు ఆయనకు సంఘీభావం తెలిపాయి. జోరిస్ త్వరగా కోలుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, రష్యా అధ్యక్షుడు పుతిన్, స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ తదితరులు ఆకాంక్షించారు. (ఐసీయూలో బ్రిటన్ ప్రధాని) -
ఐసీయూలో ప్రధాని.. కోలుకోవాలని చప్పట్లు!
లండన్ : కరోనా వైరస్ మహమ్మారితో బాధపడుతున్న బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ (55)ను లండన్ ఆస్పత్రిలో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో గత సోమవారం వైద్యులు ఆయన్ను ఐసీయూకు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. జాన్సన్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ఆయనలో ఎలాంటి న్యుమోనియా లక్షణాలు కనిపించలేదని ప్రధాని కార్యాలయం మంగళవారం వెల్లడించింది. కాగా, బోరిస్‌ను ఐసీయూకు తరలించారనే వార్తలు వెలువడగానే బ్రిటన్‌తో సహా యావత్ ప్రపంచదేశాలు ఆయనకు సంఘీభావం తెలిపారు. జోరిస్ త్వరగా కోలుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, జపాన్ ప్రధాని షింజో అబే, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, రష్యా అధ్యక్షుడు పుతిన్, స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ తదితరులు ఆకాంక్షించారు. ఇక బ్రిటన్ నెటిజన్లు సైతం బోరిస్‌కు సంఘీభావం తెలిపారు. బోరిస్ త్వరగా కోలుకోవాలని యూకే నెటిజన్లు ‘ క్లాప్స్ ఫర్ బోరిస్’(#ClapForBoris)కు పిలుపునిచ్చారు. బ్రిటన్ ప్రధానికి సంఘీభావంగా మంగళవారం రాత్రి 8 గంటలకు చప్పట్లు కొట్టాలని విజ్ఞప్తి చేశారు. ‘రాజకీయాలు పక్కన పెట్టి ప్రతి ఒక్కరు క్లాప్స్ కొట్టి బోరిస్ వెనుక మనం ఉన్నామనే భావనను చాటుదాం’ అంటూ నెటిజన్లు యూకే ప్రజలను కోరారు. #ClapForBoris అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి వేలాది మంది నెటిజన్లు ట్వీట్లు చేశారు. దీంతో #ClapForBoris అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌గా మారింది. ఇక ‘క్లాప్ ఫర్ బోరిస్’కు భారీ స్పందన వచ్చింది. యూకే ప్రజలంతా బోరిస్‌కు సంఘీభావం తెలుపుతూ చప్పట్లు కొట్టారు. ‘ బోరిస్ మీరు కచ్చితంగా కరోనాను జయిస్తారు’, ‘కమాన్ బోరిస్.. మీ కోసం వేయిటింగ్’,‘ మీ వెనుక మేమంతా ఉన్నాం’ అని నెటిజన్లు బోరిస్‌కు మద్దతు తెలిపారు. Nice message from the Nason Ward team #CEOGlen @BorisJohnson https://t.co/E35N6C2GLb — George Eliot NHS (@GEHNHSnews) April 7, 2020 I've never felt this way about a politician before - this man has reached out to so many ppl in a rare way. Your majority and even many of your critics are rooting for you to win this battle, dear PM @BorisJohnson - the people care 💙💙💙 #ClapForBoris #PrayForBoris pic.twitter.com/IuIvHCVvaV — LizaUK (@LizaUK3) April 7, 2020 Come on Boris, u can get through this nightmare. #clapforboris https://t.co/gLQtvga4bc — Sumit Agarwal (@sumit_int) April 6, 2020 -
ఐసీయూలో బ్రిటన్ ప్రధాని
కరోనాతో బాధపడుతున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పరిస్థితి నిలకడగా ఉంది. లండన్ ఆస్పత్రిలో ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. వెంటిలేటర్ సాయం అవసరం ఆయనకు లేదని ప్రధాని కార్యాలయం మంగళవారం వెల్లడించింది. జాన్సన్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఆయనలో ఎలాంటి న్యుమోనియా లక్షణాలు కనిపించలేదని తెలిపింది. కాగా ‘ప్రధాని జాన్సన్.. మీరు ఆస్పత్రి నుంచి బయటకు వచ్చి, సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షిస్తున్నా’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. లండన్/వాషింగ్టన్/టోక్యో: కరోనా వైరస్ మహమ్మారితో బాధపడుతున్న బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ పరిస్థితి నిలకడగా ఉంది. లండన్ ఆస్పత్రిలో ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. వెంటిలేటర్ సాయం అవసరం ఆయనకు లేదని ప్రధాని కార్యాలయం మంగళవారం వెల్లడించింది. జాన్సన్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ఆయనలో ఎలాంటి న్యుమోనియా లక్షణాలు కనిపించలేదని తెలిపింది. ‘‘ప్రధానమంత్రి జాన్సన్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రతీరోజూ ఆక్సిజన్ చికిత్స అందిస్తున్నామని, వెంటిలేటర్ పెట్టాల్సిన అవసరం లేదు’’డౌనింగ్ స్ట్రీట్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. లండన్‌లో సెయింట్ థామస్ ఆస్పత్రిలో వైద్య నిపుణుల బృందం జాన్సన్‌కు చికిత్స అందిస్తున్నారని, జాన్సన్ చెప్పినట్టుగా ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని ఆయన వివరించారు. జాన్సన్ కోలుకోవాలని సందేశాలు బోరిస్ జాన్సన్ కోలుకోవాలంటూ ప్రపంచ దేశాల నాయకులు సందేశాలు పంపారు. ‘‘ప్రధాని జాన్సన్. మీరు ఆస్పత్రి నుంచి బయటకు వచ్చి, సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షిస్తున్నాను’అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. జాన్సన్ తనకు మంచి మిత్రుడని, ఆయన త్వరగా కోలుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా ప్రజలందరూ ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తున్నారని చెప్పారు. ఇలాంటి విషమ పరిస్థితుల్లో బోరిస్ జాన్సన్, ఆయన కుటుంబం, బ్రిటన్ ప్రజలందరి వెంట ఉంటామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రన్ చెప్పారు. అమెరికాలో మరణ మృదంగం అగ్రరాజ్యం అమెరికాలో మృతుల సంఖ్య 11 వేలకు, వ్యాధిగ్రస్తుల సంఖ్య 4 లక్షలకు చేరుకుంది. న్యూయార్క్‌లో అత్యధికంగా 5 వేల కేసులు నమోదయ్యాయి. జపాన్‌లో అత్యవసర పరిస్థితి జపాన్‌లో కరోనా కేసులు పెరిగిపోతూ ఉండడంతో ప్రధానమంత్రి షింజో అబె నెల పాటు ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ప్రకటించారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని అన్నారు. సోమవారం ఒకే రోజు 100 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1200కి చేరుకుంది. లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఇటలీ, స్పెయిన్లలో పెరిగిన మృతులు ఇటలీ, స్పెయిన్లలో గత నాలుగైదు రోజులుగా తగ్గినట్టుగా అనిపించిన కోవిడ్–19 మృతుల సంఖ్య మళ్లీ ఎక్కువైంది. 24 గంటల్లో స్పెయిన్‌లో 743 మరణాలు నమోదైతే, ఫ్రాన్స్‌లో 833 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కేసులు: 13,94,710 మరణాలు: 79,384 కోలుకున్న వారు: 2,98,491 -
కోవిడ్: విషమంగా బ్రిటన్ ప్రధాని ఆరోగ్యం
లండన్ : కరోనా వైరస్ బారిన పడిన బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్(55) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో వైద్యులు ఆయన్ను ఐసీయూకు తరలించారు. కరోనా లక్షణాలు కనిపించడంతో మార్చి 26 నుంచి ఆయన స్వీయ నిర్బంధంలో ఉంటూ చికిత్స తీసుకున్నారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడంతో వైద్యుల సూచన మేరకు ఆదివారం లండన్ ఆసుపత్రిలో చేరారు. తన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, కొన్ని కరోనా లక్షణాలు ఉండడంతో ఆస్పత్రిలో చేరానని బోరిస్ ఓ వీడియో కూడా విడుదల చేశారు. అయితే సోమవారం మాత్ర వ్యాధి తీవ్రత పెరగడంతో ఆయన్ను ఐసీయూకి తరలించి చికిత్స అందించారు. ప్రధాని ఆసుపత్రిలో చేరడంతో యూకే విదేశాంగ శాఖ కార్యదర్శి డొమినిక్ రాబ్ ప్రభుత్వ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఇక బ్రిటన్‌లో కరోనా కేసులు సంఖ్య 51,608 కు చేరింది. ఈ మహమ్మారి బారిన పడి 5,373 మంది మృతి చెందారు. ప్రపంచ వ్యాప్తంగా 13,46,990 మందికి కరోనా సోకగా, 74,702 మంది మృతి చెందారు. -
ఆస్పత్రిలో చేరిన బ్రిటన్ ప్రధాని
లండన్ : కరోనా వైరస్ సోకిన బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్(55)ను ఆదివారం ఆసుపత్రికి తరలించారు. గత ఏడు రోజులుగా ఆయన క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్నప్పటికీ.. ఇంకా కొన్ని వైరస్ లక్షణాలు ఉన్నాయని అందుకే ఆయనను ఆస్పత్రికి తరలించామని అధికారులు వెల్లడించారు. స్వీయ నిర్భందంలో ఉన్న బోరిస్ గత శుక్రవారమే బయటకు రావాల్సింది. కానీ తీవ్రమైన జ్వరం ఉండడంతో ఆదివారం వరకు క్వారంటైన్లో ఉన్నారు. కోవిడ్ లక్షణాలు తగ్గకపోవడంతో.. ముందుజాగ్రత్త చర్యగా అతన్ని ఆసుపత్రికి తరలించామని డౌనింగ్ స్ట్రీట్ అధికారులు చెప్పారు. బోరిస్ ఆరోగ్య పరిస్థితి నిలకడ ఉందని స్పష్టం చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నాని, కొన్ని కరోనా లక్షణాలు ఉండడంతో ఆస్పత్రిలో చేరానని బోరిస్ ఓ వీడియో ద్వారా తెలియజేశారు. కరోనా లక్షణాలు పూర్తిగా తగ్గేవరకు స్వీయ నిర్బంధంలోనే ఉండి పని చేస్తానని స్పష్టం చేశారు. గత పదిరోజులుగా ప్రధాని బోరిస్ ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండి కరోనా వ్యాప్తిపై సమీక్షిస్తూ వీడియో మెసేజ్ లు విడుదల చేశారు. కాగా, బ్రిటన్‌లో 47,806 మందికి కరోనా వైరస్ సోకగా, 4,934 మంది మరణించారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 13 లక్షల మందికి కరోనా సోకింది. 69,459 మంది మృతి చెందారు. -
బ్రిటన్ ప్రధానికి కరోనా
లండన్: కరోనా మహమ్మారి దేశాధినేతలను విడిచి పెట్టడం లేదు. బ్రిటన్ ప్రధానమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి కోవిడ్–19 సోకిన జాబితాలో చేరారు. బ్రిటన్ ప్రధాని బొరిస్ జాన్సన్‌కు కరోనా సోకడంతో 10 డౌనింగ్ స్ట్రీట్‌లో తన నివాసంలో స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. యూకే ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యత తాను నిర్వహిస్తానని ఒక వీడియో సందేశంలో వెల్లడించారు. ‘‘గురువారం నుంచి నాలో కరోనా లక్షణాలు కాస్త కనిపించాయి. వెంటనే పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్ అని తేలింది. వెంటనే నా గదిలోనే నిర్బంధంలోకి వెళ్లిపోయాను. దేశ ప్రధానిగా సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి కరోనాపై తీసుకుంటున్న చర్యల్ని పర్యవేక్షిస్తాను’’అని ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో ఒక వీడియో షేర్ చేశారు. మరోవైపు బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రి మట్ హన్కాక్కూ ఈ వైరస్ సోకింది. స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన ఆయన ఇంటి నుంచే పని చేస్తానని స్పష్టం చేశారు. కేసులు 5,60,000, మృతులు 25 వేలు.. కరోనా కేసులు 5 లక్షల 60 వేలకు మృతులు 25 వేలకు చేరుకున్నారు. ► 80,539 కేసులతో అమెరికా.. చైనా తర్వాత స్థానంలో నిలిస్తే, 8,215 మరణాలతో ఇటలీ 1వ స్థానంలో ఉంది. ► స్పెయిన్‌లో గత 24 గంటల్లో 769 మంది మరణించగా, మృతుల సంఖ్య 4,858కి చేరుకుంది. ► ఫ్రాన్స్‌లో 24 గంటల్లో 365 మంది మరణించగా, 2,300కి పైగా కేసులు నమోదయ్యాయి. ► కరోనా వైరస్ ప్రభావంతో ఈ ఏడాది అంతర్జాతీయ పర్యాటక రంగానికి 30 వేల కోట్ల డాలర్ల నుంచి 45 వేల కోట్ల డాలర్ల వరకు నష్టం రావచ్చునని ప్రపంచ పర్యాటక సంస్థ అంచనా వేసింది. ► టాక్సిక్ మెథనాల్‌తో కరోనాను ఆప వచ్చని తీసుకున్న ఓ బాలుడు కంటి చూపు కోల్పోగా 300 మంది మరణించారు. వెయ్యి మందికి పైగా అస్వస్థులయ్యారు. కరోనాతో హాలీవుడ్ నటుడు మార్క్ మృతి లాస్ ఏంజెల్స్: హాలీవుడ్ నటుడు మార్క్ బ్లమ్ కరోనా వ్యాధితో మరణించారు. ఆయన వయసు 69 ఏళ్లు. -
డిగ్రీ అయ్యాక రెండేళ్లు ఉండొచ్చు
లండన్: యూకేలో డిగ్రీ, పీజీ చేసే విద్యార్థులకు భారీగా ఊరట లభించింది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వర్క్ వీసాలో పాత నిబంధనల్ని పునరుద్ధరించాలని నిర్ణయించారు. దీంతో అక్కడ చదువుకునే నిపుణులైన విదేశీ విద్యార్థులు తమ కెరీర్ మలచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు భారీగా లబ్ధి చేకూరుతోంది. ప్రస్తుతం అక్కడ చదివే విదేశీ విద్యార్థులు డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ పూర్తయ్యాక 4నెలలు పాటు మాత్రమే ఉండే వీలుంది. 27 వర్సిటీలు పైలెట్ స్కీమ్ కింద ఆరు నెలల పాటు ఉండే అవకాశాన్ని కల్పిస్తాయి. వీసా నిబంధనల్ని సవరించడంతో చదువు పూర్తయ్యాక రెండేళ్ల పాటు యూకేలో ఉంటూనే ఉద్యోగం కోసం వెతుక్కోవచ్చు. డిగ్రీ పూర్తయిన నాలుగు నెలలు మాత్రమే దేశంలో ఉండే అవకాశం ఇస్తే, ఉద్యోగాలు ఎక్కడ వస్తాయని, దీని వల్ల టాలెంట్ ఉన్న వారంతా వేరే దేశాలకు తరలివెళ్లిపోతారని యూకేలో యూనివర్సిటీలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీనిపై గత ఆరేళ్లుగా విస్తృతంగా చర్చ జరిగిన తర్వాత పాత నిబంధనలనే తీసుకురావాలని బోరిస్ సర్కార్ నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి రానుంది. ‘‘వీసా నిబంధనల్ని పునరుద్ధరించడం వల్ల విద్యార్థులు రెండేళ్ల పాటు పని చేయడంలో అనుభవాన్ని తెచ్చుకొని బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకునే అవకాశం కలుగుతుంది’’ అని యూకే హోంమంత్రి భారత్ సంతతికి చెందిన ప్రీతి పటేల్ అన్నారు. భారీగా తగ్గిన విద్యార్థుల సంఖ్య ఒకప్పుడు బ్రిటన్‌లో చదువు పూర్తయిన విద్యార్థులు మరో రెండేళ్ల పాటు అదే వీసాపై ఆ దేశంలో కొనసాగే అవకాశం ఉండేది. కానీ థెరిసా మే హోం మంత్రిగా ఉన్నప్పుడు 2012లో విద్యార్థులు రెండేళ్లు పాటు కొనసాగే నిబంధనలను రద్దు చేశారు. దీంతో బ్రిటన్‌కు వచ్చే భారతీయ విద్యార్థుల సంఖ్య 55శాతానికి పడిపోయింది. 2010లో 51,218 మంది విద్యార్థులు బ్రిటన్‌కు వస్తే, 2011–12లో వారి సంఖ్య ఏకంగా 22,575కి పడిపోయింది. 2017–18 వచ్చేసరికి విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోయి 15,338కి చేరుకుంది. గత ఏడాది మాత్రం మళ్లీ విద్యార్థుల సంఖ్య పెరిగి 21 వేలకు పైగా చేరుకుంది. ‘రెండేళ్ల పోస్ట్ స్టడీ వీసా పునరుద్ధరించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. గత ఆరేళ్లుగా ఈ వీసా పునరుద్ధరణకు మేము పోరాటాలు చేస్తున్నాం’ అని నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అల్మని యూకే యూనియన్ సంస్థ చైర్ పర్సన్ సనమ్ అరోరా అన్నారు. -
హింసాత్మక ఘటనపై చింతిస్తున్నా
న్యూఢిల్లీ: లండన్‌లోని భారత హై కమిషన్ కార్యాలయం బయట స్వాత్రంత్య దినోత్సవాలప్పుడు జరిగిన హింసాత్మక ఘటనకు తాను చింతిస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత ప్రధాని మోదీతో చెప్పారు. వారిద్దరు మంగళవారం ఫోన్లో మాట్లాడుకున్నారు. ఈ సంభాషణపై ఢిల్లీలోని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కశ్మీర్లో ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని పాకిస్తానీ సంఘాలు, కశ్మీర్, సిక్కు వేర్పాటువాద బృందాల సభ్యులు హైకమిషన్ ఎదుట ర్యాలీ చేశాయి. దీంతో భారత అనుకూల బృందాలూ ర్యాలీ చేపట్టడంతో గొడవలు జరిగి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనపై తాను చింతిస్తున్నట్లు జాన్సన్ మోదీతో అన్నారు. భారత హై కమిషన్, ఆ కార్యాలయ ఉద్యోగులకు భద్రత కల్పిస్తామని బోరిస్ జాన్సన్ హామీనిచ్చారు. -
ప్రధానమంత్రిని చంపాలని చూశారు!
లండన్: బ్రిటన్‌లో భారీ ఉగ్రవాద కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మేను చంపేందుకు ఇద్దరు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. ప్రధాని నివాసమైన డౌనింగ్ స్ట్రీట్ గేట్లు పేల్చేసి.. ఆ సందర్భంగా తలెత్తిన గందరగోళం నడుమ ప్రధాని మేను హతమార్చాలని భావించారు. ఈ మేరకు కుట్రపన్నిన ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా దళాలు అరెస్టుచేసినట్టు స్కై న్యూస్ తెలిపింది. ఉత్తర లండన్‌కు చెందిన నాయిముర్ జకారియా రహ్మన్ (20)ను, వాయవ్య బర్మింగ్‌హామ్‌కు చెందిన మహమ్మద్ అకిబ్ ఇమ్రాన్ (21)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాద కుట్ర అభియోగాలు ఎదుర్కొంటున్న వారిని బుధవారం వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు. ‘డౌనింగ్ స్ట్రీట్ వద్ద ఇంప్రూవ్డ్ పేలుడు పదార్థాలు (ఐఈడీ) పేల్చి.. గందరగోళం రేపి.. ఆ క్రమంలో థెరిసా మేను చంపాలని వీరు కుట్రపన్నారు’ అని స్కై న్యూస్ ఒక కథనంలో తెలిపింది. -
బ్రిటన్‌లో ముందస్తు ఎన్నికలు!
► ప్రధాని థెరిసా మే అనూహ్య నిర్ణయం ► జూన్ 8న ఎన్నికలు నిర్వహించే యోచన లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి థెరెసా మే అనూహ్యమైన రీతిలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. జూన్ 8న ముందస్తు ఎన్నికలు నిర్వహించేందుకు ఆమె పిలుపునిచ్చారు. థెరెసా మే నిర్ణయం మిత్రపక్షాలతోపాటు ప్రత్యర్థుల్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని గతంలో పలుమార్లు పేర్కొన్న మే ఒక్కసారిగా ముందస్తు ఎన్నికలకు పిలుపునివ్వడం విశేషం. మంగళవారం ప్రధానమంత్రి మే తన డౌనింగ్ స్ట్రీట్ నివాసం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగాక దేశంలో కొన్నేళ్లపాటు రాజకీయ సుస్థిరత నెలకొనాలంటే ఎన్నికల నిర్వహణ ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. బ్రెగ్జిట్ విషయంలో ప్రతిపక్ష పార్టీలు ఆటలు ఆడుతున్నాయని ఆమె ఈ సందర్భంగా విమర్శించారు. బ్రెగ్జిట్‌ను విజయవంతం చేయడానికి అవసరమైన సామర్ధ్యంపై ఇది ప్రభావం చూపుతుందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సాధారణ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరముందని, ఇందుకుగాను అందరి మద్దతును కోరుతున్నానని పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికల నిర్ణయాన్ని ఆమె సోమవారమే బ్రిటన్ రాణికి తెలిపారు. డౌనింగ్‌స్ట్రీట్‌లో కేబినెట్ సమావేశం అనంతరం మే నుంచి తాజా నిర్ణయం వెలువడింది. బ్రిటన్‌లో తదుపరి ఎన్నికలు షెడ్యూలు ప్రకారం 2020లో జరగాల్సి ఉంది. అయితే మూడింట రెండువంతుల మెజారిటీతో బ్రిటిష్ పార్లమెంటు ఆమోదం తెలిపితే ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చు. మొత్తం 650 ఎంపీల్లో 434 మంది దీనికి అనుకూలంగా ఓటేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత ఎన్నికలపై ‘హౌస్ ఆఫ్ కామన్స్’ బుధవారం నిర్ణయించే అవకాశముంది. దేశంలో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలన్న ప్రధాని నిర్ణయాన్ని ప్రతిపక్ష నేత జెరెమీ కోర్బిన్ స్వాగతించారు. -
ప్రధానికి బదులు.. పోర్న్ స్టార్‌కు ఆహ్వానం!
-
ప్రధానికి బదులు.. పోర్న్ స్టార్‌కు ఆహ్వానం!
కొత్త అధ్యక్షుడి పాలనలోకి వచ్చిన శ్వేతసౌధం ఘోరమైన తప్పిదం చేసింది. త్వరలోనే తమ దేశంలో పర్యటించబోతున్న బ్రిటిష్ ప్రధాని థెరెసా మే పేరుకు బదులు ఒక పోర్న్ స్టార్ పేరును అధికారిక షెడ్యూలులో ప్రచురించింది. అది కూడా ఒకసారి కాదు.. ఏకంగా మూడుసార్లు ఆ పేరును మార్చేసింది. డోనాల్డ్ ట్రంప్ వద్ద ఉన్న అధికారుల్లో ఒకరు ఆ షెడ్యూలుకు సంబంధించిన పత్రంలో థెరెసా మే పేరు రాసేటపుడు అందులోని 'హెచ్' అనే అక్షరాన్ని వదిలేశారు. దాంతో అది కాస్తా టెరెసా మే అయిపోయింది. అదే పేరుతో ఒక పోర్న్ స్టార్ ఉన్నారు. వాసత్వానికి థెరెసా మే తన అధికారిక పర్యటనలో భాగంగా ట్రంప్‌తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొనడంతో పాటు సంయుక్త విలేకరుల సమావేశం కూడా నిర్వహించాల్సి ఉంది. వైట్ హౌస్ నుంచి ప్రతిరోజూ వచ్చే కార్యక్రమాల వివరాలలో భాగంగా ప్రెస్ సెక్రటరీ ఈ పర్యటన వివరాలను కూడా వెల్లడించారు. అందులో థెరెసా మే పేరులోని హెచ్ అక్షరాన్ని వదిలేయడంతో ఘోరమైన తప్పు జరిగిపోయింది. అది కూడా మూడుసార్లు జరిగింది. టెరెసా మే గతంలో మోడల్‌గా పనిచేసి, ప్రస్తుతం పోర్న్ సినిమా స్టార్‌గా ఉన్నారు. గత వేసవి కాలంలో బ్రెగ్జిట్ నిర్ణయం తర్వాత నాటి ప్రధాని డేవిడ్ కామెరాన్ రాజీనామా చేయడంతో బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి ఎవరు అవుతారన్న చర్చ జరిగినప్పుడు కూడా థెరెసా మే తోపాటు టెరెసా మే పేరు కూడా ట్విట్టర్లో మార్మోగిపోయింది. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత అమెరికాలో పర్యటిస్తున్న మొట్టమొదటి విదేశీ నేత థెరెసా మే. -
రష్యా, సిరియా, శరణార్థులే యూరో ఎజెండా