![3 62 Lakh Fresh Covid Cases In India, 4120 Deaths In 24 Hours - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/13/covid-india.jpg.webp?itok=JA9QwMpl)
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతున్నది. కోవిడ్‌తో ప్రాణాలు పోతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య ఇప్పటికే రెండున్నర లక్షలు దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 18,64,594 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందులో 3,62,727 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,37,03,665కు పెరిగింది. దేశంలో ఒక్కరోజులోనే ఏకంగా 4,120 మంది కోవిడ్‌తో మరణించారు. దీంతో కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 2,58,317కు చేరింది.
అదే సమయంలో దేశంలో గత 24 గంటల్లో రికార్డుస్థాయిలో 3,52,181 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 1,97,34,823 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా ప్రారంభం నుంచి ఇప్పటివరకు 30,94,48,585 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్ర, కేరళలో 40 వేల చొప్పున నమోదు కాగా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 30 వేలకు పైగా నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో 15 వేలు, రాజస్థాన్‌లో 18 వేల చొప్పున ఉన్నాయి. మరో 13 రాష్ట్రాల్లో 10 వేలకుపైగా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. ఇక కరోనా కట్టడికి ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. మరో వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది.
COVID-19 Testing Update. For more details visit: https://t.co/dI1pqvXAsZ @MoHFW_INDIA @DeptHealthRes #ICMRFIGHTSCOVID19 #IndiaFightsCOVID19 #CoronaUpdatesInIndia #COVID19 #Unite2FightCorona pic.twitter.com/svG1KPd1PB
— ICMR (@ICMRDELHI) May 13, 2021
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment