
లండన్ : బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ చుట్టూ బిగుసుకున్న పార్టీ గేట్ వివాదం మరింత ముదురుతోంది. కరోనా మహమ్మారి కోరలు చాచిన వేళ తన అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్‌లో విందులు వినోదాలు చేసుకున్నారన్న వివాదంపై విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
2020 జూన్ 19న జాన్సన్ 59వ పుట్టిన రోజునాడు కేక్ పార్టీ జరిగినట్టు తమకు సమాచారం అందిందని మెట్రోపాలిటన్ పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే పార్టీ గేట్ వివాదంపై ఇంటర్నల్ కేబినెట్ ఆఫీసు ఎంక్వయిరీ జరుగుతోంది. ఈ వారంలో దాని నివేదిక వచ్చే అవకాశం ఉంది. ఆ విచారణ సందర్భంగానే జాన్సన్ బర్త్ డే రోజు కూడా పార్టీ జరిగిందని వెల్లడైంది. గత రెండేళ్లలో డౌనింగ్ స్ట్రీట్, వైట్ హాలులో లెక్కలేనన్ని పార్టీలు జరిగాయని వాటిపై మెట్రోపాలిటన్ పోలీసుల బృందం విచారణ జరుపుతుందని కమిషనర్ డేమ్ క్రెస్సిడా డిక్ చెప్పారు.
మరోవైపు 10 డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధులు మాత్రం జాన్సన్ తన పుట్టినరోజు నాడు సి బ్బంది శుభాకాంక్షలు చెప్పడానికి వస్తే కేవలం 10 నిముషాలే ఉన్నారని వాదిస్తున్నారు. (చదవండి: ఉరిమి ఉరిమి.. యూఏఈ నెత్తిన! ఎందుకిలా జరుగుతోంది?)
Comments
Please login to add a commentAdd a comment