లండన్: కరోనా మహమ్మారి దేశాధినేతలను విడిచి పెట్టడం లేదు. బ్రిటన్ ప్రధానమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి కోవిడ్–19 సోకిన జాబితాలో చేరారు. బ్రిటన్ ప్రధాని బొరిస్ జాన్సన్‌కు కరోనా సోకడంతో 10 డౌనింగ్ స్ట్రీట్‌లో తన నివాసంలో స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. యూకే ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యత తాను నిర్వహిస్తానని ఒక వీడియో సందేశంలో వెల్లడించారు. ‘‘గురువారం నుంచి నాలో కరోనా లక్షణాలు కాస్త కనిపించాయి. వెంటనే పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్ అని తేలింది. వెంటనే నా గదిలోనే నిర్బంధంలోకి వెళ్లిపోయాను. దేశ ప్రధానిగా సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి కరోనాపై తీసుకుంటున్న చర్యల్ని పర్యవేక్షిస్తాను’’అని ఆయన తన ట్విట్టర్ అకౌంట్‌లో ఒక వీడియో షేర్ చేశారు. మరోవైపు బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రి మట్ హన్‌కాక్‌కూ ఈ వైరస్ సోకింది. స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన ఆయన ఇంటి నుంచే పని చేస్తానని స్పష్టం చేశారు.
కేసులు 5,60,000, మృతులు 25 వేలు..
కరోనా కేసులు 5 లక్షల 60 వేలకు మృతులు 25 వేలకు చేరుకున్నారు.
► 80,539 కేసులతో అమెరికా.. చైనా తర్వాత స్థానంలో నిలిస్తే, 8,215 మరణాలతో ఇటలీ 1వ స్థానంలో ఉంది.
► స్పెయిన్‌లో గత 24 గంటల్లో 769 మంది మరణించగా, మృతుల సంఖ్య 4,858కి చేరుకుంది.
► ఫ్రాన్స్‌లో 24 గంటల్లో 365 మంది మరణించగా, 2,300కి పైగా కేసులు నమోదయ్యాయి.
► కరోనా వైరస్ ప్రభావంతో ఈ ఏడాది అంతర్జాతీయ పర్యాటక రంగానికి 30 వేల కోట్ల డాలర్ల నుంచి 45 వేల కోట్ల డాలర్ల వరకు నష్టం రావచ్చునని ప్రపంచ పర్యాటక సంస్థ అంచనా వేసింది.
► టాక్సిక్ మెథనాల్‌తో కరోనాను ఆప వచ్చని తీసుకున్న ఓ బాలుడు కంటి చూపు కోల్పోగా 300 మంది మరణించారు. వెయ్యి మందికి పైగా అస్వస్థులయ్యారు.
కరోనాతో హాలీవుడ్ నటుడు మార్క్ మృతి
లాస్ ఏంజెల్స్: హాలీవుడ్ నటుడు మార్క్ బ్లమ్ కరోనా వ్యాధితో మరణించారు. ఆయన వయసు 69 ఏళ్లు.
బ్రిటన్ ప్రధానికి కరోనా
Published Sat, Mar 28 2020 5:31 AM | Last Updated on Sat, Mar 28 2020 5:31 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment