childhood days
-
UK Prime Minister: చిన్నతనంలో వివక్షకు గురయ్యా: సునాక్
లండన్: చిన్నతనంలో జాతి వివక్షకు గురయినట్లు భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ వెల్లడించారు. ఇంగ్లిష్ ఉచ్చారణలో యాస లేకుండా తన తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను వెల్లడించారు. ‘చిన్నప్పుడు జాతి వివక్షకు గురయ్యా. నాతోబుట్టువుల నుద్దేశించి కొందరు చేసిన వెటకారం, వెక్కిరింపులను ప్రత్యక్షంగా చూశా. ఎంతో బాధేసింది’అని సునాక్ బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. ఇప్పుడు తన పిల్లలు జాతి వివక్షను ఎదుర్కోవడం లేదని అన్నారు. తన భారతీయ వారసత్వం గురించి చెబుతూ సునాక్... ఆకారం, రూపం ఒక అవరోధంగా మారకూడదని తల్లిదండ్రులు తమకు చెప్పేవారన్నారు. భారతీయ తరహా యాస బయటపడకుండా మాట్లాడాలని వారు పదేపదే చెప్పేవారు. మేం మాట్లాడే భాషపై వారు ప్రత్యేకంగా దృష్టి పెట్టేవారు. అలా, సరైన అభ్యాసంతో బ్రిటిష్ యాసను మేం సరిగ్గా అనుకరించ గలిగేవాళ్లం. అది చూసి మా అమ్మ చాలా సంతోషించారు’అని సునాక్ అన్నారు. జాత్యహంకార ధోరణి ఏ రూపంలోనిదైనా ఆమోదం యోగ్యం కాదని రిషిసునాక్ చెప్పారు. -
జీవితమంతా కష్టాలు, కన్నీళ్లే.. ఆ ఫోటోలోని బేబీ ఇప్పుడొక స్టార్ హీరోయిన్!
తెలుగుమ్మాయి అయినప్పటికీ నటిగా తమిళంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చెన్నైలో పుట్టి పెరిగినా ముద్దుగుమ్మ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తెలుగు సినిమా రాంబంటు చిత్రంలో ఓ సీన్లో కనిపించింది. ఆ తర్వాత 2010లో తమిళ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి చాలా సినిమాలలో నటించింది. కెరీర్ ప్రారంభంలో తమిళ హీరో విజయ్ సేతుపతి సరసన రమ్మీ, పన్నైరం చిత్రాల్లో నటించింది. ఆ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఇటీవలే పెద్ద హీరోలు తనను పట్టించకోవడం లేదంటూ హాట్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఎవరో గుర్తు పట్టారా? మరెవరో కాదండీ ఇటీవలే ఫర్హానా చిత్రంలో నటించిన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. (ఇది చదవండి: ఇక చాలు ఆపండి, రష్మికను నేనేమీ అనలేదు: ఐశ్వర్య రాజేశ్) టాలీవుడ్లో కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య.. వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీశ్, రిపబ్లిక్ సినిమాల్లోనూ నటించింది. నటిగా తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నాని, సాయి ధరమ్ తేజ్‌లతో కలిసి నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో కూడా వరుసగా సినిమాలు చేస్తోంది. ఇటీవలే ఫర్హానా చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం జూలై 7 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మె హాస్య నటి శ్రీలక్ష్మికి మేనకోడలు. అయితే ఆమె తండ్రి రాజేష్ 38 ఏళ్ల వయసులో చనిపోయాడు. మద్యానికి బానిసై చనిపోవడంతో వారి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఆమె తండ్రి రాజేష్ ఒకప్పుడు తెలుగులో గొప్ప నటుడు. ఆ తర్వాత ఐశ్వర్య పడిన కష్టాన్ని మాటల్లో వర్ణించలేం. చిన్న వయసులోనే జీవితంలో ఎన్నో కష్టాలు చవిచూసింది. ఇప్పుడు స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది. తండ్రి చేసిన అప్పులు తీర్చేందుకు రాజేశ్ భార్య ఉన్న ఆస్తులన్నీ అమ్మేసింది. చెన్నైలోని టీనగర్లో ఉన్న ఓ ఫ్లాట్‌ను విక్రయించింది. ఆ తర్వాత అద్దె ఇంట్లో ఉన్న ఐశ్వర్య కుటుంబాన్ని మరో విషాదం వెంటాడింది. ఓ ప్రమాదంలో ఐశ్వర్య ఇద్దరు అన్నయ్యలను కోల్పోయింది. ఆ తర్వాత కుటుంబాన్ని పోషించే బాధ్యతను తానే తీసుకుంది. ఓ టీవీలో ప్రసారమయ్యే కామెడీ షోలో యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. 2011లో మనాడ మైలాడ అనే రియాల్టీ షోలో విజేతగా నిలిచిన ఆమెకు ఆవగలం వీరిగళంలో ప్రియురాలి పాత్ర వచ్చింది. ఆ తర్వాత అట్టకత్తి సినిమా ద్వారా పాపులారిటీ సంపాదించింది. (ఇది చదవండి: ఈ వారం కొత్త సినిమాల సందడి.. ఓటీటీలోనే ఎక్కువ!) తాజాగా ఈ హీరోయిన్‌కు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట తెగ వైరలవుతోంది. తాను ఫస్ట్ బర్త్ డే జరుపుకుంటున్న ఫోటోను ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసింది. గతంలో తన అన్న, అమ్మతో కలిసి కేక్ కట్ చేస్తున్న ఫోటోను పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. ఆమె జీవితంలో కష్టాలను చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే. చిన్నతనంలోనే తండ్రి, అన్నయ్యలను కోల్పోయిన్ ఐశ్వర్య రాజేశ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది. View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) -
జ్ఞాపకాల అంగడి
వీటిలో ఎన్నిటిని గుర్తుపట్టారు? ఓ మై గుడ్నెస్ అన్నిటినా? అయితే మీరు పలు బ్రాండ్లకు మంచి బిజినెస్ ఇస్తున్నట్టే! వాట్ ఆర్ యూ టాకింగ్? ఇవి నా చిన్నప్పటి.. లేదా నా యూత్ మెమొరీస్.. వాటిని బ్రాండ్స్ ఏం చేసుకుంటాయి? బిజినెస్ చేసుకుంటాయి! ఎస్.. ఇప్పుడు వినియోగదారుల చిన్ననాటి.. టీనేజ్ జ్ఞాపకాలే పలు వ్యాపార సంస్థలకు పెద్ద బిజినెస్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఈ జ్ఞాపకాలే కొత్త బిజినెస్‌కు ఆలోచన పడేలా చేస్తున్నాయి.. నోస్టాల్జియాకున్న పవర్ అది! అందుకే దీన్ని నోస్టాల్జియా మార్కెట్ అంటున్నారు. ఇప్పుడు ప్రపంచ మార్కెట్ తిరుగుతోంది ఈ ఇరుసు మీదే! ఇంట్లో.. బయటా.. ఎక్కడ ఏ వస్తువు కనపడినా.. ఏ పరిసరంలో తిరుగాడినా.. ఏ మాటలు.. పాటలు విన్నా.. అవన్నీ ఏదోరకంగా జ్ఞాపకాలతో ముడిపడి ఉన్నవే అయ్యుంటాయి! లేదంటే గతంలోని ఏదో ఒక సందర్భాన్ని.. అపూర్వ క్షణాలను.. వ్యక్తులను గుర్తుచేసేవే ఉంటాయి! గమ్మత్తయిన ఓ వర్ణం.. అమ్మకు తను కట్టుకున్న తొలి చీరను గుర్తుచేయొచ్చు. మనవరాలో.. మనవడో.. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుని మరీ కొనుక్కున్న ఓ స్టీల్ గిన్నె.. నానమ్మకు తన కాపురాన్ని జ్ఞాపకంలోకి తేవచ్చు. స్పాటిఫైలో పాట.. నాన్నకు తన బాల్యంలోని సినిమా థియేటర్ని అతని కళ్లముందు ఉంచొచ్చు. పఫ్‌తో హెయిర్ స్టయిల్ అత్తను తన యవ్వనపు రోజుల్లోకి తీసుకెళ్లొచ్చు. ఓటీటీ సిరీస్‌లోని ఓ సన్నివేశంతో తన చిన్నప్పుడు దొంగతనంగా కాల్చిన సిగరెట్ దమ్ము.. తాతయ్య మది అట్టడుగు పొరల్లోంచి బయటకు రావచ్చు! ఇలా జ్ఞాపకల్లేని జీవితం ఉంటుందా? పైగా పాతవన్నీ మధురాలే! అందుకే కదా అన్నారు ‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్’ అని! ఈ మాటనే వ్యాపార మంత్రంగా పట్టేసుకున్నాయి పలు వ్యాపార సంస్థలు. ఎలాగంటే.. ‘ఆరోజుల్లో... ’ అని మొదలుపెట్టే సంభాషణతో చుట్టూ ఉన్న వాళ్లు చిరాకు పడుతుండొచ్చు. విసుగు చెందుతుండొచ్చు. కానీ.. వ్యాపార సంస్థలు మాత్రం ఆ మాటల ప్రవాహాన్ని పట్టుకుని అందులో ఈది.. ఆ జ్ఞాపకాల్లో తమ బ్రాండ్స్‌ను దొరకబుచ్చుకుని పాత కొత్తల కలయికతో రీమేక్ చేసి యాడ్స్‌ను రిలీజ్ చేస్తున్నాయి. ఈ ‘యాది’ అనే టెక్నిక్‌ను బిజినెస్ ట్రిక్‌గా మలచుకుంటున్నాయి. ఈ స్క్రిప్ట్‌కి లీడ్ అందింది ఎప్పుడు? ఇంకెప్పుడూ.. కరోనా టైమ్‌లోనే! భలేవారే.. అన్నిటికీ కరోనాతో ముడిపెడితే ఎలా? అంటే పెట్టాల్సిందే మరి! కరోనాతో కరెంట్ ఎరా.. కరోనాకు ముందు.. తర్వాత అని చీలిపోతుందని లాక్డౌన్లో జోస్యం చెప్పుకున్నాం! నెమ్మదిగా అదిప్పుడు అనుభవంలోకి వస్తోంది. మార్కెట్లో లాభాలు సృష్టిస్తోంది. అంటే కాలం ఆ విభజనను స్పష్టం చేసిందన్నట్టే కదా! లాక్డౌన్లో చాలా మంది.. నాటి దూరదర్శన్ సీరియళ్లు, పాత సినిమాలు, పాటలతోనే కాలక్షేపం చేశారుట. ఆ కాలక్షేపంలో పల్లీ బఠాణీలు, పాప్‌కార్న్‌ని కాకుండా ఆ సీరియళ్లతో సమానంగా ఆస్వాదించిన నాటి ప్రకటనలను.. ప్రొడక్ట్స్‌ను.. వాటి తాలూకు తమ జ్ఞాపకాలను నెమరవేసుకున్నారని పలు అధ్యయనాల సారాంశం. ఆ సారాన్ని పట్టుకునే వ్యాపార సంస్థలు నోస్టాల్జియాలో మార్కెట్‌ను వెదుక్కున్నాయి. మిలెనీయల్స్కీ.. జెన్జెడ్కీ.. ఆ తరపు మెమోరీస్‌ని కొత్త ర్యాపర్లో చుట్టి ప్రకటనల గిఫ్ట్స్‌ని అందిస్తున్నాయి. ఈ జాబితాలో క్రెడ్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నుంచి క్యాడ్బరీ దాకా పలు ప్రముఖ బ్రాండ్స్ చాలానే ఉన్నాయి. ఇవి ఇలా కొత్త ర్యాపర్లో పాత యాడ్స్‌ను చుట్టి స్క్రీన్ మీద పరుస్తున్నాయి. ఆ మధురాలు పాత తరపు వినియోగదారుల భావోద్వేగాలతో కనెక్ట్ అయ్యి నాటి ఆనందానుభూతులను తాజా చేసి ఆ బ్రాండ్స్ పట్ల వాళ్ల లాయల్టీని పెంచుతున్నాయి. ఈ తరమేమో ఆ గిమ్మిక్కి పడిపోయి.. ఆ బ్రాండ్స్‌కి కొత్త కన్జూమర్స్గా రిజిస్టర్ అవుతోంది. ఇలా ఒకే ఇంట్లో ఆబాలగోపాలన్ని అలరించి.. మెప్పించి తమ ఖాతాను స్థిరపరచుకుంటున్నాయి. ఇదే కాక క్రెడ్ ఓజీ (OG) పేరుతో రాహుల్ ద్రవిడ్, వెంకటేశ్ ప్రసాద్, జావగల్ శ్రీనాథ్, మనీందర్ సింగ్, సబా కరీమ్ లాంటి నాటి మేటి క్రికెటర్స్తోనూ యాడ్స్ రూపొందించింది. ఇలా రిలీజ్ అయిన వెంటనే అలా వైరల్ అయ్యాయి ఆ ప్రకటనలు. ఆ యాడ్స్‌లో కొన్ని.. క్యాడ్బరీ.. కుఛ్∙ఖాస్ హై 90ల్లో.. ఒక క్రికెటర్ బ్యాటింగ్ చేస్తుంటాడు.. సెంచరీకి చివరి బంతి అన్నమాట. బంతి గాల్లో లేచి.. క్యాచ్ అవుతుందా అన్న ఉత్కంఠలో క్యాచ్ మిస్ అయ్యి బౌండరీ దాటుతుంది. అంతే గ్యాలరీలో క్యాడ్బరీ చాక్లెట్ తింటూ టెన్షన్ పడ్డ అతని గర్ల్‌ఫ్రెండ్ ఆనందానికి అవధులుండవు. అలాగే చాక్లెట్ తింటూ డాన్స్ చేస్తూ స్టేడియంలోకి వస్తుంది.. సెక్యూరిటీ వారిస్తున్నా తప్పించుకుని! ఇప్పుడు క్రికెట్ స్టేడియం.. లేడీ క్రికెటర్ బ్యాటింగ్ చేస్తుంటుంది. సెంచరీకి ఒక రన్ తక్కువగా ఉంటుంది ఆమె స్కోర్. ఓ షాట్ కొడుతుంది. అది గాల్లో లేచి.. బౌండరీ దగ్గరున్న ఫీల్డర్ దోసిట్లో పడబోయి.. మిస్ అయి బౌండరీ దాటుతుంది. అంతే గ్యాలరీలో క్యాడ్బరీ తింటూ టెన్షన్ పడిన ఆ క్రికెటర్ బాయ్‌ఫ్రెండ్ సంతోషానికి ఆకాశమే హద్దవుతుంది. అలాగే చాక్లెట్ తింటూ డాన్స్ చేసుకుంటూ స్టేడియంలోకి వస్తాడు సెక్యూరిటీ వారిస్తున్నా తప్పించుకుని! స్విగ్గీ ఇన్‌స్టామార్ట్.. ఫైవ్స్టార్తో కలసి అప్పుడు.. ఫైవ్‌స్టార్ ఇద్దరు యువకులు.. ఓ ప్యాంట్‌ను దర్జీకిస్తూ ‘నాన్నగారి ప్యాంట్.. ఒక అంగుళం పొడవు తగ్గించాలి’ అని చెప్పి వాళ్ల వాళ్ల షర్ట్ జేబుల్లోంచి ఫైవ్ స్టార్ చాక్లెట్స్ తీసి ఓ బైట్ తిని .. ఆ ఇద్దరూ మొహాలు చూసుకుని అప్పుడే ఒకరినొకరు గుర్తుపట్టినట్టు.. ‘రమేశ్.. సురేశ్’ అని పిలుచుకుంటారు. ఇలా చాక్లెట్ తింటూ.. మైమరిచిపోయి.. దర్జీకి పదేపదే ఆ ప్యాంట్‌ను అంగుళం చిన్నది చేయమని పురమాయిస్తూంటారు. ఈలోపు ఆ ప్యాంట్ కాస్త నిక్కర్ అయిపోతుంది. ఇప్పుడు.. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఇందులోనూ రమేశ్, సురేశ్ ఇద్దరూ ఓ ప్యాంట్ తీసుకుని దర్జీ దగ్గరకు వస్తారు. ఆ ప్యాంట్ పొడవు తగ్గించాలని పురమాయించి.. ఫైవ్‌స్టార్ కోసం జేబులు వెదుక్కుంటూంటారు.. ఖాళీ అయిపోయిన ర్యాపర్స్ తప్ప చాక్లెట్స్ దొరకవు. అప్పుడు వాయిస్ ఓవర్ వినిపిస్తుంటుంది.. ‘ఇప్పటికిప్పుడు చాక్లెట్స్ కావాలా? స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ చేయండి.. నిమిషాల్లో చాక్లెట్స్ మీ ముందుంటాయి’ అంటూ! అప్పుడు రమేశ్.. సురేశ్ పక్కకు చూడగానే చాక్లెట్స్ పట్టుకుని నిలబడ్డ స్విగ్గీ ఇన్స్టామర్ట్ డెవలరీ పర్సన్ కనపడుతుంది. క్రెడ్.. (క్రెడిట్ కార్డ్స్ పేమెంట్ యాప్) నాడు.. దీపికాజీ (నిర్మా వాషింగ్ బార్) దీపికా చిఖలియా (నాటి టీవీ రామాయణంలో సీత పాత్రధారి) కిరాణా షాప్‌లోకి వెళ్లి.. నిర్మా బట్టల సబ్బు ఇవ్వమని షాప్ అతన్ని అడుగుతుంది. ‘దీపికాజీ.. మీరెప్పుడూ సాధారణ సబ్బే కదా తీసుకునేది.. మరిప్పుడూ?’ అంటూ ఆగిపోతాడు. ‘సాధారణ సబ్బు ధరకే నిర్మా బార్ వస్తుంటే ఎందుకు కాదనుకుంటాను’ అంటుంది దీపికా. నేడు .. కరిష్మాజీ (క్రెడ్ పేమెంట్ యాప్ కోసం) షాప్‌లోకి వెళ్తుంది కరిష్మా కపూర్ సెల్‌ఫోన్ చార్జర్ కోసం. సాధారణమైన చార్జర్ కాక స్టాండర్డ్ చార్జర్ అడుగుతుంది. ‘కారిష్మాజీ.. మీరు సాధారణంగా మామూలు చార్జరే అడుగుతారు కదా.. మరిప్పుడు?’ అని ఆగుతాడు. సాధారణ చార్జర్ ధరకే క్రెడ్ బౌంటీ స్టాండర్డ్ చార్జర్ ఇస్తుండగా ఎందుకు కాదంటాను!’ అంటుంది. పార్లే జీ.. భారత్ కా అప్ నా బిస్కట్ (ఈ దేశపు సొంత బిస్కట్ ) నిరుటి గణతంత్ర దినోత్సవం సందర్భంగా పార్లే జీ ‘ భారత్ కా అప్నా బిస్కట్ (ఈ దేశపు సొంత బిస్కట్)’ పేరుతో నోస్టాల్జియా క్యాంపెయిన్ యాడ్‌ను విడుదల చేసింది. ‘స్వాతంత్య్ర సమర ప్రయాణంలో మేమూ కలసి నడిచాం! చాయ్ తీపిని.. స్వాతంత్య్ర సాధన సంతోషాన్నీ రెట్టింపు చేశాం! దేశం సాధించిన ప్రతి విజయంలో భాగస్వాములమయ్యాం..’ అంటూ స్వాతంత్య్ర పోరాటం నుంచి నేటి వరకు దేశం సాధించిన ప్రగతిని చూపిస్తూ.. అప్పటి నుంచీ ఉన్న తన ఉనికినీ ప్రస్తావిస్తూ .. నాటి జ్ఞాపకాల వరుసలో తనను ముందు నెలబెట్టుకుని.. ఇప్పటికీ అంతే తాజాగా ఉన్నానని చెబుతూ తన ప్రొడక్ట్ అయిన బిస్కట్స్‌ను మిలెనీయల్స్ చేతుల్లో ఉన్న చాయ్ కప్పుల్లో.. పాల గ్లాసుల్లోనూ డిప్ చేసింది. టాటా సాల్ట్ కూడా బాక్సర్ మేరీ కోమ్‌ను పెట్టి.. ‘దేశ్ కా నమక్’ పేరుతో నోస్టాల్జియా, సెంటిమెంట్‌ను కలిపి కొట్టి కమర్షియల్ యాడ్‌ను రూపొందించింది. అది వర్కవుట్ అయింది. మదర్స్ రెసిపీ కూడా తన పచ్చళ్ల వ్యాపార ప్రమోషన్‌కు జ్ఞాపకాల ఊటనే వాడుకుంది. దిన పత్రికలూ నోస్టాల్జియా ప్రకటనలనే నమ్ముకున్నాయి. అందుకు టైమ్స్ ఆఫ్ ఇండియా ‘హ్యాకీ చాంపియన్’ యాడే ఉదాహరణ. ఇవేకాక పేపర్ బోట్, గూగుల్ వంటి న్యూజనరేషన్ కంపెనీలూ నోస్టాల్జియాను ప్లే చేశాయి. రీలాంచ్ కూడా నోస్టాల్జియాతో ప్రొడక్ట్ ప్రకటలనే కాదు ప్రొడక్షన్ ఆగిపోయిన వస్తువులనూ తిరిగి ఉత్పత్తి చేస్తున్నాయి కొన్ని సంస్థలు. వాటిల్లో పార్లే వాళ్ల రోలా కోలా ఒకటి. 80లు, 90ల్లో పిల్లలకు ఈ క్యాండీ సుపరిచితం. పదమూడేళ్లుగా ఇది ఆగిపోయింది. కానీ దీనితో ముడిపడున్న తీపి జ్ఞాపకాలు మాత్రం 80, 90ల్లోని పిల్లలతో పాటే పెరిగి స్థిరపడ్డాయి. అందుకే నాలుగేళ్ల కిందట.. కేరళకు చెందిన 29 ఏళ్ల సిద్ధార్థ్ సాయి గోపినాథ్ అనే యువకుడు రోలా కోలా ఫొటో పెట్టి.. దాన్ని పార్లేకి ట్యాగ్ చేస్తూ ఇది మళ్లీ మార్కెట్లోకి రావాలంటే ఎన్ని రీట్వీట్స్ కావాలంటూ ట్వీట్ చేశాడు. అతని ట్వీట్‌కి పార్లే స్పందించింది. కనీసం పదివేల రీట్వీట్స్ కావాలని బదులిచ్చింది. అయిదారు నెలలకు సిద్ధార్థ కోరిక నెరవేరింది. ‘మంచి ఫలితానికి నిరీక్షణ తప్పదు.. కానీ నిరీక్షణ ఫలితమెప్పుడూ తీయగానే ఉంటుంది.. రోలా కోలా ఈజ్ కమింగ్ బ్యాక్’ అంటూ పార్లే ప్రకటించింది. సిద్ధార్థ్ ఈ రోలా కోలా కోసం ట్యాగ్ చేయని సెలబ్రిటీల్లేరు.. మెగా బ్రాండ్స్ లేవు. ఆఖరకు నెట్‌ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఏవియేషన్ కంపెనీలనూ వదల్లేదు. కాంపా కోలా.. 1970, 80ల్లో తన టేస్ట్‌తో మార్కెట్‌ను రిఫ్రెష్ చేసిన సాఫ్ట్‌డ్రింక్ ఇది. గ్లోబలైజేషన్‌తో మన అంగట్లోకి వచ్చిన పెప్సీ, రీ ఎంటర్ అయిన కోకా కోలా థండర్ వేవ్స్‌కి తట్టుకోలేక దేశీ సాఫ్ట్‌డ్రింక్ కాంపా కోలా కనుమరుగైపోయింది. దీన్నిప్పుడు రిలయెన్స్ కొనుగోలు చేసింది.. దేశీ డ్రింక్‌గా నాటి జ్ఞాపకాల చల్లదనంతో వినియోగదారులను సేదతీర్చడానికి సిద్ధమైంది. మ్యాగీ ఏమైనా తక్కువ తిందా? నిర్ధారిత పరిమాణం కన్నా సీసం పాళ్లు ఎక్కువున్నాయన్న కంప్లయింట్‌తో నెస్లే ప్రొడక్ట్ మ్యాగీ మన వంటింటి కప్‌బోర్డులను ఖాళీ చేసి వెళ్లిపోయింది. వెళ్లింది వెళ్లినట్టు ఊరుకుందా? లేదు! పిల్లల ఆకలి తీర్చిన ఇన్స్టంట్ ఫుడ్ జ్ఞాపకాలను రెచ్చగొట్టింది.. మిస్ యూ.. కబ్ వాపస్ ఆయేగా యార్ (తిరిగి ఎప్పుడొస్తున్నావ్) అంటూ! ప్రకటనలు, నలుమూలలా హోర్డింగ్‌లతో హోరెత్తించింది. ఈ ఉత్సాహం, స్ఫూర్తితో చాలా కంపెనీలు.. షటర్ మూసుకున్న తమ ప్రొడక్ట్స్‌ని కొత్తగా ముస్తాబు చేసి తిరిగి మార్కెట్లోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయట. కొత్తేం కాదు.. నోస్టాల్జియాతో మార్కెట్‌ను ఏలడం కొత్త అనుకుంటున్నాం కానీ.. కాదు. ఫ్యాషన్ ప్రపంచం ఫాలో అయ్యేది ఈ సూత్రాన్నే! బ్లాక్ అండ్ వైట్, ఈస్ట్‌మన్ కలర్ కాలం నాటి ట్రెండ్స్‌ని రెట్రో స్టయిల్ పేరుతో ఎప్పటికప్పుడు మార్కెట్ చేయట్లేదూ..! అలా బెల్‌బాటమ్, త్రీ ఫోర్ హ్యాండ్స్ బ్లౌజెస్, పోల్కా డాట్స్ డిజైన్స్, ఫ్రెంచ్ కట్ బియర్డ్స్, పఫ్ కొప్పులు ఎట్సెట్రా లేటెస్ట్ ఫ్యాషన్‌గా ఎన్ని యూత్‌ని ఆకట్టుకోవడం లేదు! ఆధునిక సాంకేతికతకు కవల జంటలైన ‘ఈ’ జెనరేషన్కూ త్రోబ్యాక్ సుపరిచితమే సోషల్ మీడియా సాక్షిగా. నిజానికి ప్రస్తుతం పలు బ్రాండ్స్ చేస్తున్న ఈ నోస్టాల్జియా మార్కెట్‌కి ప్రేరణ సోషల్ మీడియా త్రోబ్యాక్ థర్స్డేతోపాటు అది పోస్ట్ అయిన పాస్ట్ ఈవెంట్స్.. ఇన్సిడెంట్స్లను తడవ తడవకు గుర్తుచేసే తీరే అంటున్నారు మార్కెట్ నిపుణులు. ఈ స్ట్రాటెజీ వల్ల పలు బ్రాండ్ల అమ్మకాలూ పెరిగాయనీ చెప్తున్నారు. ‘జ్ఞాపకాలనేవి భలే గిరాకీ బేరం. నాటి సంగతులను మంచి ఫీల్‌తో జత చేసుకుని వస్తాయి. ఎన్నటికీ ఇంకిపోని భావోద్వేగాల తడిని కలిగుంటాయి. కాబట్టే అవి మార్కెట్లో సేల్ అవుతున్నాయి’ అంటున్నారు ‘22ఫీట్ ట్రైబల్ వరల్డ్‌వైడ్’ నేషనల్ క్రియేటివ్ డైరెక్టర్ దేబాశీష్ ఘోష్. ‘టీబీడబ్ల్యూఏ ఇండియా’ సీసీఓ పరీక్షిత్ భట్టాచార్యేమో ‘నోస్టాల్జియా అనేది టైమ్ మెషిన్ లాంటిది. నడుస్తున్న కాలానికి అందులో యాక్సెస్ ఉండదు. మళ్లీ మళ్లీ అనుభూతి చెందాలనుకున్న క్షణాల్లోకి అది మనల్ని తీసుకెళ్తుంది.. మళ్లీ జీవించేలా చేస్తుంది. ఆ బలహీనతనే కంపెనీలు ఎన్‌క్యాష్ చేసుకుంటున్నాయి’ అంటున్నారు. అయితే ఈ ప్రహసనంలో కొన్ని బ్రాండ్స్.. పాత ప్రకటన లేదా జ్ఞాపకానికి సమకాలీనతను జోడించే ప్రయత్నంలో వాటికున్న ఎసెన్స్‌ను కాపాడుతూ ఆధునికతను అద్దడంలో విఫలమవు తున్నాయి. పాత యాడ్స్.. ఆ కాలంలో అద్భుతంగా ఉండి ఉండొచ్చు. అంతే అద్భుతమైన ఫలితాలనూ రాబట్టి ఉండొచ్చు. కాని వాటి విలువ సామాజికంగా కానీ.. కల్చర్ పరంగా కానీ ప్రాసంగికతను కలిగి ఉందా? దాన్ని నేటి తరం గ్రహించగలుగుతున్నదా? ఆ ప్రకటనల సారం నేటికీ సరిపోలనున్నదా అన్నదాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అప్పటి కొన్ని యాడ్స్‌ను ఇప్పుడు చూస్తే అంటే పరిణతి చెందిన ఆలోచనాతీరుతో.. ఇప్పుడు నెలకొని ఉన్న సున్నిత వాతావరణంలో పరికిస్తే అవి వివాదాస్పదంగా కనిపించవచ్చు. పురుషాధిపత్య ధోరణినీ చూపిస్తూండవచ్చు. కాబట్టి.. ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకుని పాత ప్రకటనలకు ఆ సెన్స్‌ను జోడించాకే నోస్టాల్జియా స్ట్రాటెజీని మార్కెట్ చేసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. -
సికింద్రాబాద్ ఓ మంచి జ్ఞాపకం..
సాక్షి, హైదరాబాద్: తనకు జంటనగరాలతో మరచిపోలేని అనుబంధం ఉందని ప్రముఖ ఆర్థికవేత్త, సంస్కరణల రూపశిల్పుల్లో ఒకరైన మాంటెక్ సింగ్ అహ్లూవాలియా గుర్తు చేసుకున్నారు. వర్చువల్‌గా కొనసాగుతున్న హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ 3వ రోజు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ జంట నగరాల్లో ఒకటైన సికింద్రాబాద్‌లో తాను చాలా ఏళ్లపాటు గడిపానన్నారు. సైన్యంలో పనిచేసిన తన తండ్రి ఉద్యోగ రీత్యా.. 1950 నుంచి 1987 మధ్య సికింద్రాబాద్‌లోనే తన బాల్యం గడిచిందన్నారు. కార్ఖానాలోని సెయింట్ ప్యాట్రిక్స్ హైస్కూల్లో చదువుకున్నానని, తాము నివసించే చోట మసీదులు, ఆలయాలు పక్కపక్కనే ఉన్నట్లే హిందువులు, ముస్లింలు అంతా కలిసి మెలిసి ఉండేవారన్నారు. సికింద్రాబాద్ ఎంతో ఆహ్లాదంగా కాలుష్య రహితంగా ఉండే ప్లెజెంట్ సిటీ అంటూ ఆయన కొనియాడారు. ఆ తర్వాత చాలాసార్లు సికింద్రాబాద్‌కు రావాలనుకున్నానన్నారు. ఏదేమైనా.. ఇలాగైనా ఈ కార్యక్రమానికి హాజరవడం ఆనందంగా ఉందన్నారు. సగటు వ్యక్తికీ అర్థమయ్యేలా బ్యాక్‌స్టేజ్.. గతేడాది చనిపోయిన తన భార్య.. ప్రతి సాధారణ వ్యక్తి అర్థం చేసుకునేలా ఆర్థికాంశాలతో పుస్తకం రాయమని చెప్పిందన్నారు. ఆమె కోరిక మేరకే కేవలం ఆర్థిక నిపుణులు మాత్రమే కాకుండా సామాన్యులు కూడా అర్థం చేసుకునేలా బ్యాక్ స్టేజ్ పుస్తకం రాశానని ఆయన చెప్పారు. అనంతరం దేశ ఆర్థిక సంస్కరణల రూపకల్పనలో ముఖ్యుడిగా పేరొందిన ఆర్థిక నిపుణుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, మాజీ రాజకీయ నేత పాలసీ అనలిస్ట్ పరకాల ప్రభాకర్‌తో హెచ్ఎల్ఎఫ్లో సంభాషిస్తూ తన బ్యాక్ స్టేజ్ పుస్తకం విశేషాలను సందర్శకులతో పంచుకున్నారు. ‘న్యాయం’ చెప్పిన ఐరన్‌మ్యాన్.. బ్యాంక్ ఉద్యోగిని, ‘వై ఈజ్ మై హెయిర్ కర్లీ’ అనే పుస్తకం రాసిన లక్ష్మీ అయ్యర్ ఫిలడెల్ఫియా నుంచి స్టోరీ టెల్లింగ్ సెషన్లో పాల్గొన్నారు. తన పుస్తకం విశేషాలను ఇదే కార్యక్రమంలో పంచుకున్నారు. రాజకీయ అంశాలు, శాసనాలు, న్యాయవ్యవస్థపై రచనలు సాగించే ఐరన్ మ్యాన్ ట్రైథ్లైట్గా పేరున్న ఆకాష్ సింగ్ రాథోడ్ ఈ కార్యక్రమంలో కాంబోడియా నుంచి పాల్గొన్నారు. తాను రాసిన తాజా పుస్తకం ‘బీఆర్ అంబేడ్కర్ ద క్వెస్ట్ ఫర్ జస్టిస్’ విశేషాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా సహజ న్యాయ సూత్రాలు, న్యాయ వ్యవస్థలో మార్పు చేర్పులు, రాజకీయ, సామాజిక ప్రభావాలు.. వంటివి ఆయన ప్రస్తావించారు. అలరించిన సిటీ సంగీతం.. సీరియస్‌గా సాగుతున్న ఈ కార్యక్రమంలో 3వ రోజు నగరానికి చెందిన పలు సంగీత బృందాలు పాల్గొని అలరించాయి. సిటీకి చెందిన హైదరాబాద్ హార్పర్స్ బృంద సభ్యులు తమ మౌత్ ఆర్గాన్ సంగీతంతో ఆహ్లాదం పంచగా.. నగరానికి చెందిన తొలి ఉర్దూ ర్యాప్–హిప్ హాప్ గ్రూప్ థగ్స్ యూనిట్ ఉర్రూతలూగించారు. ఈ గ్రూప్‌నకు చెందిన మ్యుజిషియన్స్ ముదాస్సిర్ అహ్మద్, సయ్యద్ ఇర్షాద్ ద్వయంలో ముదాస్సిర్ ఈ కార్యక్రమంలో పాల్గొని సందర్శకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా థగ్స్ యూనిట్ రూపొందించిన ఆల్బమ్స్ ప్రదర్శించారు. గతేడాది మరణించిన సినీనటుడు, రచయిత సౌమిత్రా ఛటర్జీకి నివాళిగా.. సెలబ్రేటింగ్ సౌమిత్ర పేరిట సాగిన కార్యక్రమంలో బెంగాల్ సినీ ప్రముఖుడు అనిక్ దత్తా, నగరానికి చెందిన సినీ విమర్శకురాలు సంఘమిత్ర మాలిక్ పాల్గొన్నారు. నా జీవితానికి అద్దం.. బ్రాస్ నోట్ బుక్ ఆర్థికాంశాలకు సంబంధించి నిపుణురాలు, మహిళాభ్యుదయ వాది, పద్మభూషణ్ పురస్కార గ్రహీత మైసూర్‌కి చెందిన దేవకి జైన్.. కిన్నెర మూర్తితో తన ఆటోబయోగ్రఫీగా విడుదల చేసిన ‘ది బ్రాస్ నోట్ బుక్’ విశేషాల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె తన జీవితంలోని పలు కోణాలను స్పర్శించారు. బయోగ్రఫీ అంటే తాను ఈ స్కూల్‌కి వెళ్లా, ఆ కాలేజ్‌కి వెళ్లా, ఆ ఉద్యోగం చేశా వంటి విషయాలు కాకుండా అనేక వ్యక్తిగత అంశాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించానని స్పష్టం చేశారు. తాను చదివిన కొన్ని ప్రముఖుల బయోగ్రఫీల్లా ఉండకూడదని రెండేళ్లు ఆలోచించానన్నారు. ఒక సంప్రదాయ అయ్యంగార్ కుటుంబం నుంచి వచ్చిన తాను తన ప్రేమను, అభిరుచులను నెరవేర్చుకుంటూ సాగిన ప్రయాణాన్ని పొందుపర్చాన్నారు. -
బిక్షాటనతో బందీ అవుతున్న బాల్యం
సాక్షి, దుబ్బాక : ప్రతీ మనిషి జీవితంలో బాల్యం ఓ మధుర జ్ఞాపకం. చిన్నతనంలో చేసే చిలిపి పనులు మనం పెద్దయ్యకా తరుచూ.. తలుచుకుంటూ ఉంటాం. కానీ కొందరు మహిళలు పిల్లల్ని చూపి భిక్షాటన చేయడానికి అలవాటుపడ్డారు. పిల్లలను చంకలో గుడ్డతో కట్టుకుని భిక్షాటన చేస్తున్నారు. గంటల తరబడి పిల్లలను చంకలో కట్టుకుని తిరగడం వలన తల్లికి బిడ్డకు ఆరోగ్యపరంగా ఇబ్బందికరమేనని వైద్యులు చెబుతున్నారు. చంకలో నిరంతరం కట్టేయడం మూలంగా పిల్లల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడుతుందంటున్నారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట, దుబ్బాకలో తెల్లవారుజాముగానే తల్లులు పలు ప్రాంతాల్లో తిరుగుతుంటారు. ఉదయం హోటళ్ల వద్ద టిఫిన్ కోసం వచ్చేవారి నుంచి, బస్టాండ్‌లోకి వెళ్లే ప్రయాణికులతో పాటు పలు దుకాణాల వద్ద కనిపించిన వారినల్లా చంటి బిడ్డలను చూపి డబ్బులు అడుక్కుంటూ ఉండగా కొందరు డబ్బులు ఇస్తుంటారు. మరి కొందరు తిడుతూ.. చిరాకుపడుతుంటారు. ఇలా చంటి బిడ్డలతో యాచించి వారు రకరకాల ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ట్రాఫిక్‌లో ఏదైన వాహనం ఆగిందా అక్కడికి వెళ్లి చేయి చాపుతారు. అలాగే హోటళ్ల నుంచి బయటకు వస్తుంటే చాలు అడ్డుగా వెళ్లి దానం చేయ్యండయ్యా..íపిల్లలకు పాలు పట్టించాలి, పిల్లవాడు ఇంకా ఏమి తినలేదు అంటూ..అడుగుతుండడం కనిపిస్తూ ఉంటుంది. పేదరికం కారణంగా భిక్షాటన చేస్తున్నారని మానవత్వ హృదయంతో ఆలోచించి కొందరు దానం చేస్తుంటారు. మరి కొందరు చీదరించుకుంటారు. పిల్లల ఆరోగ్యంపై ప్రభావం.. ప్రతీ రోజు పిల్లలను చంకలో కట్టేసుకుని గంటల తరబడి తిరుగుతూ...భిక్షాటన చేస్తుండటంతో పిల్లలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. బడిలో ఆటపాటలతో చదువుకుంటూ సేద తీరాల్సిన పిల్లలు చంకలో కట్టేయడం మూలంగా పిల్లలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అయితే బిడ్డలను చూపి డబ్బులు అడుక్కోవడం అలవాటుగా మారిన తల్లులు అవేమి పట్టించుకోవడం లేదు. అలాగే పిల్లలకు సరైన ఆహారం అందించకపోవడంతో పిల్లలు బక్కచిక్కిపోతున్నారు. ఫౌష్టికాహారం లోపంతో పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదగడం లేదు. లాక్డౌన్లో తీవ్ర ఇబ్బందులు.. కరోన నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా భిక్షాటన చేసేవారి పరిస్థితి దుర్భేద్యంగా మారింది. హోటళ్లు, బస్సులు నడపకపోవడంతో ప్రజలు ఎవరూ రోడ్ల పైకి రాకపోవడంతో యాచకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తినడానికి తిండిలేక ఆకలితో అలమటించారు. కొందరు మానవతావాదులు వారిని చూడలేక ఆహారం అందించారు. -
బాల్యం .. ఓ మధురానుభూతి
రేష్మా.. ఈ రోజుల్లో ఫేం.. వెండితెర వర్ధమాన నటి. బాల్యం సింగరేణి కార్మికవాడల్లోనే గడిపింది. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల ఆమె ‘సాక్షి’తో ముచ్చటింది. రేష్మ తండ్రి హరిదాస్ రాథోడ్ వృత్తి రిత్యా సింగరేణి అధికారి. ఇల్లెందు స్వగ్రామం కాగా జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు ప్రాంతాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. బాల్యస్మృతులు ఆమె మాటల్లోనే.. ఇల్లెందు బాల్యం మరువలేని అనుభూతి. నా బాల్యమంతా ఇల్లెందులోనే గడిపాను. సింగరేణి బొగ్గు బావుల్లో పని చేసే కార్మికులు, బొగ్గు ఉత్పత్తిని వెలికి తీసే విధానం గురించి ఎంతో ఆసక్తిగా తెలుసుకునేదాన్ని. బొగ్గు ద్వారా కరెంటు ఉత్పత్తి అవుతుందని అంటుంటే అది ఎలా సాధ్యమని తెలుసుకోవాలనే ఉత్సాహం ఉండేది. మా నాన్న పాల్వంచలోని కేటీపీఎస్కు తీసుకెళ్లేవారు. తరచూ కుటుంబంతో పర్యాటక ప్రాంతాలకు వెళ్లేవాళ్లం. భద్రాచలం రాములవారిని దర్శించుకోవడం, గోదావరి స్నానాలు చేయడం, పర్ణశాలను సందర్శించడం చిన్నప్పుడు భలేగా ఉండేది. పాపికొండలు, అక్కడి అడవులు, పచ్చని ఆహ్లాదకర వాతావరణం ఎంతో హాయి గొలిపేది. అశ్వాపురం హెవీవాటర్ ప్లాంట్, కిన్నెరసాని ప్రాజక్టు అందాలను తిలకించటం ఆనందంగా ఉండేది. ఇల్లెందులో మా కార్మిక వాడ గ్రామాలకు భిన్నంగా ఉండేది. అన్ని వాడలకు రోడ్లు, చెట్లు, పార్కులు, కరెంటు, ఇతర సదుపాయాలు ఉండే వి. సెలవు రోజుల్లో సరదాగా స్నేహితులతో షటిల్, క్యారం, చెస్ ఆటలు ఆడుతూ బాల్యాన్ని ఎంజాయ్ చేశాను. -
ఎమ్మెల్యే ఎవరు?
అప్పుడు నేను ఏడో తరగతి చదువుతున్నాను. ఒకరోజు మా మేడమ్ మాకు సోషల్ ఎగ్జామ్ పెట్టింది. ముందు ప్రశ్నలు, తర్వాత బిట్స్ ఇచ్చింది. ప్రశ్నలన్నీ రాశాక, బిట్స్లోకి వెళ్లాను. చివరి బిట్లో ‘మన ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరు?’ అన్న ప్రశ్న వచ్చింది. దాని జవాబు నాకు తెలియదు. అయితే, అప్పుడే కొత్తగా ‘ఎమ్మెల్యే ఏడుకొండలు’ సినిమా వచ్చింది. కానీ అది సినిమా అని నాకు తెలియదు. మా క్లాస్ పక్కన హెడ్మాస్టర్ గది ఉంటే, అందులో ఎప్పుడో టీచర్స్ కూర్చుని మాట్లాడుకుంటూండగా వాళ్ల నోటినుంచి ఈ ఎమ్మెల్యే ఏడుకొండలు అని విన్నాను. ఇంకేం! జవాబు దొరికిందని సంతోషంగా రాసేశాను. మా మేడమ్ రెండు రోజుల తర్వాత పేపర్స్ దిద్దింది. పేర్ల ప్రకారం పిలిచి, వచ్చిన మార్కులు చెప్పి, తక్కువ వచ్చినవారికి చీవాట్లతో వడ్డిస్తోంది. నా పేరు పిలిచింది. ఏమంటారేమోనని నేను భయంతో నిలబడ్డాను. నన్ను చూస్తూనే మేడమ్ ఫక్కున నవ్వింది. అందరు పిల్లలు విస్తుపోయి చూస్తున్నారు, మార్కులు ఎలా వచ్చాయోనని. మేడమ్ నన్ను హెడ్మాస్టర్ రూమ్‌లోకి పిలుచుకెళ్లింది. మాస్టర్లందరూ కూర్చున్నారు. ‘‘ఎవరు చెప్పారు సుజాత, ఆ ప్రశ్నకు నీకు జవాబు?’’ అంది మేడమ్. ‘‘మొన్న మీరందరూ కూర్చుని మాట్లాడుకుంటుంటే విన్నాం మేడమ్’’ అన్నాను. అందరూ ఒక్కసారి నవ్వేశారు. ఆవిడకు నేనంటే చాలా ఇష్టం. అది సినిమా అని చెప్పి, మళ్లీ నేను ఫీలవుతానని నన్ను హత్తుకుని నవ్వమంది. ఇంటికెళ్లాక ఇంట్లో, చుట్టుపక్కలా అందరూ నవ్వడమే. ఇప్పటికీ నవ్వులే అది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా! - బత్తుల సుజాత ఇది మీ కోసం పెట్టిన పేజీ. మీ అనుభవాలు, అనుభూతులు, ఆలోచింపజేసిన సంఘటనలు, మీ ఊరు విశేషాలు, మీ పిల్లల ముద్దుమాటలు, వారి అల్లరి చేష్టలు... అవీ ఇవీ అని లేదు, ఏవైనా మాకు రాసి పంపండి. మా చిరునామా: తపాలా, ఫన్డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. funday.sakshi@gmail.com