Minister of Health
-
పొరుగింట్లో అల్లాను చూసింది
హజ్ చేయడాన్ని ముస్లింలు జీవిత పరమావధిగా భావిస్తారు. వృద్ధాప్యంలో ఇందుకోసం కలలు కనే పెద్దలు లక్షల్లో ఉంటారు. కేరళకు చెందిన జాస్మిన్‌కు 28 సెంట్ల భూమి (1350 గజాలు) ఉంది. దాన్ని అమ్మి భర్తతో హజ్‌కు వెళ్లాలని ఏర్పాట్లు చేసుకుంటోంది. కాని ఆ సమయంలో ఆమె దృష్టి పొరుగింటిపై పడింది. ఆ ఇంట్లో ఉంటున్న నిరుపేదలు సొంతిల్లు లేక అవస్థ పడుతూ కనిపించారు. పొరుగువారికి సాయం చేయమనే కదా అల్లా కూడా చెప్పాడు అని హజ్‌ను మానుకుంది. తన స్థలం మొత్తాన్ని కేరళ ప్రభుత్వం చేపట్టిన నిరుపేదల గృహపథకానికి ఇచ్చేసింది. కొందరు పొరుగువారిలో దేవుణ్ణి చూస్తారు. మానవత్వమే దైవత్వం అని చాటి చెబుతారు. బాల సాహిత్యంలో ఈ కథ కనిపిస్తుంది. అరేబియాలోని ఒక ఊళ్లో చాలా పేద కుటుంబం ఉంటుంది. ఆ ఇంట్లోని ఇద్దరు చిన్నారి ఆడపిల్లలకు ఆ వేళ చాలా ఆకలిగా ఉంటుంది. తల్లికి ఏం వండి పెట్టాలో తెలియదు. ఇంట్లో ఒక్క నూక గింజ కూడా లేదు. పని వెతుక్కుంటూ దేశం మీదకు వెళ్లిన తండ్రి ఏమయ్యాడో ఏమో. ఆకలికి తాళలేని ఆ పిల్లలు ఏం చేయాలో తోచక వీధిగుండా నడుచుకుంటూ వెళుతుంటే ఒక పిట్ట చచ్చిపడి ఉంటుంది. ఇస్లాంలో చనిపోయిన దానిని తినడం ‘హరాం’ (నిషిద్ధం). కాని విపరీతమైన ఆకలితో ఉన్న ఆ పిల్లలు ఆ చనిపోయిన పిట్టను ఇంటికి తీసుకొస్తే తల్లి చూసి ‘అయ్యో... బంగారు తల్లులూ మీకెంత ఖర్మ పట్టింది’ అని వేరే గత్యంతరం లేక ఆ పిట్టనే శుభ్రం చేసి, పొయ్యి రాజేసి, సట్టిలో ఉప్పుగల్లు వేసి ఉడికించడం మొదలెడుతుంది. ఆశ్చర్యం... సట్టిలో నుంచి ఎలాంటి సువాసన రేగుతుందంటే చుట్టుపక్కల వాళ్లందరికీ ‘ఆహా.. ఎవరు ఏం వండుతున్నారు... ఇంత మంచి వాసన వస్తోంది’ అనిపించింది. ఈ పేదవాళ్ల ఇంటి పక్కనే ఉన్న షావుకారు భార్యకు కూడా అలాగే అనిపించి, కూతురిని పిలిచి ‘పొరుగింట్లో ఏదో ఒండుతున్నారు. అదేమిటో కనుక్కునిరా’ అని పంపిస్తుంది. షావుకారు కూతురు పొరుగింటికి వచ్చి ‘ఏం వండుతున్నారు... ఇంత మంచి వాసన వస్తోంది’ అనడిగితే ‘చచ్చిన పిట్టను వండుకుని తింటున్నాం’ అని చెప్పడానికి నామోషీ వేసిన ఆ తల్లి ‘మీకు హరాం (తినకూడనిది)... మాకు హలాల్ (తినదగ్గది) వండుతున్నాం’ అంటుంది. వెనక్కు వచ్చిన షావుకారు కూతురు అదే మాట తల్లితో అంటే ఆమెకు కోపం వస్తుంది. ‘అరె... వారు తినదగ్గది మేము తినకూడనిది ఏముంటుంది’ అని భర్తకు కబురు పెట్టిస్తుంది. భర్త రాగానే పొరుగింటి అవమానాన్ని చెప్పి ‘వారేదో తినదగ్గది తింటున్నారట... మనం దానిని తినకూడదట... ఏంటది’ అని కోపం పోతుంది. భర్త ఆలోచనాపరుడు. పొరుగింటికి వెళ్లి ఆరా తీస్తే ఆ పేదతల్లి ‘అయ్యా... మీరు షావుకార్లు. చచ్చినవాటిని తినకూడదు. హరాం. మేము పేదవాళ్లం. ఆకలికి తాళలేక అలాంటివి తినొచ్చు. హలాల్. అందుకనే అలా చెప్పాను’ అని కన్నీరు కారుస్తుంది. ఆ సమయానికి ఆ షావుకారు హజ్‌కు వెళ్లడానికి సిద్ధం అవుతూ ఉంటాడు. అతడు తన హజ్ డబ్బు మొత్తాన్ని ఆ పేదరాలికి ఇచ్చి హజ్ మానుకుంటాడు. కాని ఆ సంవత్సరం హజ్‌కు వెళ్లిన ఇరుగుపొరుగు వారికి కాబా చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ఆ షావుకారు కనిపించి ఆశ్చర్యం వేస్తుంది. అంటే వెళ్లిన పుణ్యం దక్కిందని అర్థం. అదీ కథ. కేరళలో అచ్చు ఇలాగే జరిగింది. అక్కడి పత్థానంతిట్ట జిల్లాలోని అరన్మలలో 48 ఏళ్ల జాస్మిన్‌కు ఎప్పటి నుంచో హజ్‌కు వెళ్లాలని కోరిక. భర్త హనీఫా (57) కు కూడా అదే కల. అయితే ఆ కల నెరవేర్చుకోవడానికి కావలసినంత డబ్బు లేదు. జాస్మిన్‌కు తండ్రి నుంచి సంక్రమించిన 28 సెంట్ల భూమి అదే ఊళ్లో ఉంది. దానిని అమ్మి ఆ డబ్బుతో హజ్‌కు వెళ్లాలని భార్యాభర్తలు నిశ్చయించుకున్నారు. ఈలోపు కోవిడ్ వచ్చింది. చాలామంది కష్టాలు పడ్డారు. జాస్మిన్ ఇరుగుపొరుగున అద్దె ఇళ్లల్లో నివసించే మధ్యతరగతి వారు అద్దె చెల్లించలేని ఆర్థిక కష్టాలకు వెళ్లారు. తినడానికి ఉన్నా లేకపోయినా నీడ ఉంటే అదో పెద్ద ధైర్యం అని వారి మాటలు జాస్మిన్ను తాకాయి. అదే సమయంలో కేరళలో ‘లైఫ్ మిషన్’ పేరుతో పేదలకు ఇళ్లు కట్టి ఇచ్చే పథకం మొదలైంది. ఈ పథకం కోసం ప్రభుత్వం ప్రజలను కూడా స్థలాలు ఇమ్మని కోరింది. జాస్మిన్ భర్తతో చర్చించి ‘పేదల ఇళ్ల కోసం మన స్థలం ఇస్తే అల్లా కూడా సంతోషపడతాడు’ అని చెప్పి, హజ్ యాత్ర మానుకుని, ఆ స్థలాన్ని ప్రభుత్వ పరం చేసింది. మొన్నటి ఆదివారం కేరళ ఆరోగ్యశాఖా మంత్రి వీణా జార్జి స్వయంగా జాస్మిన్ ఇంటికి వచ్చి ఆమెను అభినందించింది. జాస్మిన్, హనీఫా చూపిన ఔదార్యానికి ప్రశంసలు లభిస్తున్నాయి. అన్నట్టు హజ్‌కు వెళ్లాలని వెళ్లలేకపోయిన వృద్ధ జంట కథతో 2011లో మలయాళంలో తీసిన ‘అడమింటె మకన్ అబు’ సినిమా ప్రశంసలు అందుకుంది. అందులో ముఖ్యపాత్రలో నటించిన సలీం కుమార్‌కు జాతీయ అవార్డు దక్కింది. మన తెలుగు జరీనా వహాబ్ది మరో ముఖ్యపాత్ర. కేరళలో ఇప్పుడు ఈ సినిమాను కూడా గుర్తు చేసుకుంటున్నారు. -
ఆహారం కల్తీ చేస్తే కఠినచర్యలు
మల్లాపూర్ (హైదరాబాద్): ఆహారకల్తీ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా మొబైల్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. రాష్టవ్యాప్తంగా నాలుగు మొబైల్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ వాహనాలను ప్రవేశపెట్టినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. హైదరాబాద్ నాచారంలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం) ఫుడ్ లేబొలేటరీ ఆవరణలో మంత్రి హరీశ్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శంకర్ ఈ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఆహారంతోపాటు పాలు, నెయ్యి, పండ్లు తదితర వస్తువులలో కల్తీ జరిగి ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. నిజామాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు ఈ వాహనాలను కేటాయించినట్లు చెప్పారు. 40 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసుకున్న వైద్యపరికరాలు సరిగాలేక కల్తీ ఫలితాలను తొందరగా రాబట్టలేకపోతుండటంతో నాచారంలో రూ.10 కోట్లతో అత్యాధునిక సాంకేతిక ల్యాబ్‌ను ప్రారంభించుకున్నామని వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్ల సంఖ్య కూడా పెంచామన్నారు. కల్తీ చేసివారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఎవరైనా కల్తీ చేస్తే 040 – 21111111కు నేరుగా ఫిర్యాదు చేయాలని సూచించారు. కల్తీ నియంత్రణకు రాష్ట్రవ్యాప్తంగా టాస్క్‌ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ, అడిషనల్ డైరెక్టర్ శివలీల, ఏవో కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతున్నది. కోవిడ్‌తో ప్రాణాలు పోతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య ఇప్పటికే రెండున్నర లక్షలు దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 18,64,594 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందులో 3,62,727 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,37,03,665కు పెరిగింది. దేశంలో ఒక్కరోజులోనే ఏకంగా 4,120 మంది కోవిడ్‌తో మరణించారు. దీంతో కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 2,58,317కు చేరింది. అదే సమయంలో దేశంలో గత 24 గంటల్లో రికార్డుస్థాయిలో 3,52,181 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 1,97,34,823 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా ప్రారంభం నుంచి ఇప్పటివరకు 30,94,48,585 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్ర, కేరళలో 40 వేల చొప్పున నమోదు కాగా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 30 వేలకు పైగా నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో 15 వేలు, రాజస్థాన్‌లో 18 వేల చొప్పున ఉన్నాయి. మరో 13 రాష్ట్రాల్లో 10 వేలకుపైగా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. ఇక కరోనా కట్టడికి ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. మరో వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. COVID-19 Testing Update. For more details visit: https://t.co/dI1pqvXAsZ @MoHFW_INDIA @DeptHealthRes #ICMRFIGHTSCOVID19 #IndiaFightsCOVID19 #CoronaUpdatesInIndia #COVID19 #Unite2FightCorona pic.twitter.com/svG1KPd1PB — ICMR (@ICMRDELHI) May 13, 2021 చదవండి: మరో 6-8 వారాలు లాక్డౌన్ ఉండాలి -
ఎయిమ్స్ ట్రామా సెంటర్ లో కేంద్రమంత్రి హర్షవర్ధన్ పర్యటన
-
బ్రిటన్ ప్రధానికి కరోనా
లండన్: కరోనా మహమ్మారి దేశాధినేతలను విడిచి పెట్టడం లేదు. బ్రిటన్ ప్రధానమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి కోవిడ్–19 సోకిన జాబితాలో చేరారు. బ్రిటన్ ప్రధాని బొరిస్ జాన్సన్‌కు కరోనా సోకడంతో 10 డౌనింగ్ స్ట్రీట్‌లో తన నివాసంలో స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. యూకే ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యత తాను నిర్వహిస్తానని ఒక వీడియో సందేశంలో వెల్లడించారు. ‘‘గురువారం నుంచి నాలో కరోనా లక్షణాలు కాస్త కనిపించాయి. వెంటనే పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్ అని తేలింది. వెంటనే నా గదిలోనే నిర్బంధంలోకి వెళ్లిపోయాను. దేశ ప్రధానిగా సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి కరోనాపై తీసుకుంటున్న చర్యల్ని పర్యవేక్షిస్తాను’’అని ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో ఒక వీడియో షేర్ చేశారు. మరోవైపు బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రి మట్ హన్కాక్కూ ఈ వైరస్ సోకింది. స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన ఆయన ఇంటి నుంచే పని చేస్తానని స్పష్టం చేశారు. కేసులు 5,60,000, మృతులు 25 వేలు.. కరోనా కేసులు 5 లక్షల 60 వేలకు మృతులు 25 వేలకు చేరుకున్నారు. ► 80,539 కేసులతో అమెరికా.. చైనా తర్వాత స్థానంలో నిలిస్తే, 8,215 మరణాలతో ఇటలీ 1వ స్థానంలో ఉంది. ► స్పెయిన్‌లో గత 24 గంటల్లో 769 మంది మరణించగా, మృతుల సంఖ్య 4,858కి చేరుకుంది. ► ఫ్రాన్స్‌లో 24 గంటల్లో 365 మంది మరణించగా, 2,300కి పైగా కేసులు నమోదయ్యాయి. ► కరోనా వైరస్ ప్రభావంతో ఈ ఏడాది అంతర్జాతీయ పర్యాటక రంగానికి 30 వేల కోట్ల డాలర్ల నుంచి 45 వేల కోట్ల డాలర్ల వరకు నష్టం రావచ్చునని ప్రపంచ పర్యాటక సంస్థ అంచనా వేసింది. ► టాక్సిక్ మెథనాల్‌తో కరోనాను ఆప వచ్చని తీసుకున్న ఓ బాలుడు కంటి చూపు కోల్పోగా 300 మంది మరణించారు. వెయ్యి మందికి పైగా అస్వస్థులయ్యారు. కరోనాతో హాలీవుడ్ నటుడు మార్క్ మృతి లాస్ ఏంజెల్స్: హాలీవుడ్ నటుడు మార్క్ బ్లమ్ కరోనా వ్యాధితో మరణించారు. ఆయన వయసు 69 ఏళ్లు. -
విశాఖలో మంత్రి ఆళ్ల నాని సమీక్ష
-
‘ ఆ మంత్రి పదవికి అనర్హుడు’
హైదరాబాద్‌సిటీ: తెలంగాణ ఆరోగ్య శాఖా మంత్రి పదవికి లక్ద్మారెడ్డి అనర్హుడని కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నేరెళ్ల శారద అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ.. బాలింతలు సరైన వైద్యం అందక చనిపోతుంటే ప్లీనరీ పేరుతో ఆరోగ్య శాఖా మంత్రి లక్ష్మారెడ్డి సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు. టీఎస్ఎంఐడీసీ మందుల కొనుగోళ్లలో అవకతవకలు జరుగుతున్నాయని అన్నారు. నాసిరకం మందులు సరఫరా చేస్తూ జనం ప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు. కోఠి మెటర్నిటీ మరణాలకు సూపరిండెంట్ శైలజ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు