లండన్ : కరోనా వైరస్ మహమ్మారితో బాధపడుతున్న బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ పరిస్థితి నిలకడగా ఉంది. దీంతో ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలించారు. మరికొన్నాళ్లు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స తీసుకోవాలని లండన్‌లోని సెయింట్ థామస్ ఆస్పత్రిలోని వైద్య నిపుణుల బృందం ఆయనకు సూచించింది. బోరిస్ జాన్సన్‌ను ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలించారని తెలియగానే, మంచి వార్త తెలిసిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్విటర్‌లో స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. (‘క్లాప్స్ ఫర్ బోరిస్’కు భారీ స్పందన)
Great News: Prime Minister Boris Johnson has just been moved out of Intensive Care. Get well Boris!!!
— Donald J. Trump (@realDonaldTrump) April 9, 2020
కాగా, వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో వైద్యులు బోరిస్ జాన్సన్‌ను సోమవారం ఐసీయూకు తరలించిన విషయం తెలిసిందే. బోరిస్‌ను ఐసీయూకు తరలించారనే వార్తలు వెలువడగానే బ్రిటన్‌తో సహా యావత్ ప్రపంచదేశాలు ఆయనకు సంఘీభావం తెలిపాయి. జోరిస్ త్వరగా కోలుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, రష్యా అధ్యక్షుడు పుతిన్, స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ తదితరులు ఆకాంక్షించారు. (ఐసీయూలో బ్రిటన్ ప్రధాని)
Comments
Please login to add a commentAdd a comment