లండన్: చిన్నతనంలో జాతి వివక్షకు గురయినట్లు భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ వెల్లడించారు. ఇంగ్లిష్ ఉచ్చారణలో యాస లేకుండా తన తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను వెల్లడించారు. ‘చిన్నప్పుడు జాతి వివక్షకు గురయ్యా.
నాతోబుట్టువుల నుద్దేశించి కొందరు చేసిన వెటకారం, వెక్కిరింపులను ప్రత్యక్షంగా చూశా. ఎంతో బాధేసింది’అని సునాక్ బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. ఇప్పుడు తన పిల్లలు జాతి వివక్షను ఎదుర్కోవడం లేదని అన్నారు. తన భారతీయ వారసత్వం గురించి చెబుతూ సునాక్... ఆకారం, రూపం ఒక అవరోధంగా మారకూడదని తల్లిదండ్రులు తమకు చెప్పేవారన్నారు.
భారతీయ తరహా యాస బయటపడకుండా మాట్లాడాలని వారు పదేపదే చెప్పేవారు. మేం మాట్లాడే భాషపై వారు ప్రత్యేకంగా దృష్టి పెట్టేవారు. అలా, సరైన అభ్యాసంతో బ్రిటిష్ యాసను మేం సరిగ్గా అనుకరించ గలిగేవాళ్లం. అది చూసి మా అమ్మ చాలా సంతోషించారు’అని సునాక్ అన్నారు. జాత్యహంకార ధోరణి ఏ రూపంలోనిదైనా ఆమోదం యోగ్యం కాదని రిషిసునాక్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment